Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

సగౌరవ మరణం నాప్రాథమిక హక్కు

Family Sakshi User Sakshi Sakshi Time Feb 23, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
karibasamma1.jpg

న్యూస్‌మేకర్‌ – కరిబసమ్మ

ఆమె మరణించదలుచుకుంది. ‘సగౌరవంగా మరణించే హక్కును ప్రసాదించండి’ అని 24 ఏళ్ల పాటు పోరాడి  ఆ హక్కును సాధించుకుంది. ‘రైట్‌ టు డై విత్‌ డిగ్నిటీ’ అనే డిమాండ్‌తో ‘యుథనేసియా’ ద్వారా ప్రాణం విడువనున్న 85 ఏళ్ల  కరిబసమ్మ కొత్త చర్చను లేవనెత్తే అవకాశం ఉంది. ‘మన దేశంలో పేదరికం వల్ల వైద్యం చేయించుకోలేక,  వైద్యం లేని జబ్బుల వల్ల కోట్ల మంది బాధపడుతున్నారు. వారికి సగౌరవంగా మరణించే హక్కు ఉంది’  అంటోంది కరిబసమ్మ. వివరాలు....

‘రాజ్యాంగం జీవించే హక్కు ఇచ్చినట్టుగానే మరణించే హక్కు కూడా ఇచ్చింది. నేనెందుకు గౌరవంగా మరణించకూడదు? నేను మరణించేందుకు ప్రభుత్వం ఎందుకు సాయపడకూడదు? యుథనేసియా (మెర్సీ కిల్లింగ్‌) నెదర్లాండ్స్, నార్వే వంటి దేశాల్లో ఉంది. అది ఎక్కువ అవసరమైనది మన దేశంలోనే’ అంటుంది 85 ఏళ్ల కరిబసమ్మ. 

‘మెర్సీ కిల్లింగ్‌’ కోసం 24 ఏళ్లుగా పోరాడుతోందామె. ఇప్పుడు ఆమెకు కర్ణాటక ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. ఈ మేరకు జనవరి 30న ప్రభుత్వం ఒక సర్క్యులర్‌ జారీ చేస్తూ రాష్ట్రంలో అనివార్యమైన పరిస్థితుల్లో ఉన్న 70 ఏళ్లకు పైబడిన వారు ‘రైట్‌ టు డై’ హక్కును ఉపయోగించవచ్చని పేర్కొంది. అయితే  ఇతర అనుమతులు కూడా ఓకే అయితేనే రెండు వారాల్లో కరిబసమ్మకు దయామరణం ప్రాప్తించవచ్చు.

ఎవరు ఈ కరిబసమ్మ?
కర్నాటకలోని దావణగెరెకు చెందిన కరిబసమ్మ రిటైర్డ్‌ గవర్నమెంట్‌ టీచర్‌. ఇప్పుడు వయసు 85 ఏళ్లు. 30 ఏళ్ల క్రితం ఆమెకు డిస్క్‌ స్లిప్‌ అయ్యింది. దాంతో నడవడం ఆమెకు పెద్ద సమస్య అయ్యింది. నొప్పికి తట్టుకోలేక చావే నయం అని నిశ్చయించుకుంది. దాదాపుగా 24 ఏళ్లుగా ఆమె ఇందుకై పోరాడుతోంది. 2010లో పదివేల సంతకాలతో ప్రభుత్వానికి మెమొరాండం సమర్పించింది. సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసింది. ఎందరో అధికారులకు, మంత్రులకు, రాష్ట్రపతికి ఆమె లేఖలు రాసింది. 

రాష్ట్రపతికి లేఖ రాశాక పోలీసులు వచ్చి ఇందుకు మన దేశంలో అనుమతి లేదని, కనుక పిటిషన్లు పంపవద్దని కోరారు. దాంతో కరిబసమ్మ కుటుంబ సభ్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతూ నువ్వు జైలుకెళితే మా మర్యాద ఏం కాను అని వారు ఆమెను నిలదీశారు. దాంతో ఆమె కేర్‌ హోమ్‌కు మారింది. తన పోరాటం కోసం ఇంటిని అమ్మి అందులో ఆరు లక్షలు బి.ఎస్‌.ఎఫ్‌ జవాన్ల సంక్షేమానికి ఇచ్చింది. మిగిలిన డబ్బుతో తన పోరాటం సాగించింది. ఇప్పుడు ఆమె కేన్సర్‌తో బాధ పడుతోంది.

