Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
search Subscribe Subscribe Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ Live TV లైవ్ టీవీ
download app యాప్ download app Download App
మమ్మల్ని అనుసరించండి
  • facebook
  • x
  • instagram
  • youtube
  • whatsapp
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫొటోలు
  • వీడియోలు
  • close logo
  • search
    Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ download app యాప్

    విభాగాలు

  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • మమ్మల్ని అనుసరించండి

    facebook x instagram youtube whatsapp whatsapp whatsapp
  • Sakshi Search
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. పాదాల దుర్వాసన... 10ఏళ్ల న్యాయపోరాటం! కోర్టు ఏం చెప్పిందంటే?
ADVERTISEMENT

పాదాల దుర్వాసన... 10ఏళ్ల న్యాయపోరాటం! కోర్టు ఏం చెప్పిందంటే?

Family Sakshi User Sakshi Sakshi Time Oct 18, 2026 10:53 AM IST Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Google
University.jpg

ఫండే

లీగలాటా

క్రమశిక్షణ ఉల్లంఘిస్తేనో లేదా పరీక్షల్లో కాపీలు రాస్తూ పట్టుబడితేనో విద్యార్థులపై నిషేధం విధిస్తారు. అయితే ఆ విద్యార్థి ఇవేమీ చేయలేదు. అయినా, తరగతులకు రావొద్దంటూ యూనివర్సిటీ నిషేధం విధించింది. లైబ్రరీకి సైతం రాకుండా నిరోధించింది. అతడికున్న శారీరక లోపాన్ని సాకుగా చూపి ఈ చర్యలకు పాల్పడింది.

అయినా ఆ విద్యార్థి కుంగిపోలేదు, చదువుకు దూరం కావాలని భావించలేదు. వైద్యపరమైన సమస్య తన చదువుకు అడ్డంకిగా మారకూడదనుకున్నాడు. వర్సిటీ నిర్ణయంపై కోర్టు కెక్కాడు. పదేళ్లు న్యాయపోరాటం చేశాడు. ఓ విద్యార్థి వల్ల వందలాది మంది విద్యార్థులు, అధ్యాపకులు ఇబ్బంది పడాలా? ఆ ఒక్క విద్యార్థిపై నిషేధం విధించాలా? అనారోగ్య సమస్య కారణంగా చదువుకునే హక్కును దూరం చేయాలా? ఈ ప్రశ్నలకు కోర్టు పరిష్కారం చూపింది. ఆ తీర్పుతో ప్రపంచవ్యాప్తంగా ఈ కేసు ప్రాచుర్యం పొందింది.

టూనిస్‌ టెన్‌బ్రుక్‌ నెదర్లాండ్స్‌లోని ఎరాస్మస్‌ యూనివర్సిటీలో తత్త్వశాస్త్ర విద్యార్థి.  టెన్‌బ్రుక్‌కు ఓ అనారోగ్య సమస్య ఉంది.  అతని పాదాల నుంచి విపరీతమైన దుర్వాసన వస్తుంది. అతను క్లాస్‌ రూమ్‌లో ఉన్నప్పుడు తాము పాఠాలను సరిగా బోధించలేక పోతున్నామని ప్రొఫెసర్లు, వినలేకపోతున్నా మని విద్యార్థులు వర్సిటీ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. లైబ్రరీలోనూ అదే సమస్య. నిశ్శబ్దం కంటే చెమట వాసన భయంకరంగా ఉందని తోటి విద్యార్థుల గగ్గోలు... ఫిర్యాదులు రెండూ పెరిగాయి. సమస్య జటిలంగా మారింది. దీంతో ట్యూనిస్‌ బ్రుక్‌పై వర్సిటీ నిషేధం విధించింది. తరగతులకు రావద్దని హుకుం జారీ చేసింది. లైబ్రరీకి సైతం వెళ్లడానికి అనుమతి నిరాకరించింది.

కోర్టు మెట్లెక్కిన టెన్‌బ్రుక్‌
‘వర్సిటీ నిబంధనల ప్రకారం ఫీజు చెల్లించి అడ్మిషన్‌ పొందాను. నా అనారోగ్య సమస్యను అడ్డంపెట్టుకుని నిషేధం విధించడం సరికాదు..చదువుకునే హక్కును అడ్డుకోవడం తగదు’ అంటూ కోర్టులో కేసు దాఖలు చేశాడు. 
ఇది వివక్ష కిందకే వస్తుందని, చెమట వాసన వస్తే అడ్మిషన్‌ రద్దవుతుందని వర్సిటీ నిబంధనల్లో లేదని అతని తరపు న్యాయవాది  వాదించాడు. ఓ విద్యార్థి కారణంగా వందల మంది ఇబ్బంది పడుతున్నారు. అది క్రమశిక్షణ చర్య కిందకే వస్తుందని వర్సిటీ తరపు న్యాయవాది తన వాదనలు వినిపించాడు.

ముక్కు మూసుకోవాల్సిందే
ఇది సాధారణ కేసు కాదు. ఒక వైపు విద్యార్థి చదువుకునే హక్కు. మరోవైపు తోటి విద్యార్థులు, అధ్యాపకుల వ్యక్తిగత సౌకర్యం. ఇరు పక్షాల వాదనలు విన్న డచ్‌ కోర్టు తీర్పు ప్రకటించింది. బ్రుక్‌ పాదాల నుంచి వస్తున్న వాసన అత్యంత దుర్వాసన కలిగించొచ్చు. అయితే ఆ కారణంగా అతడ్ని చదువుకు దూరం చేయలేమని, అతడి విద్యాహక్కును కాలరాయలేమని చెప్పింది. ‘ఇబ్బందికరంగా ఉంటే ముక్కులు మూసుకుని భరించాల్సిందే’ అంటూ న్యాయమూర్తి వ్యాఖ్యానించడం సంచలనం రేపింది. నిషేధం ఎత్తివేసి వర్సిటీలోకి ప్రవేశించేందుకు అనుమతి ఇవ్వాలని ఆదేశించింది.

