Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

పాఠం నుంచి పాకం దాకా

Family Sakshi User Sakshi Sakshi Time Feb 13, 2026 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Richa1.jpg

ఆమె ఎంబీఏ చేసింది. ముంబాయిలో ఓ పేరున్న కార్పొరేట్‌ కళాశాలలో అసిస్టెంట్‌ ఫ్రొఫెసర్‌గా పెద్ద జీతం మీద  పాఠాలు చెబుతూ మంచి పేరే తెచ్చుకుంది. అయితే ఉన్నట్టుండి ఆమె  పాఠాలు చెప్పే ఉద్యోగాన్ని మానేసి ఇంటి దగ్గరే హెల్దీ శ్నాక్స్‌ తయారీకి శ్రీకారం చుట్టింది. రుచిగా, శుచిగా ఉండే చిరుతిళ్లను చాలా తక్కువ ధరకే అమ్మడం మొదలు పెట్టింది. ఇప్పుడామె తయారు చేసే శ్నాక్స్‌ యూఎస్, కెనడా, ఆస్ట్రేలియాలతో సహా దాదాపు పదిహేను దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఆమే జైపూర్‌కు చెందిన రిచాశర్మ. ఇంతకీ ఆమె ఇంత హఠాత్తుగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందో... ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎలా ఎదిగిందో చూద్దాం...

రిచాశర్మది జైపూర్‌. ఫైనాన్స్‌లో ఎంబీఏ చేసింది. అక్కడే ఓ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేసింది. అయితే అది ఆమెకు చాలా దూరం కావడంతో ప్రయాణాలు చేయలేక వడోదరలోని పరుల్‌ యూనివర్శిటీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా చేరింది. అక్కడ నాలుగైదేళ్ల  పాటు పని చేసింది. పెళ్లి తర్వాత భర్తతో కలిసి ముంబాయి మహానగరంలో కాలు పెట్టింది. అప్పుడే ఆమెకు ఇద్దరు పిల్లలు పుట్టడం, వారి ఆలనా  పాలనా చూసుకోవడం తో ఇక ఉద్యోగం ఊసులేకుండా వారితోటే పూర్తికాలం గడిచి పోయింది. మెల్లగా ఆ పిల్లలు రెండు, ఆరు తరగతులకొచ్చారు. 

వాళ్లకోసం రకరకాల రుచికరమైన, ఆరోగ్యకరమైన చిరుతిళ్లు తయారు చేసి పెట్టేది. ఈ క్రమంలో ఆమె చేసే తినుబండారాలను పిల్లల ద్వారా వారి స్నేహితులు, వాళ్ల వాళ్ల ఇళ్లలోనిÐ éళ్లూ రుచి చూశారు. అవి వారికి బాగా నచ్చడంతో వారిలో కొందరు ‘మీ పిల్లలకోసం తయారు చేసేటప్పుడే... మరికొద్ది మొత్తంలో మా పిల్లలకు కూడా చేసి పెట్టవచ్చు కదండీ’ అని అడగడంతో రిచాశర్మ గ్లుటెన్, మైదా, డాల్డా లాంటివి లేకుండా రుచికరమైన కమ్మటి శ్నాక్స్‌ తయారు చేయడం మొదలు పెట్టింది. చిరుధాన్యాలైన రాగులు, జొన్నలతో లడ్డూలు, ధోక్లా, కచోరీలు, సబ్జీలు తయారు చేసేది. అవి అక్కడివాళ్లకు అమితంగా నచ్చేవి. మాకు కావాలంటే మాకు కావాలని అందరూ  పోటీపడేవాళ్లు. దాంతో ఆమె ‘రిచా ప్లేటర్‌’ పేరుతో శ్నాక్స్‌ సప్లై చేసేది. 

