Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

వివక్షకు తిరగమోత పెడదాం

Family Sakshi User Sakshi Sakshi Time Mar 11, 2026 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
wom44.jpg

ఇళ్లల్లో రోజువారీ వంటచేసేది మహిళలే అయినా, బయట మాత్రం పాకనిపుణులుగా పురుషులే రాణిస్తూ వస్తున్నారు. ఇప్పటికీ షెఫ్‌లుగా పేరుపొందిన వారిలో పురుషులే ఎక్కువగా ఉన్నా, నెమ్మదిగా పరిస్థితులు మారుతున్నాయి.  ఈ రంగంలోకి మహిళలు మరింతగా రావాల్సి ఉంది. ఇప్పుడిప్పుడే మహిళలు షెఫ్‌లుగా రాణిస్తూ ఉన్నా, ఈ రంగంలో మహిళా షెఫ్‌ల పట్ల వివక్ష ఇంకా కొనసాగుతూనే ఉంది. నేను వృత్తిరీత్యా ఆర్కిటెక్ట్‌ని అయినా, అమెరికాలో ఉన్నప్పుడు అనివార్యంగా వంట చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

క్రమంగా వంటలపై ఆసక్తి పెరిగి, షెఫ్‌గా మారాను. మాది అనకాపల్లి. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి బీఆర్క్, ఐఐటీలో ఎంఆర్క్‌ చేశాను. మాస్టర్స్‌ కోసం అమెరికా వెళ్లినప్పటి నుంచి నాకు వంటపై ఆసక్తి పెరిగింది. ఇండియాకి తిరిగి వచ్చేశాక ఒకవైపు ఆర్కిటెక్ట్‌గా పనిచేస్తూనే, మరోవైపు హోమ్‌ షెఫ్‌గా షెరటాన్, మేరియట్‌లాంటి హోటళ్లలో; ఇంట్లో ఓనం సధ్యలాంటివి హోస్ట్‌ చేయడం మొదలుపెట్టాను. 

పలు ఫైవ్‌ స్టార్‌ హోటల్స్‌లో తెలుగు వంటల ఈవెంట్స్‌ చేశాను. ఈ రంగంలోకి వచ్చిన మొదట్లో కొన్ని ఇబ్బందులూ ఎదుర్కొన్నాను. అమ్మాయినని చిన్నచూపు చూసేవారు. వెళ్లిన ప్రతిచోటా అమ్మాయిలు షెఫ్‌గా ఉన్నా, తొక్కేయాలనే చూస్తారు. అయితే, నా ప్రతిభా సామర్థ్యాల మీద నాకు నమ్మకం ఉంది.
మీరా గిరిజ తాడిమేటి షెఫ్‌

వివక్ష ఇంకా పోలేదు..
అది 2000 సంవత్సరం. నేను వరంగల్‌లో ఒక గవర్నమెంట్‌ స్కూల్‌లో ఆడపిల్లలకు క్లాస్‌ చెబుతున్నాను. ఒక అమ్మాయి ఏడ్చుకుంటూ నా క్లాస్‌లోకి అడుగుపెట్టింది. ఏమైందని అడిగితే, కాలి మీద కాల్చిన వాత చూపించింది. గిన్నెలు కడగలేదని వాళ్ల నాన్న పొయ్యిలోని కట్టె తీసి కాల్చాడని చెప్పింది. వెంటనే అమ్మాయిని తీసుకుని వాళ్ల ఇంటికి వెళ్లాను. వాళ్ల అమ్మా నాన్నలు నన్ను చూసి ఆశ్చర్యపోయారు. ‘ఆడపిల్లను అలా కాలుస్తావా?’ అని వాళ్ల నాన్నను అడిగాను. ఆయన చాలా క్యాజువల్‌గా ‘తప్పేముంది, పని చేయకపోతే ఆడపిల్ల ఎందుకు?’ అని అడిగాడు. ఆడపిల్ల ఎందుకు చదువుకోవాలో వివరంగా చెప్పాను. చివరకు తప్పయిందని ఒప్పుకున్నాడు. ఇకపై స్కూలుకు పంపిస్తానని చెప్పాడు. 

ఈమధ్య నేను గోవాకు వెళ్లాను. అక్కడ బీచ్‌కి వెళ్లాం. నాకు ఒక దృశ్యం కనిపించింది. ఒక తండ్రి పదేళ్ల పాపను తిడుతూ, కాళ్లతో వెనకవైపు తంతున్నాడు. నేను వెళ్లి ఆ తండ్రిని అడిగేలోపే జనంలో కలిసిపోయారు. ఇన్నాళ్లలో ఆడపిల్లల జీవితాలు ఏమీ మారలేదు కదా అనిపించింది.
నేను గత 26 సంవత్సరాలుగా ఆడపిల్లలు, మహిళల అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలను చేస్తూ వస్తున్నాను. నేను 2000 సంవత్సరంలో నా సంస్థ మొదలుపెట్టినప్పుడు ఆడపిల్లలపై వివక్ష, భ్రూణహత్యలు, ఎనీమియా, పౌష్టికాహార లోపం, బాల్యవివాహాలు, బాల కార్మికులు, ఆడపిల్లలపై అత్యాచారాలు తదితర ఎన్నో అంశాలపై పనిచేయాల్సి వచ్చింది. 

