Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

విలక్షణ వినాయకుడు..!

Family Sakshi User Sakshi Sakshi Time Aug 24, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
vinaya2.jpg

ఆదిపూజలు అందుకునే వినాయకుడికి దేశ విదేశాల్లో అనేక ఆలయాలు ఉన్నాయి. పురాతన ఆలయాల్లో విలక్షణమైన వినాయక విగ్రహాలు ఉన్నాయి. వీటిలో కొన్ని అత్యంత అరుదైన ఆలయాలు, విలక్షణమైన విగ్రహాలు ఉన్నాయి. అలాంటి అరుదైన ఆలయాలు, విగ్రహాల విశేషాలు 
మీ కోసం...

వినాయకుడిని భక్తులు గజాననుడిగానే ఆరాధిస్తారు. వినాయకుడు మానవ ముఖంతో కనిపించే ఏకైక ఆలయం తమిళనాడులోని తిలతర్పణపురిలో ఉంది. పార్వతీదేవి నలుగుపిండితో రూపొందించిన వినాయకుడు లక్షణంగా మానవముఖంతోనే ఉండేవాడు. తనను అడ్డగించినందుకు శివుడు కోపగించి, అతడి తలను నరికేసి, ఆ తర్వాత జరిగిన పొరపాటుకు చింతించి గజముఖాన్ని అతికించిన పురాణ కథ అందరికీ తెలిసినదే! 

గజాననుడిగా మారక ముందు బాలవినాయకుడి రూపంలో కొలువుతీరిన ఆలయం ఇది. వినాయకుడి తొలి రూపం ఇదే గనుక దీనికి ఆదివినాయక ఆలయంగా పేరు వచ్చింది. ఈ ఆలయం తిలతర్పణపురిలోని ముక్తీశ్వర ఆలయ ప్రాంగణంలో ఉంది. ఇది క్రీస్తుశకం ఏడో శతాబ్ది నాటిది. శ్రీరాముడు ఇదేచోట తన తండ్రి దశరథుడికి పితృశ్రాద్ధం నిర్వహించి, తిల తర్పణాలు సమర్పించాడనే కథనం కూడా ఉంది. అందువల్ల ఇది కాశీ, రామేశ్వరాలతో సమానమైన పుణ్యక్షేత్రంగా భక్తులు విశ్వసిస్తారు. 

ఐశ్వర్య గణపతి
కలువా వినాయకుడుఅత్యంత భారీ ఏకశిలా విగ్రహం ఇది. ఆరుబయట పంట పొలాల మధ్య ఉన్న ఈ విగ్రహానికి ఆలయమేదీ లేదు. భక్తులు ఈ విగ్రహాన్ని దర్శించుకుని పూజలు చేస్తుంటారు. ఐశ్వర్య గణపతిగా కొలువు తీరిన ఈ ఏకశిలా విగ్రహం తెలంగాణలోని నాగర్‌కర్నూల్‌ జిల్లా ఆవంచ గ్రామంలో ఉంది. ఈ విగ్రహం ఎత్తు 7.62 మీటర్లు. పీఠంతో కలుపుకొంటే, దీని ఎత్తు 9.14 మీటర్లు. ఈ విగ్రహం పశ్చిమ చాళుక్యుల కాలం నాటిది. సుమారు క్రీస్తుశకం పన్నెండో శతాబ్దిలో ఈ విగ్రహాన్ని రూపొందించి ఉంటారని 
అంచనా.

అడవీయ గణపతి
పురాతనమైన ఈ ఏకశిలా గణపతి విగ్రహం శ్రీలంకలోని ఉడుదుంబరలో ఉంది. అడవులకు రక్షణగా ఉంటాడని భావించి, ఈ విగ్రహాన్ని నెలకొల్పడం వల్ల ఈ గణపతికి ‘అడవీయ గణపతి’ అనే పేరు వచ్చింది. ఇది సుమారు పన్నెండో శతాబ్ది నాటిదని అంచనా.

స్థానిక గిరిజన తెగ నాయకుడికి వినాయకుడు కలలో కనిపించడంతో ఆయన ఈ విగ్రహాన్ని నెలకొల్పాడని స్థానికుల కథనం. దీని ఎత్తు 6 మీటర్లు. ఇది ప్రపంచంలోని అతి ఎత్తయిన వినాయక విగ్రహాలలో మూడవ స్థానంలో నిలుస్తుంది. శ్రీలంకలోని హిందువులే కాకుండా, విదేశీ పర్యాటకులు కూడా ఈ విగ్రహాన్ని సందర్శించుకుంటూ ఉంటారు.

