Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

నన్ను పెళ్లి చేసుకుంటావా ?!

Family Sakshi User Sakshi Sakshi Time Feb 8, 2026 Sakshi Read Time Read Time: 6 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Feb8-mad.jpg

‘వాలెంటైన్స్‌’ వీక్‌ మొదలైంది. నిన్నంతా గులాబీల పరిమళం (రోజ్‌ డే). 
నేడు, ‘‘నన్ను పెళ్లి చేసుకుంటావా?!’’ అని వేడుకొనే రోజు (ప్రపోజ్‌ డే). 
రేపు, మధురమైన చాక్లెట్‌ డే. 
10న టెడ్డీ డే. 11న ప్రామిస్‌ డే. 12న హగ్‌ డే. 13న కిస్‌ డే.
14 శనివారం, వాలెంటైన్స్‌ డే. 
ఎనిమిది రోజుల ప్రేమవారం.. ఈ వరుసంతా!
అన్నిట్లోకి అపురూపమైనది ఇవాళ్టి ప్రపోజ్‌ డే. 
ఈ సందర్భంగా –కొందరు తత్వవేత్తల ప్రపోజల్స్‌ గురించి.

తత్త్వవేత్తల ఆలోచనలు సాధారణ ప్రపంచానికి అంతుపట్టవు. వాళ్లకు ఎంతో సరళమైనది, లోకానికి కఠినాతికఠినంగా ఉంటుంది. ప్రేమ, పెళ్లి అనే లాలిత్యమైన భావనలు కూడా వారిలో ‘మేధాగర్భితమై’ ఉంటాయి. మానవ మాత్రులం పూలగుత్తులు, వెన్నెల రాత్రులతో ప్రేమను పండించుకోవాలని చూస్తుంటే... వారు మాత్రం తర్క వితర్కాలు, విడ్డూరమైన ఒప్పందాలతో ప్రేమను ‘కుదుర్చుకోవటం’ చరిత్రలో మనకు కనిపిస్తుంది! పాశ్చాత్య ఫిలాసఫర్‌లు మాత్రమే కాదు, భారతీయ తాత్త్విక చింతనాపరులూ ప్రేమ / పెళ్లి ‘ప్రపోజల్‌’ విషయంలో వాళ్లదైన స్థాయిలో సతమతమైనవారే లేదా తమ ప్రియురాళ్లను సతాయించినవారే.

ఫ్రెడరిక్‌ నీషే
నీషే 19వ శతాబ్దపు జర్మన్‌ తత్త్వవేత్త. ఈయన తన ప్రియురాలికి (వన్‌ సైడ్‌ లవ్‌) ముచ్చటగా మూడుసార్లు ప్రపోజ్‌ చేశారు. ఆ ప్రియురాలు ‘లూ ఆండ్రియాస్‌ సలోమీ’ అసాధారణ మేధావి! ఈయన్ని మించినావిడ! భావోద్వేగాల పరంగా ఆమె స్థాయి ఎక్కడో ఎగువన ఉంటే, నీషే స్థాయి ఎక్కడో దిగువన ఉండేది. ‘‘నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా?’’ అని ఆయన ఆమెను ఒకసారి అడిగి ఊరుకోలేదు. మూడు ప్రయత్నాలు చేశారు. మొదటి ప్రయత్నంలో, నేరుగా అడిగే ధైర్యం లేక తన స్నేహితుడు పాల్‌ రేని రాయబారిగా పంపారు. అదే అతడు చేసిన పొరపాటు. 

