Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

కాఫీకి ఒక రోజు..!

Family Sakshi User Sakshi Sakshi Time Mar 14, 2026 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
coff.jpg

అక్టోబర్‌ 1 కాఫీ డే

కాఫీ అంటే ఉదయించే ఉత్సాహం. సరికొత్త రోజుకు కాఫీ సేవనంతో ఉత్సాహంగా స్వాగతం చెప్పటం తప్పనిసరైన ఇష్టమని గాఢంగా భావించే కాఫీ ప్రేమికులు ప్రపంచవ్యాప్తంగా కోకొల్లలు. ఒక మహత్తరమైన ఆహార సాంస్కృతిక వారసత్వానికి కాఫీ ఒక ప్రతీక. అటువంటి కాఫీకి ఇప్పటి వరకు ఒక ప్రత్యేక రోజంటూ లేదు. ఇప్పుడా కొరత తీరింది. అక్టోబర్‌ 1వ తేదీన ఇక ఏటా అంత‌ర్జాతీయ‌ కాఫీ డే (International Coffee Day) జరుపుకోవచ్చు. ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ ఈ నెల 10వ తేదీన ఈ మేరకు తీర్మానించింది. తన సువాసనలతో ఉత్తేజపరిచే కాఫీకి జేజేలు చెప్పని వారు ఈ విశాల భూతలమ్మీద ఎవరుంటారు? కమ్మటి కాఫీని సిప్‌ చేస్తూ మైమరచే వినియోగదారులతో పాటు కాఫీ గింజలను ఆరుగాలం కష్టించి పండించే రైతుల వరకూ కాఫీ దినోత్సవ ప్రకటన ఒక ఉత్తేజకరమైన వార్తే కదూ! ఆహార భద్రతకు దోహదపడే కాఫీ పంట సామాజిక–ఆర్థిక ప్రాముఖ్యత గురించి అవగాహన పెంపొందించడానికి కాఫీకి ఒక రోజును కేటాయిస్తున్న ఐక్యరాజ్యసమితి తీర్మానం పేర్కొంది. ఈ సందర్భంగా కాఫీ కబుర్లు మీ కోసం!

కాఫీకి ఉన్న సాంస్కృతిక, సామాజిక, చారిత్రక ప్రాముఖ్యతను ఐక్యరాజ్య సమితి గుర్తించింది. ఇదొక ముఖ్యమైన వ్యవసాయక ఉత్పత్తి మాత్రమే కాదు, కోట్లాది మంది వ్యవసాయ సమూహాలకు జీవనోపాధి కూడా. సామాజిక ఆతిథ్యం, సాంస్కృతిక వ్యక్తీకరణ, రోజువారీ సంప్రదాయానికి చిహ్నంగా కూడా కాఫీ మారింది అని ఐరాస తీర్మానం పేర్కొంది. ఆకలికి వ్యతిరేకంగా పోరాటం, తీవ్ర పేదరికాన్ని తగ్గించడం, మహిళల సాధికారత, మంచి పనిని ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించడం వంటి అనేక సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు కాఫీ సాగు, ప్రాసెసింగ్‌ దోహదపడుతున్నాయని ఐరాస పేర్కొంది.

2.5 కోట్ల రైతుల పంట 
ప్రపంచంలో అత్యంత విస్తృతంగా సేవించే పానీయాలలో కాఫీ ఒకటి. గత దశాబ్దంలో ప్రపంచ తలసరి వినియోగం సంవత్సరానికి 1.2 శాతం పెరుగుతోంది. ఈ రంగం సుమారు 2.5 కోట్ల రైతుల జీవనోపాధికి తోడ్పడుతోంది. తోటల సాగు నుంచి ప్రాసెసింగ్, వినియోగం వరకు విస్తరించిన విలువ గొలుసు అంతటా ఎందరికో ఉపాధి అవకాశాలను కాఫీ కల్పిస్తోంది. మొత్తం మీద, ప్రపంచ కాఫీ పరిశ్రమ వార్షిక ఆదాయం 20,000 కోట్ల డాలర్లు.

3,400 కోట్ల డాలర్ల వాణిజ్యం
ప్రపంచంలోనే అత్యధికంగా క్రయవిక్రయాలు జరిగే వస్తువులలో కాఫీ ఒకటిగా ఉంది. 2024లో ప్రపంచ కాఫీ ఉత్పత్తి 1.1 కోట్ల టన్నులను అధిగమించింది. అంతర్జాతీయంగా సుమారు 80 లక్షల టన్నుల కాఫీ గింజల వర్తకం జరుగుతోంది. 2024లో ప్రపంచ కాఫీ ఉత్పత్తి విలువ దాదాపు 2,500 కోట్ల డాలర్లని అంచనా, అయితే, కాఫీ గింజల ప్రపంచ వాణిజ్యం సుమారు 3,400 కోట్ల డాలర్లకు చేరుకుంది.

పుట్టిల్లు ఇథియోపియా
అనేక తక్కువ ఆదాయ దేశాలు విదేశీ మారకద్రవ్యం ఆర్జనకు కాఫీ ఎగుమతులు కీలకంగా మారాయి. కాఫీ పుట్టిల్లు ఇథియోపియా. 2024లో ఇథియోపియా మొత్తం వస్తువుల ఎగుమతుల్లో కాఫీ వాటా 27.9 శాతం. ఉగాండాలో 20.1 శాతం, బురుండిలో 19.5 శాతం. ఇథియోపియా, ఉగాండా రెండింటిలోనూ, కాఫీ ఎగుమతి ఆదాయాలు ఆహార దిగుమతి బిల్లులను మించిపోయాయి. 2024లో బ్రెజిల్, వియత్నాం ప్రముఖ కాఫీ ఎగుమతిదారులుగా ఉన్నాయి. యూరోపియన్‌ యూనియన్, అమెరికా అతిపెద్ద దిగుమతిదారులుగా ఉన్నాయి.

