Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Editorial
  3. సతత హరిత వ్యూహాత్మకం
ADVERTISEMENT 

సతత హరిత వ్యూహాత్మకం

Editorial Sakshi User Sakshi Sakshi Time Mar 1, 2023 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
japan-pre.jpg

ఢిల్లీలోని చాణక్యపురిలో రోడ్డుపై దుకాణంలో తేనీరు సేవించిన జర్మనీ అధినేత! ఇది, ప్రధాని మోదీతో కలసి సంయుక్త మీడియా ప్రకటన మినహా జర్మనీ ఛాన్స్‌లర్‌ ఒలాఫ్‌ షోల్జ్‌ రెండు రోజుల భారత అధికారిక పర్యటనపై హడావిడి వార్తలు, ప్రకటనలు మీడియాలో కనిపించి ఉండకపోవచ్చు. అంతమాత్రాన షోల్జ్‌ భారత పర్యటన అప్రధానమనుకుంటే పొరపాటే.



రాష్ట్రపతిని కలసి సంభాషించడం, ప్రధానిని కలసి చర్చించడం, ఔత్సాహిక వ్యాపారవేత్తలతో గోష్ఠి జరపడం – ఇలా ఫిబ్రవరి 25, 26ల్లో షోల్జ్‌ సుడిగాలిలా చుట్టేశారు. ఇప్పటికే జపాన్, చైనా, ఆసియాన్‌ దేశాల్లో పర్యటించిన ఆయన తమ దేశ ఇండో–పసిఫిక్‌ విధానంలో భాగంగా భారత్‌తో బంధం దృఢమైనదని తేల్చేశారు. ఉక్రెయిన్‌లో యుద్ధానికి ఏడాది నిండిన వేళ ఈ పర్యటన వ్యూహాత్మకంగా కీలకమనేది అందుకే. 



పదహారేళ్ళ సుదీర్ఘ ఏంజెలా మెర్కెల్‌ పాలన తర్వాత 2021 డిసెంబర్‌లో జర్మనీ ప్రభుత్వాధినేత అయిన షోల్జ్‌ ఆ పైన మన దేశంలో పర్యటించడం ఇదే తొలిసారి. ఆ మాటకొస్తే, 2011 తర్వాత ఒక జర్మన్‌ నేత భారత్‌లో ప్రత్యేకంగా పర్యటించడం కూడా ఇదే ప్రథమం. అలా ఈ తాజా పర్యటనకు విశేష ప్రాధాన్యం ఉంది.



జర్మన్‌ అధినేత వెంట వచ్చిన వ్యాపార ప్రతినిధి బృందంలో సీమెన్స్, శాప్‌ సంస్థలు ఉన్నాయి. ఐటీ, టెలికామ్‌ సహా కీలక రంగాల్లో భారత సంస్థలతో ఒప్పందాలు చేసు కున్నాయి. స్వచ్ఛ ఇంధనం, వాణిజ్యం, నవీన సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాల పటిష్ఠతే లక్ష్యంగా ప్రధాని మోదీతో షోల్జ్‌ విస్తృత స్థాయి చర్చలు జరిపారు. మరీ ముఖ్యంగా, యూరప్‌ తన సరఫరా వ్యవస్థలను చక్కదిద్దుతున్న వేళ షోల్జ్‌ చర్చలు కీలకమయ్యాయి.  



సహజంగానే ఉక్రెయిన్‌ వ్యవహారం అజెండాలో ముందుంది. అయితే, రష్యా వ్యతిరేక వైఖరి తీసుకొనేలా ఒత్తిడి తెచ్చే కన్నా... అందరికీ కావాల్సిన మనిషిగా, మధ్యవర్తిత్వం నెరిపే వీలున్న దేశంగా భారత్‌తో జర్మనీ జత కడుతోంది. జీ20 సారథిగా భారత్‌ ఈ యుద్ధానికి త్వరగా తెరపడేలా చేసి, ఆర్థిక పునరుజ్జీవనం జరిపించాలని భావిస్తోంది. అందుకీ పర్యటనను సాధనంగా ఎంచుకుంది. రష్యా రక్షణ ఉత్పత్తుల సరఫరాలపై భారత్‌ ఆధారపడినందున జలాంతర్గాముల సంయుక్త తయారీ లాంటి అంశాల్లో భారత్‌తో చేయి కలుపుతూ, సరఫరా వ్యవస్థల్లో మార్పుకు చూస్తోంది.



ఈ భౌగోళిక – రాజకీయ సంక్షోభాన్ని కాస్త పక్కనపెడితే, నూతన ఆవిష్కరణలు, సాంకేతిక రంగాల్లో పరస్పర సహకారాన్ని పటిష్ఠం చేసుకొనేలా ఒక దార్శనిక పత్రాన్ని మోదీతో కలసి షోల్జ్‌ ఆమోదించారు. స్వచ్ఛ ఇంధన సాంకేతికత నుంచి కృత్రిమ మేధ (ఏఐ) దాకా పలు హామీలు ఇచ్చిపుచ్చుకున్నారు. రెండు అంతర్‌ ప్రభుత్వ పత్రాలతో పాటు, మూడు వ్యాపార ఒప్పందాల పైనా చేవ్రాలు జరిగింది.  



