Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

చదువుకున్న సముద్రపు చేప

Family Sakshi User Sakshi Sakshi Time Jan 19, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
subhiksha-1.jpg

భిన్న మార్గం

బావుల్లో ఉండిపోతారు కొందరు. తెలిసిన కుంటల్లోనే మునకలేస్తారు కొందరు.
మహా అయితే చెరువు గురించి ఆలోచిస్తారు కొందరు.
కాని అతి కొందరు మాత్రమేసముద్రాన్ని జయించాలనుకుంటారు. వృత్తిరీత్యా బెస్త కుటుంబంలో పుట్టిన సుభిక్ష ఇంగ్లిష్‌ లిటరేచర్‌ చదివి నగరంలో ఉద్యోగం చేసినా
ఎందుకు తన వృత్తిలోనే రాణించకూడదు అని ఆలోచించింది. అంతే... తానే చేపల వేటలో దిగి ‘సీఫుడ్‌ అంట్రప్రెన్యూర్‌’గా దేశాన్ని ఆకర్షిస్తోంది.

సముద్రానికి కెరటాలతో అదిలించడం తెలుసు. వలల కొద్ధి చేపల్ని నింపి సిరులను అందించడం కూడా తెలుసు. ‘సముద్రం తల్లిలాంటిదే. మమకారం, కోపం రెండూ ఉంటాయి. భయభక్తులతో ఉంటే ఏది అడిగినా కాదనకుండా ఇస్తుంది’ అంటుంది సుభిక్ష. ఈ 23 ఏళ్ల అమ్మాయి తమిళనాడులోని తూత్తుకూడి సమీపంలో ఉన్న పెరియతలై అనే బెస్తపల్లె నుంచి ఇవాళ దేశాన్ని ఆకర్షిస్తోంది. మగవాళ్లకే పరిమితమైన చేపలు పట్టే విద్యలో ఆ అమ్మాయి రాణించడమే కాదు తన చదువును ఆ విద్యకు జత చేసి ఆదాయ మార్గాలను నిర్మిస్తోంది.

ఒడ్డు నుంచి సముద్రానికి...
మగవాళ్లు చేపలు పడతారు. వాటిని స్త్రీలు గట్టున కూచుని అమ్ముతారు. ఇదే ఆనవాయితీ. తరాలుగా ఇదే సాగుతోంది. సుభిక్ష తండ్రి కుమార్, అన్న లియాండర్‌ కూడా వాళ్లింట్లో సముద్రం మీద వేటకు వెళ్లి చేపలు తెస్తారు. తల్లి వాటి అమ్మకంలో సాయం చేస్తుంది. ‘నేనెందుకు చేపలు పట్టడానికి మీతో రాకూడదు?’ అని అడిగింది సుభిక్ష ఒకరోజు తండ్రిని. తండ్రి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే సుభిక్ష ఇంగ్లిష్‌ లిటరేచర్‌ చదివింది. 

ప్రయివేట్‌ బ్యాంకులో ఉద్యోగం కూడా చేస్తోంది. ఆడపిల్ల సౌకర్యంగా బతకాలంటే ఆమెలాంటి మార్గమే అందరూ సూచిస్తారు. ‘సముద్రంలో ఎంతో ఉంది. టెన్‌ టు ఫైవ్‌ జాబ్‌లో ఏముంది? నన్నొక ప్రయత్నం చేయనివ్వు నాన్నా’ అంది సుభిక్ష. అప్పటికే ఆ అమ్మాయికి సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ ఉంది. మత్స్యకారుల జీవనాన్ని సరదాగా వీడియోల్లో చూపేది సుభిక్ష. ఇప్పుడు ఆ అమ్మాయి సిసలైన బెస్త జీవనంలోకి దిగింది.

సముద్రంతో చెలగాటం...
‘కోరమాండల్‌ తీరంలో సముద్రంతో దిగడం అంటేప్రాణాలతో చెలగాటమే’ అన్నాడు సుభిక్ష తండ్రి చివరకు ఒప్పుకుంటూ. మొదటిసారి తండ్రి, అన్నతో కలిసి ఫైబర్‌ బోట్‌లో చేపల వేటకు సుభిక్ష వెళ్లిన అనుభవం గగుర్పాటుకు గురి చేసేదే. ‘ఆకాశంలో చుక్కలు తప్ప వేరే ఏమీ కనిపించని చీకటి. పడవను కుదురుగా ఉంచకుండా ఎత్తెత్తి వేసే సముద్రం. మేము దాదాపు 20 కిలోమీటర్ల లోపలికి వెళ్లాం. అక్కడ ఏమైనా జరగొచ్చు. 

