Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
search Subscribe Subscribe Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ Live TV లైవ్ టీవీ
download app యాప్ download app Download App
మమ్మల్ని అనుసరించండి
  • facebook
  • x
  • instagram
  • youtube
  • whatsapp
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫొటోలు
  • వీడియోలు
  • close logo
  • search
    Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ download app యాప్

    విభాగాలు

  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • మమ్మల్ని అనుసరించండి

    facebook x instagram youtube whatsapp whatsapp whatsapp
  • Sakshi Search
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. నీ ఆటే బంగారం... శ్రీవల్లీ
ADVERTISEMENT

నీ ఆటే బంగారం... శ్రీవల్లీ

Family Sakshi User Sakshi Sakshi Time Nov 27, 2024 12:23 AM IST Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Google
Srivalli---2.jpg

‘క్రికెట్‌ ప్లేయర్‌ కావాలనుకుంటున్నాను’ అనే మాట అబ్బాయిల నోట వినిపిస్తే అభినందనలు తెలుపుతారు. ఆశీర్వదిస్తారు. అదే మాట అమ్మాయిల నోటి నుంచి వినిపిస్తే..? అవాక్కవుతారు. ‘అమ్మాయిలకు క్రికెట్‌ ఎందుకు?’ అని కూడా అంటారు. లక్ష్యం మీద గురి పెట్టిన వారు మాత్రం అలాంటి మాటలను లక్ష్యపెట్టరు. అలాంటి ఒక అమ్మాయి శ్రీవల్లి. ఎన్నో సవాళ్లను అధిగమించి తన కలను నెరవేర్చుకున్న శ్రీవల్లి క్రికెట్‌లో రాణిస్తోంది. డిసెంబరు 4 నుంచి అహ్మదాబాద్‌లో జరగనున్న మ్యాచ్‌లో బీసీసీఐ సీనియర్‌ మహిళల జట్టులో హైదరాబాద్‌ తరఫున ప్రాతినిధ్యం వహించనుంది.

శ్రీవల్లికి క్రికెట్‌ అంటే చాలా ఇష్టం. అయితే ఆ ఇష్టం టీవీలో వీక్షణకే పరిమితం కాలేదు. చిన్న వయసులోనే బాల్, బ్యాట్‌తో గ్రౌండ్‌లో అడుగు పెట్టేలా చేసింది. శ్రీవల్లి అయిదవ తరగతి చదువుతున్న రోజుల్లో... స్కూల్‌ ప్లే గ్రౌండ్‌కు వెళ్లింది. హైస్కూల్‌ అబ్బాయిలు అక్కడ క్రికెట్‌ ఆడుతున్నారు. ‘అన్నా... నేను కూడా ఆడతాను’ అని అడిగింది చిన్నారి శ్రీవల్లి. వాళ్లు బిగ్గరగా నవ్వారు.

ఆ నవ్వులో ఎన్నో అర్థాలు ఉన్నాయి. ‘అయిదో క్లాసు అమ్మాయి హైస్కూల్‌ అబ్బాయిలతో ఆడడం ఏమిటి!’ అని కావచ్చు. ‘ఆడపిల్లలు క్రికెట్‌ ఆడడం ఏమిటి!’ అని కావచ్చు. వారి వెటకారపు నవ్వులతో వెనక్కి వెళ్లిపోలేదు శ్రీవల్లి. పీఈటీ రహీం సార్‌కు చెప్పింది.  ‘నీ ఉత్సాహం సరే, వారితో ఆడగలవా?’ అని అడిగారు సార్‌. ‘ఆడతాను’ అని ఉత్సాహంతో తల ఊపింది.

నిజానికి అది ఉత్సాహం మాత్రమే కాదు ఆత్మవిశ్వాసానికి సంబంధించిన తొలి సంకేతం. విజయపథం వైపు వేసిన తొలి అడుగు. శ్రీవల్లి చేసిన బౌలింగ్‌లో సీనియర్లు షాట్లు బాగానే కొట్టారు. కానీ, తన స్పీడ్‌కు కొందరు బెంబేలెత్తడం పీఈటీ సార్‌ గమనించారు. లైన్  లెంగ్త్‌ సరిదిద్దితే శ్రీవల్లిని బాగా తీర్చిదిద్దవచ్చు అని గుర్తించారు. అక్కడ నుంచి తానే కోచ్‌గా మారారు. శ్రీవల్లి బౌలింగ్‌లోని లోపాలను సరిచేస్తూ క్రమంగా స్పీడ్‌బౌలర్‌గా తీర్చిదిద్దారు. ‘మీ అమ్మాయికి మంచి భవిష్యత్‌ ఉంది’ అని శ్రీవల్లి తల్లిదండ్రులకు చె΄్పారు.

‘క్రికెట్‌ అంటే ఏదో సరదాగా ఆడుతోంది కానీ అమ్మాయిని డాక్టర్‌గా చూడాలనేది మా కల’ అని వారు అని ఉంటే శ్రీవల్లి కల ఆవిరైపోయేది. అయితే సార్‌ మాట విని శ్రీవల్లి తల్లిదండ్రులు చాలా సంతోషించారు. కుమార్తెకు మరింత సాధన అవసరమనుకున్న తండ్రి లక్షా్మరెడ్డి శ్రీవల్లిని హైదరాబాద్‌ పంపాడు.

