భువనేశ్వర్: ఒడిశాలో విషాద ఘటన చోటుచేసుకుంది. పెళ్లి వేడుక జరుగుతున్న ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆర్టీసీ బస్సును పెళ్లి బృందంతో వెళ్తున్న ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పది మంది ఘటనా స్థలంలోనే మృతిచెందగా మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.
వివరాల ప్రకారం.. ఒడిశాలోని గంజాం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున దిగపహండి సమీపంలో ఆర్టీసీ బస్సును ఓ ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలోనే 10 మంది మృతిచెందగా.. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇక, రోడ్డు ప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే హుటాహుటిన పోలీసులు, సహాయక బృందం ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంతో గాయపడిని వారిని బ్రహ్మపురలోని ఎంకేసీజీ ఆసుపత్రికి తరలించి వైద్యసాయం అందిస్తున్నారు.
Odisha | 10 people died and 8 injured in a bus accident in Ganjam district, on Sunday late night. Injured were immediately rushed to the MKCG Medical College in Berhampur for treatment.
"Two buses collided in which 10 people died. The injured were immediately admitted to MKCG… pic.twitter.com/OE3G3BhMFl— ANI (@ANI) June 26, 2023
అయితే, ఓ పెళ్లికి హాజరయ్యేందుకు పెళ్లి బృందం ప్రైవేటు బస్సులో వెళ్తుండగా ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు రాయ్‌గఢ్ నుంచి భువనేశ్వర్‌కు వెళ్తోంది. కాగా, మృతుల్లో ఎక్కువ మంది ప్రైవేటు బస్సులో ప్రయాణిస్తున్నవారే ఉన్నారని పోలీసులు తెలిపారు.
#ଦିଗପହଣ୍ଡିରେ_ଭୟଙ୍କର_ଦୁର୍ଘଟଣା
ଗଂଜାମ ଦିଗପହଣ୍ଡିରେ ଦୁଇ ବସ୍ ମଧ୍ୟରେ ମୁହାଁମୁହିଁ ଧକ୍କା..ସମସ୍ତ ଆହତ ବ୍ରହ୍ମପୁର ବଡ଼ ମେଡିକାଲରେ ଭର୍ତ୍ତି କରାଯାଇଛି#MKCG #accident #Ganjam #Odisha #OTV pic.twitter.com/t52OfjNgxB— ଓଟିଭି (@otvkhabar) June 26, 2023
ఇక, ఈ ప్రమాదంపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడినవారికి మెరుగైన వైద్యసాయం అందించాలని అధికారులను ఆదేశించారు. వారంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇదే సమయంలో మృతుల కుటుంబాలకు రూ.3 లక్షలు ఆర్థికసాయం చేస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపారు.
ఇది కూడా చదవండి: టిక్కెట్ లేకుండా ‘వందేభారత్’ ఎక్కి.. భయంతో వాష్‌రూమ్‌లో నక్కి..