ఆడపిల్లలను వద్దనుకుని, చెత్తకుండీలలో పడేస్తున్నప్పుడు ఆస్పత్రులు, బస్టాండ్లు, అంగన్వాడీ కేంద్రాలలో ‘తరుణి’ ఊయలలు పెట్టి, ఆడపిల్లలను రక్షించగలిగాం. ఎన్నో వేల బాల్యవివాహాలను ఆపగలిగి,ఆ ఆడపిల్లలను మళ్లీ చదువులో పెట్టగలిగాం. మేం 2004లో జాతీయ మానవ హక్కుల కమిషన్‌లో వేసిన ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఫలితంగా బాల్యవివాహ నిరోధక చట్టం–2006 వచ్చింది. 

బాలికలపై లైంగిక అత్యాచారాలను నిరోధించడానికి అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టాం. తెలంగాణ పోలీసులతో కలిసి భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయగలిగాం. హైదరాబాద్‌లో మొదలైన ఈ భరోసా కేంద్రాలు ఇప్పుడు 33 జిల్లాలకూ విస్తరించాయి. అత్యాచార బా«ధితులైన బాలికల్లో ఆత్మహత్యలు పెరుగుతుండటం చూసి, వారి కోసం తరుణి స్వావలంబన రీహాబిలిటేషన్, స్కిల్‌ సెంటర్‌ను హైదరాబాద్‌లో రెండేళ్లుగా నడుపుతున్నాం.

మహిళల్లో కూడా దురలవాట్లు, సంపాదించగలమనే ధైర్యంతో బాధ్యతారాహిత్యం పెరిగాయి. మహిళల్లో పెరిగిన దురలవాట్లను మాన్పించడానికి ‘సాంత్వన’ డీఅడిక్షన్‌ సెంటర్, అలాగే చంచల్‌గూడ మహిళా జైలులో ‘నివృత్తి’ డీఅడిక్షన్‌ సెంటర్‌ నడుపుతున్నాం. లింగవివక్షను రూపుమాపడానికి మా సంస్థ తరఫున ‘సమదృష్టి’ అనే వేదికను నిర్వహిస్తున్నాం. తరుణి సంస్థ పలు ప్రైవేటు, ప్రభుత్వ ఆఫీసులలో ఎక్స్‌టర్నల్‌ మెంటర్‌గా అంతర్గత కమిటీలలో పనిచేస్తూ, అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. 
డాక్టర్‌ ఆచంట, మమతా రఘువీర్‌, తరుణి స్వచ్ఛంద సంస్థ 

వంటల పుస్తకం రాసిన తొలి మహిళ 
అనా వెకర్‌. జర్మనీలోని న్యూరెంబర్గ్‌కు చెందిన అనా, 1596లో ‘న్యూ డిలైట్‌ఫుల్‌ అండ్‌ యూజ్‌ఫుల్‌ కుక్‌బుక్‌’ రాశారు. ఈ పుస్తకం పలు భాషల్లోకి అనువాదం పొంది ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. ఇళ్లలో రోజువారీ వండుకునే వంటకాలు, ప్రత్యేక వంటకాలు, వంటకాల రుచిని పెంచే చిట్కాలను ఇందులో విపులంగా రాశారు. వంటకాల రచన మాత్రమే కాకుండా, అనా వెకర్‌ అరుదుగా కొన్ని కవితలు కూడా రాశారు.

నిర్మలా రెడ్డి

(చదవండి: ‘ఆమె’ ఆరోగ్యమే... సమాజ ఆరోగ్యం!)

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Womens Day
Funday
kitchen
Cooking
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఇది సాధారణ బొమ్మ కాదు.. మినీ రోబో స్నేహితుడు!

ఇది సాధారణ బొమ్మ కాదు.. మినీ రోబో స్నేహితుడు!

ఆన్‌ చేస్తే టీవీ.. ఆఫ్‌ చేస్తే ఆర్ట్‌ గ్యాలరీ.. అద్భుతం!

ఆన్‌ చేస్తే టీవీ.. ఆఫ్‌ చేస్తే ఆర్ట్‌ గ్యాలరీ.. అద్భుతం!

గర్విష్టి గజరాజు

గర్విష్టి గజరాజు

వైరస్‌ పుట్టకముందే అంత్యక్రియలు! ఏఐ వ్యాక్సిన్‌ ప్రయోగం..

వైరస్‌ పుట్టకముందే అంత్యక్రియలు! ఏఐ వ్యాక్సిన్‌ ప్రయోగం..

కుక్కయినా హక్కుంది... దానికో లెక్కుంది!

కుక్కయినా హక్కుంది... దానికో లెక్కుంది!

అష్టావక్రుడి పూర్వజన్మ వృత్తాంతం

అష్టావక్రుడి పూర్వజన్మ వృత్తాంతం

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.