Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Editorial
  3. దారితప్పిన మాల్దీవులు
ADVERTISEMENT 

దారితప్పిన మాల్దీవులు

Editorial Sakshi User Sakshi Sakshi Time Jan 18, 2024 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
modi1.jpg

ఏదో యథాలాపంగా, ఎంతో యాదృచ్ఛికంగా మొదలైనట్టు కనబడిన మాల్దీవుల పంచాయితీ ఆంతర్యం మన దేశానికి దూరం జరగటమేనని తాజా పరిణామాలు మరింత తేటతెల్లం చేస్తున్నాయి. భారత వ్యతిరేకతే అస్త్రంగా ఎన్నికల్లో ప్రచారం చేసి మొన్న నవంబర్‌లో అధికారంలో కొచ్చిన అధ్యక్షుడు మహమ్మద్‌ మెయిజూ ఇప్పటికీ అదే పోకడలు పోతున్నారు. లక్షద్వీప్‌లో పర్యటించిన సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ఒక ఛాయాచిత్రాన్ని పోస్టు చేసినప్పుడు ముగ్గురు మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలపై రాజుకున్న రగడ తర్వాత ఆ దేశం ఒకటొకటిగా చర్యలు మొదలుపెట్టింది.



మన దేశం బహుమతిగా ఇచ్చిన రెండు తేలికపాటి అధునాతన ధ్రువ హెలికాప్టర్లు వెనక్కు తీసుకోవాలని కోరటంతో పాటు వచ్చే మార్చి 15లోపు దేశంలోవున్న భారత సైనిక దళాలను ఉపసంహరించాలని తుదిగడువు విధించారు. కేవలం 88 మంది సైనికుల వల్ల తమ దేశానికి ముప్పు ముంచుకొస్తుందంటూ హడావిడి చేస్తున్నారు. అధికారంలోకొచ్చిన వెంటనే భారత పర్యటనకొచ్చే సంప్రదాయాన్ని పక్కనబెట్టి మెయిజూ టర్కీని ఎంచుకున్నారు. ఆ తర్వాత యూఏ ఈలో జరిగే కాప్‌–28 సదస్సుకెళ్లారు. తాజాగా ఈ నెల 8 నుంచి 12 వరకూ చైనాలో పర్యటించారు. ‘భౌగోళికంగా ఆకారంలో చిన్నదైనంత మాత్రాన మాల్దీవులు ఎవరి బెదిరింపులకూ లొంVýæద’ని హెచ్చరించారు. వీటన్నిటి వెనుకా ఉన్నదెవరో సులభంగానే పోల్చుకోవచ్చు.

 

మనకూ, మాల్దీవులకూ వున్న బంధం చాలా పాతది. అలాగని భారత్‌పై విద్వేషాన్ని వెళ్లగక్కే శక్తులకు అక్కడ కొదవేమీ లేదు. దేశ ప్రజానీకంలోవున్న భారత్‌ అనుకూలతను ఎలాగైనా పరిమార్చాలని చాలామంది రాజకీయ నాయకులు ప్రయత్నించారు. ప్రత్యర్థుల విధానాలనూ, వారి కార్యాచరణనూ తప్పుబట్టడానికి సందు దొరకని ప్రతిసారీ భారత్‌ ప్రసక్తి తీసుకొచ్చి విమర్శించటం అక్కడ పరిపాటి. గతంలో అబ్దుల్లా యామీన్‌ సైతం మూడు దశాబ్దాల తన ఏలుబడిలో భారత్‌ వ్యతిరేక నిర్ణయాలు తీసుకుని, చైనాతో అంటకాగి దేశాన్ని నిండా ముంచారు. ప్రశ్నించినవారిని ఖైదు చేశారు. ఇది సరికాదంటూ తీర్పునిచ్చిన ఇద్దరు సుప్రీంకోర్టు జడ్జీలను జైలుకు పంపారు.



ఆయన నిర్వాకంలో ఆ దేశం చైనా నుంచి భారీగా రుణాలు తీసుకుంది. పెట్టుబడులను ఆహ్వానించింది. వీటివల్ల చెల్లించాల్సిన వడ్డీలే అపరిమితంగా పెరిగిపోయాయి. 2013లో రెండోసారి అధికారంలోకొచ్చాక కూడా యామీన్‌ తీరు మారలేదు. చివరకు ఆయన విధానాలతో విసిగిన జనం 2018లో ఇబ్రహీం మహ్మద్‌ సోలిహ్‌ను గద్దెనెక్కించారు. నియంతృత్వ పోకడలకు పోలేదన్న మాటేగానీ... అవినీతిని అంతమొందిస్తానన్న వాగ్దానాన్ని సోలిహ్‌ నిలుపుకోలేకపోయారు. ఒక అవినీతి కేసులో యామీన్‌కు 11 ఏళ్ల జైలు శిక్ష పడిన మాట వాస్తవమే అయినా, అది మినహా అవినీతి నిర్మూలనకు పకడ్బందీ చర్యలు తీసుకోలేకపోయారు.



