Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

బుల్లి ర‌చ‌యిత‌లు.. ఘ‌న‌తలు బోలెడు!

Family Sakshi User Sakshi Sakshi Time Feb 20, 2026 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
anant-bhardwaj-praveen-srim.jpg

‘పిల్లలు పుట్టుకతోనే ఆర్టిస్ట్‌లు’ అంటారు పికాసో. ఈ అన్నా చెల్లెళ్లను చూస్తే నిజమేననిపిస్తుంది. హైదరాబాద్‌లోని బీహెచ్‌ఇఎల్‌లో ఉంటున్న ఎ.ఆర్‌.అనంత్‌ భరద్వాజ్‌ ప్రవీణ్, మహతి శ్రీమణి ప్రవీణ్‌లు ఆరు, నాలుగు తరగతులు చదువుతున్నారు. అన్న ‘మై చిర్పింగ్‌ థాట్స్‌’ అని కథల పుస్తకం రాస్తే, చెల్లెలు ‘ది ఫ్లోయింగ్‌ పెన్‌’ పేరుతో  కవితా సంపుటం తీసుకువచ్చింది...

చిన్ననాటి ‘అన్నాచెల్లెలు’ అనగానే మనకు టామ్‌ అండ్‌ జెర్రీ కార్టూన్‌ షోలోని క్యారెక్టర్లు గుర్తుకువస్తాయి. పదకొండేళ్ల ఎ.ఆర్‌.అనంత్‌ భరద్వాజ్‌ ప్రవీణ్, తొమ్మిదేళ్ల మహతి శ్రీమణి ప్రవీణ్‌లు కూడా ఈ పాత్రలకు ఏ మాత్రం తీసిపోరు అన్నట్లుగా పోటీ పడేవాళ్లు. తెగ అల్లరి చేసేవారు.

ఫస్ట్‌ క్లాస్‌లో స్టోరీ..
అనంత్, మహతీల ప్రతిభ, అల్లరి గురించి తల్లిదండ్రులు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అయిన కస్తూరి ప్రవీణ్‌కుమార్‌కు చెప్పారు. ‘అన్నింటిలోనూ ఒకరికన్నా ఒకరు ముందు ఉండాలని పోటీపడుతుంటారు. ఈ విషయంలో ముందుగా మహతి ఉంటుంది’ అని కూతురు గురించి వివరించారు శకుంతల. మహతి ఫోర్త్‌ క్లాస్‌ చదువుతోంది. అన్నయ్య కథలు రాస్తుండటం చూసి తనూ ఫస్ట్‌ క్లాస్‌లో ఒక కథ రాసింది. ఆ తర్వాత తన ఆలోచనను కవిత్వం మీదకు మళ్లించింది. తను రాసిన కవితలన్నింటినీ కలిపి తల్లిదండ్రులు ఇ–బుక్‌గా తీసుకువచ్చారు.

ఇందులో కవితల గురించి ప్రస్తావిస్తూ ‘ఫ్లైయింగ్‌ హై’ అనే కవిత తనకు ఎందుకు బాగా నచ్చుతుందో తెలిపింది మహతి. ‘ఈ కవితలో ఈగల్‌ – ఫాల్కన్స్‌ అనే రెండు గ్రూప్‌ ఆఫ్‌ బర్డ్స్ పోటీ పెట్టుకుంటాయి. ఆ పోటీలో ఒక చిన్న ఫాల్కన్‌ బర్డ్‌ కూడా పాల్గొంటుంది. కానీ, అది పెద్ద బర్డ్స్‌తో పోటీపడలేకపోతుంది. ఆ బర్డ్స్‌ అన్నీ కలిసి కోచ్‌ దగ్గర ట్రైన్‌ అవుతుంటాయి.