ఆ రాయబారికి కూడా ఆమె అంటే ప్రాణం! నీషే ప్రేమ గురించి చెప్పకుండా తన ప్రేమ గురించి ఆమెకు చెప్పాడు. చివరికి ఆమె ఇద్దరికీ ‘నో’ చెప్పేసింది. అలాగని ఆమె ఆ రెండు పురుషాత్మల ఆశా దీపాన్ని ‘ఉఫ్‌’మనేమీ ఆర్పేయలేదు. ‘‘మన ముగ్గురం కలిసి ఒక ‘పరిశుద్ధ త్రిమూర్తులు’గా బ్రహ్మచర్యం పాటిస్తూ, కేవలం చదువుకు అంకితమై ఒకే ఇంట్లో ఉందాం’’ అని ప్రతిపాదించింది. నీషే మొదట అయిష్టంగానే ఒప్పుకున్నా, ఆ తర్వాత వారి పవిత్ర స్నేహబంధాన్ని ఆమెతో పెళ్లిగా మార్చుకుందామని రెండుసార్లు ప్రయత్నించారు. పాపం ఆయన తర్కం ఆమె దగ్గర చీమంత కూడా పని చేయలేదు.

సోరెన్‌ కిర్కేగార్డ్‌
కిర్కేగార్డ్‌ 19వ శతాబ్దపు డెన్మార్క్‌ వేదాంత వేత్త. రెజీన్‌ ఒల్సెన్‌ అనే యువతికి ఆయన చేసిన ప్రపోజల్‌ మొదట్లో చాలా పద్ధతిగానే ఉంది. కానీ ఆ తర్వాత ఆయన ప్రదర్శించిన విన్యాసాలే చరిత్రలో ఒక వింత అధ్యాయంగా మిగిలిపోయాయి. ఆయన అడిగారు, ఆమె సరేనంది... ఆ ఆనందం కనీసం మూణ్ణాళ్లైనా కాదు కదా, రెణ్ణాళ్ల ముచ్చటగానే ముగిసింది! అందుకు కారణం ఆమె కాదు. అతడే. 

లవ్‌ని ప్రపోజ్‌ చేశాక ఆయనకు ఒక ఆలోచన వచ్చింది తనకున్న అకారణ విషాద భావన తత్వం (మెలంకలీ), దేవుని పట్ల ఉన్న భక్తి... ఒక మంచి భర్తగా ఉండటానికి ఏమాత్రం పనికిరావని ఆయన సిద్ధాంతీకరించుకున్నారు! పోనీ, గౌరవప్రదంగా విడిపోవచ్చు కదా? అదీ లేదు! ఆమెకు తన మీద ద్వేషం, అసహ్యం కలిగేలా చేసుకుని, బ్రేకప్‌ వల్ల ఆమె బాధపడకూడదనే వింత ఆలోచనతో తన గురించి తనే ఒక దుష్ప్రచారం మొదలుపెట్టుకున్నారు. బయట అందరి ముందు కావాలనే ఒక మూర్ఖుడిలా, దుర్మార్గుడిలా ప్రవర్తిస్తూ తన పరువును తనే తీసుకున్నారు.

ఇమ్మాన్యుయేల్‌ కాంట్‌ 
ఈయన 18వ శతాబ్దపు ప్రముఖ భావవాద జర్మనీ తత్త్వవేత్త. సమయాన్ని పాటించడంలో, విషయాలను విశ్లేషించి, వర్గీకరించటంలో మహాజ్ఞాని. సమస్య ఏంటంటే, లవ్‌ ప్రపోజల్‌ని ఆయన ఒక అందమైన అనుభూతిలా కాకుండా, తాను ఛేదించలేని ఒక క్లిష్టమైన గణిత సమస్యలా చూశారు. సంగతేంటంటే, ఇద్దరు అమ్మాయిలకు (ఒకేసారి కాదు లెండి, ఒకరి తర్వాత ఒకరికి) ఆయన ప్రపోజ్‌ చేయాలనుకున్నారు కాని, మేధస్సు ఆడిన ఊగిసలాటతో ఆ పని చేయలేకపోయారు.

