Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Editorial
  3. తూటాలతో తక్షణ  న్యాయం?
ADVERTISEMENT 

తూటాలతో తక్షణ  న్యాయం?

Editorial Sakshi User Sakshi Sakshi Time Apr 18, 2023 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Atiq.jpg

కంటికి కన్ను... పంటికి పన్ను లాంటి డైలాగులు, వెంటాడి వేటాడడాలు తెరపై చూస్తాం. నిజ జీవితంలో పదులకొద్దీ సాయుధ పోలీసుల కళ్ళెదుట, టీవీ కెమెరాల ముంగిట అలా జరగడం ఒళ్ళు జల దరించే అనుభవం. రాజకీయాల్లోకొచ్చిన నేరసామ్రాజ్యనేత అతీక్‌ అహ్మద్, ఆయన తమ్ముడు ఖాలిద్‌ అజీమ్‌ అలియాస్‌ అష్రాఫ్‌లు యూపీలో పోలీస్‌ కస్టడీలో ఉండగా, మీడియా ముసుగులో వచ్చి ముగ్గురు కుర్రాళ్ళు చంపిన తీరు అలాంటిదే.



హత్యలు, అపహరణలకు పాల్పడి నూటికిపైగా కేసులున్న నేరగాడిగా పేరుమోసిన అతీక్‌ జీవితంలో హింసను నమ్మి, చివరకు హింసలోనే చనిపోవడం కవితాత్మక న్యాయంగా కనిపించవచ్చు. కానీ కరడుగట్టిన నేరస్థుణ్ణి సైతం చట్టబద్ధంగా విచారించి కోర్ట్‌లో కఠినశిక్ష విధించాలి. తక్షణశిక్షలతో సత్వరన్యాయం జరపాలనిచూస్తే అన్యాయమే.  



‘మాఫియా కో మిట్టీ మే మిలా దూంగా’ (మాఫియాను మట్టిలో కలిపేస్తాను) అని అసెంబ్లీ సాక్షిగా గర్జించిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఈ నెలలోనే కనీసం 3 ఎన్‌కౌంటర్లకు మౌనసాక్షి. విషాదం ఏమిటంటే, ఈ సర్కారీ ప్రేరేపిత హింసను పౌర సమాజం సైతం అభ్యంతర పెట్టకుండా, ఆమోదిస్తూ ఉండడం. పరారీలో ఉన్న అతీక్‌ కుమారుడు ‘ఆత్మరక్షణకు పోలీసుల ఎదురుకాల్పుల్లో’ గురువారం ఝాన్సీలో చనిపోతే, శనివారం రాత్రి ప్రయాగరాజ్‌లో పోలీసుల ఎదుటే కాల్పుల్లో అతీక్‌ ప్రాణాలు విడిచాడు.



రాజకీయ ప్రత్యర్థి ఉమేశ్‌పాల్‌ హత్యలో తండ్రీ కొడుకులిద్దరూ నింది తులు. అతీక్‌ హత్యపై  రిటైర్డ్‌ జడ్జీ సారథ్యంలో కమిషన్‌ వేశారు యోగి. తీరా మంత్రులే ఈ మర ణాలు ‘కర్మ ఫలిత’మనీ, ‘దేవుడి న్యాయ’మనీ వ్యాఖ్యానిస్తుంటే ఇక విచారణలో ఏం తేలుతుంది!



