Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

నో గాసిప్స్‌ ప్లీజ్‌! ఎవరైనా గాసిప్‌ ప్రారంభించగానే.. ఇలా చేయండి!

Family Sakshi User Sakshi Sakshi Time Jun 13, 2026 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
3535.jpg

మనం జీవితంలో రెండు విషయాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. వీటిలో చాడీలు చెప్పడం ఒకటైతే నిందలు వేయడం రెండోది. ఎదుటి వ్యక్తి గురించి చాడీలు చెప్పినా, నిందలు వేసినా.. మనం దిగజారిపోయినట్టే! కనుక మనం మాటను ఆచితూచి ఉపయోగించాలి లేదంటే చేజేతులా ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టే! 

మన స్నేహితులతోనో, బంధువులతోనో, సన్నిహితులతోనో మాట్లాడేటప్పుడు మన దగ్గర లేని వ్యక్తి గురించి ఏది పడితే అది మాట్లాడటం మంచిది కాదు. ఇలాంటి ధోరణి హత్యతో, అత్యాచారంతో సమానమని, ఇతరుల గురించి విపరీతంగా అసూయపడే వారే ఇలాంటి ఇచ్చకాల మాటలకు పాల్పడుతుంటారని రామాయణం, మహాభారతంతో సహా పురాణాలన్నీ నొక్కి చె΄్పాయి. ప్రపంచంలోని దాదాపు అన్ని మతాలూ ఈ ధోరణిని తీవ్రంగా ఖండించాయి. ఎటువంటి ఆధారం లేకుండా ఇతరుల దోషాలను, లోపాలను, తప్పిదాలను వేలెత్తి చూపిస్తూ మాట్లాడడాన్ని మహాపాపంగా బైబిల్‌ పరిగణించింది. ఇటువంటి వ్యక్తుల్ని ఎటువంటి పరిస్థితుల్లోనూప్రోత్సహించవద్దని, చేరదీయవద్దని  గట్టిగా హెచ్చరించింది. ఇలా ఇచ్చకాలు మాట్లాడడాన్నే ఆంగ్లంలో గాసిప్స్‌ అని వ్యవహరిస్తారు.
 

గాసిప్‌ మాట్లాడటం అంటే  ఉత్తి పుణ్యానికి ఇతరుల మీద బురద చల్లడం, ఇతరుల ప్రతిష్టను, గౌరవ మర్యాదలను దిగజార్చే విధంగా వ్యాఖ్యలు చేయడం. ఇది  సమాజానికి, వ్యక్తిగత జీవితానికి కూడా శ్రేయస్కరం కాదని మహాభారతంలో విదురుడు చె΄్పాడు. ఇతరుల గురించి పొరపాటున తప్పుగా మాట్లాడినప్పుడు వెంటనే పశ్చాత్తాపం వ్యక్తం చేయడం ఒక్కటే దీనికి పరిహారమని బైబిల్‌ స్పష్టం చేసింది. ఇతరుల పరోక్షంలో వారి గురించి చెడుగా మాట్లాడే వ్యక్తి నరకాలకు వెళతాడని, హీనమైన జన్మ ఎత్తుతాడని మహాభారతం పేర్కొంది.

కనుక పనికి రాని ఇచ్చకాలు ఎప్పటికీ ప్రమాదమే. అది సంబంధాలను దెబ్బతీయడమే కాకుండా మన శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కూడా నాశనం చేస్తుంది.  చెత్త ఆలోచనలు ,  చెత్త కబుర్లు మాట్లాడడం వల్ల అవి  మనలోనిప్రాణశక్తిని హరించి వేయడమే  కాకుండా మన జీవితంలో విలువైన సమయం వధా కావడానికి దోహదపడతాయి.

పుకార్ల వల్ల చోటుచేసుకునే పరిణామాలు అత్యంత ప్రమాదకరంగా,ప్రాణాంతకంగా ఉంటాయి.  గాసిప్‌లో మునిగి తేలే వ్యక్తి ఎటువంటి దారుణానికైనా ఒడిగడతాడు. గాసిప్స్‌కు పాల్పడే వ్యక్తి తాను మానసికంగా చెడిపోవడమే కాకుండా, ఇతరులను కూడా మానసికంగా చెడగొడతాడు.అంతేకాదు అతను వ్యాప్తి చేసే పుకార్ల వల్ల సమాజానికి తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ‘గాసిప్స్‌ వల్ల నిజం మరుగున పడిపోతుంది. అదొక కార్చిచ్చు లాంటిది. అది తన చుట్టూరా ఉన్న సమాజాన్ని దహించి వేస్తుంది. అది విషంతో సమానం.