 పెళ్లి వల్ల వచ్చే ఆర్థిక లాభనష్టాలు; తార్కికమైన ప్లస్‌లు, మైనస్‌లు లెక్కగట్టడానికి ఆయన ఎంత సమయం తీసుకున్నారంటే... చివరకు ఆయన ఒక నిర్ణయానికి వచ్చి, పెళ్లికి మానసికంగా సిద్ధం అయ్యేనాటికి.. ఒకమ్మాయి ఊరు విడిచి వెళ్లిపోయింది. ఇంకో అమ్మాయి హాయిగా వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. పాపం, కాంట్‌.. తన లోపల ఉండే ప్రాఫిట్‌ అండ్‌ లాస్‌ల గడియారం కంటే... మనుషుల జీవ గడియారమే వేగంగా తిరుగుతుందని గుర్తించలేకపోయారు!

జి.డబ్ల్యూ.ఎఫ్‌. హెగెల్‌
ఈయన ఒక తార్కిక ప్రేమికుడు! 18వ శతాబ్దం నాటి ప్రఖ్యాత జర్మన్‌ తత్త్వవేత్త. ప్రతి పదార్థానికీ చలనం ఉంటుందన్న హెగల్‌ సూత్రం, మార్క్సిస్టు గతి తార్కిక భౌతికవాదంపై ఎంతో ప్రభావం చూపింది. అర్థం కాని భాషకు, భారమైన సిద్ధాంతాలకు హెగల్‌ మారుపేరు. ‘మేరీ వాన్‌ టుచర్‌’ కి ఆయన చేసిన ప్రపోజల్‌ కూడా ఆయన శైలిలోనే కొంచెం గంభీరమైనది.

ఆమె కోసం ఆయన కవితలు రాశారు. కానీ అవి మెదడుకు మేత పెట్టేలా ఉండేవి తప్ప, మనసున మల్లెల మాలలను ఊగించేవి కావు. ‘‘నిష్కల్మషమైన ప్రేమ అనేది బాగానే ఉంటుంది కానీ, ఒక మనిషి వ్యక్తిత్వ వికాసానికి ‘పెళ్లి’ అనేది ఒక చట్టపరమైన, సామాజికమైన అవసరం. అందుకే మనం పెళ్లి చేసుకుందాం..’’ అని ఆమెతో అనేవారు. అంటే తన లవ్‌ ప్రపోజల్‌ని కూడా ఆయన తన ‘ఫెనోమెనాలజీ ఆఫ్‌ స్పిరిట్‌’ అనే గ్రంథంలోని ఒక క్లిష్టమైన పాఠంలా మార్చేశారు. అదృష్టవశాత్తూ, మేరీకి ఆయన ప్రపోజల్‌ నచ్చటంతో ఆయన్ని పెళ్లాడింది.

జీన్‌ పాల్‌ సార్త్రే 
సార్త్రే 20వ శతాబ్దారంభపు ఫ్రెంచి తత్త్వవేత్త. నాటక రచయిత, రాజకీయ కార్యకర్త, సాహితీ విమర్శకుడు. ‘విడ్డూరం’ అనే పదానికి అసలైన అర్థం సార్త్రే, ఆయన ప్రియురాలు సిమోన్‌ డిబోవర్‌. వీరు ప్రేమించుకున్నారు కాని, పెళ్లి చేసుకోలేదు! ‘చేసుకోకపోవడమే ప్రేమ పరమార్థం’ అన్నట్లు ఉండిపోయారు. సార్త్రే, ఆమెకు ఒక వినూత్నమైన ఆఫర్‌ ఇచ్చారు. అదేమిటంటే, ప్రతి రెండేళ్లకు ఒకసారి తమ పెళ్లిని ‘రెన్యువల్‌’ చేసుకునే ఒక ఒప్పందం! ‘‘మన మధ్య ఉన్నది అత్యంత ‘అవసరమైన’ ప్రేమ (!); కాని లోకంలో ఉన్న ‘అనవసరమైన’ పెళ్లిని కూడా మనం చవి చూడటం మంచిది’’ అని సార్త్రే ఆమెను ఒప్పించారు. 

