Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
search Subscribe Subscribe Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ Live TV లైవ్ టీవీ
download app యాప్ download app Download App
మమ్మల్ని అనుసరించండి
  • facebook
  • x
  • instagram
  • youtube
  • whatsapp
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫొటోలు
  • వీడియోలు
  • close logo
  • search
    Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ download app యాప్

    విభాగాలు

  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • మమ్మల్ని అనుసరించండి

    facebook x instagram youtube whatsapp whatsapp whatsapp
  • Sakshi Search
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. ద్రౌపదీ వస్త్రాపహరణం శాపమా? కర్మ ఫలమా..?
ADVERTISEMENT

ద్రౌపదీ వస్త్రాపహరణం శాపమా? కర్మ ఫలమా..?

Family Sakshi User Sakshi Sakshi Time Nov 2, 2026 01:01 AM IST Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Google
bharatha-vigananm.jpg

భారత విజ్ఞానం

పాండవుల ధర్మపత్ని ద్రౌపదికి నిండు సభలో అవమానకరంగా వస్త్రాపహరణం ఎందుకు జరిగింది? జగన్నాటక సూత్రధారి అయిన శ్రీ కృష్ణ పరమాత్మ మినహా పాండవులతో సహా కౌరవ సభలో కొలువుదీరిన అతిరథ మహారథులు సైతం ఎందుకు మౌనం దాల్చారు? అందుకు కారణం ఏమిటి? పూర్వజన్మ శాపమా? లేక కర్మ ఫలమా.. అంటే ఈ రెండూ అని చెప్పవచ్చు. అసలు తనకు ఇంత పరాభవం ఎందుకు జరిగిందని ద్రౌపది శ్రీకృష్ణ పరమాత్మను అడిగినపుడు పూర్వజన్మలోని ఒక పతివ్రత ఇచ్చిన శాపంతోపాటు, కర్మ సిద్ధాంతమే కారణమని శ్రీ కృష్ణుడు సమాధానమిచ్చాడు.

యుగాలలో మొదటిదైన కృత (సత్య) యుగం ముగిసింది. త్రేతాయుగం ప్రారంభమైంది. ఆర్యవటానికి ఉత్తర దిక్కున సువర్ణపురం రాజ్యాన్ని వీరభద్రుడనే మహారాజు పాలించేవాడు. ఆయనకు ఎంతో మంచి పేరు ఉంది. ధర్మనిరతతో రాజ్యాన్ని పాలిస్తూ అందరి ప్రశంసలు పొందాడు. ఆయన కుమార్తె దేవిక గొప్ప శివ భక్తురాలు. ఆమె రాజకుమారి కావడంతో ఖరీదైన పట్టువస్త్రాలు ధరించేది. అయితే కొద్దిపాటి అహంకారం గర్వం కూడా ఉన్నాయి. అందుకే ఆమె రాజ్యంలో ఉన్న పేదవారిని వారు కట్టుకున్న వస్త్రాలను చూసి ఎగతాళి చేసేది.

సువర్ణపుర రాజ్యానికి దూరంగా ఉన్న అడవిలో ఉగ్రశ్రవుడు అనే మహర్షి ఆశ్రమం ఉంది. ఆయన భార్య సుశీలాదేవి. ఆమె మహా సాధ్వి. వృద్ధాప్యంతో పాటు ముని భార్య కావడంతో ఆమె పాత నార చీరలు ధరించేది. ఒకరోజు ఆమె మంచినీటి కోసం కుండ చేత పట్టుకుని దగ్గరలో ఉన్న నది వద్దకు వెళుతుండగా కాలికి రాయి తగిలి, పక్కనే ఉన్న ముళ్లపొదపై పడిపోయింది. ఆమె చీర ముళ్లలో చిక్కుకొని పోవడంతో  దానిని తీసుకునే క్రమంలో చీర పూర్తిగా చిరిగిపోయింది.

 దాంతో ఆమె సాయం చేయవలసిందిగా ఆర్తనాదాలు చేసింది. అదే సమయంలో తన ఐదుగురు చెలికత్తెలతో నదిలో జలకాలాడేందుకు వచ్చిన రాజకుమారి దేవిక సుశీలాదేవి పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ ‘‘నీలాంటి పేదదానికి మానం కాపాడుకోవడానికి నాలాంటి ధనవంతులైన రాజకుమారి పట్టువస్త్రాలు  కావాలా... అవసరమైతే అడవిలో ఉన్న ఆకులను చుట్టుకొని ఇంటికి వెళ్ళు’’ అని నవ్వుతూ తీవ్రంగా పరిహాసం చేంది. రాజకుమారి మాటలకు ఐదుగురి చెలికత్తెలు పగలబడి నవ్వారు.

