Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
search Subscribe Subscribe Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ Live TV లైవ్ టీవీ
download app యాప్ download app Download App
మమ్మల్ని అనుసరించండి
  • facebook
  • x
  • instagram
  • youtube
  • whatsapp
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫొటోలు
  • వీడియోలు
  • close logo
  • search
    Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ download app యాప్

    విభాగాలు

  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • మమ్మల్ని అనుసరించండి

    facebook x instagram youtube whatsapp whatsapp whatsapp
  • Sakshi Search
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. అక్షరం..అపు రూపం..
ADVERTISEMENT

అక్షరం..అపు రూపం..

Family Sakshi User Sakshi Sakshi Time Feb 3, 2025 09:26 AM IST Sakshi Read Time Read Time: 4 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Google
645455.jpg

 రాయడం మర్చిపోతున్న ఆధునికులు

అన్నింటికీ కీప్యాడ్‌ మంత్రమే జపిస్తున్న వైనం

రాతకు సాధనే శరణ్యమంటున్న గ్రాఫాలజిస్ట్‌లు

టెక్నాలజీ రాకతో వాయిస్‌ టైపింగ్‌ వైపు దృష్టి

 అవసరార్థం రాయాల్సి వస్తే తప్పని అవస్థలు  

‘సార్‌.. నా రాత ఒకప్పుడు ముత్యాలు పేర్చినట్టుండేది. ఇప్పుడు కోడి కెలికినట్టు ఉంటోంది’.. ‘మేడమ్‌.. ప్లీజ్, అర్జెంట్‌గా నా రైటింగ్‌ స్టైల్‌ బాగవ్వాలి.. లేకపోతే చెక్‌బుక్‌ మీద సంతకం కూడా సరిగా రావడం లేదు’.. ‘అమ్మో.. నాలుగు పేజీలు రాయాలట.. నా వల్ల కావడం లేదు. ఎప్పుడో కాలేజీ రోజుల్లో అంటే ఓకే. ఇప్పుడు రాయడం ఎంత కష్టంగా ఉందో’ ఇలాంటి అభ్యర్థనలతో హ్యాండ్‌ రైటింగ్‌ నిపుణులను సంప్రదిస్తున్నవారు నగరంలో పెరిగారు. చేతిరాత అధ్వాన్నంగా మారిందని కొందరు, నాలుగులైన్లు రాస్తే చేతులు నొప్పులు పుడుతున్నాయని మరికొందరు.. ఇలా రకరకాల సమస్యలను ఎదుర్కొంటూ నగరవాసులు రైటింగ్‌ డాక్టర్స్‌/ గ్రాఫాలజిస్ట్‌లను కలుస్తున్నారు. ‘గతంలో చిన్నపిల్లలు, కాలేజీ విద్యార్థులు మాత్రమే తమ రైటింగ్‌ స్కిల్స్‌ను మెరుగుపరచాలని వచ్చేవారు. ఇప్పుడు మధ్యవయస్కులు, ఉద్యోగస్తులు, గృహిణులు వస్తున్నారు’ అని చేతిరాత నిపుణులు డాక్టర్‌ రణధీర్‌ కుమార్‌ చెబుతున్నారు.        
                              
ఇచ్చట నేను క్షేమం.. అచ్చట మీరు క్షేమంగా ఉన్నారని భావిస్తా.. ఇలా ఆప్యాయత ఉట్టిపడే అక్షరాలతో అల్లుకున్న అనుబంధాల లేఖలు లేవు. ‘తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు’ అంటూ చూపుల్ని పంచుకున్న ప్రేమలేఖలూ లేవు. ఎందుకంటే.. ఇప్పుడు చేతిరాతలే లేవు.. బుడిబుడి అడుగులు వేసే వయసులో పలక, బలపం చేతబట్టి ‘అ ఆ ఇ ఈ’ లను దిద్దడం నేర్చుకున్నాం. బలపం నుంచి పెన్సిళ్లు, పెన్నులు, కాగితాలు, పుస్తకాలు.. ఇలా అక్షరాలు ఆసీనులయ్యే ఆసనాలు, ఆవిష్కరించే సాధనాలు మారేకొద్దీ.. మన చేతిరాత మరింత మెరుగులు దిద్దుకుంది. మన చేతుల్లో నుంచి ఊపిరి పోసుకున్న గీత మన తలరాతను సైతం దిద్దగలిగింది. అంతటి చరిత్ర ఉన్న అక్షరం ఇప్పుడు వంకర్లు పోతోంది. రాత.. గీత తప్పుతోంది. చేతిరాత చెదిరి ‘పోయేకాలం’ వచ్చేసింది.. డిజిటల్‌ కోరల్లో చిక్కిన చేతిరాత.. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. 