ఫలితంగా, వారు రెండేళ్లకోసారి పెళ్లి అనే భావనను (!) పొడిగించుకుంటూ 51 ఏళ్ల పాటు కలిసి ఉన్నారు. అలాగని ఏనాడూ ఒకే ఇంట్లో నివసించలేదు. పైగా, తమ తమ ఇతర ప్రేమాయణాల గురించి కాఫీ తాగుతూ హాయిగా చర్చించుకునేవారు. ‘ఓపెన్‌ రిలేషన్‌షిప్‌’ అనే పదం పుట్టకముందే, ఆ కాన్సెప్ట్‌కి వీరు బ్రాండ్‌ అంబాసిడర్లుగా నిలిచారు!
మొత్తానికి ఈ పాశ్చాత్య తత్త్వవేత్తల ప్రేమకథలు వింటుంటే.. ‘ప్రేమ గుడ్డిది’ అనే మాట కంటే, ‘ప్రేమ తాత్త్వికమైనది’ అనే మాట కరెక్ట్‌ ఏమో అనే ఆలోచన కలుగుతుంది.

::: భారతీయ తత్త్వవేత్తల ప్రపోజల్స్‌ :::
మనవాళ్ల తాత్త్విక సంప్రదాయాలు ఎక్కువగా వైరాగ్యం, మోక్షం వైపు మొగ్గు చూపుతాయి. అందుకే, ఒక జ్ఞాని సంసార జీవితంలోకి (గృహస్థాశ్రమం) అడుగుపెట్టడం అంటే ప్రాచీన భారతదేశంలో అదొక పెద్ద ‘మేధాపరమైన కల్యాణ వేదిక’! పెళ్లి ప్రపోజల్స్‌ అంటే కేవలం మనసులు కలవడం మాత్రమే కాదు... అవి ధర్మం గురించి, ఆత్మల అనుసంధానం గురించి జరిగే హై–వోల్టేజ్‌ డిబేట్లు!

యాజ్ఞవల్క్య మహర్షి
ఉపనిషత్తుల కాలం నాటి మేధావు లందరిలో యాజ్ఞవల్క్యుడు ఒక శిఖరం లాంటి వాడు. పెళ్లి విషయంలో కూడా ఆయనది ఒక రకమైన ‘మెటాఫిజికల్‌’ (అధిభౌతిక) అప్రోచ్‌! ఆయన తన రెండో భార్య మైత్రేయిని పెళ్లి చేసుకున్నప్పుడు, అది ఇప్పట్లో లాగా ‘నేన్నిన్ను ప్రేమిస్తున్నాను... నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా?‘ అని అడిగే మామూలు ప్రపోజల్‌ కాదు. మైత్రేయి అసామాన్యురాలు. గొప్ప విదుషీమణి. అంటే, మహా పండితురాలు. ఆమెకు కావలసింది నగలు, బంగారం లేదా హోదా కాదు. ఆమెకు ‘అమరత్వ సిద్ధి’ రహస్యం కావాలి. 

యాజ్ఞవల్క్యుడు ఆమెకు ఒక సంసార బంధాన్ని కాకుండా, ఒక ‘ఆధ్యాత్మిక భాగస్వామ్యాన్ని’ ఆఫర్‌ చేశారు. ఆయన ఆమెతో ఒక మాట అన్నారు. ‘‘భర్తను భర్త కోసం ప్రేమించకూడదు, ఆయనలో ఉన్న ‘ఆత్మ కోసం ప్రేమించాలి’’ అని! అదే, ఆమెకు ఆయన చేసిన పెళ్లి ప్రపోజల్‌. దానర్థం ఏమిటంటే, మనం హాయిగా అడవికి వెళ్లి కూర్చుని, మోక్షం వచ్చే వరకు ఈ విశ్వం గురించి వాదించుకుంటూ ఉందాం – అని! ఇదొక రకమైన ‘స్టడీ–బడ్డీ’ లేదా క్లాస్‌మేట్‌ ప్రపోజల్‌ లాంటిది. పెళ్లి తర్వాత పార్టీలు, ఫంక్షన్లు కాదు... నేరుగా పరలోకానికి టికెట్‌ బుక్‌ చేసుకునే ప్రణాళిక అన్నమాట.

