Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

Health: క్రానిక్‌... పానిక్‌.. వేడివేడిగా బాడీ రిపేర్‌!

Family Sakshi User Sakshi Sakshi Time Sep 10, 2024 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
stom.jpg

దేహంలోకి ప్రమాదకరమైన బ్యాక్టీరియా, వైరస్‌ ప్రవేశించడం గానీ లేదా ఏవైనా గాయాలైనప్పుడుగానీ ఆ హానికారక సూక్ష్మజీవులతో పోరాడి, శరీరాన్ని రక్షించుకునేందుకు రోగ నిరోధక వ్యవస్థ...  ఇన్‌ఫ్లమేషన్‌ అనే స్వాభావికమైన చర్య జరిగేలా చూస్తుంది. తెల్లరక్తకణాలపై. దేహాన్ని రక్షించేందుకు అవసరమైన కొన్ని రసాయనాలను పంపుతుంది.

గాయమైనప్పుడు ఆ ప్రదేశం ఎర్రబారడం, వాపురావడం, మంట అనిపించడం గమనించవచ్చు. అంటే వ్యాధి నిరోధక వ్యవస్థ... ఆ గాయాన్ని మాన్పే పని మొదలుపెట్టిందనేందుకు నిదర్శనాలే ఆ గుర్తులు. ఉదాహరణకు ఒకరి వేలు తెగిందనుకుందాం. వెంటనే వ్యాధి నిరోధక వ్యవస్థ రంగంలోకి దూకుతుంది. తెగిన ప్రాంతం చుట్టూ ఎర్రబడి, వాపు వస్తుంది. తెగడంతో గాయమైన కణజాలాన్ని రిపేరు చేసేందుకు ఉపక్రమించాయన్నమాట.

  • అలాగే జలుబు చేసినా లేదా దేహంలోకి జలుబు కలగజేసే వైరస్‌లాంటిది ఇంకోటి ఏదో ప్రవేశించిందంటే... దాన్ని తుదముట్టించేందుకు జ్వరం వస్తుంది. అంటే దేహం ఉష్ణోగ్రతను పెంచడం ద్వారా ఆ వేడిమి సహాయంతో శత్రు వైరస్‌ను కాల్చేటందుకే దేహపు ఉష్ణోగ్రత పెరుగుతుంది. అంటే జ్వరం అనేది దేహం తాలూకు ఓ ‘ఇన్‌ఫ్లమేటరీ రెస్పాన్స్‌’ అన్నమాట.

  • కొద్దికాలం పాటు మాత్రమే ఉండే ఇన్‌ఫ్లమేషన్‌ను ‘అక్యూట్‌ ఇన్‌ఫ్లమేషన్‌’ అనీ, అదే  దీర్ఘకాలం పాటు కొనసాగితే దాన్ని ‘క్రానిక్‌ ఇన్‌ఫ్లమేషన్‌’ అని వ్యవహరిస్తారు. అక్యూట్‌ ఇన్‌ఫ్లమేషన్‌తో పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చుగానీ... చాలాకాలం పాటు ఉండే ‘క్రానిక్‌ ఇన్‌ఫ్లమేషన్‌’ మాత్రం ఒక్కోసారి చాలా ప్రమాదకరం.

  • ఒక ఇన్‌ఫ్లమేషన్‌ చాలాకాలం పాటు కొనసాగుతోందంటే... శత్రువును ఎదుర్కొనేందుకు దేహం, దాని తాలూకు వ్యాధి నిరోధక వ్యవస్థ చాలా చురుగ్గా, సుదీర్ఘకాలం పాటు అలర్ట్‌గా ఉన్నాయని అర్థం.

