Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Editorial
  3. వెనిజులాపై ట్రంప్‌ పంజా
ADVERTISEMENT 

వెనిజులాపై ట్రంప్‌ పంజా

Editorial Sakshi User Sakshi Sakshi Time Dec 3, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
trump.jpg

మొన్నటివరకూ నోబెల్‌ శాంతి బహుమతి కోసం తెగ తాపత్రయపడిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఇప్పుడు యుద్ధవీరుడి అవతారమెత్తారు. మాదకద్రవ్యాల అడ్డాగా మారి అమెరికా వినాశనానికి కంకణం కట్టుకున్నదని ఆరోపిస్తూ దక్షిణ అమెరికా దేశమైన వెనిజులాపై కత్తులు నూరుతున్నారు. అక్కడ ‘కార్టెల్‌ ఆఫ్‌ సన్స్‌’ అనే అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఉన్నదని ప్రకటించి, దాన్ని నిషేధించారు. అదంతా అబద్ధమని వెనిజులా చెబుతోంది. మొన్న ఆగస్టు నుంచి కరీబియన్‌ దీవులకు 10,000 మంది సైనికులనూ, అతి పెద్ద విమాన వాహక నౌకనూ, క్షిపణులు వగైరా ఆయుధ సామగ్రినీ తరలించిన అమెరికా ఆ మరుసటి నెల 2న వెనిజులా నుంచి పోతున్న పడవలపై దాడి చేసి 11 మందిని హతమార్చింది. 

ఇవి మాదకద్రవ్యాలు తరలిస్తున్నాయని ఆరోపించింది. ఆ సాకుతోనే 22 దాడుల్లో 83 మంది ప్రాణాలు తీసింది. ఇందులో ఏ ఉదంతానికీ అమెరికా దగ్గర సాక్ష్యాధారాలు లేవు. ఈమధ్య వెనిజులా అధ్యక్షుడు నికోలస్‌ మదురోకు ట్రంప్‌ ఫోన్‌ చేసి అధికారం వదిలిపెట్టి దేశం వదిలి పారిపోవాలని హెచ్చరించారు. వెనిజులా గగనతలాన్ని మూసివేసినట్టు ప్రకటించారు. 

తాజాగా బయటపడిన వీడియో ట్రంప్‌ ప్రభుత్వ హంతక మనస్తత్వాన్ని తెలియ జేస్తోంది. దాడిలో పడవలోని 9 మంది ప్రయాణికులు చనిపోగా, ఇద్దరు బతికి బయట పడ్డారు. వెనువెంటనే మళ్లీ దాడిచేసి ఆ ఇద్దర్నీ కూడా చంపేశారు. మొదట్లో ఆ దాడి గురించి అతిశయోక్తులు చెప్పిన ట్రంప్, వీడియో బయటపడగానే స్వరం మార్చారు. పడవలోని వారందరినీ చంపేయమని రక్షణమంత్రి పీట్‌ హెగ్సెత్‌ ఆదేశించటం వల్లే ఇలా చేశామని సైనికాధికారులు చెబుతుండగా, అలా చెప్పలేదని హెగ్సెత్‌ అంటున్నారు. అది తప్పేనన్నట్టు ట్రంప్‌ సంజాయిషీ ఇస్తున్నారు. ఈ ఉదంతంపై రిపబ్లికన్లలోనే విభేదాలు బయల్దేరాయి. ప్రతినిధుల సభ అనుమతి లేకుండా దండయాత్రకు అసలు ఎలా దిగుతారంటూ డెమోక్రాట్లు, రిపబ్లికన్లు నిలదీస్తున్నారు. ఈ వ్యవహారంలో దర్యాప్తు మొదలుకాబోతోంది.

సంక్షోభాన్ని సృష్టించటం, ఒక సార్వభౌమాధికార దేశం ప్రమాదకరంగా పరిణమించిందని ఆరోపించటం, ఆ సాకుతో దురాక్రమణకు ప్రయత్నించటం అమెరికాకు అలవాటు. వేరే దేశం గగనతలాన్ని మూసేసినట్టు చెప్పటం అంతర్జాతీయ న్యాయసూత్రాలకు విరుద్ధం. సమస్యలుంటే, సాక్ష్యాధారాలుంటే దౌత్యపరంగా పరిష్కరించు కోవటానికి ప్రయత్నించాలి. నిజానికి వెనిజులాపై అమెరికా కడుపుమంట ఈనాటిది కాదు. అక్కడి భూగర్భంలో చమురు, సహజవాయు నిక్షేపాలు, వజ్రాలు, బంగారం వగైరాలున్నాయి. 

