Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

అత్యంత అరుదైన వ్యాధి: కంటి రెప్పల్లో పేలు..!

Family Sakshi User Sakshi Sakshi Time Nov 9, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
eye_0.jpg

తల్లో పేలు గురించి విన్నాం కానీ, కనురెప్పల్లో పేలు ఉండటం గురించి వినలేదు కదా..!. కనురెప్పల్లో చుండ్రు ఉంటుందని తెలుసగానీ ఇదేంటీ..పేలు ఉండటం అని విస్తుపోకండి. ఎందుకంటే..నిజంగానే ఓ మహిళ కంట్లో ఏకంగా 250 పేలను గుర్తించారు వైద్యులు. తొలుత వైద్యులు సైతం ఆశ్యర్యపోయారు. ఆ తర్వాత ఈ వ్యాధి గురించి క్షుణ్ణంగా తెలుసుకుని మరి చికిత్స అందించి ఆమెకు చక్కటి ఉపశమనం అందించారు. అసలేంటి ఈ సమస్య? ఎందుకు వస్తుంది వంటి వాటి గురించి సవివరంగా చూద్దామా..!

గుజరాత్‌లోని ఆమ్రేలి జిల్లా సావర్‌ కుండ్ల ఆస్పత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. 66 ఏల్ల గీతాబెన్‌ కంటిలో తీవ్రమైన దురద, నొప్పితో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చింది. సూరత్‌కు చెందిన గీతాబెన్‌కు ఈ సమస్య గత రెండున్నర నెలలుగా వేధిస్తోంది. కళ్లు ఎర్రబారిపోవడం, సరిగా నిద్రపట్టకపోవడం వంటి సమస్యలతో సతమతమైంది. దీంతో కంటి డాక్టర్‌ మృగాంక్‌ పటేల్‌ ఆమె కళ్లను పరీక్షించగా.. రెప్పల్లో ఏకంగా పేలు ఉన్నట్లు గుర్తించారు. 

మొదట ఆయన కూడా ఇదేంటని విస్తుపోయారు. ఆ తర్వాత వివిధ అధ్యయన పత్రాలను శోధించి.. ఇలాంటి వింత కేసు గురించి తెలుసుకున్నట్లు తెలిపారు. దీన్ని వైద్య పరిభాషలో ఫిరాయసిస్ పాల్పిబ్రారమ్ అంటారని చెప్పారు. తాము మాగ్నిఫికేషన్ కింద కనురెప్పల్ని పరిశీలించినప్పుడు, పేలు కదులుతున్నట్లు గుర్తించామని అన్నారు. వాటి తోపాటు గుండ్రని పేను గుడ్లను కూడా కనిపించాయని వెల్లడించారు. వీటిని తొలగించాలంటే చాలా సమయం పడుతుందని ముందుగానే బాధిత మహిళకు తెలియజేసి మరి ఆపరేషన్‌కి సిద్ధం చేశారామెను. 

అయితే ఆమెకున్నవైద్య పరిస్థితుల రీత్యా ఎలాంటి ఇంజెక్షన్లు ఇవ్వకుండా ఒక్కొక్కపేనుని ఓపికగా తొలగించారు వైద్యులు. ఈ పరాన్న జీవి కంటి రెప్ప మూయగానే అమాంతం రక్తం తాగేస్తుందట. ఎందుకంటే అక్కడ కణజాలాం చాలా పల్చగా ఉండి, సులభంగా రక్తాన్ని పీల్చేయగలదని అన్నారు. పైగా అక్కడ కనురెప్పలకు అతుక్కుపోయి ఉంటాయట. దీని కారణంగా పేషెంట్‌కి దురద, మంట వస్తుందట. అదీగాక ఇవి తొలగించాలనుకున్నా..అంత తేలిగ్గా రావట కూడా. 

ప్రత్యేక పరికరంతో తొలగింపు ప్రక్రియ..
ఈ పేలు వెలుతురు పడినప్పుడూ కదులుతుంటాయట. కాబట్టి వాటిని తొలగించడానికి మెక్‌ఫర్సన్ అనే ప్రత్యేక పరికరం ఉపయోగించి ప్రతీ పేనుని పట్టుకుని బయటకు తీసినట్లు వివరించారు. అలాగే ఆ మహిళకు నొప్పి తెలియకుండా అనస్థీషియా ఇచ్చాం అని వైద్యుడు మృగాంక్‌ వెల్లడించారు. 

తన 21 ఏళ్ల అనుభవంలో ఇలాంటి కేసు మొట్టమొదటిదని, అస్సలు ఎప్పుడూ ఇలాంటి కేసు ఎదురవ్వలేదని అన్నారు. బాధిత మహిళ కంటి రెప్పల్లోంచి ఏకంగా 250 పేలు, 85 గుడ్లు(లార్వా)లు తొలగించినట్లు తెలిపారు.

