Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Editorial
  3. చిగురాశలపై పిడుగుపాటు
ADVERTISEMENT 

చిగురాశలపై పిడుగుపాటు

Editorial Sakshi User Sakshi Sakshi Time Feb 25, 2026 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
wedding.jpg

సమాజంలో ఉండే అసమానతలకూ, అంతరాలకూ చట్టాల ద్వారా, మధ్యవర్తిత్వంతో సహా ఇతరేతర మార్గాల ద్వారా సామరస్యపూర్వకమైన పరిష్కారం సాధించటం రాజ్యం చేయాల్సిన పని. అందుకు రాజ్యాంగం, దాని ద్వారా ఏర్పడే భిన్న వ్యవస్థలు పనిచేస్తుంటాయి. కుటుంబాల్లో తరాల మధ్య తలెత్తే సమస్యలకు కూడా ఆ పరిధిలోనే పరిష్కారాలుంటాయి. ఇతరత్రా సమస్యల మాటేమో గానీ, పెళ్లి విషయంలో మాత్రం అదేం కుదరదంటున్నది గుజరాత్‌ ప్రభుత్వం. వివాహం గురించి తల్లిదండ్రులకు చెప్పి, వాళ్ల అనుమతి తీసుకోవాలని ఆంక్షలు విధించటానికి సిద్ధపడుతోంది. ఇందుకోసం 2006 నాటి వివాహ నమోదు చట్టాన్ని సవరించదల్చుకున్నట్టు ప్రకటించింది. పరస్పరం ఇష్టపడి పెళ్లాడాలనుకునే జంటలకు ఇప్పటికే అనేకానేక అవాంతరాలు ఎదురవుతున్నాయి. కులాలు, మతాలు, ప్రాంతాలు, ఆర్థిక అసమానతలు అందులో కొన్ని. ఈ గోదాలోకి తాను కూడా జొరబడి గుజరాత్‌ సర్కారు ఏం సాధించదల్చుకున్నదో అనూహ్యం. 

ప్రజాస్వామ్యంలో 18 ఏళ్ల వయసు నిండినవారు ఓటేయటానికి, పోటీ చేయటానికి అర్హులు. ప్రభుత్వాలను మార్చవచ్చు. జనం ఆమోదం పొంది ఎన్నికైతే ప్రభుత్వంలో భాగమై విధానాలు రూపొందించవచ్చు. కానీ ఆ వయసువారు తమకు నచ్చిన భాగస్వామిని ఎంచుకోవటానికి వీల్లేదని, అందుకు మరొకరి ఆమోదముద్ర తప్పనిసరని అనటం ఆశ్చర్యకరం. ఇలాంటి తలకిందుల ఆలోచనలు చేయటం గుజరాత్‌తోనే మొదలు కాలేదు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్‌లు ఈ పనే చేశాయి. ఎనిమిదేళ్ల క్రితం కేరళకు చెందిన హదియా అనే యువతి కేసులో... తనకు నచ్చిన జీవితభాగస్వామి ఎవరో నిర్ణయించుకునే స్వేచ్ఛ మైనారిటీ తీరిన ప్రతి ఒక్కరికీ ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ బంధంలో తల్లిదండ్రులు గానీ, కుల మత పెద్దలు గానీ జోక్యం చేసుకోవడం చెల్లదని చెప్పింది. నచ్చిన జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవటం రాజ్యాంగం 21వ అధికరణం ద్వారా ప్రసాదించిన జీవించే హక్కులో భాగమని కూడా తెలిపింది. 2021లో అలహాబాద్‌ హైకోర్టు, కర్ణాటక హైకోర్టులు సైతం ఈ సంగతినే స్పష్టం చేశాయి. 

