Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Crime
  3. వసూళ్ల బాగోతం.. బంజారాహిల్స్‌ సీఐకి నోటీసులు
ADVERTISEMENT 

వసూళ్ల బాగోతం.. బంజారాహిల్స్‌ సీఐకి నోటీసులు

Crime Sakshi User Sakshi Sakshi Time Oct 7, 2023 Sakshi Read Time Read Time: 4 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Banjara-Hills-Ci-Narender-To-Acb-Office.jpg

సాక్షి, హైదరాబాద్‌: పెంచిన మామూళ్లతో పాటు ‘పాత బకాయిల’ కోసం పబ్‌ యజమానిని వేధించి, బెదిరించి, తప్పుడు కేసు నమోదు చేసిన బంజారాహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం.నరేందర్, ఎస్సై ఎస్‌.నవీన్‌రెడ్డి, హోంగార్డు హరిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఏసీబీ కార్యాలయానికి నరేందర్‌ను తరలించారు.

సీఐతో పాటు ఎస్‌ఐ, హోంగార్డును ఏసీబీ తరలించింది. సీఐ నరేందర్‌ను 20 గంటల పాటు ఏసీబీ ప్రశ్నించింది. స్కెలాంజ్‌ పబ్‌ యజమానులను ప్రశ్నించిన ఏసీబీ.. స్టేట్‌మెంట్‌ రికార్డు చేసింది. పబ్ వ్యవహారంతో పాటు... మిగతా వసూళ్ల పైనా ఏసీబీ ఆరా తీస్తోంది.

9న విచారణకు హాజరుకావాలి.. ఏసీబీ నోటీసులు..

నరేందర్ వసూళ్ల బాగోతం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సీఐ, ఎస్ఐ హోం గార్డ్‌లకు 41ఏ సీఆర్‌పీసీ నోటీసులను ఏసీబీ జారీ చేసింది. ఈ నెల 9న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది.

కాగా, రాజకీయ నాయకుల ప్రమేయంతో కొన్నాళ్ల క్రితం అటకెక్కిన ఈ కేసు వ్యవహారంపై ‘సాక్షి’ సోమవారం ‘ఏ’ క్లాస్‌ రాజీ! శీర్షికన ప్రత్యేక కథనం ప్రచురించింది. దీంతో స్పందించిన ఏసీబీ అధికారులు శుక్రవారం బంజారాహిల్స్‌ పోలీసుస్టేషన్‌పై దాడి చేశారు. నరేందర్, నవీన్‌రెడ్డి, హరిలను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే నరేందర్‌ అస్వస్థతకు గురి కావడంతో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ఈ ముగ్గురి పైనా శాఖాపరమైన చర్యలు తీసుకుంటూ సస్పెండ్‌ చేయడానికి ఉన్నతాధికారులు సన్నాహాలు చేపట్టారు.  

మామూలు పెంచి ‘ఎరియర్స్‌’ ఇమ్మని... 

బంజారాహిల్స్‌ పీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్న ఎం.నరేందర్‌కు రాజకీయ అండదండలు దండిగా ఉన్నాయన్నది బహిరంగ రహస్యమే. తన పరిధిలో ఉన్న పబ్స్, బార్‌ అండ్‌ రెస్టారెంట్స్‌తో పాటు మసాజ్‌ సెంటర్ల నుంచి నెలవారీ మామూళ్లు వసూలు చేస్తున్నారు. తన వద్ద హోంగార్డుగా పని చేస్తున్న హరికి ఈ కలెక్షన్స్‌ బాధ్యతలు అప్పగించారు. అతడే ప్రతి నెలా అందరికీ ఫోన్లు చేసి, డబ్బు వసూలు చేసుకుని వస్తుంటాడు. కొన్ని నెలల క్రితం నరేందర్‌ తన పరిధిలో ఉన్న పబ్స్‌ ఇచ్చే నెల వారీ మామూళ్లను రూ.50 వేల నుంచి రూ.1.5 లక్షలకు పెంచేశారు.

అంతటితో ఆగకుండా రెండు నెలల ‘ఎరియర్స్‌’తో కలిపి మొత్తం రూ.4.5 లక్షలు చెల్లించాలంటూ డిమాండ్‌ చేశారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.14లోని రాక్‌ క్లబ్‌ అండ్‌ స్కై లాంజ్‌ పబ్‌ను లక్ష్మణ్‌ రావు, శివలాల్‌ నిర్వహిస్తున్నారు. అంత మొత్తం ఇచ్చేందుకు వారు అంగీకరించకపోవడంతో ‘రిబేటు’ ఇచ్చిన నరేందర్‌ రూ.3 లక్షలకు తగ్గించారు. ఈ డబ్బు ఇవ్వాలంటూ లక్ష్మణ  రావుకు హోంగార్డు హరితో పదేపదే వాట్సాప్‌ కాల్స్‌ చేయించాడు.  