2018లో సుప్రీంకోర్టు
రైట్‌ టు డై హక్కును సుప్రీంకోర్టు 2018లో అంగీకరించింది. ‘రాజ్యాంగపరంగా మరణించే హక్కు పౌరులకు లభిస్తుంది’ అని చెప్పింది. 2023లో ఎవరు ఏ వయసు, పరిస్థితుల్లో ఉంటే ఇటువంటి విన్నపాన్ని కోరవచ్చో మార్గదర్శకాలను సూచించింది. అయితే కర్నాటక ప్రభుత్వం ఇప్పటి వరకూ సుప్రీంకోర్టు డైరెక్షన్‌ గురించి దృష్టి పెట్టలేదు. అంటే మెర్సీ కిల్లింగ్‌ పట్ల సంశయ మౌనం దాల్చింది. కాని కరిబసమ్మ పట్టుదల వల్ల ఇన్నాళ్లకు అనుమతినిచ్చింది.

70 ఏళ్లు పైబడి
‘70 ఏళ్లు పైబడి, వైద్యపరంగా మందులకు స్పందించని స్థితిలో, సపోర్ట్‌ సిస్టమ్‌ మీద ఉంటే అటువంటి వారికి మెర్సీ కిల్లింగ్‌ గురించి ప్రభుత్వం అనుమతిని పరిశీలిస్తుంది. మనది సభ్య సమాజం. బాధితులను ఎన్నో విధాలుగా ఆదుకోవచ్చు. కాబట్టి అడిగిన వెంటనే మరణించే హక్కుకు అనుమతి లభిస్తుందని ఆశించవద్దు. కరిబసమ్మ విషయంలో కూడా ఆరోగ్యశాఖ ఆమెను పరిశీలించి ఆరోగ్యపరంగా దుర్భర స్థితిలో ఉందని తేల్చితేనే ఆమెకు రైట్‌ టు డై అనుమతి లభిస్తు్తంది’ అని కర్నాటక ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ప్రాణం తీసుకోవడం పాపం కాదా?‘ఆత్మహత్య, మరణాన్ని కోరుకోవడం ఏ మతమూ అంగీకరించదు. దీనిపై మీరేమంటారు?’ అని కరిబసమ్మను అడిగితే ‘అలా మతాచారాలు, విశ్వాసాలు మాట్లాడేవారు రోడ్డు మీద దిక్కు లేక అనారోగ్యంతో బాధపడే వృద్ధులను తీసుకెళ్లి వాళ్ల ఇళ్లల్లో పెట్టుకోవాలి. అప్పుడు మాట్లాడాలి. అనుభవించేవారికి తెలుస్తుంది బాధ. మన దేశంలో పేదరికంలో ఉన్న వృద్ధులు జబ్బున పడితే చూసే దిక్కు ఉండదు. వాళ్లు మలమూత్రాలలో పడి దొర్లుతుండాలా? వారు సగౌరవంగా మరణించాలని కోరుకుంటే మనం ఆ కోరికను ఎందుకు గౌరవించకూడదు? అన్నారామె.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Supreme Court
karnataka
Davangere
retired teacher
Beneficiary
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

పాలు నచ్చకపోతే తాగొద్దు.. రీల్స్‌ ఎందుకు?

పాలు నచ్చకపోతే తాగొద్దు.. రీల్స్‌ ఎందుకు?

కొలీజియం నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేం! 

కొలీజియం నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేం! 

ప్రకాశ్ రాజ్ కు షాక్.. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

ప్రకాశ్ రాజ్ కు షాక్.. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

‘యూజ్‌లెస్‌ ఫెలోస్‌.. మీ సంగతి తేలుస్తా’

‘యూజ్‌లెస్‌ ఫెలోస్‌.. మీ సంగతి తేలుస్తా’

కర్ణాటక రాజకీయాల్లో బిగ్‌ ట్విస్ట్‌..

కర్ణాటక రాజకీయాల్లో బిగ్‌ ట్విస్ట్‌..

ఫలించిన రుక్మిణి వసంత్‌ పోరాటం

ఫలించిన రుక్మిణి వసంత్‌ పోరాటం

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.