మనసులో ద్వేషాన్ని నింపుకున్న వాడే గాసిప్స్‌ను వ్యాప్తి చేస్తాడు. ఇటువంటి పనికిమాలిన కబుర్లు చెప్పడం ఎంత టైమ్‌ వేస్టో, వాటిని వినడం,ప్రోత్సహించడం కూడా అంతకన్నా ఎక్కువ టైమ్‌ వేస్ట్, ఇటువంటి వాటిని ఎంత దూరంగా ఉంచితే అంత మంచిదని వ్యక్తిత్వ వికాస నిపుణులు చెబుతున్నారు. స్నేహితులు కానీ, బంధువులు కానీ ఇటువంటి గాలికబుర్లు చెప్పడంప్రారంభించగానే వాటిని తిరస్కరించడమో లేక వారిని ఆపు చేయడమో  చేయాలి. లేదంటే అది కొన్ని సున్నితమైన గుండెల్ని బద్దలు చేయవచ్చు. మనసుల్ని, మనుషుల్ని కుప్పకూల్చవచ్చు. చివరకు మన వ్యక్తిత్వాన్నే సర్వనాశనం చేస్తుంది. నిస్సహాయుల్ని దారుణంగా దెబ్బతీస్తుంది’’ ఇటువంటి వ్యక్తుల్నిప్రోత్సహించే వారిని, చేరదీసే వారిని సైతం ఆ నీలినీడలు వెంటాడుతూనే ఉంటాయి.

కేవలం మన పట్ల మనం మాట్లాడుకునే మాటలే ఎంతో ప్రభావం చూపిస్తే.. మరి మనం ఇతరుల జీవితాలకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను వారు లేనప్పుడు వారి గురించి మాట్లాడటం ఎంతటి ప్రభావం చూపిస్తాయో ఆలోచించాలి.

ఎవరైనా గాసిప్‌ ప్రారంభించగానే ఆ వ్యక్తి అంత హితమైన వ్యక్తి కాదని వెంటనే గ్రహించాలి. మనసు నిండా కుళ్లుతోనూ, అసహనంతోనూ, అంతకుమించిన అసూయతోను అలాంటి గాలిమాటలు చెబుతున్నాడని అర్థం చేసుకుని అటువంటి వ్యక్తిని ఎటువంటి పరిస్థితుల్లోనూ దగ్గరకు రానివ్వకపోవడం మంచిది. ఏది ఏమైనా, గాసిప్‌ మాట్లాడే వ్యక్తి తనను తాను దుర్మార్గుడిగా పరిచయం చేసుకుంటున్నాడని అర్థం చేసుకోవాలి.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Gossip
suggestions
Life style
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

కొన్ని తలనొప్పులను.. సీరియస్‌గా తీసుకోవాల్సిందే! లేదంటే..

కొన్ని తలనొప్పులను.. సీరియస్‌గా తీసుకోవాల్సిందే! లేదంటే..

సాగుబడి: ‘బయో’ విత్తన పూతతో 25% అధిక దిగుబడి!

సాగుబడి: ‘బయో’ విత్తన పూతతో 25% అధిక దిగుబడి!

ట్రావెలర్స్‌ వద్ద ఉండాల్సిన 3 గ్యాడ్జెట్స్‌ ఇవే..

ట్రావెలర్స్‌ వద్ద ఉండాల్సిన 3 గ్యాడ్జెట్స్‌ ఇవే..

ఆన్‌ చేస్తే టీవీ.. ఆఫ్‌ చేస్తే ఆర్ట్‌ గ్యాలరీ.. అద్భుతం!

ఆన్‌ చేస్తే టీవీ.. ఆఫ్‌ చేస్తే ఆర్ట్‌ గ్యాలరీ.. అద్భుతం!

వైరస్‌ పుట్టకముందే అంత్యక్రియలు! ఏఐ వ్యాక్సిన్‌ ప్రయోగం..

వైరస్‌ పుట్టకముందే అంత్యక్రియలు! ఏఐ వ్యాక్సిన్‌ ప్రయోగం..

కంఫర్ట్‌ ఫుల్‌... స్టయిల్‌ డబుల్‌!

కంఫర్ట్‌ ఫుల్‌... స్టయిల్‌ డబుల్‌!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.