Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Editorial
  3. ఖలిస్తాన్‌ 2.0
ADVERTISEMENT 

ఖలిస్తాన్‌ 2.0

Editorial Sakshi User Sakshi Sakshi Time Mar 21, 2023 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
amritpal-singh-1679306505.jpg

శనివారం నుంచి మూడు రోజులుగా నిరంతర గాలింపు. అయినా దొరకలేదు. ఇప్పటికి వందమందికిపైగా అతని సహచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం పొద్దుగూకాక కూడా నిందితుడు పోలీసుల గస్తీ కళ్ళ నుంచి తప్పించుకొని, తిరుగుతూనే ఉన్నాడు.



‘వారిస్‌ పంజాబ్‌ దే’ సంస్థ అధినేత అమృత్‌పాల్‌ సింగ్‌ పరారీ, అందుకు దారి తీసిన పరిస్థితులు చూస్తే, నలభై ఏళ్ళ నాటి తీవ్రవాద సంక్షుభిత పంజాబ్‌ పరిస్థితులు పునరావృతమవుతున్నాయన్న ఆందో ళన కలుగుతోంది.



సిక్కులకు సార్వభౌమాధికార దేశం కావాలన్న ఖలిస్తానీ జెండాను భుజానికెత్తుకున్న యువనేత అమృత్‌పాల్‌ ముఠా బలప్రదర్శన చేసి,అమృత్‌సర్‌లో పోలీస్‌స్టేషన్‌పై ఫిబ్రవరి 23న దాడి చేసి నెలవుతున్నా, నిన్నటి దాకా కళ్ళు తెరవని ‘ఆప్‌’ సర్కార్‌ వైఫల్యం వెక్కిరిస్తోంది. 



గాలివార్తలు సుడిగాలిలా వైరల్‌ అవుతున్న వేళ శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఇంటర్నెట్‌ సేవల్ని మంగళవారం మధ్యాహ్నం దాకా పాలకులు నిలిపివేయాల్సి వచ్చిందంటే పరిస్థితిని ఊహించుకోవచ్చు. రూపం మార్చుకున్న సరికొత్త ఖలిస్తాన్‌ 2.0 విజృంభిస్తోందా? 1980–90ల్లోలా పంజాబ్‌ మళ్ళీ అగ్నిగుండం కానుందా? హత్యానేరం, పోలీసులపై దాడి సహా కనీసం 7 క్రిమినల్‌ నేరారోపణలున్న అమృత్‌పాల్‌ ఇప్పుడు పంజాబ్‌లో మళ్ళీ పుంజుకుంటున్న వేర్పాటువాదానికి కేంద్రబిందువయ్యాడు.



మాదక ద్రవ్యాల అలవాటును మాన్పించడానికి పనిచేసే డీ–ఎడిక్షన్‌ కేంద్రాలనూ, అలాగే ఓ గురుద్వారానూ అమృత్‌పాల్‌ తన అడ్డాగా చేసుకున్నాడట. ఆ స్థావరాల్లో కత్తులు, తుపాకీలు, తూటాలు... పోగేసి, ఆత్మాహుతి దాడులకు యువతరాన్ని సిద్ధం చేస్తున్నాడని గూఢచారి వర్గాల సమాచారం. ఆయుధాలు – బుల్లెట్‌ప్రూఫ్‌ జాకెట్లు దొరకడం, సాయుధ పోరాటం ఇష్టం లేదంటూనే ‘ఆనంద్‌పూర్‌ ఖల్సా ఫోర్స్‌’ (ఏకెఎఫ్‌) పేరును ప్రాచుర్యంలో పెట్టడం లాంటి అమృత్‌పాల్‌ సమాచారంతో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. 



బంధువుల సాయంతో 20 ఏళ్ళ వయసులో దుబాయ్‌ వెళ్ళి, భారీ వాహనాల డ్రైవర్‌గా పని చేసి, నిరుడు భారత్‌కు తిరిగొచ్చిన ఓ యువకుడు అనూహ్యంగా ఈ స్థాయికి చేరడం చిత్రమే. నిన్నటి దాకా ఆధునిక వేషభాషల్లో ఉన్న 30 ఏళ్ళ అమృత్‌పాల్‌ ఇవాళ సాంప్రదాయిక సిక్కు వస్త్రధారణలో, చేతిలో కృపాణంతో, ఖలిస్తానీ ఉద్యమానికి వేగుచుక్క కావడం సహజ పరిణామం అనుకోలేం.



ఈ ఖలిస్తాన్‌ అనుకూల ఉద్యమం వెనుక పాకిస్తానీ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐ ప్రమేయం ఉందన్న అనుమానం బలపడుతున్నది అందుకే. అతనికి నిధులెక్కడివన్నదీ ఆరా తీయాల్సిందే! ఇక, పలాయితుడిపై జాతీయ భద్రతా చట్టం విధిస్తారన్న వార్త పరిస్థితి తీవ్రతకు ఉదాహరణ. 



1980లు, 90లలో అకాలీలు తీవ్రవాద ఆరోపణలతో అరెస్టయిన తమ అనుయాయుల విడుదల కోసం వీధికెక్కినట్టే, ఈ 2023లో అమృత్‌పాల్, ఆయన తోటి ఖలిస్తానీ మద్దతుదారులు తమ సహచరుడి విడుదల కోసం గత నెలలో వీధికెక్కారు.