మండన మిశ్రుడు 
8వ శతాబ్దంలో, గొప్ప మీమాంస పండితుడైన మండన మిశ్రుడికి ఉభయభారతి అనే తాత్త్వికురాలితో వివాహం జరిగింది. నిజానికి ఆమె తెలివితేటల ముందు ఆయన మేధస్సు కాస్త తక్కువేనని ఆ కాలంలోనే చెప్పుకునేవారు. నిజానికైతే వీరి వివాహాన్ని ఒక ప్రేమ బంధంలా కాకుండా, ఇద్దరు మేధావుల మధ్య జరిగిన ‘జ్ఞాన సమ్మేళనం’ లాగా అభివర్ణించాలి. మండన మిశ్రుడి పెళ్లి ప్రపోజల్‌ కూడా అదే విధంగా జరిగింది. ఇక, వీరి కాపురం ఎలా ఉండేదంటే... అదొక నిరంతర తాత్త్వికాంశాల తరగతి గదిలా ఉండేది. 

ఒకసారి సాక్షాత్తు ఆది శంకరాచార్యుల వారు మండన మిశ్రుడితో వాదనకు దిగారు. అప్పుడు మండన మిశ్రుడు ఏ మగ పండితుడినీ న్యాయనిర్ణేతగా పెట్టుకోకుండా, తన భార్యనే ఆ స్థానంలో ఉండమన్నారు! ఆ చర్చలో భర్త ఓడిపోతుంటే, ఆమె ఏమాత్రం మొహమాటపడకుండా నిజాన్ని అంగీకరించింది. అయితే, ఆమె అక్కడితో  ఆగిపోలేదు. ‘‘నా భర్తను ఓడించినా, ఆయనలో సగభాగమైన నన్ను ఓడిస్తేనే మీ విజయం పూర్తవుతుంది’’ అని శంకరాచార్యుల వారికే సవాలు విసిరింది! పైగా, ‘‘నువ్వు సన్యాసివి, అసలు పెళ్లి చేసుకుంటే వచ్చే జీవితానుభవాలే నీకు తెలియవు. మరి నీకు సంపూర్ణ జ్ఞానం ఉందని ఎలా చెబుతావు?’’ అని శంకరాచార్యుల వారిని ప్రశ్నించింది.

మహావీరుడు
జైనమతంలో 24వ తీర్థంకరుడైన మహావీరుడు చివరికి సర్వసంగ పరిత్యాగిగా మారినప్పటికీ, ఆయన వివాహం గురించి చరిత్రలో ఒక పెద్ద తాత్త్విక చర్చే నడిచింది. పురాణ గాథల ప్రకారం, ఆయన మనసు లోక కల్యాణం మీద ఉండటంతో, ఆయనను ఈ ప్రాపంచిక బంధాల్లో బంధించాలని తల్లిదండ్రులు యశోదతో పెళ్లి నిశ్చయించారు. అంటే, ఆయన పెళ్లి ప్రపోజల్‌ వెనుక ఆయన ప్రమేయం కంటే, వారి తల్లిదండ్రుల ప్లానే ఎక్కువగా ఉందన్నమాట! మొత్తానికి మహావీరుడు పెళ్లి చేసుకున్నారు కాని, ఆ సంసార జీవితంలో ఉంటూనే అంతర్గతంగా పూర్తి వైరాగ్యంతో ఉండేవారు. ఒకసారి ఊహించుకోండి... ‘‘నేను నీ పక్కనే కూర్చొని ఉంటాను కాని, నా మనసు మాత్రం ఎక్కడో విశ్వంలోని అనంతమైన శూన్యంలో విహరిస్తూ ఉంటుంది’’ అని ప్రపోజ్‌ చేస్తే ఎలా ఉంటుంది? సామాన్యులకు బోధపడే తత్త్వం అయితే కాదు.