కోవిడ్‌ మార్చేసిన జీవితం
అలా సాగుతున్న ఆమె జీవితంలో కోవిడ్‌ పెను మార్పు తెచ్చింది. ఇక్కడ మార్పు అనగానే ఆమె చేసే శ్నాక్స్‌ బిజినెస్‌ కాస్తా దెబ్బ తిందేమో అని జాలిపడితే పప్పులో కాలేసినట్టే.. ఎందుకంటే కోవిడ్‌ సమయం లో రిచాశర్మ రుచిగా శుచిగా శుభ్రంగా చేసే హోమ్‌ మేడ్‌ ఫుడ్‌ కోసం జ నాలు ఎగబడ్డారు. దాంతో ఆమె బిజినెస్‌ ఇబ్బడిముబ్బడిగా పెరిగి పోయింది. అప్పుడే ఆమె తన బిజినెస్‌ స్కిల్స్‌ను మరింత అభివృద్ధి చేసుకుంది. ఆర్డర్లకు తగ్గట్టే ప్రిపేర్‌ చేయడం వల్ల మిగిలి పోవడం కానీ, తక్కువ కావడం కానీ ఎప్పుడూ జరగలేదామెకి. దాంతో అప్పటివరకు మామూలు చిన్న చిన్న తినుబండారాల తయారీ నుంచి రకరకాల స్వీట్స్‌ తయారీకీ శ్రీకారం చుట్టింది రిచా. మొదట్లో నెలకు 20 ఆర్డర్లతో సరిపెట్టుకున్న రిచా శర్మ చూస్తుండగానే నెలకు 500 ఆర్డర్లకు సప్లై చేసేంతగా అభివృద్ధి చెందిందామె వ్యా పారం. 

ఖర్, బోరివలి, అంధేరిలకే పరిమితమైన ఆమె కష్టమర్లు కోయంబత్తూరు, బెంగళూరు, ఉత్తర ప్రదేశ్, పంజాబ్‌ల వరకు విస్తరించారు. తన బిజినెస్‌కు ‘హంబుల్‌ ఫ్లేవర్స్‌’ అనే పేరు పెట్టి దానిని ఇంకా ఇంకా పెంచింది రిచా. వచ్చిన లాభాలలో ఐదుశాతం వాటాను ఎన్జీవోలకు డొనేట్‌ చేస్తుంది రిచా. మరో ఐదుశాతం లాభాలను తనతో పని చేసే వారికి ఇస్తుంది రిచా. వ్యా పారం ద్వారా లాభాలను గడించడం తన లక్ష్యం కాదని, అందరికీ హెల్దీ, టేస్టీ శ్నాక్స్‌ అందించడంలోనే తనకు సంతృప్తి లభిస్తుందని చెప్పే రిచాను ఇండియన్‌ ఇన్‌స్పైరింగ్‌ హోమ్‌ బిజినెస్‌ ఉమన్‌ అవార్డు వరించింది. 
 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
mumbai
manufacturing centre
low cost
USA
Canada
australia
jaipur
Richa Sharma
Entrepreneur
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

భీకరంగా మారిన అమెరికా-ఇరాన్‌ యుద్ధం!

భీకరంగా మారిన అమెరికా-ఇరాన్‌ యుద్ధం!

ప్రపంచకప్‌ నుంచి అమెరికా నిష్క్రమణ

ప్రపంచకప్‌ నుంచి అమెరికా నిష్క్రమణ

హార్మూజ్‌పై ఇరాన్ షాకింగ్‌ కామెంట్స్‌.. స్ట్రాంగ్‌ వార్నింగ్

హార్మూజ్‌పై ఇరాన్ షాకింగ్‌ కామెంట్స్‌.. స్ట్రాంగ్‌ వార్నింగ్

వర్షపు నీటిలో పరీక్షల ప్రశ్నపత్రాలు

వర్షపు నీటిలో పరీక్షల ప్రశ్నపత్రాలు

ఆలస్యంగా వచ్చి.. అంతకంతకూ పెరిగి

ఆలస్యంగా వచ్చి.. అంతకంతకూ పెరిగి

మొబైల్‌ ఫోన్‌లో మాట్లాడుతూ నడుస్తూ మ్యాన్‌హోల్‌లో పడి..

మొబైల్‌ ఫోన్‌లో మాట్లాడుతూ నడుస్తూ మ్యాన్‌హోల్‌లో పడి..

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.