Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

పచ్చని స్వర్గధామం..సమ్మర్‌లో తప్పక చూడాల్సిన ప్రదేశం!

Family Sakshi User Sakshi Sakshi Time Apr 24, 2026 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
kash.jpg

కాశ్మీర్‌ వేసవి అనుభవం కేవలం ఒక ప్రయాణం కాదు..  ప్రకృతి, సంస్కృతి ప్రశాంతత కలిసిన ఒక సజీవ కావ్వధార. ‘భూమిపై స్వర్గం’గా పేరొందిన ఈ ప్రాంతం, వేసవి కాలంలో తన సంపూర్ణ సౌందర్యాన్ని ఆవిష్కరిస్తుంది. మంచుతో కప్పబడిన శిఖరాలు, పచ్చని పర్వత లోయలు, నీలిరంగు సరస్సులు, పూలతో నిండిన తోటలు... ఇవన్నీ కలిపి కాశ్మీర్‌ను ఒక కలల ప్రపంచంలా మార్చేస్తాయి.. 

పూలతో నిండి బోట్‌లు
శ్రీనగర్‌కి ఆభరణంలా వెలుగొందే దాల్‌ సరస్సు, కాశ్మీర్‌ పర్యాటకానికి కేంద్రబిందువుగా నిలుస్తుంది. ఇక్కడి ప్రశాంత వాతావరణం మనసును వెంటనే ఆకర్షిస్తుంది. శికారా పడవలో సరస్సు మీద నెమ్మదిగా ప్రయాణించడం ఒక మధురమైన అనుభవం. నీటి మీద తేలియాడే తోటలు, పూలతో నిండిన హౌస్‌బోట్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ప్రత్యేకంగా తెల్లవారుజామున జరిగే తేలియాడే కూరగాయల మార్కెట్‌ అనుభవం మరచిపోలేనిది. స్థానిక రైతులు తమ పడవలలో తాజా కూరగాయలను విక్రయించే ఈ దృశ్యం, కాశ్మీర్‌ జీవనశైలిని దగ్గరగా పరిచయం చేస్తుంది.

మొఘల్‌ తోటలు
వేసవి ప్రారంభంలో శ్రీనగర్‌ చుట్టూ ఉన్న తోటలు పుష్పాలతో కళకళలాడుతుంటాయి. టులిప్‌ ఉత్సవం ఏప్రిల్‌లో ముగిసినా, షాలిమార్‌ బాగ్‌ మరియు నిషాత్‌ బాగ్‌ వంటి మొఘల్‌ తోటలు ఇంకా అందంగా వికసిస్తూనే ఉంటాయి. ఈ తోటల్లో విహరించడం ఒక రొమాంటిక్‌ అనుభూతిని కలిగిస్తుంది. ప్రతి మూలలోనూ ప్రకృతి అందాల పరిమళం మనసును హత్తుకుంటుంది.

పచ్చని స్వర్గధామం..
‘పూల మైదానం’గా పేరొందిన గుల్మార్గ్‌ వేసవిలో మరింత ఆకర్షణీయంగా మారుతుంది. మంచు కరిగిపోయిన తర్వాత పచ్చని గడ్డి మైదానాలు విస్తరించి, కనిపిస్తాయి. గుల్మార్గ్‌ గోండోలా రైడ్‌ ఆసియాలోనే అత్యంత ఎతైన కేబుల్‌ కార్‌లలో ఒకటి. ఈ ప్రయాణంలో హిమాలయ పర్వతాల అద్భుత దృశ్యాలు కళ్లముందు ప్రత్యక్షమవుతాయి.

దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి రవాణా, వసతి సదుపాయాలు ఉన్నాయి. 

ఐఆర్‌సిటితోపాటు ఇతర ప్రైవేట్‌ ట్రావెల్‌ సంస్థలు కూడా ప్యాకేజీని అందిస్తున్నాయి.

నాలుగు, ఐదు, ఎనిమిది రోజులకు గాను రూ.20 వేల నుంచి రూ. 2.5 లక్షల వరకు ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. 

కాశ్మీర్‌ వేసవి అనుభవం ఒక కలలా ఉంటుంది. ప్రతి ప్రదేశం ఒక కథ చెబుతుంది. ప్రకృతి అందాలు, సాంస్కృతిక సంపద, ప్రశాంత జీవనం కలిసిన ఒక అద్భుత ప్రపంచాన్ని పరిచయం చేస్తాయి.  

