Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

బందరు బంగారు తీగ

Family Sakshi User Sakshi Sakshi Time Dec 22, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
gold_0.jpg

అసలు కన్నా వడ్డీ ముద్దు.. ఒరిజినల్‌ కన్నా ఇమిటేషన్‌ ఇంపు! అందుకే.. బంగారం మిన్నుకేసి మిడిసిపడుతుంటే.. మార్కెట్లో మెరుస్తూ రోల్డ్‌గోల్డ్‌ ఆభరణప్రియులను ఆకట్టుకుంటోంది! గోల్డ్‌ స్థానాన్ని ఆక్రమిస్తూ తన వన్నె పెంచుకుంటోంది! అలాంటి గిల్టునగలకు మేలిమి చిరునామా ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నం!! సామాన్యులతోపాటు ధనికులనూ ఆకర్షిస్తున్న మచిలీపట్నం రోల్డ్‌గోల్డ్‌ జ్యూల్రీపై ప్రత్యేక కథనం..

ఎస్‌.పి. యూసుఫ్, సాక్షి, మచిలీపట్నం. 
మచిలీపట్నంలోని ఇమిటేషన్‌ జ్యూల్రీకి సారేపల్లి సాంబయ్య పోతపోశారు.   రోజురోజుకు బంగారం ధర పెరిగిపోతున్న కారణంగా ప్రత్యామ్నాయం వైపు దృష్టిసారించారాయన. బంగారం, రాగి లోహాలతో ‘కట్టు’ పద్ధతి ద్వారా నగల తయారీని ప్రారంభించారు. తక్కువ ధరకే లభించడం, వన్నె తగ్గకుండా ఏళ్లపాటు మన్నడంతో నాడు అది లకలపూడి బంగారంగా పేరుపొందింది. తర్వాతర్వాత బంగారం, రాగితో కాకుండా వేరే మెటల్‌తో ముక్కు పుడక దగ్గర్నుంచి ఒడ్డాణం దాకా పలు రకాల నగలను పలు రకాల డిజైన్స్‌లో తయారుచేసి, బంగారు వర్ణం రేకుతో తాపడం పెట్టసాగారు. రోజువారీ ఉపయోగం నుంచి శుభకార్యాలు, ప్రత్యేక వేడుకల వరకు అన్ని సందర్భాలకు అవసరమయ్యే నగలను తయారుచేస్తారు. ట్రెండ్‌కి తగ్గ డిజైన్స్‌తో మెరుపులో అసలు బంగారానికే మాత్రం తీసిపోని ఈ గిల్టు నగలకు మార్కెట్లో డిమాండ్‌ కూడా పెరుగుతూ వస్తోంది. 

జీవం పోసిన వైఎస్సాఆర్‌
వైఎస్‌ రాజశేఖర రెడ్డి సీమ్‌ అయ్యాక ఈ పరిశ్రమకు జీవం పోశారు. ఎమ్మెస్సెమ్‌ఈలో దీన్నో  క్లస్టర్‌గా గుర్తించి, ఏపీఐఐసీ ద్వారా అభివృద్ధి చర్యలు చేపట్టారు. ఈ నగల పరిశ్రమల కోసం మచిలీపట్నంలో 48 ఎకరాల భూమిని కేటాయించి, జ్యూల్రీ పార్క్‌గా మలచారు. ప్రస్తుతం ఇక్కడ 236 పరిశ్రమలు న్నాయి. ప్రత్యక్షంగా మూడువేల మంది ఉపాధి పొందుతు న్నారు.

ఈ జ్యూల్రీ తయారీ మచిలీ పట్నంతో పాటు పెడన, పామర్రు, అవనిగడ్డ వంటి 40కి పైగా గ్రామాల్లో విస్తరించడంతో సుమారు 30వేల మంది ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఈ రంగాన్ని ఆదుకునేందుకు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ సబ్సిడీపై విద్యుత్‌ను అందించారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు సీఎమ్‌ అయ్యాక .. ఏడు రూపాయలున్న యూనిట్‌ ధరను రూ.3.25 పైసలకే ఇచ్చారు.

