Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

అంధులకు కోసం స్మార్ట్‌ గాగుల్స్‌.. 14 ఏళ్ల బాలికల ఆవిష్కరణ!

Family Sakshi User Sakshi Sakshi Time Feb 6, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
samart.jpg

కేరళలోని నలుగురు బాలికలు అంధులకు ఉపయోగపడే స్మార్ట్‌గాగుల్స్‌ని రూపొందించారు. వాళ్లు దాన్ని తమ పాఠశాల్లో అంధురాలిగా ఉన్న సహ విద్యార్థిని దృష్టిలో ఉంచుకుని రూపొందించినట్లు పేర్కొన్నారు. నీతి అయోగ్‌లో భాగంగా అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికి తీసేందుకు వేదికగా ఏర్పాటు చేస్తున్న అటల్ టింకరింగ్‌ ల్యాబ్‌లో దీన్ని ప్రదర్శించారు బాలికలు. ఈ ఆవిష్కరణ మూడో స్థానం దక్కించుకోవడమే గాక అందరీ దృష్టిని ప్రముఖంగా ఆకర్షించడం విశేషం. ఆపిల్‌ వంటి దిగ్గజ కంపెనీలు ఈ ఆలోచనకు శ్రీకారం చుట్టునున్న నేపథ్యంలో పాఠశాల విద్యార్థులు ఒక అడుగు ముందేసి ఇలాంటి గాగుల్స్‌ని రూపొందించాలనుకోవడం అందర్నీ సభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. ఆ బాలికలు ఎలా రూపొందించారు? ఈ ఆలోచనకు మార్గదర్శకం చేసిందెవరూ..? తదితర విశేషాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం!.

కేరళలోని సెయింట్‌ మేరిస్‌ కాన్వెంట్‌ గర్ల్స్‌ హయ్యర్‌ సెకండరీ స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు స్మార్ట్‌ గాగుల్స్‌ని రూపొందించారు. ఈ నమునాను హన్నా రీతు సోజన్‌, ఆన్సిలా రెజి, ఆన్లిన్‌ బిజోయ్‌, అంజెలినా అనే నలుగురు బాలికలు రూపొందించారు. ఈ స్మార్ట్‌ గాగుల్‌ అల్ట్రా సోనిక్‌ సెన్సార్‌లను ఉపయోగించింది రూపొందించారు. అందువల్ల వీటిని ధరించిన అంధ వ్యక్తులకు ఎదురుగా ఉన్న అడ్డంకులను గుర్తించి బజర్‌ ద్వారా వారిని ముందుగా హెచ్చరిస్తుంది. ఆ బాలికలు ఈ స్మార్ట్‌ గ్లాస్‌ నమునాని త్రిసూర్‌లోని సెయింట్‌ పాల్స్‌ హయ్యర్‌ సెకండరీ స్కూల్‌ అటల్‌ టింకరింగ్‌ లాబొరేటరీ(ఏటీఎల్‌) తొలి వార్షికోత్సవం సందర్భంగా ప్రదర్శించారు.

ఈ ఏటీఎల్‌ని నీతి అయోగ్‌లో బాగంగా అటల్‌ ఇన్నోవేషన్‌ మిషన్‌ ఉన్నత పాఠశాల్లలో  ఏర్పాటు చేసింది. ఇలాంటి ల్యాబరేటరీలను దేశవ్యాప్తంగా ఉన్న ఉన్నత పాఠశాలల్లో సుమారు పదివేలకు పైగా ఏర్పాటు చేసింది అటల్‌ ఇన్నోవేషన్‌ మిషన్‌. ఈ ల్యాబరేటరీలను పాఠశాల విద్యార్థుల్లోని సృజనాత్మక ఆలోచన వెలికితీసి, ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసింది. అంతేగాదు ముఖ్యంగా విద్యార్థుల్లో డిజైన్ మైండ్‌సెట్, కంప్యూటేషనల్ థింకింగ్, అడాప్టివ్ లెర్నింగ్, ఫిజికల్ కంప్యూటింగ్ వంటి నైపుణ్యాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఈ ల్యాబరేటరీలను ఏర్పాటు చేసింది.