ఓ వ్యక్తి అనారోగ్యకరమైన జీవనశైలితో జీవిస్తున్నా, అతడు చాలాకాలంగా చాలా ఎక్కువగా ఒత్తిడికి గురవుతున్నా, అతడు తీసుకుంటున్న ఆహారం అంతగా ఆరోగ్యకరంగా లేకపోయినా... ఈ అంశాలన్నీ అతడిలోకి వ్యాధి నిరోధక వ్యవస్థపై ఒత్తిడి కలగజేస్తూ, దాన్ని ఎప్పుడూ అలర్ట్‌గా ఉంచుతాయి. దాంతో ఇన్‌ఫ్లమేషన్‌ సుదీర్ఘకాలం పాటు (క్రానిక్‌గా) కొనసాగుతుంది. అప్పుడా పోరాటం శత్రుకణాల మీద కాకుండా సొంత కణాల మీదే జరుగుతుండటం వల్ల... ఈ పోరులో ఆరోగ్యకరమైన కణాలూ దెబ్బతింటుంటాయి.

  • ఉదాహరణకు ఓ వ్యక్తి తీసుకునే ఆహారంలో ్రపాసెస్‌డ్‌ ఐటమ్స్‌ ఎక్కువగా ఉన్నా లేదా చక్కెరలను ఎక్కువగా తీసుకుంటున్నా అతడిలో క్రానిక్‌ ఇన్‌ఫ్లమేషన్‌ వచ్చేందుకు అవకాశాలెక్కువ. అది సుదీర్ఘకాలం కొనసాగుతున్నందు ఆరోగ్యవంతమైన కణాలనూ నాశనం చేసే అవకాశాలు ఎక్కువ. ఇలాంటి సుదీర్ఘ ఇన్‌ఫ్లమేషన్స్‌తో ఆరోగ్యవంతమైన కణజాల వ్యవస్థలు దెబ్బతినడంతో అక్రమంగా గుండెజబ్బులు, డయాబెటిస్‌తో పాటు కొన్ని రకాల క్యాన్సర్లకు దారితీయవచ్చు. ఇక ఆ ఇన్‌ఫ్లమేషన్‌ జీర్ణవ్యవస్థలో వస్తే అది ఆరోగ్యంపై  రకారకాల దుష్ప్రభావాలను కలగజేయవచ్చు.

    ఓ వ్యక్తిలో అతడి జీర్ణవ్యవస్థ చాలా కీలకమైనది. ఆహారాన్ని జీర్ణం చేయడం ద్వారా అది దేహంలోని కోటానుకోట్ల (ట్రిలియన్లకొద్దీ) కణాలకు జీవశక్తిని అందజేయడం, అక్కడ వ్యర్థాలను తొలగించడం వంటి పనులు చేస్తుంది. ఈ జీర్ణవ్యవస్థే దేహానికి మేలు చేసే ట్రిలియన్లకొద్దీ సూక్ష్మజీవుల (మైక్రోబ్స్‌)కు ఆవాసం. వీటినే గట్‌ మైక్రోబియమ్‌ అంటారు. ఒక వ్యక్తి తాలూకు మూడ్స్‌ (భావోద్వేగాల)కూ ఇవే కారణం. అతడి వ్యాధి నిరోధక వ్యవస్థ సమర్థంగా పనిచేయడంలోనూ ఇవే కీలకం. అన్నట్టు వ్యాధి నిరోధక వ్యవస్థకు చెందిన కణజాలంలో 70 – 80 శాతం వరకు జీర్ణవ్యవస్థలోనే ఉండటమనే అంశం కూడా ఓ వ్యక్తి తాలూకు వ్యాధి నిరోధక వ్యవస్థకు అతడి జీర్ణవ్యవస్థ ఎంతగా ఊతం ఇస్తుందో ఈ అంశం తెలియజేస్తుంది.

    ఇంతటి కీలకమైన జీర్ణవ్యవస్థలో క్రానిక్‌ ఇన్‌ఫ్లమేషన్‌ వచ్చిందంటే అది ‘లీకీ గట్‌ సిండ్రోమ్‌’ లాంటి ఎన్నో అనర్థాలకు దారితీయవచ్చు. మానసికాందోళనలు మాటిమాటికీ తలెత్తే వాళ్లలో కొందరిలో పేగుల్లోని గోడలు చిట్లుతాయి. ఈ పరిస్థితినే ’లీకీ గట్‌’ అంటారు. ఇలా పేగుల్లోని గోడలు చిట్లడం జరిగితే దేహంలోని ప్రమాదకరమైన విషపదార్థాలూ, జీర్ణం కాని వ్యర్థాలూ, బ్యాక్టీరియా.. ఇవన్నీ రక్తప్రవాహంలోకి ప్రవేశిస్తాయి. ఈ ప్రక్రియ మరింత ఇన్‌ఫ్లమేషన్‌ను ప్రేరేపిస్తుంది. దాంతో సొంత వ్యాధినిరోధక వ్యవస్థే తన కణజాలంపై ప్రతికూలంగా పనిచేసే ఆటో ఇమ్యూన్‌ డిసీజెస్‌ వంటి వ్యాధులూ, చర్మరోగాలు, కీళ్లనొప్పులు వస్తాయి. ఇక మానసిక సమస్యలైన డిప్రెషన్‌ వంటివీ రావచ్చు.