నూతన ఆవిష్కరణల పత్రంలో ప్రధానంగా హరిత ఉదజని సహా ఇంధన, స్వచ్ఛ సాంకేతి కతల్లో భాగస్వామ్యానికి అగ్ర తాంబూలం ఇచ్చారు. హరిత ఉదజని ఆర్థికంగా గిట్టుబాటయ్యేలా చూడడమే ఉమ్మడి దీర్ఘకాలిక లక్ష్యం. కొన్నేళ్ళుగా ఇరుదేశాల మధ్య సంబంధాలు కీలక రంగాల్లో జోరందుకున్నాయి. గత డిసెంబర్‌లో జర్మన్‌ విదేశాంగ మంత్రి భారత్‌ను సందర్శించారు. షోల్జ్‌ పర్యటనకు రంగం సిద్ధం చేశారు. గత ఏడాది కాలంలో మూడుసార్లు కలసిన మోదీ, షోల్జ్‌ల మధ్య మంచి స్నేహం నెలకొంది.



నిరుడు మేలో 6వ ఇండియా– జర్మనీ అంతర్‌ ప్రభుత్వ సంప్రతింపులలో (ఐజీసీ) ఇరువురు నేతలూ తొలిసారి సమావేశమయ్యారు. ఆపైన జర్మనీ సారథ్యంలోని ‘జీ7’ సదస్సుకు మోదీని షోల్జ్‌ ఆహ్వానించారు. జూన్‌లో ఆ వార్షిక సదస్సులో మోదీ పాల్గొన్నారు. ఇక నవంబర్‌లో ‘జీ20’ సదస్సు వేళ ఇండొనేసియాలో ద్వైపాక్షిక చర్చలతో బంధం బలపడింది.



ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న పలు సవాళ్ళను దీటుగా ఎదుర్కొనే విషయంలో భారత, జర్మనీల దృక్పథం చాలావరకు కలుస్తుంది. నియమానుసారమే అంతర్జాతీయ క్రమం సాగాలనీ, ఐరాస నిబంధనావళిలోని అంతర్జాతీయ న్యాయ ఆదేశిక సూత్రాలను గౌరవించాలనీ ఇరుదేశాల వైఖరి. ఈ అభిప్రాయాలతో పాటు ఇండో– పసిఫిక్‌ విధానంలో భాగంగా అంతర్జాతీయ అవస రాలు, అనివార్యతలు ఉభయ దేశాలనూ మరింత దగ్గర చేశాయి.



యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) – భారత్‌ల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ), ఈయూలో భాగం కాని థర్డ్‌ కంట్రీల్లో అభివృద్ధి పథకాలపై చర్చల్ని త్వరితగతిన ఖరారు చేయాలని జర్మనీ గట్టిగా యత్నిస్తోంది. గతంలో ఆరేళ్ళు చర్చించినా, 2013లో తొలిసారి మన ఎఫ్టీఏ ప్రయత్నం విఫలమైంది. ఇప్పుడు షోల్జ్‌ సైతం ఎఫ్టీఏకు వ్యక్తిగతంగా కట్టుబడ్డారు. ఇవన్నీ ప్రపంచ వేదికపై పెరుగుతున్న భారత్‌ పలుకుబడికి నిదర్శనం. 



జర్మనీ విదేశాంగ మంత్రి ఆ మధ్య అన్నట్టు, ‘ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశంగా చైనాను అధిగమిస్తున్న భారత్‌ను సందర్శిస్తే, ప్రపంచంలో ఆరోవంతును చూసినట్టే.’ అలాగే, ‘21వ శతాబ్దంలో ఇండో– పసిఫిక్‌లోనూ, అంతకు మించి అంతర్జాతీయ క్రమాన్ని తీర్చిదిద్దడంలో నిర్ణయాత్మక ప్రభావం భారత్‌దే.’ ఇక, మన దేశంలో దాదాపు 1800 జర్మనీ సంస్థలు క్రియాశీలంగా ఉన్నాయి. భారత్‌లో భారీ విదేశీ పెట్టుబడుల్లోనూ ముందున్న ఆ దేశం వేలల్లో ఉద్యోగ కల్పనకు కారణమవుతోంది.



ఈ పరిస్థితుల్లో షోల్జ్‌ ఆత్మీయ స్నేహం, అవసరమైన మిత్రుడితో మోదీ అనుబంధం అర్థం చేసుకోదగినవి. 141 కోట్ల జనాభాతో అపరిమిత ఇంధన అవసరాలున్న వేళ, హరిత ఇంధనం సహా అనేక అంశాల్లో జర్మనీతో బంధం భవిష్యత్తుకు కీలకమైనది. ఈ సమయం,సందర్భాలను అందిపుచ్చుకోవడమే భారత్‌కు తెలివైన పని. 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
German Chancellor
Olaf Scholz
Narendra Modi
India tour
Sakshi Editorial
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఇక ఎన్డీఏ వేదిక 'మంగళ్ మిలన్’!

ఇక ఎన్డీఏ వేదిక 'మంగళ్ మిలన్’!

అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభం.. మోదీ ఐదు సంకల్పాలు ఇవే..

అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభం.. మోదీ ఐదు సంకల్పాలు ఇవే..

నడకదారి ఇక పౌరుల హక్కు

నడకదారి ఇక పౌరుల హక్కు

అగ్నిప్రమాదంపై ప్రధాని విచారం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన

అగ్నిప్రమాదంపై ప్రధాని విచారం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన

మీరు గొప్పనేత ఎప్పుడౌతారో ఏమో!

మీరు గొప్పనేత ఎప్పుడౌతారో ఏమో!

అజేయంగా మన సముద్ర శక్తి

అజేయంగా మన సముద్ర శక్తి

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.