Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Editorial
  3. భూతల స్వర్గం ఇక ‘కేరళమ్‌’!
ADVERTISEMENT 

భూతల స్వర్గం ఇక ‘కేరళమ్‌’!

Editorial Sakshi User Sakshi Sakshi Time Aug 11, 2023 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
kerala.jpg

పచ్చని ప్రకృతితో భూతల స్వర్గంగా, ‘దేవుడి సొంతగడ్డ’గా పేరుబడ్డ రాష్ట్రానికి త్వరలోనే కొత్త పేరు ఖరారు కానుందా? కేరళ అతి త్వరలోనే అధికారికంగా పేరు మార్చుకోనుందా? అవును. దేశానికి దక్షిణ కొసనున్న ఈ మలయాళ రాష్ట్రం ‘కేరళమ్‌’గా కొత్త నామధేయం స్వీకరించడానికి  సన్నాహాలు సాగుతున్నాయి. రాష్ట్రం పేరును రాజ్యాంగంతో సహా అన్ని ఆఫీసు రికార్డుల్లోనూ అధికారికంగా ‘కేరళమ్‌’గా మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ, కేరళ శాసనసభ తీర్మానం చేయడంతో అందుకు రంగం సిద్ధమైంది.



ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరాయి విజయన్‌ బుధవారం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని విపక్షాలతో సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించడం పార్టీలకతీతంగా కొత్త పేరుకున్న సర్వజనా మోదాన్ని తెలియజేస్తోంది. అసెంబ్లీ తీర్మానం తర్వాత కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఇంకా అనేక అంచెలున్నందున అవన్నీ దాటుకొని మలయాళీల ఆకాంక్ష నెరవేరడానికి మరికొంత కాలం పట్టవచ్చు. 



నిజానికి, మలయాళంలో అసలు ఆ రాష్ట్రం పేరు కేరళమే. మలయాళీలు సాధారణంలో వాడు కలో చెప్పేది అలానే. ఎటొచ్చీ అధికారిక, ఇంగ్లీష్‌ రికార్డులోనే ఈ కేరళ అనే మాట. చరిత్ర పరికిస్తే – మలయాళం మాట్లాడే ప్రజలు రకరకాల రాజులు, సంస్థానాల పాలనలో ఉండేవారు. మలబార్, కొచ్చి, ట్రావన్‌కోర్‌లను కలిపి, మలయాళ భాషీయులు అందరికీ సమైక్యంగా ఒకే రాష్ట్రం కావాలనే ‘ఐక్య కేరళ ఉద్యమం’ 1920ల నుంచే ఉంది. ఒకే భాష, ఒకే చరిత్ర, సంస్కృతి, సంప్రదాయమున్న మలయాళీలంతా ఐక్యం కావాలనే బలమైన డిమాండ్‌ దేశానికి స్వాతంత్య్రం వచ్చాక సంస్థానాల విలీనంతో క్రమక్రమంగా నెరవేరింది.



1949 జూలై 1న ట్రావన్‌కోర్, కొచ్చి రాష్ట్రాలు రెండూ ఏకమై, ట్రావన్‌కోర్‌ – కొచ్చిన్‌ రాష్ట్రం ఏర్పడింది. ఆ తర్వాత భాషా ప్రాతిపదికన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరుగుతున్నప్పుడు పునర్వ్యవస్థీకరణ సంఘం కేరళ రాష్ట్ర ఏర్పాటును సిఫార్సు చేసింది. అలా 1956 నవంబర్‌ 1న ఇప్పటి కేరళ రాష్ట్రం ఆవిర్భవించింది. రాష్ట్రం పేరును మలయాళంలో కేరళమ్‌ అని పేర్కొన్నా, అప్పట్లో రాజ్యాంగం తొలి షెడ్యూల్‌లో ఇంగ్లీషులో కేరళ అని రాశారు. ఇప్పుడు అదే రాజ్యాంగం 3వ అధికరణ కింద అంతటా కేరళమ్‌గా మార్చాలన్నది కేంద్రానికి అసెంబ్లీ తీర్మానం. 



సాధారణంగా పేరులో ఏముంది పెన్నిధి అనుకోవచ్చు. కానీ, అనేక సందర్భాల్లో ఆ పేరు, ఆ పేరు వెనుక చరిత్ర, దానితో ముడిపడ్డ అనుబంధం నిజంగానే ఓ పెన్నిధి. అస్తిత్వానికీ, అపారమైన సెంటిమెంట్‌కూ నెలవు. అనేక ప్రాంతీయ, అస్తిత్వ ఉద్యమాలకు ఆ యా ప్రాంతాల ప్రజల భాష, గోస, ఊరు, పేరు బలమైన ఊతమిచ్చాయనేది మర్చిపోలేని చరిత్ర. ఒకప్పుడు మద్రాస్‌ ప్రెసిడెన్సీ నుంచి విడిగా తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ తెలుగువారు చేసిన పోరాటమే తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పాటుకు దారి తీసింది.



దక్షిణాదిన తెలుగువారికి, తమిళులకు, కన్నడిగులకు, మలయాళీలకు ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పడ్డాయి. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు తర్వాత స్థానిక సెంటిమెంట్లను గౌరవిస్తూ, కొన్ని రాష్ట్రాల పేర్లూ మారాయి. ‘మద్రాస్‌ రాష్ట్రం’ అనంతర కాలంలో 1967 నుంచి తమిళనాడు అయినా, ‘మైసూర్‌ స్టేట్‌’ అటుపైన 1973లో కర్ణాటకగా పేరు మార్చుకున్నా అలాగే జరిగింది. ఇప్పుడు కేరళ ప్రజాప్రతినిధులు అసెంబ్లీ ఏకగ్రీవంగా తమ రాష్ట్రం పేరును స్థానిక పురాతన చరిత్రను ప్రతిఫలించేలా కేరళమ్‌గా మార్చాలంటూ చేసిన తీర్మానం కూడా ఆ కోవలోనిదే!