పదేళ్ల అతని న్యాయ పోరాటం ఫలించింది. చదువుకునే హక్కును బ్రుక్‌ తిరిగి పొందాడు.  ఈ ఉదంతం నేపథ్యంలో వర్సిటీ ఓ కొత్త నిబంధనను తీసుకొచ్చింది. ఇలాంటి సమస్య ఉన్న విద్యార్థులపై నిషేధం కాకుండా వారి నుంచి పెనాల్టీలు వసూలు చేయాలని నిర్ణయించింది.

గతంలోనూ బ్రుక్‌ ఈ తరహా అవమానాలు ఎదుర్కొన్నట్టు వార్త కథనాలు పేర్కొన్నాయి. డెల్ఫ్ట్‌ యూనివర్సిటీ లైబ్రరీలో బూట్లు విప్పి కూర్చున్నప్పుడు దుర్వాసన వచ్చింది. దీంతో లైబ్రరీ సెక్యూరిటీ ఉద్యోగులు అతడ్ని బలవంతంగా బయటకు పంపారు. ప్రాంగణంలోకి రాకూడని హెచ్చరించారు. దాన్ని ఉల్లంఘించి అతడు మళ్లీ వర్సిటీలోకి వెళ్లడానికి ప్రయత్నించాడు. బ్రుక్‌ ఆ వర్సిటీ విద్యార్థి కాకపోవడంతో లోపలికి అక్రమంగా ప్రవేశించాడని పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టు జరిమానా విధించింది. తర్వాత ఎరాస్మస్‌ యూనివర్సిటీలో అడ్మిషన్‌ పొందాడు. అక్కడా ఇదే తరహా సమస్యను ఎదుర్కొన్నాడు.

ఈ కేసు విద్యార్థులకు ఓ పాఠాన్ని నేర్పుతోంది. సమస్య ఎదురైతే కుంగిపోకుండా, మానసిక ధైర్యంతో ముందడుగు వేయాలి. సమస్యకు పరిష్కారం వెతకాలి... అని ఈ ఉదంతం విద్యార్ధులకు మార్గం చూపుతోంది.

- దిలీప్‌ మాదిరెడ్డి

ఇదీ చదవండి: నోబెల్‌ నుంచి జ్ఞానపీఠం వరకు.. రచయితలకు దక్కే అరుదైన గౌరవాలు!

ADVERTISEMENT
ADVERTISEMENT
tags Tags:
Student
university
banned
court verdict
Disability
Education cess
Funday
Vintalu Vishesalu
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

గుడ్డు పెట్టకుండానే కోడిపిల్ల..!?

గుడ్డు పెట్టకుండానే కోడిపిల్ల..!?

గంటల లెక్కన కుక్కల బుకింగ్‌.. ఇదేం ఐడియా బాసూ!

గంటల లెక్కన కుక్కల బుకింగ్‌.. ఇదేం ఐడియా బాసూ!

మీ షూస్‌ చూస్తేనే మీ స్టేటస్‌ తెలిసిపోతుందా?

మీ షూస్‌ చూస్తేనే మీ స్టేటస్‌ తెలిసిపోతుందా?

సాయిపల్లవి చేతికి ఎప్పుడూ ఆ మాలే ఎందుకు?

సాయిపల్లవి చేతికి ఎప్పుడూ ఆ మాలే ఎందుకు?

ఆరావళిలో వినిపించిన మృదుల రవళి...

ఆరావళిలో వినిపించిన మృదుల రవళి...

అపరిచితుడిని చంపితే దొరకరా? ఇదో వింత పరిశోధన!

అపరిచితుడిని చంపితే దొరకరా? ఇదో వింత పరిశోధన!

మరిన్ని వార్తలు

మీ చిన్నప్పుడూ.. ఇలాంటి స్నేహితుడు ఉన్నాడా!?

మీ చిన్నప్పుడూ.. ఇలాంటి స్నేహితుడు ఉన్నాడా!?

మతిమరుపుకు ముందస్తు హెచ్చరిక.. ఏఐతో కొత్త ప్రయోగం!

మతిమరుపుకు ముందస్తు హెచ్చరిక.. ఏఐతో కొత్త ప్రయోగం!

గుడ్డు పెట్టకుండానే కోడిపిల్ల..!?

గుడ్డు పెట్టకుండానే కోడిపిల్ల..!?

గంటల లెక్కన కుక్కల బుకింగ్‌.. ఇదేం ఐడియా బాసూ!

గంటల లెక్కన కుక్కల బుకింగ్‌.. ఇదేం ఐడియా బాసూ!

మీ షూస్‌ చూస్తేనే మీ స్టేటస్‌ తెలిసిపోతుందా?

మీ షూస్‌ చూస్తేనే మీ స్టేటస్‌ తెలిసిపోతుందా?

సాయిపల్లవి చేతికి ఎప్పుడూ ఆ మాలే ఎందుకు?

సాయిపల్లవి చేతికి ఎప్పుడూ ఆ మాలే ఎందుకు?

  

ADVERTISEMENT
 
 
ADVERTISEMENT
ADVERTISEMENT
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Jagati Publications Limited.
Powered by Yodasoft