రాస్తున్నాం కానీ.. రాత ఏదీ.. 
మనం పేపర్‌ మీద పెన్ను పెట్టి ఎన్ని రోజులైంది? బహుశా కొన్ని నెలలు గడిచినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో కదా? ఒక్కసారి సెల్ఫ్‌ చెక్‌ చేసుకుంటే మనకే అర్థమవుతుంది. చేతిరాతకు ఎంతగా దూరమవుతున్నామో.. ఒకప్పటికన్నా ఇప్పుడే మనం ఎక్కువగా రాస్తున్నాం. అయితే పెన్నుతోనో.. పెన్సిల్‌తోనో కాదు. కేవలం కీబోర్డ్‌తోనే అనేది అక్షర సత్యం. కంప్యూటర్‌ కావచ్చు, మొబైల్స్‌ కావచ్చు.. ఇవన్నీ చేతిరాత అంతాన్నే కోరుతున్నాయి. పచారీ సామాన్ల జాబితా నుంచి సమావేశంలో నోట్స్‌ రాసుకోవడం వరకూ.. పుట్టిన రోజు శుభాకాంక్షల నుంచి పోయిన రోజు సంతాప సందేశాల వరకూ అన్నీ టెక్ట్స్‌ మెసేజ్‌లో, మెయిల్స్, మరొకటో  దీంతో రాయాల్సిన అవసరం రోజురోజుకూ తగ్గిపోతోంది. ఫలితంగా అష్టకష్టాలూ పడి నేర్చుకున్న ‘మనదైన’ చేతిరాత మనల్ని వీడిపోతోంది. చరిత్ర చూసుకుంటే చేతిరాత పత్రాలు సృష్టించిన ఎన్నో అద్భుతాలు కనిపిస్తాయి. ప్రేమలు అంకురించడం దగ్గర్నుంచి యుద్ధాలు ప్రారంభించడం వరకూ సమస్యలు పరిష్కరించడం దగ్గర్నుంచి శాంతి నెలకొల్పడం వరకూ సంచలనాలను సృష్టించడం దగ్గర్నుంచి స్వేచ్ఛా స్వాతం్రత్యాలు అందించడం వరకూ.. అన్నిట్లో చేతి రాత పత్రాల ప్రాధాన్యత మనకు స్పష్టంగా కనబడుతుంది.

‘రైట్‌’ ఈజ్‌ బ్రైట్‌.. 
హ్యాండ్‌ రైటింగ్‌ బావున్నంత మాత్రాన నాలుగు మార్కులు పడితే పడతాయేమో.. అంతకు మించి ఏం లాభంలే.. అని తీసి పారేసే విషయం కాదిది. కార్పొరేట్‌ కంపెనీలు, బహుళజాతి సంస్థలు.. ఉద్యోగులను నియమించుకునే సమయంలో వారి విద్యార్హతలు, ప్రవర్తనా తీరుతెన్నులతో పాటు వ్యక్తి చేతిరాతను తద్వారా వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తూ.. పనితీరును, సామర్థ్యాలను విశ్లేíÙంచి అనంతరం ఉద్యోగిగా అవకాశం ఇవ్వడం ఇప్పుడు నగరంలోని కార్పొరేట్‌ కల్చర్‌లో సర్వ సాధారణం. చేతిరాతను విశ్లేíÙంచేందుకు దాదాపు ప్రతి కంపెనీ ఒక గ్రాఫాలజిస్ట్‌ను అందుబాటులో ఉంచుకుంటోందంటే సంస్థలు ఈ విషయానికి ఇస్తున్న ఇంపార్టెన్స్‌ ఏమిటో తెలుస్తుంది.

చేతిరాతతో చెప్పుకోదగ్గ విజయాలు.. 
చేతిరాత మార్చుకునే ప్రక్రియ మన జీవనశైలిని కూడా మార్చుకునేందుకు ఉపకరిస్తుందని గ్రాఫాలజిస్ట్‌లు చెబుతున్నారు.  సహజంగా వచ్చే కొన్ని ప్రవర్తనాలోపాలను రాసే తీరుతో మార్చుకోచ్చని స్పష్టం చేస్తున్నారు. విద్యార్థులు రాయడం ద్వారానే చదవడం నేర్చుకుంటారు. కొన్ని పరిశోధనల ప్రకారం రాయడం అలవాటున్నవారి ఆలోచనలు, రాయడం అలవాటు లేనివారితో పోలిస్తే మరింత సృజనాత్మకంగా ఉంటాయి. అదే విధంగా కీబోర్డ్‌తో పోల్చుకుంటే రాసేటప్పుడు బ్రెయిన్‌ పనిచేసే తీరు భిన్న ఫలితాలు అందిస్తుంది. డైరీ రాయడం వల్ల ఒత్తిడి తగ్గుతుందని వ్యాధి నిరోధకత పెరుగుతుందని పరిశోధనల విశ్లేషణ.

