Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Crime
  3. ప్చ్‌.. బాబు 23 సెంటిమెంట్‌
ADVERTISEMENT

ప్చ్‌.. బాబు 23 సెంటిమెంట్‌

Crime Sakshi User Sakshi Sakshi Time Sep 11, 2023 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
cbnnnn.jpg

సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, విజయవాడ/రాజమహేంద్రవరం: చంద్రబాబును సీఐడీ అధికారులు ఆదివారం అర్ధరాత్రి రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలుకు తరలించారు. జైలు అధికారులు ఆయనకు రిమాండ్‌ ఖైదీ నంబర్‌ 7691 కేటాయించారు. షెల్‌ కంపెనీల ముసుగులో నిధులు కొల్లగొట్టడంలో ప్రధాన భూమిక పోషించిన ఆయనపై సిట్‌ మోపిన అభియోగాలతో విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానం ఏకీభవించింది.



చంద్రబాబుకు న్యాయస్థానం 14 రోజులపాటు అంటే ఈ నెల 22 వరకు రిమాండ్‌ విధించింది. దాంతో చంద్రబాబును జ్యుడిషియల్‌ రిమాండ్‌ కోసం రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలుకు తరలించాలని సిట్‌ అధికారులు నిర్ణయించారు. న్యాయస్థానంలో అధికారిక లాంఛనాలు పూర్తి చేశాక సిట్‌ అధికారులు జైళ్ల ఎస్కార్ట్‌తో ప్రత్యేక కాన్వాయ్‌లో విజయవాడ నుంచి తరలించారు.



ప్రతిపక్ష నేతగా ప్రభుత్వం కల్పించిన బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనంతో కూడిన కాన్వాయ్‌తోపాటు ప్రత్యేక బస్‌లో భద్రతా సిబ్బందితోపాటు ఎన్‌ఎస్‌జీ భద్రతా సిబ్బంది కూడా అనుసరించారు. విజయవాడ నుంచి ఆదివారం రాత్రి 10 గంటలకు చంద్రబాబు కాన్వాయ్‌ బయలుదేరింది. మార్గం మధ్యలో కాన్వాయ్‌లోని ఓ వాహనం (చంద్రబాబు ప్రయాణిస్తున్న వాహనం కాదు) బ్రేక్‌ డౌన్‌ అయ్యింది.



దాంతో ఆ వాహనాన్ని పక్కన పెట్టేశారు. విజయవాడ నుంచి రాజమహేంద్రవరం వరకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్‌ సమస్య లేకుండా ముందుగానే పోలీసులు రోడ్డు క్లియరెన్స్‌ చేశారు. చంద్రబాబును తరలిస్తున్న కాన్వాయ్‌ అర్ధరాత్రి ఒంటి గంట అనంతరం సురక్షితంగా రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలుకు చేరుకుంది.



అనంతరం రిమాండ్‌ ఖైదీ చంద్రబాబును జైలు అధికారులకు అప్పగించారు. జ్యుడిషియల్‌ రిమాండ్‌కు సంబంధించిన అధికారిక లాంచనాలు పూర్తి చేసి, ఆయనకు రిమాండ్‌ ఖైదీ నంబర్‌ 7691 కేటాయించారు. ఆ తర్వాత జైలులో స్నేహ బ్లాక్‌లోని ప్రత్యేక గదికి తరలించారు.


కోర్టు ఆదేశాలతో ఆయనకు ప్రత్యేకంగా ఆహారం, అవసరమైన మందులు, ఇతర వసతులు కల్పించనున్నారు. రిమాండ్‌ ఖైదీగా చంద్రబాబును సెంట్రల్‌ జైలుకు తరలించడంతో ఎన్‌ఎస్‌జీ భద్రతా సిబ్బంది తాత్కాలికంగా ఆయన భద్రతా విధుల నుంచి వైదొలిగారు. చంద్రబాబు వెంట తనయుడు నారా లోకేష్, టీడీపీ నాయకులు జైలు వద్దకు చేరుకున్నారు. అధికారుల నుంచి అనుమతులు రాగానే జైలు లోపలికి వెళ్లిన లోకేష్‌ తిరిగి కొద్ది సేపటికే బయటకు వచ్చేశారు.  



జైలు అధికారుల సమావేశం 

చంద్రబాబుకు రిమాండ్‌ విధించిన నేపథ్యంలో రాజమహేంద్రవరం జైలు అధికారులు అత్యవసర సమావేశం నిర్వహించారు. బాబుకు గది కేటాయింపు మొదలు వివిధ అంశాలపై చర్చించారు. మాజీ ముఖ్యమంత్రి కావడంతో ఖైదీలకు ఇచ్చే డ్రస్‌ ఉండదని, మామూలుగా ఆయన ధరించే దుస్తులకు అనుమతిస్తామని చెప్పారు. కాగా, రాజమండ్రిలో భద్రతా ఏర్పాట్లను పోలీసు ఉన్నతాధికారులు దగ్గరుండి పర్యవేక్షించారు.

ఖైదీ నంబర్‌.. సోషల్‌ మీడియాలో వైరల్‌ 

రిమాండ్‌ ఖైదీగా చంద్రబాబుకు 7691 నంబరు కేటాయించడం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 7 + 6 + 9 + 1 = 23 కావడమే అందుకు కారణం. 2019 ఎన్నికల్లో టీడీపీకి 23 సీట్లే వచ్చాయి. చంద్రబాబు అరెస్ట్‌ అయిన తేదీ 9–9–23. ఆ అంకెలు కలిపితే మొత్తం 23 అవుతోంది. దాంతో ఈ అంశంపై సోషల్‌ మీడియాలో పోస్టులు వైరల్‌ అయ్యాయి.   

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Chandrababu Naidu
TDP
rajamundry central jail
remand
ACB
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

 బీచ్ షాక్స్ జీవో రద్దు చేయాల్సిందే : వైఎస్సార్‌సీపీ

బీచ్ షాక్స్ జీవో రద్దు చేయాల్సిందే : వైఎస్సార్‌సీపీ

పోయేకాలం వస్తే ఇలాంటి కేసులే పెడతారు.. దేశద్రోహం కేసు పెట్టాల్సింది పవన్, బాబు పైనే..?

పోయేకాలం వస్తే ఇలాంటి కేసులే పెడతారు.. దేశద్రోహం కేసు పెట్టాల్సింది పవన్, బాబు పైనే..?

ఎక్సైజ్‌ సూపరిండెంట్ ఇంట్లో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు

ఎక్సైజ్‌ సూపరిండెంట్ ఇంట్లో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు

ఏమన్నా ఉంటే కదా..  చెప్పడానికి!

ఏమన్నా ఉంటే కదా.. చెప్పడానికి!

తుమ్మిళ్ల ఇసుక రీచ్‌లో ఏపీ టీడీపీ మూకల దాడి

తుమ్మిళ్ల ఇసుక రీచ్‌లో ఏపీ టీడీపీ మూకల దాడి

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.