Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

గాంధీ.. గాడ్సే.. నోబెల్‌ శాంతి బహుమతి!

Family Sakshi User Sakshi Sakshi Time Jul 15, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Mahatma-Gandhi.jpg

శాంతి, అహింసా సిద్ధాంతాన్ని ప్రవచించిన మహాత్ముడికి నోబెల్‌ శాంతి బహుమతి ఎందుకు దక్కలేదు?. ఆయన దారిలో నడిచిన వారెందరినో వరించిన ఆ పురస్కారం.. ఆయన్నెందుకు వరించలేదు? కారణం.. నాథూరాం గాడ్సేనా?? గాంధీని చంపిన గాడ్సే.. ఆయనకు నోబెల్‌ దక్కే అవకాశాన్ని కూడా చంపేశాడా? అందుకే 1948లో నోబెల్‌ శాంతి బహుమతిని ఎవరికీ ఇవ్వలేదా? పైగా.. తగు యోగ్యత కలిగిన వ్యక్తి ఎవరూ జీవించి లేనందున ఆ పురస్కారాన్ని ఇవ్వడం లేదన్న నోబెల్‌ కమిటీ ప్రకటన దీన్నే సూచిస్తోందా? అసలు.. గాంధీకి నోబెల్‌ రాకపోవడానికి గాడ్సేకు ఉన్న లింకేంటి?

1930ల్లో ఏం జరిగిందంటే..
నోబెల్‌ శాంతి బహుమతికి మహాత్మా గాంధీ 5 సార్లు నామినేట్‌ అయ్యారు. 1937, 1938, 1939, 1947, 1948ల్లో ఆయన ఈ పురస్కారం దక్కే అవకాశం వచ్చింది. గాంధీ అహింసా మార్గం లేదా శాంతి మార్గం అన్నది తన దేశ స్వాతంత్య్రం కోసం తప్ప.. అంతర్జాతీయ శాంతి కోసం కాదని నోబెల్‌ కమిటీలోని కొందరు సభ్యులు ఆ టైంలో అభ్యంతరం వ్యక్తం చేశారు. 

రెండో ప్రపంచ యుద్ధంలో భారత్‌ పాల్గొనడానికి ఆయన షరతులతో సమ్మతి తెలపడాన్ని వాళ్లు ఎత్తి చూపారు. నోబెల్‌ బహుమతులను ఇచ్చే నార్వే అప్పట్లో బ్రిటిష్‌ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా చేసిన పోరాటాలకు అవార్డులు ఇవ్వకూడదని ఆ దేశం అనుకోవడం కూడా ఒక ప్రధాన కారణంగా చెబుతారు. 

1947 వచ్చేసరికి ఆ సమయంలో విభజన కారణంగా చెలరేగిన హింస.. మతపరమైన హింసను నిరోధించడానికి గాంధీజీ చేసిన ప్రయత్నాలు పూర్తిగా విజయవంతం కాకపోవడం, విభజన హింస.. గాంధీ శాంతి సందేశాన్ని మరుగునపడేటట్లు చేసిందని ప్రఖ్యాత చరిత్రకారుడు రామచంద్ర గుహ పేర్కొన్నారు.  1900 నుంచి 1960 వరకూ పురస్కారాలను గమనిస్తే మనకీ విషయం అర్థమవుతుందని గేర్‌ లూండెస్టాడ్‌ అన్నారు.

1948లో ఎందుకు రాలేదంటే..
1948లో గాంధీజీ మళ్లీ నోబెల్‌ శాంతి బహుమతికి నామినేట్‌ అయ్యారు. ఆ ఏడాది గాంధీ పేరును అమెరికాకు చెందిన శాంతి కార్యకర్త, ఆర్థికవేత్త, నోబెల్‌ గ్రహీత ఎమిలీ గ్రీన్‌  బాల్చ్, బాంబే స్టేట్‌ తొలి సీఎం బాలాసాహెబ్‌ గంగాధర్‌ ఖేర్, యునైటెడ్‌ ప్రావిన్సెస్‌ తొలి సీఎం గోవింద్‌ వల్లభ్‌ పంత్, లోక్‌సభ తొలి స్పీకర్‌ గణేశ్‌ వాసుదేవ్‌ మౌలాంకర్‌.. ఇలా ఎందరో ప్రముఖులు ప్రతిపాదించారు. 