కాని ఆ సమయంలో చేపల వేటకు వెళ్లి వల విసరడం గొప్ప అనుభవం’ అంది సుభిక్ష. ఆ రోజు నుంచి నేటి వరకు అనేకసార్లు రాత్రి 1 గంటకు వేటకు వెళ్లి ఉదయం 10 గంటలకు తిరిగి రావడం సుభిక్షకు అలవాటుగా మారింది. ‘చేపలు పట్టడానికి ఏయే వలలు వాడాలి... ఏ వల వేస్తే ఏ రకం చేపలు పడతాయనేది తెలుసుకున్నాను. ఇంకా పల్లెపల్లెకు తిరిగి చేపల వేటలో మా పూర్వికుల అనుభవం తెలుసుకుంటున్నాను’ అంటుంది సుభిక్ష. ఆమె తన వేటను మొదలెట్టాక అదంతా వీడియోలు చేసేసరికి ప్రపంచానికి తెలిసిపోయింది.

పెరిగిన వ్యాపారం
చేపలు పడితే టోకున ఎక్స్‌పోర్టర్లకు అమ్మడం లేదా లోకల్‌గా అమ్మడం లేదా ఎండబెట్టి అమ్మడం తెలిసిన సంప్రదాయ పద్ధతికి భిన్నంగా సుభిక్ష తమ చేపలను ఊరగాయలుగా, పచ్చళ్లు, ఎండు చేపలుగా మార్చి వాటిని తన లేబుల్‌ కింద అమ్మకానికి పెట్టింది. సోషల్‌ మీడియా వల్ల వాటిని దేశ విదేశాల్లో కొంటున్నారు. అలా మెల్లగా సుభిక్ష ‘సీఫుడ్‌ అంట్రప్రెన్యుర్‌’గా మారింది. తండ్రి, అన్న ఈ పరిణామాలను స్వాగతిస్తున్నారు. 

ఊళ్లో అందరూ సుభిక్షను మెచ్చుకోలుతో చూస్తున్నారు. ‘చేపలంటేప్రొటీన్‌తో నిండిన రిచ్‌ఫుడ్‌. ప్రజలకు ఆ ఫుడ్‌ను అందించడానికి బెస్తలు ఎంత కష్టం చేస్తారో... ప్రమాదంలోకి వెళతారో లోకానికి చూపడమే నా లక్ష్యం. అలాగే మత్స్యకార స్త్రీలను మరింత ముందుకు తీసుకు వెళ్లడం కూడా’ అంటోంది సుభిక్ష. ఒకవైపు ఈ పని చేస్తూనే మరోవైపు మోడల్‌గా కూడా పని చేస్తోంది. సంప్రదాయ విద్యలని గౌరవిస్తూ ఆధునిక ధోరణులను పుణికి పుచ్చుకుంటూ ముందుకు సాగితే విజయం తథ్యం అని నిరూపించింది సుభిక్ష.                 
 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
subhiksha
English literature
Women Entrepreneur
tamil nadu
thoothukudi
Woman
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

వివాదాల నేపథ్యంలో.. విజయ్‌ సంచలన నిర్ణయం

వివాదాల నేపథ్యంలో.. విజయ్‌ సంచలన నిర్ణయం

విజయ్‌ ఆకస్మిక తనిఖీ.. ఉలిక్కిపడ్డ అధికారులు!

విజయ్‌ ఆకస్మిక తనిఖీ.. ఉలిక్కిపడ్డ అధికారులు!

ఆలస్యం.. సమస్యాత్మకం..!?

ఆలస్యం.. సమస్యాత్మకం..!?

విజయ్ బర్త్ డే స్పెషల్.. తెరపై 'దళపతి' ఇప్పుడేమో 'ముఖ్యమంత్రి' (ఫొటోలు)

విజయ్ బర్త్ డే స్పెషల్.. తెరపై 'దళపతి' ఇప్పుడేమో 'ముఖ్యమంత్రి' (ఫొటోలు)

తమిళనాడులో టోర్నడో బీభత్సం.. భారత్‌లోనే అరుదైన ఘటన

తమిళనాడులో టోర్నడో బీభత్సం.. భారత్‌లోనే అరుదైన ఘటన

అతడు అరవడు.. హంగామా చేయడు.. సునామీలా ప్రభావం చూపిస్తాడు!

అతడు అరవడు.. హంగామా చేయడు.. సునామీలా ప్రభావం చూపిస్తాడు!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.