‘పై చదువుల కోసమో, ఎంసెట్‌ కోచింగ్‌ కోసమో పిల్లల్ని హైదరాబాద్‌కు పంపిస్తారుగానీ క్రికెట్‌ కోచింగ్‌ కోసం పంపిస్తున్నావా!’ అని బోలెడు ఆశ్చర్యపడిన వాళ్లు... ‘క్రికెట్‌లో ఎవరికో ఒకరికి అదృష్టం దక్కుతుంది. ఆడినవాళ్లందరూ స్టార్‌లు కాలేరు’ అని నిరాశపరిచిన వాళ్లూ్ల ఉండొచ్చు. ఎవరి నుంచి ఎలాంటి మాటలు వచ్చినా ఆ తల్లిదండ్రులకు బాగా నచ్చిన మాట...‘మీ అమ్మాయికి క్రికెట్‌లో మంచి భవిష్యత్‌ ఉంది’

హైదరాబాద్‌లో కనిష్కనాయుడు శిక్షణలో క్రికెట్‌లో తన నైపుణ్యాన్ని మరింతగా మెరుగుపరుచుకుంది శ్రీవల్లి. ఫాస్ట్‌బౌలర్‌గానే కాకుండా, బ్యాటింగ్‌తోనూ ఆకట్టుకోగల ఆల్‌రౌండ్‌ నైపుణ్యాన్ని సొంతం చేసుకుంది.బాల్యంలోనే పెద్ద కలలు కన్న శ్రీవల్లి టీనేజ్‌లో ఆ కలలను తన సాధనతో మరింత సాకారం చేసుకుంది.ప్రపంచంలోనే అత్యంత ఫాస్ట్‌ బౌలర్‌గా రాణించాలనేది శ్రీవల్లి లక్ష్యం. ఆమె కల నెరవేరాలని ఆశిద్దాం. – అనిల్‌ కుమార్‌ భాషబోయిన సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌

ఆ స్ఫూర్తితోనే...
అబ్బాయిలతో పోల్చితే అమ్మాయిలు క్రికెట్‌ ఆడడానికి రకరకాల పరిమితులు ఉండొచ్చు. అయితే ఆడాలనే ఉత్సాహంతోపాటు సంకల్పబలం ఉంటే ఆ పరిమితులు మనకు అడ్డుకావు. ఎంతోమంది స్టార్‌ క్రికెట్‌ ప్లేయర్‌ల అపూర్వ విజయాలతో స్ఫూర్తి పొందాను. ఆ స్ఫూర్తితోనే క్రికెట్‌ గ్రౌండ్‌లోకి అడుగుపెట్టాను. ఫాస్ట్‌ బౌలర్‌గా రాణించాలనేది నా కల. – కట్టా శ్రీవల్లి రెడ్డి

ADVERTISEMENT
ADVERTISEMENT
tags Tags:
Srivalli
woman cricketer
Hyderabad
team
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

 ఎల్ నినో దెబ్బ.. హైదరాబాద్ లో నీటి ఎద్దడి..

ఎల్ నినో దెబ్బ.. హైదరాబాద్ లో నీటి ఎద్దడి..

మంటల్లో బూడిదైన ఐదు ఆటోలు, ఒక DCM

మంటల్లో బూడిదైన ఐదు ఆటోలు, ఒక DCM

హైదరాబాద్ లో దీపావళి విషాదం.. టపాసులతో 50 మందికి కంటి గాయాలు

హైదరాబాద్ లో దీపావళి విషాదం.. టపాసులతో 50 మందికి కంటి గాయాలు

కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం..

కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం..

హైదరాబాద్‌లో వరుస అగ్నిప్రమాదాలు.. రాత్రంతా భయానకం

హైదరాబాద్‌లో వరుస అగ్నిప్రమాదాలు.. రాత్రంతా భయానకం

బండిమెట్‌లోని ఓ భవనంలో భారీగా చెలరేగిన మంటలు

బండిమెట్‌లోని ఓ భవనంలో భారీగా చెలరేగిన మంటలు

మరిన్ని వార్తలు

మీ చిన్నప్పుడూ.. ఇలాంటి స్నేహితుడు ఉన్నాడా!?

మీ చిన్నప్పుడూ.. ఇలాంటి స్నేహితుడు ఉన్నాడా!?

మతిమరుపుకు ముందస్తు హెచ్చరిక.. ఏఐతో కొత్త ప్రయోగం!

మతిమరుపుకు ముందస్తు హెచ్చరిక.. ఏఐతో కొత్త ప్రయోగం!

గుడ్డు పెట్టకుండానే కోడిపిల్ల..!?

గుడ్డు పెట్టకుండానే కోడిపిల్ల..!?

గంటల లెక్కన కుక్కల బుకింగ్‌.. ఇదేం ఐడియా బాసూ!

గంటల లెక్కన కుక్కల బుకింగ్‌.. ఇదేం ఐడియా బాసూ!

మీ షూస్‌ చూస్తేనే మీ స్టేటస్‌ తెలిసిపోతుందా?

మీ షూస్‌ చూస్తేనే మీ స్టేటస్‌ తెలిసిపోతుందా?

సాయిపల్లవి చేతికి ఎప్పుడూ ఆ మాలే ఎందుకు?

సాయిపల్లవి చేతికి ఎప్పుడూ ఆ మాలే ఎందుకు?

  

ADVERTISEMENT
 
 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Jagati Publications Limited.
Powered by Yodasoft