బహుళజాతి సంస్థల ద్వారా వాటిని కైంకర్యం చేస్తూ వచ్చిన అమెరి కాకు 1999లో తొలిసారి హ్యూగో చావెజ్‌ రూపంలో ఆటంకం ఎదురైంది. ఆయన అధికారంలోకొచ్చిన వెంటనే దాన్నంతటినీ ఆపేశారు. అప్పటినుంచి ఏదో వంకన వెనిజులాను హస్తగతం చేసుకోవాలని అమెరికా ప్రయత్నిస్తోంది. చావెజ్‌ అనారోగ్యంతో మరణించాక 2013లో అధికారంలోకొచ్చిన మదురోను ఇబ్బందిపెట్టని రోజంటూ లేదు. క్రితంసారి ఏలుబడిలో ట్రంప్, వెనిజులా నుంచి పారిపోయివచ్చిన జువాన్‌ గైదోను దేశాధ్యక్షుడిగా ప్రకటించి భంగపడ్డారు. అక్కడ జరిగిన ఎన్నికలు అప్రజాస్వామికమంటూ విరుచుకుపడ్డారు. ఇప్పుడు ఆ గైదో ఏమయ్యాడో తెలియదు. ఈసారి మాదక ద్రవ్యాల సాకుతో కత్తిగట్టారు.  

ట్రంప్‌కు మాదకద్రవ్యాలు అరికట్టే ఉద్దేశం ఉందా? ఉంటే కొకైన్‌ తరలింపు కేసులో నిరుడు అమెరికా కోర్టు 45 ఏళ్ల శిక్ష విధించిన హోండురస్‌ మాజీ అధ్యక్షుడు జువాన్‌ ఓర్లాండోకు క్షమాభిక్ష పెడతామని గతవారం ట్రంప్‌ ఎలా చెప్పగలిగారు? వెనిజులాపై సైనిక చర్యకు 70 శాతం మంది అమెరికన్లు వ్యతిరేకమని సీబీఎస్‌ సర్వే వెల్లడించింది. సైనిక జోక్యం పేరిట ఇప్పటికే అమెరికా ఆర్థిక వ్యవస్థ గుల్లయిందని, వాటి జోలికి పోవద్దని మెజారిటీ అమెరికన్లు కోరుకుంటున్నారు. నిజానికి అలాంటి హామీతోనే ట్రంప్‌ అధికారంలోకొచ్చారు. ఇప్పుడు అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. ఉక్రెయిన్‌ యుద్ధం నిలుపుదల చేస్తానంటూనే మరో యుద్ధానికి అంకురార్పణ చేస్తున్న ట్రంప్‌ పోకడ ప్రమాదకరం. అమెరికాకు మాత్రమే కాదు, ప్రపంచానికే ఇది పెను ముప్పు. దీన్ని తక్షణం కట్టిపెట్టాలి. 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Drugs
USA
Donald trump
South America
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

హర్ముజ్‌ జలసంధిపై కొత్త ఆధిపత్య పోరు!

హర్ముజ్‌ జలసంధిపై కొత్త ఆధిపత్య పోరు!

మళ్లీ ట్రిగ్గర్‌ నొక్కిన ట్రంప్.. మరింత ముదిరిన యుద్ధం

మళ్లీ ట్రిగ్గర్‌ నొక్కిన ట్రంప్.. మరింత ముదిరిన యుద్ధం

పుతిన్‌ తగ్గేదేలే.. మళ్లీ మంటలు రేపే యుద్ధమా?

పుతిన్‌ తగ్గేదేలే.. మళ్లీ మంటలు రేపే యుద్ధమా?

భీకరంగా మారిన అమెరికా-ఇరాన్‌ యుద్ధం!

భీకరంగా మారిన అమెరికా-ఇరాన్‌ యుద్ధం!

ప్రపంచకప్‌ నుంచి అమెరికా నిష్క్రమణ

ప్రపంచకప్‌ నుంచి అమెరికా నిష్క్రమణ

హార్మూజ్‌పై ఇరాన్ షాకింగ్‌ కామెంట్స్‌.. స్ట్రాంగ్‌ వార్నింగ్

హార్మూజ్‌పై ఇరాన్ షాకింగ్‌ కామెంట్స్‌.. స్ట్రాంగ్‌ వార్నింగ్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.