దేశవిదేశాలకు బందరు బంగారు తీగ
మామూలు నగలే కాకుండా ఆలయాల్లోని విగ్రహాల కిరీటాలు తదితర సామాగ్రి, భరతనాట్యం, కూచిపూడి నాట్య ప్రదర్శనలకు అవసరమైన ఆహార్యంలోని హారాలు, ఒడ్డాణాలు, డ్రామా కంపెనీల ఆభరణాల సెట్లనూ తయారుచేస్తారిక్కడ. 2007లో రూ. 30 కోట్లున్న ఈ పరిశ్రమ టర్నోవర్‌ జ్యూల్రీ పార్క్‌ ఏర్పాటు తర్వాత పుంజుకుని, ఐఎస్‌ఓనూ పొందింది. ప్రస్తుతం దీని టర్నోవర్‌ రూ. 100 కోట్లకు పైమాటే! బందరు రోల్డ్‌గోల్డ్‌ నగలకు ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా మొదలైన రాష్ట్రాల్లోనూ డిమాండ్‌ ఉంది. అంతేకాదు శ్రీలంక, మాల్దీవ్స్, , బంగ్లాదేశ్, మయన్మార్, అరబ్‌ కంట్రీస్‌కూ ఎగుమతి అవుతున్నాయి. ఈ ఇమిటేషన్‌ జ్యూల్రీలో కొన్నింటికి ఆరునెలల గ్యారంటీ ఇస్తారు. రంగుపోతే వాటిని మార్చుకోవచ్చు. స్కిల్‌ హబ్‌ కింద ఈ నగల తయారీలో ఉత్సాహవంతులకు మూడు నెలల ఉచిత శిక్షణను అందిస్తున్నారు.

నాణ్యతకూ మారుపేరు
మచిలీపట్నానికి చెందిన సారేపల్లి సాంబయ్య ఆలోచన ఇప్పుడు వేలాది మందికి ఉపాధిగా మారింది. బందరు బంగారు తీగ డిజైన్స్‌కే కాదు నాణ్యతకూ మారుపేరుగా నిలిచింది.
∙పెద్దేటి వెంకటసుబ్బారావు, అధ్యక్షుడు, మచిలీపట్నం ఇమిటేషన్‌ జ్యూల్రీ పార్కు సంఘం

వారసత్వాన్ని కాపాడ్డానికి..
ఎంతో చరిత్ర ఉన్న మచిలీపట్నం ఇమిటేషన్‌ జ్యూల్రీ తయారీని తర్వాత తరాలకూ అందించడానికి ఆసక్తి ఉన్నవాళ్లకు ఉచితంగానే శిక్షణనిస్తున్నాం. దీనివల్ల ఎంతోమంది ఉపాధి పొందుతున్నారు. 
∙అంకెం జితేంద్రకుమార్, కార్యదర్శి, మచిలీపట్నం ఇమిటేషన్‌ జ్యూల్రీ పార్కు సభ్యుల సంఘం.

 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
special story
machilipatnam
Jewellery
Funday
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఇది సాధారణ బొమ్మ కాదు.. మినీ రోబో స్నేహితుడు!

ఇది సాధారణ బొమ్మ కాదు.. మినీ రోబో స్నేహితుడు!

ఆన్‌ చేస్తే టీవీ.. ఆఫ్‌ చేస్తే ఆర్ట్‌ గ్యాలరీ.. అద్భుతం!

ఆన్‌ చేస్తే టీవీ.. ఆఫ్‌ చేస్తే ఆర్ట్‌ గ్యాలరీ.. అద్భుతం!

గర్విష్టి గజరాజు

గర్విష్టి గజరాజు

వైరస్‌ పుట్టకముందే అంత్యక్రియలు! ఏఐ వ్యాక్సిన్‌ ప్రయోగం..

వైరస్‌ పుట్టకముందే అంత్యక్రియలు! ఏఐ వ్యాక్సిన్‌ ప్రయోగం..

కుక్కయినా హక్కుంది... దానికో లెక్కుంది!

కుక్కయినా హక్కుంది... దానికో లెక్కుంది!

అష్టావక్రుడి పూర్వజన్మ వృత్తాంతం

అష్టావక్రుడి పూర్వజన్మ వృత్తాంతం

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.