ఉపాధి కల్పనలోనూ సొంత మనుషులకే ప్రాధాన్యమిచ్చారన్న ఆరోపణలు వినబడ్డాయి. ఈ అసంతృప్తిని ప్రస్తుత అధ్యక్షుడు మెయిజూ ఆసరాగా తీసుకుని అధికారానికి రాగలిగారు. అయిదున్నర లక్షలమంది జనాభాగల మాల్దీవుల్లో మూడులక్షలమంది సున్నీ ముస్లివ్‌ులు. మతం పేరుతో వీరిలో అత్యధికులను తనవైపు తిప్పుకోవాలని, జాతీయవాదాన్ని రెచ్చగొట్టాలని అంతక్రితం యామీన్‌ ప్రయత్నించినా ప్రయో జనం లేకపోయింది. కాకపోతే ఈ రాజకీయ క్రీడ చివరకు సెక్యులర్‌ పార్టీల వైఫల్యంగా మారి మతతత్వ శక్తుల ప్రాబల్యం పెరుగుతుందా అన్న సందేహాలు చాలామందిలో ఉన్నాయి. మెయిజూ అయినా, మరొకరైనా దేశాభివృద్ధిలో భారత్‌ కీలకపాత్రను తోసిపుచ్చలేరు. ప్రస్తుతం దేశ దిగుమతుల్లో అత్యధిక వాటా భారత్‌దే. దీన్ని తగ్గించుకుందామని ప్రయత్నిస్తే వ్యయం పెరగటం మినహా ప్రయోజనం శూన్యం. ఇక మాల్దీవుల విదేశీ రుణాల్లోనూ సింహభాగం మన దేశానిదే. 



గతంలో చైనాతో సాన్నిహిత్యం పెంచుకుని ఎడాపెడా రుణాలు తీసుకుని శ్రీలంక ఆర్థికంగా ఎంత నష్టపోయిందో, ఎలా దివాలా తీసిందో అక్కడి పరిణామాలే తేటతెల్లం చేశాయి.అధికారంలోకొచ్చిన నాటి నుంచీ మెయిజూ పాలనపై దృష్టి నిలపడానికి బదులు చైనాను సంతుష్టిపరచటానికి సమయం వెచ్చిస్తున్నారు. అన్ని దేశాల్లోనూ ఒకే తరహా వ్యవస్థలు,రాజకీయ భావాలుండటం సాధ్యం కాదు. ఎన్నికలప్పుడు ఏం మాట్లాడినా అధికారంలో కొచ్చాక బాధ్యతగా మెలగాలి. దేశ గరిష్ఠ ప్రయోజనాలు గీటురాయిగా ఉండాలి తప్ప, మూర్ఖత్వంతో అవతలివారిని నొప్పించటమే ధ్యేయం కాకూడదు. మెయిజూకు ఎన్నికల జాతరలో తలకెక్కిన మత్తు ఇంకా దిగినట్టు లేదు.



లోగడ పాలించిన యామీన్‌కు చైనాతో ఉన్న సాన్నిహిత్యం, ఇటీవల గద్దె దిగిన సోలిహ్‌ భారత్‌ అనుకూల ధోరణి జగద్వితమే అయినా వారిద్దరూ ఇరు దేశాలకూ సమాన దూరంలో మెలుగుతామని ప్రకటించేవారు. విధానాల రూపకల్పనలో, నిర్ణయాల్లో ఎంతోకొంత దాన్ని చేసిచూపేవారు. మెయిజూకు ఆ పరిణతి లేదని ఆయన చర్యలు స్పష్టం చేస్తున్నాయి. అది చాలదన్నట్టు  ఇటీవల తైవాన్‌లో చైనాను గట్టిగా వ్యతిరేకించే పక్షమే తిరిగి అధికారంలోకి రాగా, తగుదునమ్మా అంటూ తమది ‘వన్‌ చైనా’ విధానమేనంటూ ప్రకటించారు. భౌగోళికంగా చూస్తే మాల్దీవులు 1,190 పగడపు దిబ్బల సముదాయం. కానీ అందులో నివాస యోగ్యమైనవి కేవలం 185 దీవులు మాత్రమే. మన దేశానికి 400 కిలోమీటర్ల దూరంలోవుంటూ మన భద్రత రీత్యా హిందూ మహా సముద్రంలో కీలక ప్రాంతంలో ఉన్న మాల్దీవులు భారత్‌ – చైనాల మధ్య సాగే పందెంలో తలదూర్చి బొప్పి కట్టించుకునే చేష్టలకు దూరంగా ఉండటం అన్నివిధాలా దానికే శ్రేయస్కరం.  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
maldives
Narendra Modi
Lakshadweep
Sakshi Editorial
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఇక ఎన్డీఏ వేదిక 'మంగళ్ మిలన్’!

ఇక ఎన్డీఏ వేదిక 'మంగళ్ మిలన్’!

అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభం.. మోదీ ఐదు సంకల్పాలు ఇవే..

అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభం.. మోదీ ఐదు సంకల్పాలు ఇవే..

నడకదారి ఇక పౌరుల హక్కు

నడకదారి ఇక పౌరుల హక్కు

అగ్నిప్రమాదంపై ప్రధాని విచారం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన

అగ్నిప్రమాదంపై ప్రధాని విచారం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన

మీరు గొప్పనేత ఎప్పుడౌతారో ఏమో!

మీరు గొప్పనేత ఎప్పుడౌతారో ఏమో!

అజేయంగా మన సముద్ర శక్తి

అజేయంగా మన సముద్ర శక్తి

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.