త్రినేత్ర గణపతి
వినాయకుడి తండ్రి పరమశివుడు ముక్కంటి అని అందరికీ తెలుసు. మూడు కన్నులతో వినాయకుడు కొలువుదీరిన అరుదైన ఆలయం రాజస్థాన్‌లో ఉంది. రణథాంబోర్‌ కోట ప్రాంగణంలో ఉన్న ఈ త్రినేత్ర గణపతి ఆలయం క్రీస్తుశకం పన్నెండో శతాబ్ది నాటిది. రణథాంబోర్‌ కోటను కేంద్రంగా చేసుకుని పాలించిన రాజు హమీర్‌ వినాయకుడికి వీరభక్తుడు. ఆయన యుద్ధాలకు వెళ్లేటప్పుడల్లా ముందుగా ఈ త్రినేత్ర గణపతికి ప్రత్యేక పూజలు జరిపించి మరీ బయలుదేరేవాడట! 

ఈ ఆలయానికి చేరుకోవాలంటే, కోటలో నిర్మించిన రెండువందల యాభై మెట్ల మీదుగా మెట్ల మార్గం ఉంది. కోట లోపలి వైపునే అర కిలోమీటరు కాలిబాట కూడా ఉంది. ఈ ఆలయంలో ఇక్కడి త్రినేత్ర గణపతి తన భార్యలు సిద్ధి, వృద్ధి; కొడుకులు శుభ లాభాలతో కలసి కొలువుదీరడం విశేషం. వినాయకుడు ఇలా సకుటుంబంగా కొలువుదీరిన ఏకైక ఆలయం ఇదొక్కటే!

కలువా వినాయకుడు
ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన వినాయక ఆలయం. ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని హిమాలయ పర్వత ప్రాంతంలో రూప్‌కుండ్‌– నందాదేవి పర్వతారోహక యాత్రకు వెళ్లే మార్గంలో ఈ ఆలయం ఉంది. ‘కలువా’ వినాయక ఆలయం లేదా ‘కేల్వా’ వినాయక ఆలయంగా పేరుపొందిన ఈ ఆలయం సముద్ర మట్టానికి 14,500 అడుగుల ఎత్తున ఉంది. 

మంచుకొండల్లో ఒక కొండ మీద ఉన్న ఈ ఆలయం చాలా చిన్నది. దీని ఎత్తు కేవలం అరడుగులు. ఈ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తే కోరిక కోరికలు ఈడేరుతాయని భక్తులు నమ్ముతారు. పర్వతారోహకులు తప్ప సామాన్యులు ఈ ఆలయాన్ని సందర్శించడం దుస్సాధ్యం.

(చదవండి: గిన్నిస్‌లో గణపయ్య..)
 

బ్రొమో గణపతి
పురాతనమైన ఈ గణపతి విగ్రహం ఇండోనేసియాలో ఉంది. తూర్పు జావాలోని టెంగెర్‌ పర్వతాలకు చెందిన ‘బొమో’ అగ్నిపర్వత శిఖరంపై కొలువైన ఈ విగ్రహం ఏడు శతాబ్దాల నాటిది. ‘బ్రహ్మ’ను జావా హిందువులు స్థానిక భాషలో ‘బ్రొమో’ అంటారు. బ్రహ్మదేవుడి పేరిట ఈ అగ్నిపర్వతాన్ని ‘బ్రొమో’ అని పిలుచుకుంటారు. 

జావాలోని టెంగెరీ తెగకు చెందిన వారు ఇక్కడ వినాయక విగ్రహాన్ని నెలకొల్పినట్లు చెబుతుంటారు. సముద్ర మట్టానికి ఏడువేల అడుగుల ఎత్తులో ఉన్న ఈ విగ్రహానికి పూజలు చేసేందుకు జావా ప్రజలు పర్వతారోహణ చేస్తుంటారు. ఈ వినాయకుడు తమను అగ్నిపర్వతాల పేలుడు నుంచి, ప్రకృతి విపత్తుల నుంచి కాపాడతాడని జావా ప్రజల నమ్మకం. 

(చదవండి: గిన్నిస్‌లో గణపయ్య..!)


 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
ganesh chaturdhi
Ganesh
Vinayaka
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

అదంతా అబద్ధం.. జ్ఞానేశ్వరి తండ్రి కీలక వ్యాఖ్యలు

అదంతా అబద్ధం.. జ్ఞానేశ్వరి తండ్రి కీలక వ్యాఖ్యలు

తండ్రి ప్రాణం తీసిన నాటుకోడి కూర

తండ్రి ప్రాణం తీసిన నాటుకోడి కూర

బాధితుల నరకయాతన.. సర్కారు కాలయాపన

బాధితుల నరకయాతన.. సర్కారు కాలయాపన

దేవుడా.. ఏంటీ దుస్థితి!

దేవుడా.. ఏంటీ దుస్థితి!

ఆగని కల్తీ పాల మరణాలు

ఆగని కల్తీ పాల మరణాలు

మూగజీవాలపై ‘పైసా’చికత్వం

మూగజీవాలపై ‘పైసా’చికత్వం

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.