Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

జమ... ఖర్చుల్లో... ఆమె ఎక్కడ?

Family Sakshi User Sakshi Sakshi Time Jan 30, 2025 Sakshi Read Time Read Time: 4 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
iStock-1052928614-budget-wo.jpg

బడ్జెట్‌ బాత్‌

ఎక్కడైనా జమ, ఖర్చులదే లెక్క!  దాన్ని బట్టే ఇంటికైనా.. దేశానికైనా జరుగుబాటు!
అప్పు, ఆదా సమంగానే పంచినా బలహీనుల పట్ల ఆపేక్ష సహజం!
అయితే ఆ బలహీనత అర్థమే మారిపోతోంది ఇంటి బడ్జెట్‌లో అయినా.. దేశ బడ్జెట్‌లో అయినా!
చిత్రంగా ఆ వర్గంలో ఎక్కడా స్త్రీ కనిపించదు! అమ్మాయి నుంచి ఆంట్రప్రెన్యూర్‌ వరకు ఎవరికీ  కేటాయింపులు ఉండవు! ఇల్లాలి సేవలకైతే గుర్తింపే కరవు!

మహిళలకు బడ్జెట్‌లో స్థానం కల్పించాలని ‘జెండర్‌ బడ్జెటింగ్‌’ పేరుతో ఐక్యరాజ్యసమితి మహిళా విభాగం ప్రపంచానికి వినిపించేలా గళమెత్తింది. ఆప్రాధాన్యాన్ని గ్రహించిన దేశాలు భారత్‌ సహా జెండర్‌ బడ్జెట్‌ మీద దృష్టిపెట్టాయి!కానీ కొన్నేళ్లుగా మన దగ్గర ఆ పదం వినిపించకుండా పోవడమే కాదు... బడ్జెట్‌లో మహిళలు కనిపించడమూ  తగ్గుతోంది. ఫిబ్రవరి 1న కేంద్రబడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న  సందర్భంగా ‘జెండర్‌ బడ్జెటింగ్‌’ మీద  పలు రంగాల్లోని  మహిళా నిపుణుల  అభిప్రాయాలు ...

సంక్షేమపథకాలు జెండర్‌ బడ్జెట్‌ కిందికి రావు
పదిహేనేళ్లుగా జెండర్‌ బడ్జెటింగ్‌ను మరచిపోయారు. మహిళలకు ఇస్తున్న పెన్షన్లు, గృహలక్ష్మి, ఉచిత రవాణా సౌకర్యాలు వంటివన్నిటినీ విమెన్‌ బడ్జెట్‌ కింద చూపిస్తున్నారు. అధికార పార్టీల సంక్షేమపథకాలు జెండర్‌ బడ్జెట్‌ కిందికెలా వస్తాయి? మహిళలకు సంబంధించి మౌలిక సదుపాయాల కల్పన, శాఖలన్నిటి కేటాయింపుల్లో మహిళలకుఇస్తున్న వాటా, స్త్రీ చదువు, జీవనోపాధి, ఆంట్రప్రెన్యూర్‌షిప్‌ గురించి, మొత్తం స్ట్రక్చర్‌ను విమెన్‌ ఫ్రెండ్లీ చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలు, స్త్రీ, పురుష అసమానతలను రూపుమాపడానికి తీసుకుంటున్న చర్యలు విమెన్‌ బడ్జెట్‌ కిందికి వస్తాయి.

 కేరళలో గ్రామ పంచాయతీ బడ్జెట్‌లో కూడా 30 శాతం మహిళలకు కేటాయిస్తారు. సాధారణ బడ్జెట్‌లోనూప్రాధాన్యం ఇస్తారు. దాన్ని కేంద్రప్రభుత్వమూ అనుసరించాలి. కిందటేడు కేంద్ర బడ్జెట్‌లో నరేగా(మహాత్మాగాంధీ నేషనల్‌ రూరల్‌ ఎం΄్లాయ్‌మెంట్‌ గ్యారంటీ యాక్ట్‌)కు రూ.35 వేల కోట్లు తగ్గించారు. సవరించిన బడ్జెట్‌లో 120కోట్లకు గాను 95వేల కోట్లను కేటాయించి, కేవలం రూ. 60 వేల కోట్లతో సరిపెట్టారు. ఈ కోతలు గ్రామీణ ఉపాధిరంగంలోని స్త్రీల మీద తీవ్రప్రభావం చూపిస్తున్నాయి. వ్యవసాయరంగంలో 58 శాతం మహిళలున్నారు. వాళ్లు ఎక్కువగా కౌలు చేస్తారు. 

