Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Editorial
  3. నాటో ఆయుధ పూజ!
ADVERTISEMENT 

నాటో ఆయుధ పూజ!

Editorial Sakshi User Sakshi Sakshi Time Jun 28, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
trump.jpg

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ గత ఏలుబడి నుంచీ నాటో కూటమిపై తెస్తున్న ఒత్తిళ్లు ఫలించాయి. గత డెబ్బయి ఆరేళ్లుగా తమ భద్రతను అమెరికాకు అప్పగించి నిష్పూచీగా ఉంటున్న ఆ దేశాలు ఎట్టకేలకు రక్షణ బడ్జెట్‌లను పెంచాలని తీర్మానించాయి. ఈ వ్యయం ఏటా పెరుగుతూ వాటి జీడీపీల్లో 5 శాతానికి చేరుకుంటుంది. ప్రస్తుతం ఆ దేశాల వ్యయం 2 శాతం మాత్రమే. ఇన్నాళ్లూ ట్రంప్‌ను పెద్దగా లెక్కచేయని ఆ దేశాలు బుధవారం నెదర్లాండ్స్‌లోని ది హేగ్‌లో శిఖరాగ్ర సదస్సు నిర్వహించి ఆయన్ను ఆకాశానికెత్తేశాయి. 

నాటో సెక్రటరీ జనరల్‌ మార్క్‌ రుట్‌ అయితే ‘డాడీ’ అంటూ సంబోధించి, కేవలం ఆయన వల్లనే ఇన్నాళ్లకు వాస్తవ పరిస్థితులను గ్రహించి ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రశంసించారు. 12 దేశాలతో మొదలైన నాటో కూటమి ఇప్పుడు 32 సభ్య దేశాలతో కిక్కిరిసింది. అందరికందరూ అమెరికానూ, ట్రంప్‌నూ పొగడ్తలతో ముంచెత్తారు. ఇరాన్‌కు తన స్థానమేమిటో తెలియజెప్పి ఇజ్రాయెల్‌–ఇరాన్‌ యుద్ధం ఆపిన శాంతిదూతగా అభివర్ణించారు. ఈ ప్రహసనమంతా గమనిస్తే – నాటో దేశాల పరాధీనత, తమ ఆత్మగౌరవం పట్ల లేశమాత్రమైనా పట్టింపు లేని నిస్సహాయత కనబడతాయి. 

కానీ సదస్సు పొడవునా గంభీర వదనంతో ఉండిపోయిన ట్రంప్‌ ప్రశంసలకు పొంగిపోయినట్టు కనబడలేదు. రష్యాపై పోరాడుతున్న ఉక్రెయిన్‌కు సాయం అందిస్తామని ఒక్క మాటైనా అనలేదు. తమ వంతుగా నాటో దేశాలు కూడా దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఉమ్మడి ప్రకటనలో రష్యా వల్ల దీర్ఘకాలిక బెడద ఉంటుందనీ, ఉక్రెయిన్‌కు మద్దతు కొనసాగుతుందనీ ఒక వాక్యంలో ప్రస్తావించి ఊరుకున్నారు. అంతకుమించితే ట్రంప్‌కు ఆగ్రహం కలుగుతుందన్న భయం ఉన్నట్టుంది. కూటమి తరఫున దృఢంగా నిలబడ తామని ట్రంప్‌ ఇచ్చిన హామీ ఒక్కటే కాస్త ఉపశమనం కలిగించే మాట.

సమష్టి భద్రత కోసం రక్షణ వ్యయాన్ని జీడీపీలో 5 శాతానికి  తీసుకెళ్లటం తమ ఉక్కుసంకల్పమని ఉమ్మడి ప్రకటన అభివర్ణించటం బాగానేవున్నా దాన్ని పరిపూర్తి చేయటానికి ఆ దేశాల ప్రజానీకం చాలా ‘త్యాగాలు’ చేయాల్సి ఉంటుంది. స్పెయిన్‌ ప్రధాని పెడ్రో సాంచెజ్‌ అన్నట్టు పింఛన్లకూ, సంక్షేమ పథకాలకూ కత్తెరేయాలి. ఇది తమకు అసాధ్యమని కుండబద్దలు కొట్టారు. ప్రశంసల ప్రవాహంలో ఆయనొక్కడిదే భిన్నస్వరం. అందుకే సాంచెజ్‌పై ట్రంప్‌ విరుచుకు పడ్డారు. సుంకాలతో అంతకంతా వసూలు చేస్తానని హెచ్చరించారు. అటు తర్వాత బెల్జియం, స్లోవేకియాలు సాంచెజ్‌తో గొంతు కలిపాయి. 

ఈ మూడు దేశాలకు మాత్రమే కాదు... నాటోలోని ఇతర దేశాలకు సైతం జీడీపీల్లో 5 శాతం లక్ష్యాన్ని చేరటం ప్రాణాంతకం. కోతలపై, పొదుపు చర్యలపై పౌరుల నిరసనలు మిన్నంటుతాయి. నాటో దేశాలు ఇంత కాలమూ రక్షణ రంగం కన్నా వైద్య, విద్యారంగాలకే ప్రాధాన్యమిస్తున్నాయి. ట్రంప్‌కిచ్చిన హామీ నెరవేర్చాలంటే ఇకపై పాఠశాలల కన్నా ఆయు ధాలకే అధిక వ్యయం చేయాల్సి ఉంటుంది. ఈ సీజన్‌లో అమెరికాతోపాటు యూరప్‌ దేశాల్లో కూడా ఎండలు మండిపోతున్నాయి. 1950 తర్వాత ఈ స్థాయి ఉష్ణోగ్రతలు లేవని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మున్ముందు ఇంకా పెరుగుతాయంటున్నారు. కానీ ఈ దేశాలు రక్షణ వ్యయం పెంచటానికి పర్యావరణ పరిరక్షణ నిధులకు సైతం కోతపెట్టాల్సి వస్తుంది.