చిన్న ఫాల్కన్‌ బర్డ్‌కి ట్రైనింగ్‌ అంటే కష్టంగా ఉండి, ఒక పొద దగ్గర కూర్చొని ఏడుస్తుంటుంది. అప్పుడు మదర్‌ ఫాల్కన్‌ వచ్చి ఏదైనా కష్టపడితేనే వస్తుంది, ఏడుస్తూ కూర్చుంటే రాదు అని చెప్పిన మాటలను గుర్తుకుపెట్టుకొని, కష్టపడి ట్రైనింగ్‌ తీసుకొని, చిన్న ఫాల్కన్ పోటీలో పాల్గొంటుంది. ముందు ఆ చిన్న బర్డ్‌ ఈగల్స్‌ని, బ్రదర్‌ ఫాల్కన్‌ని, మదర్‌ ఫాల్కన్‌ని క్రాస్‌ చేసి. చివరికి అతి కష్టమ్మీద ఫాదర్‌ ఫాల్కన్‌ని కూడా క్రాస్‌ చేసి గెలుస్తుంది. అందరితో పోటీ పడటానికి, నన్ను నేను మోటివేట్‌ చేసుకోవడానికి కవిత్వం ఉపయోగపడింది. అందుకు బర్డ్స్‌ని ఉదాహరణగా తీసుకున్నాను’ అని చెప్పింది మహతి. సైన్యంలో పనిచేసే శునకాల గురించి కూడా రాసింది మహతి.

‘సైన్యంలో పనిచేసే వారికి అవార్డులు ఇస్తారు. కానీ, అక్కడ పనిచేసిన చేసిన డాగ్స్‌కి మాత్రం ఏమీ ఇవ్వరు..’ ఈ ఆలోచనతో శునకాలకు కూడా అవార్డులు ఇవ్వాలని కవిత రాసింది. పిల్లలు ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది అనే అంశంపై రాసిన  ‘డైట్‌’ కవిత జాతీయ దిన పత్రికలో ప్రచురణ అయింది.

సిరీస్‌ స్టోరీస్‌...
ఎ.ఆర్‌.అనంత్‌ భరద్వాజ్‌ ప్రవీణ్‌ మూడేళ్లుగా కథలు రాస్తున్నాడు. ఇంటి దగ్గర, పార్క్‌ ఏరియాలో కనిపించే పాముల నుంచి తమను తాము ఎలా రక్షించుకోవాలి అనే అంశంపై  స్వీయ అనుభవాలను కథల రూపంలో తీసుకువచ్చాడు.

‘మా పాప ఒకసారి క్లాస్‌లో బి+ గ్రేడ్‌ వచ్చింది. దాంతో బాగా ఫీలయిపోయి రాసిన పోయెమ్‌ ఫ్లైయింగ్‌ హై. బాబు గురించి చెప్పాలంటే స్కూల్‌కి లంచ్‌ బాక్స్‌ పెట్టిస్తే సరిగా తినేవాడు కాదు. ఇంట్లోనూ అంతే. మేం పదే పదే తినమని చెబుతుండేవాళ్లం. దీంతో రోబో స్పూన్‌ తినిపించడం గురించి ఒక కథ. పాము ఇంటికి వస్తే ఏం చేయాలి? డ్రోన్‌ ద్వారా వాటిని ఎలా కనిపెట్టవచ్చు అని మరో కథ రాశాడు. హోమ్‌ వర్క్‌ అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. దీంతో రోబో పెన్‌ పేరుతో ఒక క్రియేటివ్‌ పెన్‌ గురించి, అది బ్లైండ్‌ పీపుల్‌కి ఉపయోగించినట్లు ఒక సొల్యూషన్‌లా చూపెట్టాడు. ఇలా ఏదైనా సమస్యగా అనిపిస్తే దానిని కథగా తీసుకొని, పరిష్కారం కూడా కనిపెట్టి నోట్‌ చేస్తాడు. ప్రతి స్టోరీలోనూ ఇంత ఆలోచిస్తాడా అనిపించింది’ అని వివరించారు శకుంతల.

