Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Editorial
  3. ఎన్‌సీఆర్‌బీ చాటుతున్న నిజం
ADVERTISEMENT 

ఎన్‌సీఆర్‌బీ చాటుతున్న నిజం

Editorial Sakshi User Sakshi Sakshi Time Oct 4, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
ncrb.jpg

కేంద్ర హోం శాఖ పర్యవేక్షణలో జాతీయ క్రైం రికార్డుల బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) వెలువరించే నివేదికలు రెండు విధాల కీలకమైనవి. ఆ నివేదికలు మన సమాజం తీరుతెన్నులకు అద్దం పడతాయి. అదే సమయంలో పాలకుల సమర్థతకో, వైఫల్యాలకో ఆనవాళ్లుగా నిలుస్తాయి. మూడు రోజులనాడు విడుదల చేసిన 2023 నాటి ఎన్‌సీఆర్‌బీ నివేదికలోని గణాంకాలు దిగ్భ్రమ కలిగించేలా ఉన్నాయి. 

దేశ రాజధాని ఢిల్లీ జాతీయ నేర రాజధానిగా కూడా ఉన్నదని నివేదిక చెబుతోంది. అక్కడ ప్రతి లక్షమంది జనాభాకూ 1,508.9 నేరాలు జరుగుతున్నాయి. 721.7 నేరాలతో కేరళ రెండో స్థానంలో ఉంది. తర్వాత స్థానాల్లో వరసగా హరియాణా, తెలంగాణ, ఒడిషా ఉన్నాయి. జాతీయ స్థాయిలో వివిధ నేరాల శాతం పెరిగితే ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వ హయాంలో 2023లో అవి గణనీయంగా తగ్గాయని నివేదికను విశ్లేషిస్తే అర్థమవుతుంది. 

తాజా నివేదిక ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఏలుబడి సాగిస్తున్న ఎన్డీయే కూటమి పక్షాల నీతిబాహ్యతనూ, వంచననూ బజారుకీడ్చింది. జగన్‌ అయిదేళ్ల పాలనలో విపక్షాలుగా ఉన్న టీడీపీ, బీజేపీ, జనసేనలు మైకు దొరికింది తడవుగా అబద్ధాలు వల్లెవేయటం అలవాటుగా చేసుకున్నాయి. ఏపీ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు మొదలుకొని జనసేన నేత పవన్‌ కల్యాణ్, బీజేపీ నాయకురాలు పురందేశ్వరి వగైరాలు గూడుపుఠాణి అయి ఒక పద్ధతి ప్రకారం ప్రజలను పక్కదోవ పట్టించారు. 

వీరికి యెల్లో మీడియా ఇతోధికంగా సహకరించింది. రైతుల ఆత్మహత్యలు ఎక్కువయ్యాయనీ, కల్తీ మద్యంమృతులు అపారంగా పెరిగిపోయారనీ, మహిళలు, బాలికల అదృశ్యం కేసుల సంఖ్యఆందోళనకర స్థాయిలో ఉన్నదనీ తప్పుడు లెక్కలు వల్లెవేశారు. వాలంటీర్లే మహిళలూ, బాలికలూ మాయం కావటానికి కారణమని కూడా పవన్‌ దుష్ప్రచారం చేశారు. కేంద్ర ఇంటెలిజెన్స్‌ అధికారి ఒకరు ఈ విషయం తనకు చెప్పాడని దబాయించారు. 

ఏకంగా 34,000 మంది ఆచూకీ లేకుండా పోయారని ఆయన చేసిన ఆరోపణ పూర్తిగా అవాస్తవ మనీ, కల్తీ మద్యం మృతులు అసలు లేనేలేరనీ నివేదిక తేటతెల్లంచేసింది. ఏదో ఒకరోజు నిజానిజాలు నిగ్గుతేలుతాయనీ, అప్పుడు దోషులుగా మిగిలిపోతామనీ వీరిలో ఏ ఒక్కరికీ అనిపించలేదంటే ఆశ్చర్యం కలుగుతుంది. 

