మండ్య: తీవ్రమైన కడుపు నొప్పిని భరించలేక యువతి ఒకరు ప్రాణాలు తీసుకుంది. మండ్య జిల్లాలోని పాండవపుర తాలూకాలోని కణివెకొప్పలు గ్రామంలో సోమవారం ఈ సంఘటన జరిగింది. న్యాయవాది కణివె యోగేష్ కుమార్తె అయిన గౌతమి (21) కొంత కాలంగా తరచూ కడుపునొప్పితో బాధపడుతోంది. వైద్యులతో చికిత్స చేయించినా ప్రయోజనం లేకపోయింది. ఉదయం ఇంటిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొంది. పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు.
ADVERTISEMENT
ADVERTISEMENT