నూతన సంవత్సరాది బోహాగ్‌ బిహు
దేశంలో చల్లని ప్రదేశంగా పేరొందిన అస్సాంలో ఆనందంగా జరుపుకునే సంవత్సరాది పండగ బోహాగ్‌ బిహె. దీనిని ‘రొంగలీ బిహు’ అని కూడా పిలుస్తారు. ఉత్సాహభరితమైన పండుగగా పేరొందింది ఇది అస్సామీ నూతన సంవత్సరాన్ని, వసంతకాలం ఆగమనాన్నీ సూచిస్తుంది. తెలుగు రాష్ట్రాలలో సంవత్సరాది ఉగాది. అస్సామీల సంవత్సరాది బోహాగ్‌ బిహు. ఈ పండుగ సాధారణంగా ఏప్రిల్‌ నెల మధ్యలో (అస్సామీ నెల ’బోహాగ్‌’ మొదటి రోజు) వస్తుంది. దీనిని వాళ్లు వారం రోజుల పాటు జరుపుకుంటారు.

పంటల కోసం దేవుని ఆశీర్వాదం..
ఈ పండగ వ్యవసాయ సీజన్‌ ప్రారంభాన్ని సూచిస్తుంది. రైతులు ఏడాది అంతా పంటలు బాగా పండాలని, ఈ రోజున వారు దేవుని ఆశీర్వాదం కోరుకుంటారు. ‘రొంగలి’ అంటే ఆనందం, రంగుల పండుగ అని కూడా అర్థం.

పండగ మొదటి రోజును గోరు బిహు అంటారు. ఆ రోజున ఆవులను, ఎద్దులను పసుపు, ఇతర ఔషధ మూలికలతో కడిగి, పూల దండలు వేసి, పూజలు జరుపుతారు. బెండకాయలు, పొట్లకాయలు తినిపిస్తారు.

పండగ రెండవ రోజున మనుహ్‌ బిహు అంటారు. ఆ రోజున ప్రజలు కొత్త బట్టలు ధరించి, పెద్దల ఆశీర్వాదం తీసుకుంటారు. స్నేహితులు, బంధువుల దగ్గరకు వెళ్లి, పిఠా అనే సంప్రదాయ వంటకాన్ని, రుచికరమైన పదార్థాలను పంచుకుంటారు.

ఆనందంగా నృత్యాలు..
యువతీ–యువకులు సంప్రదాయ దుస్తులను అలంకరించుకుంటారు. డ్రమ్స్‌ వాయిస్తూ, కొమ్ముతో చేసిన వాయిద్యాలతో శబ్ధం చేస్తూ నృత్యం ఆనందంగా చేస్తారు. ఈ ఏడురోజుల పండగను చూడటానికి టూరిస్టులు ఈ ప్రాంతానికి ప్రత్యేకంగా వెళుతుంటారు. 

(చదవండి: సమ్మర్‌లో ఆ ప్రదేశాలకు వెళ్తే..వేసవి కూడా చిల్‌గా..!)

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Travel
kashmir
tourism
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

అక్కడికే ఎక్కువమంది!

అక్కడికే ఎక్కువమంది!

ట్రావెలర్స్‌ వద్ద ఉండాల్సిన 3 గ్యాడ్జెట్స్‌ ఇవే..

ట్రావెలర్స్‌ వద్ద ఉండాల్సిన 3 గ్యాడ్జెట్స్‌ ఇవే..

ప్రయాణంలో సరైన బ్యాగ్‌ ఎంపిక..

ప్రయాణంలో సరైన బ్యాగ్‌ ఎంపిక..

మాన్‌సూన్‌ మజిలీకి కేరాఫ్‌ అడ్రస్‌..

మాన్‌సూన్‌ మజిలీకి కేరాఫ్‌ అడ్రస్‌..

ప్రకృతి ఒడిలో మైమరపించే జలపాతాలు ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

ప్రకృతి ఒడిలో మైమరపించే జలపాతాలు ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

'హొన్నావర్' అందానికి జయహో అనాల్సిందే..!

'హొన్నావర్' అందానికి జయహో అనాల్సిందే..!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.