వాళ్ల పేరుమీద పొలాలుండవు. భర్త పేరుమీదో.. ఉమ్మడి కుటుంబ ఆస్తిగానో ఉంటాయి. లేదంటే పిల్లల పేరుమీద ఉంటాయి. ఈ లెక్కన వాళ్లకు ఆర్థిక భద్రత ఏది? పట్టణ ఉపాధి రంగంలో 23 శాతమున్న మహిళల పరిస్థితీ అంతే! నరేగా లాంటివి అక్కడ అప్లయ్‌ చేయరు. ఇక భద్రత, రక్షణ విషయాలకు వస్తే.. నిర్భయ ఫండ్‌కి గత మూడేళ్లుగా కేటాయింపుల్లేవు. మొదట్లో వెయ్యి కోట్లేమో కేటాయించారు. తర్వాత తగ్గించుకుంటూ వచ్చారు. ఎవరూ దరఖాస్తు చేసుకోవట్లేదని ఇప్పుడు దానికి బడ్జెట్టే లేకుండా చేశారు. అయితే ఎలాంటి పరిస్థితుల్లో అప్లయ్‌ చేసుకోవచ్చో రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టతనివ్వలేదు. స్త్రీ విద్య, ఆరోగ్యం, ఉపాధి, భద్రత రంగాల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటుకు బడ్జెట్‌లో కేటాయింపులు ఉంటేనే అది జెండర్‌ బడ్జెట్‌. అది అత్యంత అవసరం!                       
– దేవి, యాక్టివిస్ట్‌

‘అవగాహన’కు ఖర్చు చేయాలి 
ఎమ్మెస్సెమ్మీలో 20 వేల కోట్ల రూపాయల మిగులు నిధులున్నట్లుగా డేటా చూపిస్తోంది. దాని అర్థం ఆ స్కీమ్స్‌ ప్రజలకు చేరట్లేదని! ఆ మిగులును చూసి కేటాయింపులు తగ్గిస్తారు లేదంటే రివర్స్‌ చేస్తారు తప్ప.. దాన్ని మహిళా సాధికారత మీద అవగాహన కలిగించే కార్యక్రమాలకో, ఆడపిల్లల చదువుకో మళ్లించరు! ఎమ్మెస్సెమ్మీ స్కీమ్స్‌ గురించి కాలేజీల్లో అవేర్‌నెస్‌ క్యాంప్‌లు పెట్టండని ప్రభుత్వాన్ని పోరుతున్నాం. కాలేజీస్థాయిలోనే అవగాహన వస్తే చదువైపోయాక ఉద్యోగం కోసం వెంపర్లాడకుండా తక్కువ పెట్టుబడితోనే ఏదో ఒక వ్యాపారం మొదలుపెట్టుకుంటారు. 

దీనివల్ల ప్రభుత్వాల మీదా ఒత్తిడి తగ్గుతుంది. యువతలో ఆంట్రప్రెన్యూర్‌షిప్‌ పెరుగుతుంది. ఓరియంటల్‌ మహిళా వికాసం, ముద్ర లోన్స్, స్త్రీ శక్తి యోజన.. సిం«ద్‌ మహిళాశక్తి యోజనలాంటి వాటితో భారతీయ మహిళా బ్యాంక్‌ (బీఎమ్‌బీ) లాంటి స్కీమ్స్‌ ఎన్నో ఉన్నాయి. బీఎమ్‌బీలో రూ. 50 వేల నుంచి రూ. 50 లక్షల వరకు లోన్స్‌ «తీసుకోవచ్చు. ధరావత్తు అవసరం లేదు. అయితే వీటి గురించి ఎవరికీ అంతగా తెలీదు. ఈ కోవలోనిదే స్టార్టప్‌ ఇండియా స్కీమ్‌. దీన్ని ఎస్సీ, ఎస్టీ, మహిళల కోసం డిజైన్‌ చేశారు. ఇంకా గ్రూప్‌ లోన్స్‌ ఉన్నాయి. 