అసలు రష్యా రేపో మాపో దాడికి దిగుతుందని ఊదరగొడుతున్న నాటో... ఆ భయాందో ళనలకు ప్రాతిపదికేమిటో ఇంతవరకూ చెప్పలేదు. ఇన్ని దశాబ్దాల నాటో చరిత్రలో ఒక్కసారి కూడా రష్యా పూర్వరూపమైన సోవియెట్‌ ఏనాడూ దండెత్తిరాలేదు. అది 1956లో హంగెరీ, 1968లో చెకొస్లోవేకియా, 1979లో అఫ్గానిస్తాన్‌లలో దురాక్రమణలకు పూనుకున్నది. నాటోలో భాగమైన పశ్చిమ యూరప్‌ దేశాలపైగానీ... ఆ మాటకొస్తే ఫిన్లాండ్, స్వీడన్, స్విట్జర్లాండ్, యుగోస్లేవియా, ఆస్ట్రియా వంటి తటస్థ దేశాల జోలికిగానీ పోలేదు. 

పైగా అప్పట్లో పశ్చిమ జర్మనీ ఛాన్సలర్‌గా ఉన్న విలీ బ్రాంట్‌ సోవియెట్‌ ఛత్రఛాయలో ఉన్న తూర్పు యూరప్‌ దేశాలతో సఖ్యతకు ప్రయత్నించారు. అంతేకాదు... స్వీడన్‌ ప్రధాని ఓలోఫ్‌ పామే ఆధ్వర్యంలో 1982లో ఒక కమిషన్‌ నియమించారు. రెండు యూరప్‌లూ విన్యాసాల సమయంలో అవతలి వారికి ముందస్తు సమాచార మీయటం, నిరంతరం సంభాషించుకుంటూ పరస్పర విశ్వాసాన్ని పెంచుకోవటం చేయాలని ఆ కమిషన్‌ సిఫార్సు చేసింది. ఈ శాంతి యత్నాలకు మెచ్చి విలీ బ్రాంట్‌కు 1971లో నోబెల్‌ శాంతి బహుమతి ఇచ్చారు. ఆ బహుమతి కోసం వెంపర్లాడుతున్న ట్రంప్‌కు ఈ చరిత్ర తెలిస్తే మంచిది.

ఆయుధాలు పోగేస్తూ పోతే భద్రత భేషుగ్గా ఉంటుందని నాటోకు ఎవరు నూరిపోస్తున్నారో గానీ... అందువల్ల ఆయుధ బేహారులు మాత్రమే బాగుపడతారు. నిరుడు నాటో రక్షణ వ్యయం 1.47 లక్షల కోట్ల డాలర్లు. ఇందులో అమెరికా వాటా 93,500 కోట్ల డాలర్లు. మిగిలిన 53,500 కోట్ల డాలర్లు యూరప్‌ దేశాలది. నాటోలో సభ్యత్వం లేని ఉక్రెయిన్‌ తరఫున దౌత్యం నెరపి, రష్యాకు నచ్చజెబితే ఈ మాత్రం కూడా ఖర్చయ్యేది కాదు. భద్రత, రక్షణ చర్చల ద్వారా సాధ్యం తప్ప రక్షణ వ్యయం పెంచుకుంటూ పోవటం ప్రత్యామ్నాయం కాదు. 

వాస్తవానికి అమెరికాతో కలిసి అఫ్గాని స్తాన్, ఇరాక్‌ , సిరియా తదితర దేశాలపై... సొంతంగా బోస్నియా, హెర్జెగోవినా, లిబియాలపై దాడులు చేసి విధ్వంసం సృష్టించింది నాటోయే! సురక్షితమైన, భద్రమైన ప్రపంచాన్ని సృష్టించటం... వాతావరణ సంక్షోభాలను అధిగమించటం వర్తమాన యుగ అవసరం. అందుకు భిన్నంగా ఆయుధ పూజకు పూనుకుంటే నాటో దేశాలతోపాటు ప్రపంచమంతా నష్టపోతుంది. 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Donald trump
NATO
defense budget
Editorial.
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

హర్ముజ్‌ జలసంధిపై కొత్త ఆధిపత్య పోరు!

హర్ముజ్‌ జలసంధిపై కొత్త ఆధిపత్య పోరు!

మళ్లీ ట్రిగ్గర్‌ నొక్కిన ట్రంప్.. మరింత ముదిరిన యుద్ధం

మళ్లీ ట్రిగ్గర్‌ నొక్కిన ట్రంప్.. మరింత ముదిరిన యుద్ధం

పుతిన్‌ తగ్గేదేలే.. మళ్లీ మంటలు రేపే యుద్ధమా?

పుతిన్‌ తగ్గేదేలే.. మళ్లీ మంటలు రేపే యుద్ధమా?

భీకరంగా మారిన అమెరికా-ఇరాన్‌ యుద్ధం!

భీకరంగా మారిన అమెరికా-ఇరాన్‌ యుద్ధం!

వాన్స్‌ను ముందుకు నెట్టి.. ట్రంప్‌ సేఫ్‌ గేమ్?

వాన్స్‌ను ముందుకు నెట్టి.. ట్రంప్‌ సేఫ్‌ గేమ్?

అమెరికా డీల్‌ను నెతన్యాహు చెడగొడుతున్నారా?

అమెరికా డీల్‌ను నెతన్యాహు చెడగొడుతున్నారా?

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.