ఏడేళ్ళ వయసు నుంచే సాంప్రదాయిక సిక్కు ధార్మిక శిక్షణ పొందిన ఒకప్పటి ఖలిస్తానీ నేత జర్నైల్‌ సింగ్‌ భింద్రన్‌వాలేకు భిన్నంగా,అలాంటి శిక్షణేమీ లేకుండా ఉన్నట్టుండి అలాగే వేషం కట్టి, మాట్లాడుతున్నాడు అమృత్‌పాల్‌.



స్వీయ ప్రచారం మాటెలా ఉన్నా అతనిని ‘భింద్రన్‌వాలే 2.0’ అనలేం. సాయుధ అంగరక్షకుల నడుమ ఊరూరా తిరుగుతూ, రెచ్చగొడుతున్నాడు. 1984లో అమృత్‌సర్‌ స్వర్ణాలయంలో ఆపరేషన్‌ బ్లూస్టార్‌లో భింద్రన్‌వాలేను హతమార్చిన తర్వాత నాటి ప్రధాని ఇందిర, పంజాబ్‌ సీఎం బియాంత్‌ సింగ్‌లకు పట్టిన గతి నేటి కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, పంజాబ్‌ సీఎం మాన్‌లకు పడుతుందని తొడకొడుతున్నాడు. మానిన పాత గాయాల్ని మళ్ళీ కెలుకుతున్నాడు.   



భారత్‌ పట్ల ఖలిస్తానీల విద్వేషం బ్రిటన్, ఆస్ట్రేలియా సహా వివిధ దేశాల్లో ఉన్నట్టుండి వెల్లువె త్తడం మరింత ఆందోళనకరం. బరి తెగించిన ఖలిస్తానీ దుండగులు లండన్‌ తదితర ప్రాంతాల్లో భారత రాయబార కార్యాలయాలపై దాడి చేయడం, జాతీయ జెండాను తొలగించడం దుస్సహం. రాయబార కార్యాలయానికి కాపుండాల్సిన ఆయా దేశాల ఉదాసీన వైఖరీ ముమ్మాటికీ తప్పే.



అసలు మన బంగారం మంచిదైతేగా! పంజాబ్‌ సంపన్న రాష్ట్రమే కానీ, గత పదిహేనేళ్ళలో తీవ్రనిరుద్యోగంతో యువత తప్పుదోవ పడుతోంది. రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలకు వ్యతిరే కంగా 2020 – 21లో పంజాబీ సోదరులు పోరాటం సాగిస్తున్నప్పుడు దాన్ని సుదీర్ఘంగా సాగదీసిన కేంద్ర ప్రభుత్వ ఉదాసీనత సైతం అసంతృప్తి ప్రబలడానికి ఓ కారణం. హిందూ రాష్ట్రమనే భావనను పైకి తెస్తున్న పిడి వాదులూ, పరోక్షంగా ఖలిస్తానీల సిక్కురాజ్య వాదనకు ప్రేరేపకులే! 



నిరుద్యోగ యువత అసంతృప్తి, రైతుల ఆగ్రహం, ‘ఉఢ్తా పంజాబ్‌’గా మారిన రాష్ట్రంలో ఇట్టే దొరుకుతున్న మాదక ద్రవ్యాలు, పాక్‌ సరిహద్దుల నుంచి ఆయుధ ప్రవాహం, పాలకుల నిస్తేజం... అన్నీ కలసిన పంచకూట కషాయమే – పంజాబ్‌లో ప్రబలుతున్న దేశవ్యతిరేక కార్యకలాపాలు.



జనబాహుళ్య అసంతృప్తిని తెలివిగా వాడుకుంటూ తన పునాదిని విస్తరించుకుంటున్న అమృత్‌ పాల్‌కు పాక్‌ అండతో సాగుతున్న విదేశీ ఖలిస్తానీ మద్దతుదారులు తోడవడం అగ్నికి ఆజ్యమే.



తనను తాను అతిగా ఊహించుకుంటున్న ఈ వేర్పాటువాదిని ఆదిలోనే అడ్డుకోవాలి. మొగ్గలోనే తుంచకపోతే విభజనవాదం బ్రహ్మరాక్షసిగా మారి మింగేస్తుంది. కదం తొక్కాల్సిన పాలకులు కాలహరణం చేస్తే పంజాబ్‌లో మళ్ళీ పాత చీకటి రోజులు ముందుకొస్తాయి. పారా హుషార్‌!   

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
khalistan
Sikh
Sakshi Editorial
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

నడకదారి ఇక పౌరుల హక్కు

నడకదారి ఇక పౌరుల హక్కు

అరణ్యరోదన

అరణ్యరోదన

జై భీమ్‌... జై సంవిధాన్‌!

జై భీమ్‌... జై సంవిధాన్‌!

ఎట్టకేలకు శాంతి దిశగా...

ఎట్టకేలకు శాంతి దిశగా...

దాహార్తిని తీర్చే ప్రణాళికలేవి?

దాహార్తిని తీర్చే ప్రణాళికలేవి?

ఆంక్షల చట్రంలో సిరప్‌లు

ఆంక్షల చట్రంలో సిరప్‌లు

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.