అయిదుగురు మహిళలు కలిసి ఓ సంస్థను పెట్టుకోవచ్చు. ఈరోజున ఒక ఆంట్రప్రెన్యూర్‌ మహిళ నెలకు రూ. 3 లక్షలు సంపాదిస్తోంది. గ్రామీణ, పట్టణ, దళిత మహిళలందరినీ ఆంట్రప్రెన్యూర్‌షిప్‌ వైపు నడిపించాలంటే.. వారికోసం ప్రభుత్వాలు కల్పిస్తున్న పథకాల పట్ల అవగాహన కల్పించే కార్యక్రమాలకు బడ్జెట్‌లో కేటాయింపులు సమృద్ధిగా ఉండాలి. ఆ కార్యక్రమాలతో ఇల్లిల్లూ తిరిగి చైతన్యం కలిగించాలి. కేక్‌ తయారీ నుంచి చేపల పెంపకం దాకా అన్నిటికీ ఎమ్మెస్సెమ్మీలో శిక్షణ ఉంది. అవగాహన కల్పించాలంతే! 
– బి.ఎన్‌. రత్న, ప్రెసిడెంట్, దలీప్‌ (దళిత్‌ ఆదివాసీ విమెన్‌ ఆంట్రప్రెన్యూర్స్‌ అసోసియేషన్‌)

ప్రత్యేక కేటాయింపులు కావాలి
ఆంట్రప్రెన్యూర్‌షిప్‌ స్కిల్స్‌ని డెవలప్‌ చేసే ట్రైనింగ్‌ ప్రోగ్రామ్స్‌కి సరిపోయేంత బడ్జెట్‌ ఉండట్లేదు. దానికోసం ప్రత్యేక కేటాయింపులు కావాలి. పెట్టుబడి కోసం కూడా మహిళల దగ్గర డబ్బు ఉండదు. అందుకే పది, పదిహేను శాతం సీడ్‌ క్యాపిటల్‌ అసిస్టెన్స్‌ కూడా ఉంటే బాగుంటుంది. 
– అరుణ దాసరి, ప్రెసిడెంట్‌ డిక్కీ, తెలంగాణ

వాళ్లూ జాతీయోత్పత్తిలో భాగస్వాములే!
వ్యవసాయం లాంటి అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న మహిళలకు క్షేత్రస్థాయిలో ఈ రోజుకీ ఎలాంటి వసతులు లేవు. కనీసం టాయిలెట్‌ సౌకర్యం కూడా లేదు. వర్కింగ్‌ విమెన్స్‌ హాస్టల్స్, బేబీ కేర్‌ సెంటర్స్‌ను ఏర్పాటుచేస్తామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుస్థిర వ్యవసాయ పద్ధతుల గురించి మాట్లాడినప్పుడల్లా అది మహిళల మీద అదనపు భారాన్నే మోపుతోంది. వీరి ఈ శ్రమను ఇంటిపనిగానే చూస్తున్నారు తప్ప ఉత్పత్తిలో భాగంగా చూడట్లేదు.

 ఎలాంటి కూలీ చెల్లించట్లేదు. మహిళా రైతుల ఆత్మహత్యలను లెక్కలోకి తీసుకోవట్లేదు. వాళ్లను అసలు రైతులుగానే గుర్తించట్లేదు. ఒంటరి మహిళలకు అందాల్సిన పెన్షన్లు, ఎక్స్‌గ్రేషియా విషయంలోనూ నిర్లక్ష్యమే కనిపిస్తోంది. నిర్వాసిత ప్రాజెక్ట్‌ నిర్మాణాల వల్ల) మహిళలైతే అనేకరకాల అభద్రతలకు లోనవుతున్నారు. వీళ్లంతా జాతీయోత్పత్తిలో భాగస్వాములే! వీళ్లందరి అభివృద్ధి, భద్రత, రక్షణలకు బడ్జెట్‌లో స్థానం ఉంటోందా? నిజాయితీగా సమీక్షించుకోవాలి. నిష్పక్షపాతంగా ఒప్పుకోవాలి. అప్పుడే బడ్జెట్‌లో స్త్రీకి సముచితస్థానం లభిస్తుంది. 
– పద్మ వంగపల్లి, ఇండిపెండెంట్‌ జర్నలిస్ట్‌