కాఫీ రైతులు ఎదుర్కొంటున్న వాతావరణ సంక్షోభాన్ని పరిష్కరించడంలో ఆహార – వ్యవసాయ సంస్థ ఫార్మర్‌ ఫీల్డ్‌ స్కూల్స్‌ కార్యక్రమం ముఖ్యపాత్ర పోషిస్తోంది. ఫీల్డ్‌ స్కూల్స్‌ ద్వారా తూర్పు ఆఫ్రికాలో, క్యూబాలో సహకార కాఫీ సాగు నమూనాలను ఎఫ్‌ఏవో బలోపేతం చేసింది. ప్రపంచ కాఫీ మార్కెట్‌కు అవసరమైన బలమైన ట్రేసబిలిటీ వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి రైతులు, ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తోంది. 

ఏడో స్థానంలో భారత్‌
కాఫీ సాగులో ప్రపంచంలో ఏడో స్థానంలో, ఎగుమతిలో ఐదో స్థానంలో భారత్‌ ఉంది. కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ తదితర దక్షిణాది రాష్ట్రాల్లోనే 90% కాఫీ గింజలు పండుతాయి. ముఖ్యంగా తూర్పు, పశ్చిమ కనుమల్లోని కొండ్రప్రాంతాల్లో కాఫీ సాగు విస్తరించింది. అరకు కాఫీ ఘుమఘుమలకు ప్రపంచ ప్రఖ్యాతి ఉంది. కాఫీ రకాల్లో అరబిక 30%, రోబస్ట 70% మన దేశంలో సాగవుతున్నాయి. 

17వ శతాబ్దంలో బాబా బుడాన్‌ ఎమెన్‌ నుంచి ఏడంటే ఏడు కాఫీ గింజల్ని మన దేశానికి రహస్యంగా తీసుకొచ్చారు. బ్రిటీష్‌ పాలనలో 19వ శతాబ్దం మధ్య నుంచి వాణిజ్యపరంగా కాఫీ పంట సాగు మన దేశంలో డచ్‌ వారి చొరవతో ప్రారంభమైంది. మన దేశంలో ఉత్పత్తయ్యే కాఫీ గింజల్లో 70% ఇటలీ, రష్యా, జర్మనీ కొనుగోలు చేస్తున్నాయి. 6 లక్షల కుటుంబాలు ఆధారపడి ఉన్న కాఫీ పరిశ్రమ కార్యకలాపాలను కాఫీ బోర్డు పర్యవేక్షిస్తోంది.

చదవండి: మహిళా రైతులకు మద్దతిస్తే..!

కాఫీ అనేది ఒక పానీయం కంటే ఎక్కువ. ఇది ప్రపంచవ్యాప్త వాణిజ్య వస్తువు. గింజల నుండి కాఫీ సేవనం వరకు – కోట్లాది వ్యవసాయ కుటుంబాల జీవనోపాధిని నిలబెడుతోంది. గ్రామీణులను ప్రపంచ మార్కెట్లతో అనుసంధానం చేస్తోంది. కాఫీ రంగానికి గల విలువను గుర్తించటం, దాని సామాజిక–ఆర్థిక ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచుతుంది. పేదరిక నిర్మూలనకు దాని సహకారాన్ని బలోపేతం చేస్తుంది. కాఫీ దినోత్సవాన్ని, దాని విలువలను సంబరంగా జరుపుకోటానికి ఎదురుచూస్తున్నాం.
– క్యూ.యూ. డోంగ్యు, డైరెక్టర్‌ జనరల్, ఐరాస ఆహార–వ్యవసాయ సంస్థ, రోమ్‌.

నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్‌  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
UNO
coffee
sagubadi
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

సాగుబడి: ‘బయో’ విత్తన పూతతో 25% అధిక దిగుబడి!

సాగుబడి: ‘బయో’ విత్తన పూతతో 25% అధిక దిగుబడి!

‘‘నోర్ముయ్‌!.. లేదా బయటకు పో.. నీ హద్దులో నువ్వు ఉండు!’’

‘‘నోర్ముయ్‌!.. లేదా బయటకు పో.. నీ హద్దులో నువ్వు ఉండు!’’

పాకిస్తాన్‌కు బిగ్‌ షాక్‌.. భారత్‌ దెబ్బ అదుర్స్‌

పాకిస్తాన్‌కు బిగ్‌ షాక్‌.. భారత్‌ దెబ్బ అదుర్స్‌

ఈ చెట్టుకు ఔషధ గుణాలు ఉన్నాయని చరిత్ర చెబుతోంది..!

ఈ చెట్టుకు ఔషధ గుణాలు ఉన్నాయని చరిత్ర చెబుతోంది..!

ఎల్‌నినోను తట్టుకునే సీ4 పంటలు తెలుసా?

ఎల్‌నినోను తట్టుకునే సీ4 పంటలు తెలుసా?

ఎల్‌నినోను తట్టుకునే ఉపాయాలు!

ఎల్‌నినోను తట్టుకునే ఉపాయాలు!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.