శబ్ద వ్యుత్పత్యర్థాల ప్రకారం చూసినా చాలా కథే ఉంది. మలయాళంలో ‘కేర’ అంటే కొబ్బరి కాయ. అలా ‘కేరళ’ అంటే నారికేళాల భూమి అని శబ్దార్థం. కేరళ సీమలో ఎటు చూసినా పచ్చటి కొబ్బరి చెట్లు విస్తృతంగా ఉండడమే ఈ శబ్దోత్పత్తికి నేటికీ సాక్ష్యం. క్రీ.పూ. 257 నాటి అశోకుని రెండో శిలాశాసనంలోనే తొలిసారి కేరళ ప్రస్తావన కనిపిస్తుంది.



అందులో స్థానిక పాలకుణ్ణి ‘కేరళపుత్ర’ అనీ, చేర రాజవంశాన్ని ప్రస్తావిస్తూ ‘చేర పుత్రుడ’నీ ఉంది. గోకర్ణం నుంచి కన్యాకుమారి మధ్య ఉన్న ప్రాంతాన్ని ‘చేరమ్‌’ అనేవారట. ‘చేర’ అనే మూలపదానికి అనుసంధానించడమనీ, ‘అళం’ అంటే ప్రాంతమనీ అర్థం. అలా చేరమ్, చేరళమ్‌ పదాల నుంచే ‘కేరళమ్‌’ అనే మాట పుట్టిందట.



దేశపు నైరుతి మూలన మలబార్‌ తీరంలో నెలకొన్న ఈ రాష్ట్రానికి అనేక విశిష్టతలున్నాయి. ఇది పరశురామ క్షేత్రమనీ, బలి చక్రవర్తి ఇక్కడ నుంచే భూమండలాన్ని పాలించాడనీ పురాణగాథ. మల బార్‌ సీమ వారిది ప్రత్యేక భాష, సంస్కృతి, సంప్రదాయం. సహజంగానే స్వరాష్ట్రం పేరు సైతం వాటిని ప్రతిఫలించేలా, స్థానిక భావ్వోదేగాలను ప్రతిబింబించేలా ప్రతిష్ఠాత్మకంగా ఉండాలని వారు కోరుకుంటారు. అది నూరుపాళ్ళూ సమంజసమే.



ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు మొదలు సమైక్య ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణ రాష్ట్ర విభజన దాకా ఇవన్నీ ఆ కోవలో వచ్చినవే! అయితే, పేరు మార్పుకూ పెద్ద తతంగం ఉంది. కొత్త రాష్ట్రాల ఏర్పాటు, సరిహద్దులు, పేర్లలో మార్పుల అంశాలు రాజ్యాంగం 3వ అధికరణం కిందకు వస్తాయి. నగరాల పేర్లు మార్చేందుకు కేంద్ర ఆమోదం అవసరం లేకున్నా, రాష్ట్రాల పేర్ల మార్పునకు కేంద్ర హోమ్‌శాఖ అంగీకారం తప్పనిసరి. రాజ్యాంగ సవరణ అవసరం.



సాధారణంగా రాష్ట్ర సర్కార్‌ నుంచి ప్రతి పాదన రాగానే కేంద్రం పేరు మార్పు ప్రక్రియ ఆరంభమవుతుంది. ఆ పైన ఇంటెలిజెన్స్‌ బ్యూరో, రైల్వే, తపాలా శాఖలు వగైరాల నుంచి నిరభ్యంతర పత్రాలు కోరుతుంది. పార్లమెంట్‌ ఆమోదంతో చట్టమయ్యాక, రాష్ట్రానికి కొత్త పేరు అమలులోకి వస్తుంది. కేరళ విజయాలను ప్రపంచానికి చాటేలా ఈ నవంబర్‌ 1న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నుంచి ‘కేరళీయమ్‌ 2023’ పేరున ఉత్సవాలు జరగను న్నాయి. ఆలోగా పేరు మారితే ఉత్సవాలకూ నిండుదనమన్న రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన ఫలిస్తుందా?  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
kerala
Constitution
Pinarayi Vijayan
Sakshi Editorial
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

వయనాడ్ లో వర్ష బీభత్సం.. కొండచరియలు విరిగి ఐదుగురు మృతి

వయనాడ్ లో వర్ష బీభత్సం.. కొండచరియలు విరిగి ఐదుగురు మృతి

ట్రాఫిక్‌లో ఆగిన గుండె.. కదిలొచ్చిన దేవతలు

ట్రాఫిక్‌లో ఆగిన గుండె.. కదిలొచ్చిన దేవతలు

నడకదారి ఇక పౌరుల హక్కు

నడకదారి ఇక పౌరుల హక్కు

లక్‌ అంటే వీరిదే : కారు నుజ్జు నుజ్జు, షాకింగ్‌ సీసీటీవీ విజువల్స్‌

లక్‌ అంటే వీరిదే : కారు నుజ్జు నుజ్జు, షాకింగ్‌ సీసీటీవీ విజువల్స్‌

అరణ్యరోదన

అరణ్యరోదన

జై భీమ్‌... జై సంవిధాన్‌!

జై భీమ్‌... జై సంవిధాన్‌!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.