కేర్‌ ఎకానమీకీ స్థానం ఉండాలి
స్త్రీ, పురుష ఆర్థిక సమానత్వ సాధనలో జెండర్‌ బడ్జెటింగ్‌ అనేది కీలకం. ఆర్థిక వనరులను నేరుగా ప్రభావితం చేసే రంగాల్లో స్త్రీలకు ఎంతమేర కేటాయింపులుంటున్నాయి, వాటినెలా ఉపయోగిస్తున్నారు, మహిళల భద్రత కోసం ఎంత కేటాయిస్తున్నారు లాంటివన్నీ పరిగణనలోకి వస్తాయి. కేర్‌ ఎకానమీ అంటే ఇంట్లో స్త్రీల సేవలు.. ఇంటి పని, వంటపని దగ్గర్నుంచి భర్తకు ఇచ్చే ఎమోషనల్‌ సపోర్ట్, పిల్లలు.. పెద్దవాళ్ల బాగోగుల దాకా మహిళలు చేసేదంతా జీతం లేని శ్రమ. మరుగునపడిన వీరి సేవలను, శ్రమను ఆదాయ పట్టీలోకి చేర్చాలి. 

భార్య అన్నిరకాలుగా సహకరిస్తేనే భర్త బయటకు వెళ్లి పనిచేయగలుగుతున్నాడు. అలా ఆమె కూడా ఉత్పత్తిలో భాగమవుతూ, జాతీయ ఆదాయానికి ఊతమవుతోందని గ్రహించాలి. ఈ కేర్‌ ఎకానమీకీ బడ్జెట్‌లో స్థానం ఉండాలి. స్థూల విధానాలు జెండర్‌ ఈక్వాలిటీ, సామాజిక న్యాయం, మిలీనియల్‌ గోల్స్, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు దగ్గరగా ఉండాలి. మహిళలు, జెండర్‌ మైనారిటీల చదువు, ఆరోగ్యం, భద్రత, ఉపాధి, జీవన నైపుణ్యాలు పెంపొందించడం వంటివన్నీ బడ్జెట్‌లో భాగం కావాలి. ఆ కేటాయింపులన్నీ సక్రమంగా ఖర్చవ్వాలి. కానీ అవన్నీ వేరేచోటికి మళ్లుతున్నాయి. జెండర్‌ ఈక్వాలిటీ మీద ఒకరకమైన ఉపేక్ష కనబడుతోంది. 
– అపర్ణ తోట, జెండర్‌ కన్సల్టెంట్‌ ట్రైనర్, ద పర్పుల్‌ వరండా

– సరస్వతి రమ 
 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Budget
womens position
Gender Issues
United Nations
opinion
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

డీఏ పెంపు, లక్ష ఉద్యోగాలు : బెంగాల్‌లో బీజేపీ తొలి బడ్జెట్‌లో వరాల జల్లు

డీఏ పెంపు, లక్ష ఉద్యోగాలు : బెంగాల్‌లో బీజేపీ తొలి బడ్జెట్‌లో వరాల జల్లు

వాతావరణ మార్పులతో ముప్పు: ఐరాస 

వాతావరణ మార్పులతో ముప్పు: ఐరాస 

‘కారుణ్య వీసా’ ఫాస్ట్‌–ట్రాక్‌ ఒప్పందం కావాలి!

‘కారుణ్య వీసా’ ఫాస్ట్‌–ట్రాక్‌ ఒప్పందం కావాలి!

ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఏది?

ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఏది?

ఇక్కడి నుంచే సొసైటీ ఈక్వాలిటీ!

ఇక్కడి నుంచే సొసైటీ ఈక్వాలిటీ!

మధ్యతరగతిపై ధరల భారం

మధ్యతరగతిపై ధరల భారం

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.