    జీర్ణవ్యవస్థలో వచ్చే ఇన్‌ఫ్లమేషన్‌ పేగుల్లోని మంచి బ్యాక్టీరియా అయిన గట్‌ మైక్రోబియమ్‌ సమతౌల్యతను దెబ్బతీయవచ్చు. దాంతో కడుపుబ్బరం, మలబద్ధకం, నీళ్ల విరేచనాలు వంటి జీర్ణవ్యవస్థకు సంబంధించిన అనేక అనారోగ్యాలు కనిపించవచ్చు. గట్‌ మైక్రోబియమ్‌ దెబ్బతినడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ బలహీనపడేందుకూ అవకాశముంది. గట్‌ మైక్రోబియమ్‌ దెబ్బతినడం వల్ల ఇన్‌ఫ్లమేషన్‌... మళ్లీ ఈ ఇన్‌ఫ్లమేషన్‌ వల్ల మైక్రోబియమ్‌ సమతౌల్యత మరింత దెబ్బతినడం... ఈ విషవలయం ఇలా కొనసాగుతూ జీర్ణవ్యవస్థ మరింతగా దెబ్బతింటుంది. దాంతో జీర్ణవ్యవస్థ పనితీరూ దెబ్బతింటుంది.

    అందుకే జీర్ణవ్యవస్థ బాగుంటేనే వ్యాధి నిరోధక వ్యవస్థ మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది. సంతోషకరమైన భావోద్వేగలతో మూడ్స్‌ బాగుంటాయి. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటేనే దీర్ఘకాలిక (క్రానిక్‌) ఇన్‌ఫ్లమేషన్స్‌ సైతం తగ్గుతాయి. ఇతర దీర్ఘకాలిక జబ్బులు... అంటే గుండెజబ్బులు, ఊబకాయం, డయాబెటిస్‌ వంటివి నివారితమవుతాయి. అందుకే ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ ఉందంటే... దేహమంతా ఆరోగ్యంగా ఉందనీ, వ్యాధి నిరోధక వ్యవస్థ కూడా చురుగ్గా ఉందని అర్థం.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
family
Health
Precautions
suggestions
Inflammation
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

 5 రకాల ఫుడ్స్‌ కంప్లీట్‌ బంద్‌ : 11 నెలల్లో 32 కిలోలు తగ్గింది

5 రకాల ఫుడ్స్‌ కంప్లీట్‌ బంద్‌ : 11 నెలల్లో 32 కిలోలు తగ్గింది

'దటీజ్‌ మహాలక్ష్మి' ఎంత ముద్దుగుందో..!

'దటీజ్‌ మహాలక్ష్మి' ఎంత ముద్దుగుందో..!

ఆటిజం పిల్లలను పెంచే పేరెంటింగ్‌ టిప్స్..! వైరల్‌గా ఓ తల్లి గైడెన్స్‌..

ఆటిజం పిల్లలను పెంచే పేరెంటింగ్‌ టిప్స్..! వైరల్‌గా ఓ తల్లి గైడెన్స్‌..

ఆధ్యాత్మిక జ్వాల..

ఆధ్యాత్మిక జ్వాల..

అక్కడికే ఎక్కువమంది!

అక్కడికే ఎక్కువమంది!

కోర్టు కార్యకలాపాలు – ప్రాంతీయ భాషలు

కోర్టు కార్యకలాపాలు – ప్రాంతీయ భాషలు

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.