అతీక్‌ను ఎవరో చంపారనీ, వ్యవస్థ ప్రమేయం లేదనీ నమ్మలేం. చట్టప్రకారం ఏప్రిల్‌ 13న కస్టడీకి కోర్టు అప్పగించిన వెంటనే వైద్యపరీక్షలు జరపాల్సిన పోలీసులు 15వ తేదీ రాత్రి దాకా ఎందుకు ఆలస్యం చేశారు? సాధారణ పరీక్షలకు అసాధారణంగా ఆ రాత్రివేళను ఎందుకు ఎంచు కున్నారు? సంకెళ్ళు వేయరాదని కోర్టు తీర్పులున్నా సరే ఎందుకు వేశారు? కాలిస్తే ఒకరికొకరు దూరం జరిగే వీలైనా లేకుండా హతులిద్దరికీ కలిపి ఒకే పొడవాటి సంకెల ఎందుకేశారు? ప్రాణహాని ఉన్న నేరస్థులని తెలిసినా బందోబస్తులో ఎందుకు నిర్లక్ష్యం వహించారు? ఆ సమయానికి వారు అక్కడికలా నడుచుకుంటూ వస్తారని కాల్పులు జరిపిన కుర్రాళ్ళకెలా తెలిసింది? ఘోర నేర చరిత్రలేమీ లేని వారి చేతికి ఆధునిక విదేశీ తుపాకీలెలా వచ్చాయి? ఇలా ఎన్నో ప్రశ్నలు. వెరసి, యూపీలో శాంతిభద్రతలకు టీవీ ప్రత్యక్షప్రసారాలకు చిక్కిన ఈ హత్యలే ప్రతీక. కస్టడీలోని వారికైనా కనీస భద్రత కల్పించలేని పోలీసు వ్యవస్థ ఘనతకు ఉదాహరణ. 



ఇంతకీ నకిలీ ఎన్‌కౌంటర్లు, సర్కారీ ప్రేరేపిత హత్యల ద్వారా యూపీ సర్కార్‌ ఏ సంకేతాలు పంపాలని చూస్తోంది? పట్టుమని 17 ఏళ్ళకే కేసులకెక్కి, 60 ఏళ్ళ వయసులో ఇప్పుడు ప్రాణాలు పోగొట్టుకున్న అతీక్‌ ఇన్నేళ్ళుగా రాజకీయపార్టీల్లో కొనసాగుతూ, ఇష్టారాజ్యంగా దంధా కొనసాగించడం 1990ల నుంచి మన రాజకీయ, ప్రభుత్వ వ్యవస్థల పుణ్యమే. జైలుకెళ్ళినా చక్రం తిప్పిన అతీక్‌ను 2019లో గుజరాత్‌లో జైలుకు మార్చారు.



ఇటీవలే యూపీకి పట్టుకొచ్చారు. తాజా ఘటనతో ఈ డాన్‌ కథ ముగిసింది. కానీ, చేసిన నేరాలూఘోరాలూ ఎన్నయినా, ఎంత పెద్దవైనా కావచ్చు. విచారణ లేకుండా తక్షణన్యాయమే పరిష్కారమనే ప్రభుత్వాల ధోరణి రాజ్యాంగ విహిత న్యాయసూత్రాలకే విరుద్ధం. సమదృష్టితో సాగాల్సిన వ్యవస్థలపై విశ్వాసానికి విఘాతం. 



యూపీలో యథేచ్ఛగా సాగుతున్న ఎన్‌కౌంటర్లపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం నాలుగేళ్ళ క్రితమే 2019 జనవరిలో ఆందోళన వ్యక్తం చేసింది. 2017 మార్చిలో యోగి సర్కార్‌ ఏర్పాటైనప్పటి నుంచి అలాంటి 15 కేసుల పూర్తి సమాచారాన్ని అప్పట్లోనే భారత ప్రభుత్వానికి పంపింది. ఆ కేసుల్లో బాధితులందరూ నిరుపేద మైనారిటీలే.



తాజా డేటా ప్రకారం గత ఆరేళ్ళ యోగి పాలనలో 10,900కు పైగా పోలీస్‌ ఎన్‌కౌంటర్లు జరిగాయి. నిందితులు 183 మంది పోలీసు తూటాలకు ప్రాణాలు కోల్పోయారు. నిజానికి, నకిలీ ఎన్‌కౌంటర్లపై ఆందోళనతో జాతీయ మానవ హక్కుల సంఘం ఎప్పుడో మార్గదర్శకాలిచ్చింది. కానీ గద్దె మీది పెద్దలు తలుచు కున్నప్పుడల్లా అవి గాలికి పోతున్నాయి. వెరసి నేర న్యాయవ్యవస్థ కుప్పకూలి, పోలీస్, న్యాయ వ్యవస్థల్లో సంస్కరణలు అవసరమని గుర్తు చేస్తున్నాయి.