ఎప్పట్లాగే జాతీయ స్థాయిలో నేరాల సంఖ్య పెరిగిందని నివేదిక చెబుతోంది. ప్రతి లక్ష జనాభాకు 2022లో 422.2 నేరాలు జరిగితే, 2023కు అది 448.3కు ఎగబాకింది. సైబర్‌ క్రైం కేసులు 31.2 శాతం పెరిగితే, పిల్లలపై నేరాలు అంతక్రితంతో పోలిస్తే 9.2 శాతం మేరకు అధికమయ్యాయి. జగన్‌ ప్రభుత్వ హయాంలో ఏపీలో అన్ని రకాల నేరాలూ గణనీయంగా తగ్గాయి. హింసాత్మక ఘటనలూ, హత్యలూ, అపహరణలూ మాత్రమే కాదు... మహిళలు, బాలికలపై నేరాలు తగ్గాయి. 

దేశవ్యాప్తంగా సైబర్‌ క్రైం కేసులు, ఆర్థిక నేరాలు పెరిగితే ఏపీలో అవి నియంత్రణలో ఉన్నాయి. అలిగివెళ్లిన లేదా అపహరణలకు గురైన బాల బాలికల కేసుల్లో 85.7 శాతం మందిని పోలీసులు సురక్షితంగా వారి వారి తల్లిదండ్రుల దగ్గరకు చేర్చగలిగారు. జాతీయ స్థాయిలో ఇది 54 శాతం మాత్రమే. నేరాలకు పాల్పడేవారిపై సత్వరం తీసుకునే చర్యలవల్ల వాటి నియంత్రణ సాధ్యమవుతుందంటారు నిపుణులు. నేరం జరిగిన రెండు నెలల్లో న్యాయస్థానంలో చార్జిషీటు దాఖలు చేయటం పోలీసుల సమర్థతకు నిదర్శనం. ఆ పని జగన్‌ హయాంలో జరిగింది. 

91.6 శాతం కేసుల్లో గడువులోగా చార్జిషీట్లు దాఖలు చేసి దేశంలోనే మూడో స్థానంలో ఉంది. జగన్‌ సర్కారు రూ. 15 లక్షల కోట్లు అప్పుచేసిందని బీజేపీ నేత పురందేశ్వరి చేసిన ప్రచారం పూర్తిగా అబద్ధమని అప్పట్లోనే కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. నేరాల విషయంలో సైతం వారివి తప్పుడు మాటలేనని తాజాగా రుజువైంది. నిజం బయటికొచ్చేలోగా అబద్ధం లోకాన్ని చుట్టేస్తుందని నానుడి. 

ఏణ్ణర్థం క్రితం అబద్ధాలు, వంచనలతో అధికారానికి ఎగబాకిన ఎన్డీయే కూటమి నిజ స్వరూపాన్ని ఇన్నాళ్లకు ఎన్‌సీఆర్‌బీ నివేదిక బట్టబయలు చేసింది. ముద్దాయిలుగా బోనులో నిలబడాల్సిన ఈ నేతలు ఇప్పుడు ‘తగుదునమ్మా’ అంటూ సైబర్‌ నేరాలకింద దాదాపు 2,000 మంది సామాన్యుల్ని తప్పుడు కేసుల్లో ఇరికిస్తుండటం ఒక వైచిత్రి.

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
NCRB
Report
Cyber crime
Editorial.
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

హెచ్చరిక.. వెలుగులోకి కొత్త స్కామ్!

హెచ్చరిక.. వెలుగులోకి కొత్త స్కామ్!

సౌందర్య ఉత్పత్తుల మార్కెట్‌ @ రూ.3.70 లక్షల కోట్లు

సౌందర్య ఉత్పత్తుల మార్కెట్‌ @ రూ.3.70 లక్షల కోట్లు

మా ఆయన పాత ఫోన్‌ దాచేస్తున్నాడు!

మా ఆయన పాత ఫోన్‌ దాచేస్తున్నాడు!

ఏపీలో ద్రవ్యోల్బణం టాప్‌

ఏపీలో ద్రవ్యోల్బణం టాప్‌

అమెరికా అమిత్ర వైఖరి

అమెరికా అమిత్ర వైఖరి

ప్రతి ఐదుగురు మహిళల్లో  ఒకరిది బాల్య వివాహమే!

ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరిది బాల్య వివాహమే!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.