ఆగ్రహించిన సుశీలాదేవి ‘ఇలాంటి పరిస్థితి ఏ స్త్రీకి రాకూడదు. సాటిమహిళగా సాయం చేయడానికి బదులు హేళన చేశావు. ఇదే పరిస్థితి భవిష్యత్తులో నీకూ వస్తుంది’’ 
అని శాపం ఇచ్చింది. ఇందుకు రాజకుమారి భయపడి ఇంటికి వెళ్లిపోగా సుశీలాదేవి తన శరీరాన్ని ఆకులతో కప్పుకొని ఆశ్రమానికి వెళ్లిపోయింది.

సంఘటన సమాచారాన్ని తెలుసుకున్న రాజు వీరభద్రుడు హుటాహుటిన ఉగ్రశ్రవ మహర్షి ఆశ్రమానికి చేరుకొని మహర్షి పాదాలపై పడి క్షమాపణ కోరాడు. మహర్షి ఉగ్రశ్రవుడు ఇందుకు సుశీలాదేవి మాత్రమే పరిష్కారం చూపగలదని చెప్పడంతో మహారాజు వీరభద్రుడు, రాజకుమారి దేవిక సుశీల పాదాలపై పడి క్షమాపణ కోరారు. స్వతహాగా దయామయురాలు అయిన సుశీలా దేవి నారాయణుని స్మరించమని శాపవిమోచనం తెలిపింది.

అప్పటినుండి రాజకుమారి దేవిక అహంకారం నశించి నారాయణ ధ్యానం లోకి వెళ్లి పోయింది. త్రేతాయుగం పూర్తయింది... ద్వాపరయుగం ఆరంభమైంది. వీరభద్ర మహారాజు ద్రుపద మహారాజు అయ్యాడు. రాజకుమారి దేవిక.. ద్రౌపది అయింది. యుగాలు మారినా కర్మ సిద్ధాంతం వెతుక్కుంటూ రానే వచ్చింది. నిండు సభలో ద్రౌపది వస్త్రాపహరణం జరిగింది. ఆనాటి ఐదుగురు చెలికత్తెలు పాండవులైనప్పటికీ నిస్సహాయులయ్యారు. కురుపితామహుడు సైతం మిన్నకుండి పోవడంతో ఆయన కూడా కురుక్షేత్ర సంగ్రామంలో అంపశయ్యపై పరుండవలసి వచ్చింది. 

చూశారా! విధి ఎంత బలమైనదో..... యుగాలు నాటి శాపం... కర్మ సిద్ధాంతం తమ ధర్మాన్ని నిర్వర్తించాయి.

– సి. ఎన్‌. మూర్తి, సీనియర్‌ పాత్రికేయులు.

ADVERTISEMENT
ADVERTISEMENT
tags Tags:
Draupadi
curse
Karma
Devika
Mahabharatam
Mahabharat
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

నవ్వు వెనుక ఏడుపు.. ద్రౌపది ఆవేదన చెప్పే నీతి ఏంటంటే?

నవ్వు వెనుక ఏడుపు.. ద్రౌపది ఆవేదన చెప్పే నీతి ఏంటంటే?

జరాసంధ వధ

జరాసంధ వధ

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

రియాలిటీలో ఆలోచన

రియాలిటీలో ఆలోచన

కీచక పర్వం

కీచక పర్వం

పెద్దలను చిన్నబుచ్చవద్దు!

పెద్దలను చిన్నబుచ్చవద్దు!

మరిన్ని వార్తలు

కానుకల సమర్పణలో ఆధ్యాత్మిక రహస్యం..!

కానుకల సమర్పణలో ఆధ్యాత్మిక రహస్యం..!

ఆమె సాక్షాత్తు సీతమ్మే! సాయిపల్లవి లుక్‌పై ప్రశంసల వెల్లువ..

ఆమె సాక్షాత్తు సీతమ్మే! సాయిపల్లవి లుక్‌పై ప్రశంసల వెల్లువ..

కార్తికేయుడి చేతిలో కుక్కుటం?

కార్తికేయుడి చేతిలో కుక్కుటం?

వెలుగుల పండుగ వెనుక ఇంత ఆరోగ్య రహస్యం ఉందా..?!

వెలుగుల పండుగ వెనుక ఇంత ఆరోగ్య రహస్యం ఉందా..?!

ఆవుపేడతో అద్భుతాలు సృష్టిస్తున్న మహిళ!

ఆవుపేడతో అద్భుతాలు సృష్టిస్తున్న మహిళ!

ఎల్లలు లేని వెలుగుల దివ్వెలు..! ఆయా దేశాల్లో ఎలా జరుపుకొంటారంటే..

ఎల్లలు లేని వెలుగుల దివ్వెలు..! ఆయా దేశాల్లో ఎలా జరుపుకొంటారంటే..

  

ADVERTISEMENT
 
 
ADVERTISEMENT
ADVERTISEMENT
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Jagati Publications Limited.
Powered by Yodasoft