Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

బంగ్లా హెర్క్యులస్‌ రేపిస్టుల పాలిటి యముడు

Family Sakshi User Sakshi Sakshi Time Jan 26, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
11232.jpg

బంగ్లాదేశ్‌ ఆశూలియా జిల్లా 2019 జనవరి 7న జరిగిన అత్యాచార సంఘటనతో ఉలిక్కిపడింది. ఆశూలియాలోని ఒక దుస్తుల కర్మాగారంలో పనిచేసే పద్దెనిమిదేళ్ల యువతిపై కొందరు దుండగులు సామూహిక అత్యాచారానికి తెగబడి, ఆమెను దారుణంగా హత్య చేశారు. ఇరుగు పొరుగులు ఇంట్లో ఆమె మృతదేహం పడి ఉండటం గమనించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. 

ఈ సంఘటనపై అశూలియా జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. పోలీసులపై అన్ని వర్గాల నుంచి ఒత్తిడి పెరిగింది. మృతురాలితో పాటు అదే దుస్తుల కర్మాగారంలో పనిచేసే రిపొన్, అతడి ఇద్దరు సహచరులను పోలీసులు అనుమానితులుగా గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని, పోలీస్‌ స్టేషన్‌లో విచారణ జరిపారు. సాక్ష్యాధారాలు లేకపోవడంతో విడిచిపెట్టారు.ఈ కథ ఇక్కడితో ముగిసిపోలేదు. పైగా మరో మలుపు తీసుకుంది. జనవరి 17న అనుమానితుల్లో కీలక వ్యక్తి అయిన రిపొన్‌ దారుణంగా హత్యకు గురయ్యాడు. 

అశూలియాకు చేరువలోని ఒక పొలంలో అతడి మృతదేహం పడి ఉండటాన్ని గమనించి, స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహం మెడకు తగిలించిన నోట్‌ను చూసి, దానిని బయటకు తీసి పరిశీలించారు. ఆ నోట్‌లో ఇలా ఉంది: ‘నా పేరు రిపొన్‌. నేను (బాధితురాలి పేరు)పై అత్యాచారం చేశాను. నేను రేపిస్టును. నా నేరానికి ఇదే తగిన శిక్ష. నాతో కలసి ఈ నేరానికి ఒడిగట్టిన నా సహచరులకు కూడా ఇదే గతి పడుతుంది. జాగ్రత్త!’– హెర్క్యులస్‌ అని బెంగాలీలో రాసి ఉంది. 

పోలీసులు ఆశ్చర్యపోయారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు.పట్టుమని పదిరోజులైనా కాలేదు. మరో సంఘటన కలకలం రేపింది. జనవరి 26న అశూలియా జిల్లా బోల్తలా గ్రామంలోని వరి చేనులో ఒక మృతదేహం పడి ఉండటం చూసి, స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గ్రామ పంచాయతీ చైర్మన్‌కు కూడా సంగతి చెప్పారు. అందరూ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడి మెడలో నోట్‌ వేలాడదీసి ఉంది. ఇది కూడా హెర్క్యులస్‌ పేరుతోనే ఉంది. ఈ సంఘటనలో మృతుడి పేరు సాజల్, న్యాయశాస్త్ర విద్యార్థి. ఇతడు కూడా జనవరి 7న జరిగిన అత్యాచార సంఘటనలో పట్టుబడిన అనుమానితుల్లో ఒకడు. 

ఒకే హత్యాచారం కేసులో అనుమానితులైన ఇద్దరు వరుసగా హత్యకు గురికావడం, పైగా వారి మృతదేహాలపై ‘హెర్క్యులస్‌’ పేరుతో హెచ్చరిక నోట్‌ దొరకడం బంగ్లాదేశ్‌లో దేశవ్యాప్తంగా కలకలంగా మారింది. పోలీసులకు ఈ హత్యలు సవాలుగా మారాయి. పోలీసులు చేయలేని పనిని ఒక అజ్ఞాతవ్యక్తి చేయడం పట్ల జనాల్లో రకరకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. చట్టాన్ని ఇలా చేతుల్లోకి తీసుకోవడం తగదని కొందరు మర్యాదస్తులు అభిప్రాయపడితే, న్యాయం చేయడంలో పోలీసులు చేతగాని వాళ్లయినప్పుడు, అజ్ఞాత వ్యక్తి ఎవరో ఇలాంటి న్యాయం చేయడమే సరైన పని అని వ్యాఖ్యానించసాగారు. మరోవైపు పోలీసుల అసమర్థతను దుమ్మెత్తిపోస్తూ మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి.