ఇక, గత నవంబర్‌లో అమృత్‌సర్‌లో ఓ హిందూ రాజకీయ నేత ఇలాగే మీడియా ముందు కాల్పులకు గురై చనిపోయినప్పుడు సోకాల్డ్‌ మేధావులు ఇంత రచ్చ చేయలేదేమిటన్నది ఓ వాదన. జరిగిన దారుణాన్ని బట్టి కాక, మతాన్ని బట్టి గగ్గోలు పెడుతున్నారనీ వారి ఆరోపణ. చిత్రంగా మారణకాండలో సైతం మతం చొచ్చుకొచ్చిన రోజులివి. అతీక్‌ కుమారుడు ఎన్‌కౌంటరైనప్పుడు అధికార పార్టీ యువజన విభాగం టపాసులు కాల్చి, సంబరాలు చేసుకుంది. అది ఆందోళన రేపే ధోరణి. అది మరవక ముందే ప్రాణహాని ఉందంటూ అతీక్‌ సుప్రీం కోర్ట్‌లో భయపడినట్టే జరిగింది.



అంతకన్నా భయపడాల్సిందేమిటంటే – హతులు ముస్లిమ్‌లైనప్పుడల్లా హంతకులు జైశ్రీరామ్‌ నినాదాలు చేయడం. ప్రజలను వర్గాలుగా చీల్చే ఈ ప్రయత్నాలు, దేవుడి పేరు అడ్డంపెట్టి దారుణా లకు ఒడిగట్టే తీరు సమాజానికి క్యాన్సర్‌ కన్నా ప్రమాదకరం. ఏ వర్గం ఇలాంటి దుశ్చర్యలకు దిగినా గర్హనీయమే. ‘డబుల్‌ ఇంజన్‌’, ‘బుల్‌డోజర్‌’ లాంటి మాటలతో మళ్ళీ కేంద్రంలో గద్దెనెక్కదలచిన పార్టీలూ, కాబోయే ప్రధానిగా ప్రచారమవుతున్న యూపీ నేతలూ అది గమనించాలి.  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Atiq Ahmed
assassination case
Mafia
Yogi Adityanath
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

‘అయోధ్య’ విరాళాల్లో గోల్‌మాల్‌: ‘సిట్’కు షాకిచ్చిన ఫుటేజ్!

‘అయోధ్య’ విరాళాల్లో గోల్‌మాల్‌: ‘సిట్’కు షాకిచ్చిన ఫుటేజ్!

యోగి ఆదిత్యనాథ్ కీలక నిర్ణయం

యోగి ఆదిత్యనాథ్ కీలక నిర్ణయం

కల నిజమాయెగా..!

కల నిజమాయెగా..!

అఖిలేష్‌ కుమార్తెకు న్యాయం చేస్తా : సీఎం యోగి

అఖిలేష్‌ కుమార్తెకు న్యాయం చేస్తా : సీఎం యోగి

గంటా ఇమేజ్ డ్యామేజ్, చుక్కలు చూపిస్తున్న అల్లుడు

గంటా ఇమేజ్ డ్యామేజ్, చుక్కలు చూపిస్తున్న అల్లుడు

అపుడు సస్పెన్షన్‌, ఇపుడు సీఎం యోగీ ఎలివేషన్‌, ఎవరీ దుర్గా శక్తి?

అపుడు సస్పెన్షన్‌, ఇపుడు సీఎం యోగీ ఎలివేషన్‌, ఎవరీ దుర్గా శక్తి?

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.