::: ‘సారీ, నీలో వైరాగ్యం తక్కువగా ఉంది’:::
భక్తి, అద్వైత సంప్రదాయాల్లోని కథలను చూస్తే మనకు ఒక విషయం అర్థమవుతుంది అక్కడి తత్త్వవేత్తలు ప్రపోజ్‌ చేసే విధానం చాలా భిన్నంగా, విచిత్రంగా ఉంటుంది. వారు తమ భాగస్వామికి ప్రాపంచిక విషయాల పట్ల ఎంత ‘నిర్లిప్తత’ ఉందో పరీక్షించి కానీ ముందడుగు వేసేవారు కాదు. నాటి పురుష తాత్వికులు ప్రపోజ్‌ చేయాలంటే, ఒక షరతు పెట్టేవారు.

 తనకు కాబోయే భార్య తన ‘దైవ చింతన’కు ఏమాత్రం అడ్డంకి కాకూడదు– అని! పెళ్లి్ల సంబంధం అని అమ్మాయిని చూడటానికి వెళ్లినప్పుడు కూడా మన తత్త్వవేత్తలు ఆమె అందం గురించి కాకుండా... జనన మరణాల గురించి, దేహం తాలూకు అశాశ్వతత్వం గురించి అత్యంత కఠినమైన ప్రశ్నలు అడిగేవారు. ఒకవేళ ఆ అమ్మాయి ఏదైనా ప్రాపంచికమైన ఆశలతోనో లేదా మామూలు భావోద్వేగాలతోనో సమాధానం చెబితే, ‘‘సారీ... నీలో వైరాగ్యం తక్కువగా ఉంది’’ అని తిరస్కరించేవారు. అంటే, అది పెళ్లి చూపుల్లా కాకుండా, ఒక ఆత్మకు జరిగే టెక్నికల్‌ ఇంటర్వ్యూ లాగా ఉండేది! 
మొత్తానికి పశ్చిమ దేశాల తత్త్వవేత్తలైనా, మన భారతీయ మేధావులైనా... ప్రపోజల్‌ విషయంలో వారి లాజిక్కులు సామాన్యులకు అందనంత ఎత్తులో ఉంటాయని అర్థమౌతోంది. 

· సాక్షి, స్పెషల్‌ డెస్క్‌ 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
valentines week
PROPOSALS
Philosopher
Funday
funday specials story
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఇది సాధారణ బొమ్మ కాదు.. మినీ రోబో స్నేహితుడు!

ఇది సాధారణ బొమ్మ కాదు.. మినీ రోబో స్నేహితుడు!

ఆన్‌ చేస్తే టీవీ.. ఆఫ్‌ చేస్తే ఆర్ట్‌ గ్యాలరీ.. అద్భుతం!

ఆన్‌ చేస్తే టీవీ.. ఆఫ్‌ చేస్తే ఆర్ట్‌ గ్యాలరీ.. అద్భుతం!

గర్విష్టి గజరాజు

గర్విష్టి గజరాజు

వైరస్‌ పుట్టకముందే అంత్యక్రియలు! ఏఐ వ్యాక్సిన్‌ ప్రయోగం..

వైరస్‌ పుట్టకముందే అంత్యక్రియలు! ఏఐ వ్యాక్సిన్‌ ప్రయోగం..

కుక్కయినా హక్కుంది... దానికో లెక్కుంది!

కుక్కయినా హక్కుంది... దానికో లెక్కుంది!

అష్టావక్రుడి పూర్వజన్మ వృత్తాంతం

అష్టావక్రుడి పూర్వజన్మ వృత్తాంతం

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.