చ‌ద‌వండి: నిజ‌మైన వ్య‌క్తిత్వ వికాసం మొద‌ల‌య్యేది అప్పుడే..!

‘నాకు వచ్చిన చిన్న చిన్న ఆలోచలను కథల రూపంలో పెట్టాను. నా వయసు ఉన్న అబ్బాయి ఎదుర్కొనే సమస్యలు, పరిష్కారం గురించి ఈ కథలు ఉంటాయి’ అంటున్నాడు భరద్వాజ్‌. ఈ పుస్తకాలను ప్రింట్‌లో తీసుకురావడానికి చాలా ఖర్చు అవుతుందని, ఇద్దరి బుక్స్‌ని డిజిటల్‌గా తీసుకువచ్చారు.

ఏడువందల శ్లోకాలు ఏకధాటిగా
బీహెచ్‌ఇఎల్‌ భారతీయ విద్యాభవన్స్‌ పబ్లిక్‌ స్కూల్‌లో చదువుతున్న ఈ అన్నాచెల్లెళ్లు కథలు, కవిత్వాలు రాయడంలోనే కాదు భగవద్గీత శ్లోకాలను కంఠతా చేయడంలోనూ సాటిలేరని నిరూపిస్తున్నారు. కర్ణాటకలోని శృంగేరి శారదా మఠం వాళ్లు మార్చిలో నిర్వహిస్తున్న భగవద్గీత శ్లోకాల కాంపిటీషన్‌లో వీరిద్దరూ పాల్గొంటున్నారు. అన్నయ్య నేర్చుకుంటున్నాడని చెల్లెలు మహతి భగవద్గీత కాంపిటీషన్‌లో పాల్గొనడానికి 700 శ్లోకాలు నేర్చుకుంది. ఏడాది పాటు చేసిన ఈ ప్రయత్నం వీరిని పోటీలో పాల్గొనేలా చేసింది. ఇద్దరికీ మొదట తెలుగు వచ్చేది కాదు. కానీ, భగవద్గీత శ్లోకాల ద్వారా తెలుగు కూడా సులువుగా నేర్చేసుకున్నారు. నేటి పిల్లలు టీవీలు, మొబైల్‌ స్క్రీన్‌కే  పరిమితం అవుతున్నారని  పెదవి విరిచేవారికి రచనలతో, శ్లోకాలతో సమాధానం చూపుతున్నారు ఈ అన్నాచెల్లెళ్లు.  

– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
writers
kids
Kids Stories
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

autism parenting: ఆటిజం పిల్లలను పెంచే పేరెంటింగ్‌ టిప్స్..! వైరల్‌గా ఓ తల్లి గైడెన్స్‌..

autism parenting: ఆటిజం పిల్లలను పెంచే పేరెంటింగ్‌ టిప్స్..! వైరల్‌గా ఓ తల్లి గైడెన్స్‌..

పాపతో బంధం.. వీడ్కోలు వేళ భావోద్వేగం

పాపతో బంధం.. వీడ్కోలు వేళ భావోద్వేగం

నాకు అది ఇష్టం లేదు పెళ్లి, పిల్లలుపై క్లారిటీ ఇచ్చిన ప్రవల్లిక

నాకు అది ఇష్టం లేదు పెళ్లి, పిల్లలుపై క్లారిటీ ఇచ్చిన ప్రవల్లిక

చిన్నారుల మిస్సింగ్‌ మిస్టరీ విషాదాంతం

చిన్నారుల మిస్సింగ్‌ మిస్టరీ విషాదాంతం

పెట్రోల్‌ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా?

పెట్రోల్‌ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా?

ముగ్గురిని కంటే 25 నలుగురైతే 50 వేలు.. ఇప్పుడు మనం ఏం చేయాలంటే..

ముగ్గురిని కంటే 25 నలుగురైతే 50 వేలు.. ఇప్పుడు మనం ఏం చేయాలంటే..

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.