రాతే వ్యక్తిత్వానికి దిక్సూచి..  
నిత్య జీవితంలో వాడకం తగ్గడం వల్ల మనం చేతిరాతను మర్చిపోతున్నాం. అకస్మాత్తుగా ఏదైనా అవసరం వస్తే అప్పటికప్పుడు నాలుగు లైన్లు రాయడానికి కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ మమ్మల్ని సంప్రదిస్తున్నవారు ఇటీవల పెరిగారు. చేతిరాత మనిషి వ్యక్తిత్వానికి దిక్సూచి వంటిది. దాన్ని పోగొట్టుకోవడం తెలివైన పనికాదు. అవసరమైన చోట కంప్యూటర్లు వినియోగిస్తూనే రాతను కాపాడుకునే నేర్పును మనం అలవర్చుకోవాలి. 
– డా.రణదీర్‌కుమార్, గ్రాఫాలజిస్ట్‌

సర్వే జనా ‘లిఖి’నో భవంతు.. 
డాక్‌మెయిల్‌ అనే బ్రిటిష్‌ కంపెనీ చేసిన సర్వే పరిశీలిస్తే.. ఆధునికుల్లో సగటున ఓ వ్యక్తి 41 రోజులకు నాలుగులైన్లు రాయాల్సిన అవసరం పడడం లేదట. అలాగే ప్రతి ముగ్గురిలో ఒకరికి ఆరు నెలలపాటు కలం పట్టే ఖర్మే పట్టడం లేదట. ప్రతి ఏడుగురిలో ఒకరు తమ హ్యాండ్‌ రైటింగ్‌ మారిన తీరు తమకే అవమానకరంగా మారిందన్నారు. గత కొంత కాలంగా తమ చేతిరాత గుర్తించదగిన రీతిలో మారిపోయిందని సర్వేలో పాల్గొన్నవారిలో సగం మంది చెప్పారు. ‘చేతిరాత అవసరం తగ్గుతున్నప్పటికీ, టెక్నాలజీతో సంబంధం లేకుండా కూడా కమ్యూనికేట్‌ చేయగల సామర్థ్యాలను ప్రజలు నిలబెట్టుకోవాల్సిందే’ అని డాక్‌మెయిల్‌ కంపెనీ డైరెక్టర్‌ బ్రాడ్‌వే వ్యాఖ్యానించడం గమనార్హం.

చేజారనివ్వకుండా.. 
నిద్రకు ముందు ప్రతి రోజూ కాసేపైనా డైరీ రాయడం అలవాటుగా మార్చుకోండి. 
ఆలోచనలకు ఎప్పటికప్పుడు అక్షరరూపం ఇవ్వడానికి ప్రయతి్నంచండి. 
చిన్న చిన్న కథలు, ఉత్తరాలు స్వయంగా రాయండి. 
మన లక్ష్యాలను, కలలను తరచూ పేపర్‌పై పెడుతుండాలి. 
మనకు బాగా ఇషు్టలైనవారికి చేతిరాతతో శుభాకాంక్షలు పంపడం అలవాటు చేసుకోండి. 
రాయలేక పోతున్నా.. 
చదువుకునేటప్పుడు నా చేతిరాత చాలా బావుండేదని అందరూ మెచ్చుకునేవారు. ఉద్యోగంలో చేరాక రాయాల్సిన అవసరం తగ్గిపోయింది. మధ్య మధ్యలో సరదాగా ఏదైనా రాసినా, నా రాత నాకే నచ్చన మానేశాను. అనుకోకుండా ఈ మధ్యే ఒక కోర్సులో జాయిన్‌ అయ్యి, అక్కడ నోట్స్‌ రాసుకోడానికి నానా కష్టాలు పడ్డాను. పెన్ను సజావుగా కదలడానికి. దాదాపు నెలరోజులు పట్టింది. 
– సిహెచ్‌.వంశీ, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌


 

ADVERTISEMENT
ADVERTISEMENT
tags Tags:
writing
Hyderabad Vibes
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

స్వర్ణోత్సవాలకు ముస్తాబైన భాగ్యనగరం తిరుమలేశుడు..!

స్వర్ణోత్సవాలకు ముస్తాబైన భాగ్యనగరం తిరుమలేశుడు..!

 ఓ వైపు రీల్స్‌ చేస్తూ.. మరోవైపు చిల్‌..

 ఓ వైపు రీల్స్‌ చేస్తూ.. మరోవైపు చిల్‌..

మారని రోగుల తలరాత!

మారని రోగుల తలరాత!

సంక్రాంతి వచ్చేస్తోందంటే..అందాల పతంగుల సందడి మొదలు..!

సంక్రాంతి వచ్చేస్తోందంటే..అందాల పతంగుల సందడి మొదలు..!

ఏఐతో.. 'మెస్సీ'మరైజ్‌! సెల్ఫీ రూ. 10 లక్షలు..

ఏఐతో.. 'మెస్సీ'మరైజ్‌! సెల్ఫీ రూ. 10 లక్షలు..

లెట్స్‌ సింగ్‌..ఫుల్‌ స్వింగ్‌..!

లెట్స్‌ సింగ్‌..ఫుల్‌ స్వింగ్‌..!

  

ADVERTISEMENT
 
 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Jagati Publications Limited.