ఫిరాయసిస్ పాల్పిబ్రారమ్ అంటే..
యుఎస్ నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ప్రకారం.. ఫిరాయసిస్ పాల్పిబ్రారమ్ అనేది అరుదైన వైద్య పరిస్థితి. దీనివల్ల పేలు, వాటి గుడ్లు కనురెప్పలలో చేరుతాయి. దాంతో తీవ్రమైన దురద, కళ్లు ఎర్రబారడం, నిద్రలేమి వంటి సమస్యలు ఉత్ఫన్నమవుతాయట. అయితే ఇది సాధారణ కంటి ఇన్ఫెక్షన్‌కానందున నిర్థారించడం కష్టమని అన్నారు. వీటి లార్వాలు అచ్చం దోమ లార్వాలనే ఉంటాయని చెప్పారు.

ఈ పరిస్థితి ఎందుకొస్తుందంటే..
ఇన్‌ఫెక్షన్ కారణంగా లేదా పరిశుభ్రత లోపించినప్పుడు ఈ పరిస్థితి తలెత్తుతుందని చెబుతున్నారు వైద్యులు. పేలు రావడానికి కొన్ని రకాల వాతావరణాలు, ఇంట్లోని దిండ్లు కారణం కావొచ్చని అన్నారు. ఈ వ్యాధి మనుషులతోపాటు పశువుల్లో కూడా కనిపిస్తుందని  చెబుతున్నారు వైద్యులు. ముఖ్యంగా అడవుల్లో తిరిగే వాళ్లకు, పశువులకు దగ్గరగా ఉండేవాళ్లకు ఇవి వెంటనే అటాక్‌ అవుతాయట. 

వెంటనే కనురెప్పలకు చేరి అక్కడ తిష్టవేస్తాయని చెబుతున్నారు నిపుణులు. ఇవి కాంతి పడినప్పుడూ పారిపోతాయి కాబట్టి లైట్‌ లేకుండా తొలగించాలని చెబుతున్నారు వైద్యులు. పైగా ఈ పరాన్నజీవి లార్వాలను ఏ ఔషధం చంపలేదని అన్నారు. వాటిని ఒక్కొక్కటిగా పట్టుకుని కంటి నుంచి తొలగించడం ఒక్కటే మార్గం అని అన్నారు.

'తలలో ఉండే పేలు కంటి పేలు భిన్నంగా ఉంటాయి. కంటి పేలు, కంట్లోని తెల్లటి భాగంలో తిరుగుతూ వెలుతురు నుంచి పారిపోతాయి. అవి కంటి రెప్ప లోపల, చీకటిగా ఉండే భాగంలో జీవిస్తాయి. అక్కడే ఉంటాయి' అని చెప్పుకొచ్చారు డాక్టర్‌ మృగాంక్‌. 

లక్షణాలు 

కంటి నొప్పి, కళ్ళలో ఎప్పుడూ దురద, నిద్రలేమి 

కనురెప్పల వాపు, నీరు కారడం వంటివి 

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యమని సూచించారు. చేతులను క్రమం తప్పకుండా శుభ్రంగా కడుక్కోవాలని అన్నారు. పిల్లలు, వృద్ధులు ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని, యువతలో ఈ పరిస్థితి వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని చెప్పారు.

(చదవండి: కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం... అమర్యాద...అనారోగ్యకరం కూడానా?)

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Eyelids
worms
Lifestyle
Health
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

 5 రకాల ఫుడ్స్‌ కంప్లీట్‌ బంద్‌ : 11 నెలల్లో 32 కిలోలు తగ్గింది

5 రకాల ఫుడ్స్‌ కంప్లీట్‌ బంద్‌ : 11 నెలల్లో 32 కిలోలు తగ్గింది

కొన్ని తలనొప్పులను.. సీరియస్‌గా తీసుకోవాల్సిందే! లేదంటే..

కొన్ని తలనొప్పులను.. సీరియస్‌గా తీసుకోవాల్సిందే! లేదంటే..

పండుపై అంకె.. ఆరోగ్యానికి లంకె..

పండుపై అంకె.. ఆరోగ్యానికి లంకె..

ప్రసవానంతరం 14 కిలోల బరువు ...! జస్ట్‌  21 రోజుల్లోనే..

ప్రసవానంతరం 14 కిలోల బరువు ...! జస్ట్‌ 21 రోజుల్లోనే..

వైరస్‌ పుట్టకముందే అంత్యక్రియలు! ఏఐ వ్యాక్సిన్‌ ప్రయోగం..

వైరస్‌ పుట్టకముందే అంత్యక్రియలు! ఏఐ వ్యాక్సిన్‌ ప్రయోగం..

ఉదయ రాగం.. నాన్న యోగం!

ఉదయ రాగం.. నాన్న యోగం!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.