గత వారం గుజరాత్‌ అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి హర్ష్‌ సంఘవి వివాహ నమోదు చట్టాన్ని సవరించాలనుకోవటానికి చూపిన కారణాలు హాస్యాస్పదమైనవి. పెళ్లిళ్ల నమోదు నిబంధనల్ని కఠినతరం చేయాలని వివిధ సామాజిక సంస్థల నాయకుల నుంచి వినతులొచ్చాయట. బాధ్యతాయుతమైన ప్రభుత్వమైతే అది అసాధ్యమని వారికి నచ్చజెప్పాలి. వివాహాల నమోదు చట్టం రాష్ట్రాల పరిధిలోనే ఉంటుంది. దాన్ని సవరించే హక్కు కూడా ఉంటుంది. కానీ అది రాజ్యాంగానికి లోబడి ఉండాలి. అసలు ఇప్పుడు తీసుకురాదల్చుకున్న సవరణల్లో స్పష్టత లేదు. పెళ్లి గురించి తల్లిదండ్రులకు చెప్పారా లేదా అని అడగటం, వారికి చెప్పాలని నిబంధన విధించటం తప్ప వారు అంగీకరించని పక్షంలో చట్టం ఏం చేస్తుందో, పర్యవసానాలెలా ఉంటాయో చెప్పటం లేదు. పెళ్లి నమోదు చేస్తారా లేదా అన్న విషయంలో స్పష్టత ఇవ్వలేదు. ఇది అతి తెలివి. ఏదో రకంగా పెళ్లి సంగతి తల్లిదండ్రుల చెవినబడితే చాలు... ఆ తర్వాత వాళ్లూ వాళ్లూ పడతారని చేతులు దులుపుకోవటం! 

ఇలాంటి సందర్భాల్లో మన దేశంలో ఏమవుతున్నదో కనబడుతూనే ఉంది. తమ కులంవాడు కాదని, ‘తక్కువ’ కులస్థుడని అనుకున్న మరుక్షణం హంతకులుగా మారు తున్న తల్లిదండ్రులు కోకొల్లలు. కనీసం ఇప్పుడైతే కొంత కాలం గడిచాకనో, బిడ్డ పుట్టాకనో ఆవేశం తగ్గించుకుని అక్కున చేర్చుకుంటున్నవారు అక్కడక్కడ కనబడు తున్నారు. ఈ చట్టం కనీసం అందుకు కూడా అవకాశం ఇవ్వదల్చుకున్నట్టు లేదు. కొన్నేళ్ల క్రితం ‘లవ్‌ జిహాద్‌’ మాట తెగ ప్రచారం చేశారు. ప్రేమ పేరిట మతాంతీకరణ జరుగుతున్నదని భూమ్యాకాశాలు ఏకం చేశారు. ‘కేరళ ఫైల్స్‌’ చిత్రం దాని ఆధారంగానే నిర్మించారు. కానీ ఆ వంకన మతాంతర వివాహాలను వివాదాస్పదం చేయటం తప్ప సాధించిందేమీ లేదు. రాజకీయపక్షాలు తమ ప్రయోజనాల కోసం ఏమైనా చెబుతాయి. రాజ్యం అలాంటి అంశాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఉన్న సమస్యల్ని పెంచకూడదు. తానే సమస్యగా మారకూడదు.  

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Marriage
Gujarat
Sakshi Editorial
love marriages
Wedding
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

వ్యవసాయానికి మించిన కథ..! 40 ఏళ్ల వయసులో ట్రాక్టర్‌ డ్రైవింగ్‌ ..

వ్యవసాయానికి మించిన కథ..! 40 ఏళ్ల వయసులో ట్రాక్టర్‌ డ్రైవింగ్‌ ..

60ఏళ్ల వయసులో 3వ వివాహం చేసుకున్న అమిర్ ఖాన్

60ఏళ్ల వయసులో 3వ వివాహం చేసుకున్న అమిర్ ఖాన్

పెళ్లి పీటలెక్కనున్న సిద్ధూ-సోనియా.. ముహుర్తం ఫిక్స్‌!

పెళ్లి పీటలెక్కనున్న సిద్ధూ-సోనియా.. ముహుర్తం ఫిక్స్‌!

అమిర్ ఖాన్ మూడో పెళ్లి.. అతిథులకు స్పెషల్ ట్రీట్

అమిర్ ఖాన్ మూడో పెళ్లి.. అతిథులకు స్పెషల్ ట్రీట్

ప్రియురాలిని పెళ్లాడిన ప్రముఖ నటుడు

ప్రియురాలిని పెళ్లాడిన ప్రముఖ నటుడు

రేపే వివాహం.. నిప్పులు పోసిన పోకిరీ

రేపే వివాహం.. నిప్పులు పోసిన పోకిరీ

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.