ఆ ఏడాది మహాత్మునికే శాంతి బహుమతి దక్కుతుందని అంతా అనుకున్నారు. ఆయనతోపాటు మరో ఇద్దరు పేర్లతో షార్ట్‌ లిస్ట్‌ (గాంధీ పేరు ఈ జాబితాలోకి రావడం మూడోసారట) రెడీ అయ్యింది. అయితే, నోబెల్‌ శాంతి బహుమతి నామినేషన్ల గడువు ఇంకో రెండ్రోజుల్లో ముగుస్తుందనగా.. జనవరి 30న మహాత్ముడిని గాడ్సే పొట్టనబెట్టుకున్నాడు. తద్వారా ఆయనకు నోబెల్‌ శాంతి బహుమతి వచ్చే అవకాశం లేకుండా చేశాడు. 

ఎందుకంటే.. ఆ సంవత్సరం ఎవరికీ నోబెల్‌ శాంతి బహుమతి ఇవ్వడం లేదని 1948, నవంబర్‌ 18న కమిటీ ప్రకటించింది. పైగా.. ప్రస్తుతం జీవించి ఉన్నవారిలో ఆ అవార్డు పొందేందుకు తగు అర్హత కలిగిన వ్యక్తి ఎవరూ లేనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అప్పటి నిబంధనల ప్రకారం.. మరణానంతరం నోబెల్‌ ఇచ్చే సంప్రదాయం లేదు. తర్వాతి కాలంలో దాన్ని సవరించారు. ఈ నేపథ్యంలోనే ఒకవేళ మహాత్ముడు జీవించి ఉండి ఉంటే.. 1948 నోబెల్‌ శాంతి బహుమతి ఆయనకే దక్కి ఉండేదన్నది అత్యధికుల వాదన. 

పైగా.. ‘గాంధీ ఈ పురస్కారాన్ని దాదాపుగా దక్కించుకునే దాకా వచ్చారు. అయితే, ఆయన మరణం దాన్ని దూరం చేసింది’ అని 1948 నోబెల్‌ కమిటీ రికార్డుల్లో నమోదై ఉండటం కూడా ఆ వాదనను మరింత బలపరిచింది. గాంధీకి నోబెల్‌ శాంతి బహుమతి దక్కకపోవడం అన్నది కమిటీ చరిత్రలో అతిపెద్ద తప్పిదమని గేర్‌ లూండెస్టాడ్‌ అన్నారు. తర్వాత నోబెల్‌ కమిటీ కూడా మహాత్ముడికి శాంతి బహుమతి దక్కకపోవడంపై 1989, 2006లలో విచారం వ్యక్తం చేసింది. గాంధీ గొప్పోడని చెప్పడానికి ఆయనకు నోబెల్‌ అక్కర్లేదు.. కానీ నోబెల్‌ గొప్ప అవార్డు అని చెప్పుకోవడానికి మాత్రం  గాంధీ కావాలి! దట్సిట్‌..

(చదవండి: సిగరెట్టు ప్యాకెట్లపై ఉన్నట్లుగా ఆ చిరుతిండ్లపై హెల్త్‌ వార్నింగ్‌ మెసేజ్‌..!)

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
mahatma gandhi
Gadse
nobel peace prize
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

గాంధీజీ చెప్పిన‌ట్టు స‌త్య‌మే గెలిచింది: వైఎస్సార్‌సీపీ

గాంధీజీ చెప్పిన‌ట్టు స‌త్య‌మే గెలిచింది: వైఎస్సార్‌సీపీ

సత్యం ఓడినట్టుగా కనిపించవచ్చు.. కానీ..

సత్యం ఓడినట్టుగా కనిపించవచ్చు.. కానీ..

ట్రంప్‌ నోబెల్‌ బహుమతి చెల్లదంతే!

ట్రంప్‌ నోబెల్‌ బహుమతి చెల్లదంతే!

నాకు నోబెల్‌ ఇవ్వలేదు కాబట్టి.. శాంతి గురించి ఆలోచించను..!

నాకు నోబెల్‌ ఇవ్వలేదు కాబట్టి.. శాంతి గురించి ఆలోచించను..!

ట్రంప్‌నకు మచాడో నోబెల్ శాంతి బహుమతి

ట్రంప్‌నకు మచాడో నోబెల్ శాంతి బహుమతి

నోబెల్‌ శాంతికి నేనే బెస్ట్‌: ట్రంప్‌ 

నోబెల్‌ శాంతికి నేనే బెస్ట్‌: ట్రంప్‌ 

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.