అజ్ఞాత ‘హెర్క్యులస్‌ కోసం పోలీసులు గాలింపు కొనసాగిస్తుండగా, ఫిబ్రవరి 1న మరో సంఘటన జరిగింది. ఈసారి అశూలియా పొరుగు జిల్లా అయిన రాజాపూర్‌లోని జలాకఠి శివార్లలోని పొలాల్లో మరో మృతదేహం పడి ఉంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు, మృతదేహం మెడలో ‘హెర్క్యులస్‌’ పేరుతో ఉన్న హెచ్చరిక నోట్‌ దొరికింది. ఈ సంఘటనలో మృతుడి పేరు రకీబ్‌ ముల్లా. 
‘ఈ హెర్క్యులస్‌. ఎవడోగాని, పోలీసుల కంటే వీడే నయంగా ఉన్నాడు. రేపిస్టులందరినీ ఏరి పారేస్తున్నాడు’ అని అక్కడ మూగిన జనాలు పోలీసుల ముందే అనుకోవడం మొదలుపెట్టారు. తమ సమక్షంలోనే జనాలు అలా మాట్లాడటంతో పోలీసులకు తలకొట్టేసినట్లయింది. 

వరుస సంఘటనలు జరిగినా, జిల్లా పోలీసులు ఎలాంటి ఆధారాలూ సేకరించలేకపోవడంతో చివరకు బంగ్లాదేశ్‌ జాతీయ పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. దేశవ్యాప్తంగా హెర్క్యులస్‌ కోసం గాలింపు ప్రారంభించాయి. ఊహాచిత్రాలతో ఊరూరా పోస్టర్లు వేయించాయి. అయినా, ఎలాంటి ఫలితమూ దక్కలేదు. ఇప్పటికి ఆరేళ్లు గడచిపోయినా, బంగ్లా పోలీసులకు హెర్క్యులస్‌ ఆచూకీ దొరకలేదు. ఇదే విషయమై, హెర్క్యులస్‌ కేసుపై మొట్టమొదట దర్యాప్తు జరిపిన ఇన్వెస్టిగేటివ్‌ ఆఫీసర్, అశూలియా పోలీస్‌స్టేషన్‌ ఇన్‌చార్జ్‌ జహీదుల్‌ ఇస్లామ్‌ను ప్రశ్నిస్తే, ‘మేం కేసును మొదటి నుంచి దర్యాప్తు చేశాం. 

సంఘటనలు జరిగిన ప్రతిచోటా అణువణువూ గాలించాం. మృతుల మెడల్లో హెచ్చరిక సందేశాలు తప్ప మాకు ఎక్కడా ఎలాంటి ఆధారాలూ దొరకలేదు’ అని చెప్పారు. అసిస్టెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ షోహెల్‌ రాణా కూడా దాదాపు ఇలాగే చెప్పారు. ‘అప్పటి వరుస హత్యల వెనుక ఎవరు ఉన్నారో ఇప్పటి వరకు తేలలేదు. ఎలాంటి ఆధారాలూ దొరకలేదు. అయినా, హత్యలకు కారకులు ఎవరో కనుక్కోవడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నాం’ అని చెప్పారు. పోలీసులు ఇలాంటి పసలేని ప్రకటనలు చేస్తుంటే, బంగ్లా జనాల్లో చాలామంది హెర్క్యులస్‌ను హీరోగా పరిగణిస్తుండటం విశేషం.  
 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
mysterious
Serial Killer
Funday
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఇది సాధారణ బొమ్మ కాదు.. మినీ రోబో స్నేహితుడు!

ఇది సాధారణ బొమ్మ కాదు.. మినీ రోబో స్నేహితుడు!

ఆన్‌ చేస్తే టీవీ.. ఆఫ్‌ చేస్తే ఆర్ట్‌ గ్యాలరీ.. అద్భుతం!

ఆన్‌ చేస్తే టీవీ.. ఆఫ్‌ చేస్తే ఆర్ట్‌ గ్యాలరీ.. అద్భుతం!

గర్విష్టి గజరాజు

గర్విష్టి గజరాజు

వైరస్‌ పుట్టకముందే అంత్యక్రియలు! ఏఐ వ్యాక్సిన్‌ ప్రయోగం..

వైరస్‌ పుట్టకముందే అంత్యక్రియలు! ఏఐ వ్యాక్సిన్‌ ప్రయోగం..

కుక్కయినా హక్కుంది... దానికో లెక్కుంది!

కుక్కయినా హక్కుంది... దానికో లెక్కుంది!

అష్టావక్రుడి పూర్వజన్మ వృత్తాంతం

అష్టావక్రుడి పూర్వజన్మ వృత్తాంతం

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.