Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Editorial
  3. వెంటాడు... వేటాడు...
ADVERTISEMENT 

వెంటాడు... వేటాడు...

Editorial Sakshi User Sakshi Sakshi Time Mar 7, 2023 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
cpr.jpg

పరిశోధన, ప్రజా విధానాలకు సూచన, సలహాల్లో యాభై ఏళ్ళుగా కృషి చేస్తూ, స్వర్ణోత్సవం జరుపుకోవడమనేది ఉత్సాహంగా ముందుకు అడుగేయాల్సిన సందర్భం. కానీ, అందుకు విరుద్ధంగా అడుగులు ముందుకు పడకుండా పాలకులే అడ్డం పడితే? పౌర విధానానికి సంబంధించి దేశంలోకెల్లా అత్యంత గౌరవనీయమైన ఢిల్లీకి చెందిన మేధావుల బృందమైన ‘సెంటర్‌ ఫర్‌ పాలసీ రిసెర్చ్‌’ (సీపీఆర్‌) విషయంలో ఇప్పుడు జరుగుతున్నది అలానే ఉంది.



ఆ సంస్థకు విదేశీ విరాళాలు, ఆర్థిక సహాయం అందే వీలు లేకుండా ‘విదేశీ సహాయ (నియంత్రణ) చట్టం’ (ఎఫ్‌సీఆర్‌ఏ) కింద రిజిస్ట్రేషన్‌ను ఆరు నెలల పాటు కేంద్రం రద్దు చేసింది. ఈ మేరకు కేంద్ర హోమ్‌ మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి 27న ఉత్తర్వులివ్వడం జాతీయ, అంతర్జాతీయ మేధావులను ఉలిక్కిపడేలా చేసింది.



విద్యావిషయిక కార్యక్రమాలకే లైసెన్స్‌ ఇచ్చామనీ, కానీ సీపీఆర్‌ మాత్రం విదేశీ విరాళాలను పుస్తక ప్రచురణ లాంటి వాటికీ వినియోగిస్తోందనీ ఆ ఉత్తర్వుల ఆరోపణ. అయిదు నెలల క్రితం గత సెప్టెంబర్‌లో ఢిల్లీలోని సీపీఆర్‌ కార్యాలయం, అలాగే ఆక్స్‌ఫామ్‌ ఇండియా, పలు డిజిటల్‌ మీడియా సంస్థలకు నిధులిచ్చే బెంగళూరుకు చెందిన ‘ఇండిపెండెంట్‌ అండ్‌ పబ్లిక్‌ స్పిరిటెడ్‌ మీడియా ఫౌండే షన్‌’ (ఐపీఎస్‌ఎంఎఫ్‌)లపై ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ విరుచుకుపడింది. సర్వేలు నిర్వహించింది.



ఆ వెంటనే సిబ్బందికి సమన్లు వెళ్ళాయి. దానికి కొనసాగింపుగా పన్ను మినహాయింపును రద్దు చేస్తామని హెచ్చరిస్తూ, షోకాజ్‌ నోటీసు వెళ్ళాయి. ఒక రకంగా దాని కొనసాగింపే – ఇప్పుడీ లైసెన్స్‌ రద్దు. నిజానికి, లాభాపేక్ష రహిత స్వచ్ఛంద సంస్థగా 1976 నుంచి సీపీఆర్‌కు పన్ను మినహాయింపు లభిస్తోంది. వచ్చే 2027 దాకా మినహాయింపు ఉన్నా, ఇప్పుడీ బెదిరింపులు గమనార్హం. 



ఆదాయపు పన్ను లెక్కల్లో తేడాలుంటే విచారించడం తప్పు కాదు. చట్టం ముందు అందరూ సమానులే గనక ఏమన్నా తప్పు చేసినట్టు రుజువైతే చర్యలు తీసుకోవడమూ తప్పనిసరే. కానీ, మనసులో ఏదో పెట్టుకొని, ఏ చిన్న లోపం కనిపించినా, వెంటాడి వేధించాలని అనుకుంటేనే అది హర్షించలేని విషయం.



ఆ సంస్థ బాధ్యుల్లోని పరిశోధకులు కొందరు ప్రభుత్వ విధానాల్ని తప్పుబడుతూ ఇటీవల రాసిన వ్యాసాలే దీనికి హేతువని ఓ బలమైన విమర్శ. ఎక్కడా, ఏ తప్పూ చేయలేదని తేలినప్పటికీ, సాంకేతిక కారణాలే సాకుగా సీపీఆర్‌ లాంటి స్వతంత్ర మేధాసంస్థను వేధిస్తున్నారన్నది స్పష్టం. కొండను తవ్వి ఎలుకను పట్టే ఈ దీర్ఘకాల ప్రక్రియతో మానసికంగా వేధించడమే పాలక వర్గాల పరమార్థంగా కనిపిస్తోంది. 



నిజానికి, సీపీఆర్‌ అనేది దేశంలోని అగ్రేసర స్వతంత్ర పరిశోధనా సంస్థల్లో ఒకటి. విభిన్నరంగాలకు చెందిన పరిశోధకులు, వృత్తినిపుణులు, విధాన నిర్ణేతలతో కూడిన మేధావుల బృందం ఇది. ఈ లాభాపేక్ష రహిత సంస్థ 50 ఏళ్ళ క్రితం 1973లో ఏర్పాటైంది. ప్రభుత్వ విధానాల్లోని వివిధ అంశాలపై ఈ సంస్థలోని బుద్ధిజీవులు దృష్టి సారిస్తుంటారు.