ఈ మేరకు సదరు బాలికలు మాట్లాడుతూ..తాము రూపొందించిన స్మార్ట్‌ గాగుల్‌ బేసిక్‌ మోడల్‌ అని, దీన్ని మరింతగా మెరుగుపర్చేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని వివరించారు. రేబాన్‌ వంటి పెద్ద పెద్ద కంపెనీలు ఇలాంటి ఆలోచనలతో ఉన్నట్లు తెలుసని అన్నారు. అయితే అవి అత్యంత ఖరీదైనవి, అందరికీ అందుబాటులో ఉండదని చెబుతున్నారు. ఆ సమస్యకు చెక్‌పెట్టేలా, చౌకగా, పర్యావరణ హితంగా రూపొందించాలనేది తమ లక్ష్యం అని ఆ బాలికలు పేర్కొన్నారు. ఇక ఈ ఏటీఎల్‌ ప్రోగ్రాంలో లెర్నర్ లింక్స్ ఫౌండేషన్ అనే ఎన్జీవో ద్వారా నియమించబడిన ఒక మెంటర్ ఆయా విద్యార్థులకు మార్గనిర్దేశం చేస్తాడు.

ఈ ఏటీఎల్‌ ప్రోగ్రాంలో మొత్తం మూడు వేర్వేరు పాఠశాలకు చెందిన విద్యార్థులు అభివృద్ధి చేసిన 20కి పైగా ప్రాజెక్టులు ప్రదర్శించగా, వాటిలో మొదటి మూడు ప్రాజెక్ట్‌లు ప్రత్యేక అవార్డులను పొందాయి. అందులో ఈ స్మార్ట్ గాగుల్స్ ప్రాజెక్ట్ మూడవ స్థానాన్ని దక్కించుకుంది. కాగా, కేరళలోని ఏటీఎల్‌ ల్యాబ్ ఒప్పో ఇండియా భాగస్వామ్యంతో ఏర్పాటయ్యింది. ఈ మేరకు ఏటీఎల్‌ కార్యక్రమంలో ఒప్పో ఇండియా పబ్లిక్ అఫైర్స్ వైస్ ప్రెసిడెంట్ వివేక్ వశిష్ఠ మాట్లాడుతూ..ఆ యువ విద్యార్థుల అంకితభావం, కృషికి ముగ్దుడినయ్యానన్నారు. వారి నుంచి ఎంతో ప్రేరణ పొందానని చెప్పారు. దృష్టిలోపం ఉన్న తమ తోటి విద్యార్థి పట్ల వారు కనబర్చిన సానుభూతి వారిలోని సృజనాత్మక శక్తిని బయటకు వచ్చేలా చేయడమేగాక ఈ ఆవిష్కరణకు నాంది పలికేలా చేయడం నిజంగా గొప్ప విషయమంటూ ఆ బాలికలను ప్రశంసించారు వివేక్‌ వశిష్ట.

(చదవండి: చెమట, స్టెరాయిడ్స్‌ బాధలతో సొంత కాస్మొటిక్‌ బ్రాండ్‌: ఈమె తొలి గ్రామీ విన్నర్‌ కూడా!)

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
kerala
Girl
innovation
Smart glasses
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

వయనాడ్ లో వర్ష బీభత్సం.. కొండచరియలు విరిగి ఐదుగురు మృతి

వయనాడ్ లో వర్ష బీభత్సం.. కొండచరియలు విరిగి ఐదుగురు మృతి

ట్రాఫిక్‌లో ఆగిన గుండె.. కదిలొచ్చిన దేవతలు

ట్రాఫిక్‌లో ఆగిన గుండె.. కదిలొచ్చిన దేవతలు

లక్‌ అంటే వీరిదే : కారు నుజ్జు నుజ్జు, షాకింగ్‌ సీసీటీవీ విజువల్స్‌

లక్‌ అంటే వీరిదే : కారు నుజ్జు నుజ్జు, షాకింగ్‌ సీసీటీవీ విజువల్స్‌

‘మోగ్లీ గర్ల్‌’ పూజ ఇక లేదు

‘మోగ్లీ గర్ల్‌’ పూజ ఇక లేదు

కేరళలో అనుమానిత ఎబోలా, ఇప్పటికి ఎన్ని కేసులు అంటే

కేరళలో అనుమానిత ఎబోలా, ఇప్పటికి ఎన్ని కేసులు అంటే

చిన్నారి జాను మిస్సింగ్ కేసుపై సంచలన నిజాలు బయటపెట్టిన DSP

చిన్నారి జాను మిస్సింగ్ కేసుపై సంచలన నిజాలు బయటపెట్టిన DSP

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.