ఆర్థికవేత్త – మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్, భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి వై.వి. చంద్రచూడ్‌ సహా పలువురు మేధావులు ఈ సంస్థ కార్యవర్గంలో మాజీ సభ్యులు. అనేక కేంద్ర శాఖలతో, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాలతోనూ కలసి పనిచేసిన ఈ సంస్థను భారత ప్రభుత్వం గుర్తించింది. దశాబ్దాలుగా పన్ను మినహాయింపూ ఇస్తోంది. గత ఏడాదీ వివిధ రాష్ట్రాలు, కేంద్ర శాఖల నుంచి సీపీఆర్‌కు నిధులు వచ్చాయి. 



మరి, ఉన్నట్టుండి సీపీఆర్‌ జీవితం మీద పాలకులకు ఎందుకు విరక్తి కలిగినట్టు? దీనికి రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో పనిచేస్తున్న ‘జన అభివ్యక్తి సామాజిక్‌ వికాస్‌ సంస్థ’ (జస్వాస్‌) సహా దాదాపు 30 సంస్థలకు డేటా సేకరణ, పర్యావరణ చట్టం సహా పలు అంశాల్లో పరిశోధనకు సీపీఆర్‌ నిధులిచ్చింది.



ఛత్తీస్‌గఢ్‌లో ఏనుగులు తిరిగే జీవవైవిధ్య ప్రాంతం హస్‌దేవ్‌లో బొగ్గు గనుల అక్రమ తవ్వకంపై ఆదివాసీ ఉద్యమంలో జస్వాస్‌ ట్రస్టీ అయిన ఒక పరిశోధకుడి భాగం కూడా ఉంది. ఆ గనులు పాలకుల ఆశీస్సులున్న వ్యాపార సంస్థవనీ, ఆ ఉద్యమానికీ – సీపీఆర్‌తో జస్వాస్‌ భాగస్వామ్యానికీ సంబంధం లేకున్నా పాలకులకు అది కోప కారణమైందనీ విశ్లేషకుల మాట. కారణాలు ఏమైనా, ఏలినవారికి కోపమొస్తే బండి నడవడం కష్టమనే విషయం తాజా సీపీఆర్‌ లైసెన్స్‌ రద్దుతో మరోసారి రుజువు చేస్తోంది. 



గమనిస్తే – ఐటీ విభాగం తన నోటీసుల్లో పేర్కొన్న పరిశీలనలు, చేసిన ఆరోపణలు దాని పరిధిని దాటి ఉన్నాయి. ఇది పాలకులపై అనుమానాలకు ఊతమిస్తోంది. సీపీఆర్‌ మాత్రం తమ కార్యకలాపాలన్నీ చట్టబద్ధమైనవేననీ, ప్రభుత్వ సంస్థలు తమ ఆదాయ వ్యవహారాలను ఎప్పటి కప్పుడు ఆడిట్‌ చేస్తూనే ఉన్నాయనీ స్పందించింది. రాజ్యాంగ విలువల స్ఫూర్తితో ఈ వివాదం వీలైనంత త్వరలో సమసిపోతుందని అభిలషించింది.



ఆ అభిలాష వాస్తవరూపం ధరిస్తే సంతో షమే. అయితే, పాలకులు తమ చేతుల్లోని దర్యాప్తు సంస్థలనూ, విభాగాలనూ దుర్వినియోగం చేయ డానికి ఏ మాత్రం వెనుకాడని గతం, వర్తమానమే భయపెడుతున్నాయి. నిబంధనల్లోని సాంకేతిక అంశాలను ఆయుధంగా చేసుకొని, భావప్రకటన స్వేచ్ఛకున్న అవకాశాల్ని అడ్డుకోవాలని పాలకులు చూడడం ఆందోళన రేపుతోంది.



ఐటీనైనా, విదేశీ స్వార్థ ప్రయోజనాలు మన దేశ రాజకీయాలను ప్రభావితం చేయరాదని పెట్టుకున్న ఎఫ్‌సీఆర్‌ఎ లాంటి నియంత్రణ వ్యవస్థనైనా ప్రభుత్వేతర సంస్థల పీక నులమడానికి వాడితే అది అప్రజాస్వామికమే కాదు... అచ్చమైన ప్రతీకారమే! 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Income Tax (IT)
Government of India
cpr
Ministry of Home Affairs
intellectuals
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

Income Tax: నోటీసుకి బదులివ్వండి..

Income Tax: నోటీసుకి బదులివ్వండి..

రూపాయిని ఎంతకాలం నిలబెడతారు?

రూపాయిని ఎంతకాలం నిలబెడతారు?

ఆదాయపన్ను వసూళ్లు రూ.5.21 లక్షల కోట్లు

ఆదాయపన్ను వసూళ్లు రూ.5.21 లక్షల కోట్లు

ఆంక్షల చట్రంలో సిరప్‌లు

ఆంక్షల చట్రంలో సిరప్‌లు

అడ్వాన్స్ ట్యాక్స్ డెడ్‌లైన్‌ రేపే..

అడ్వాన్స్ ట్యాక్స్ డెడ్‌లైన్‌ రేపే..

వైభవ్ సూర్యవంశీ ట్యాక్స్ ఎవరు కట్టాలి?: రూల్స్ ఏం చెబుతున్నాయ్!

వైభవ్ సూర్యవంశీ ట్యాక్స్ ఎవరు కట్టాలి?: రూల్స్ ఏం చెబుతున్నాయ్!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.