హేయమైన ఆరోపణలతో తప్పుడు కేసు... 

పబ్‌ యాజమాన్యం తన మాట వినకపోవడంతో వారిపై తప్పుడు కేసు నమోదు చేసేందుకు ఎస్సై ఎస్‌.నవీన్‌రెడ్డితో కలిసి పథక రచన చేశాడు. ఈ ఏడాది జులై 30 రాత్రి నవీన్‌రెడ్డికి రాక్‌ క్లబ్‌ అండ్‌ స్కై లాంజ్‌లో అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నట్లు సమాచారం అందినట్లు,  అతడు దానిపై దాడి చేసినట్లు కేసు నమోదు చేశారు.

సదరు పబ్‌ యాజమాన్యం తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం పబ్‌లో మహిళలను కూడా సరఫరా చేస్తోందని, వారితోనే కస్టమర్లకు సర్విస్‌ చేయిస్తూ రెచ్చగొడుతోందని, ఆకర్షితులైన వినియోగదారులతో కలిసి గడిపేలా ప్రోత్సహిస్తోందనే ఆరోపణలు చేస్తూ కేసు నమోదు చేశారు. అదే నెల 31న  మహిళల అక్రమ రవాణా నిరోధక చట్టం కిందన నమోదు చేసిన  కేసులో ఇద్దరు యజమానులనూ నిందితులుగా చేర్చారు. కాగా రోజు పబ్‌లో వారు ఇరువురూ లేరని, అక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరగట్లేదని, అసలు పోలీసులు దాడే చేయలేదని ఇటీవల ఏసీబీ గుర్తించింది.  

ఒత్తిడితో మిన్నకుండిపోయిన ఏసీబీ... 

ఈ నేపథ్యంలో లక్ష్మణ్‌ రావు ఆగస్టులోనే ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అవసరమైన ఆధారాల కోసం అవినీతి నిరోధక శాఖ అధికారులు రంగంలోకి దిగారు. రహస్య కెమెరాలతో కూడిన వాచీలు తదితరాలను ఏర్పాటు చేసి పబ్‌కు సంబంధించిన ఓ వ్యక్తిని నరేందర్‌ వద్దకు పంపారు. లంచా నికి సంబంధించిన బేరసారాలు ఆడియో, వీడియో లు రికార్డు చేసే ప్రయత్నం చేశారు. అయితే ఓ దశలో సదరు వ్యక్తి రహస్య కెమెరాలతో వచ్చిన విషయం గుర్తించిన నరేందర్‌ అప్రమత్తమయ్యారు. అసలు విషయం గ్రహించి తన ‘బంధువైన’ రాజకీయ నాయకుడిని ఆశ్రయించారు.

ఆయన జోక్యంతో ఏసీబీకి చెందిన కింది స్థాయి అధికారులు అడుగు వెన క్కు వేశారు. మరోసారి సదరు పబ్‌ జోలికి రావద్దని ఇన్‌స్పెక్టర్‌ నరేందర్‌కు, నరేందర్‌ను వదిలేయని పబ్‌ యాజమాన్యానికి చెప్పి రాజీ చేసి ఫైల్‌ను అటకెక్కించేశారు. దీంతో దాదాపు రెండు నెలలుగా కేసు మరుగున పడిపోయింది. ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకువస్తూ ‘సాక్షి’ సోమవారం ‘ఏ’ క్లాస్‌ రాజీ! శీర్షికన ప్రత్యేక కథనం ప్రచురించింది. దీనిపై స్పందించిన ఉన్నతాధి కారులు ‘బంజారాహిల్స్‌ ఫైల్‌ దుమ్ము దులిపించారు.

ఓసారి షుగర్‌ డౌన్‌... మరోసారి ఛాతి నొప్పి...  

ఏసీబీ డీఎస్పీ శ్రీకాంత్‌ నేతృత్వంలోని బృందం శుక్రవారం ఉదయం బంజారాహిల్స్‌ ఠాణాపై దాడి చేసింది. నరేందర్, నవీన్‌రెడ్డి, హరిలను అదుపులోకి తీసుకుని వివిధ కోణాల్లో ప్రశ్నించింది. పబ్‌ యాజమాన్యంపై నమోదు చేసిన కేసుకు సంబంధించిన పత్రాలు సేకరించింది. సుదీర్ఘంగా ఈ ముగ్గురు నిందితులను విచారించింది. దీంతో తొలుత తన షుగర్‌ లెవల్స్‌ పడిపోయాయంటూ నరేందర్‌ చెప్పడంతో వైద్య బృందాన్ని ఠాణాకు పిలిపించి చికిత్స చేయించా రు.

సాయంత్రం తనకు ఛాతీ నొప్పంటూ పడిపోవడ ంతో స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించింది. హాస్పిటల్‌ వెళ్ళడానికి నరేందర్‌ నడుచుకుంటూ వచ్చి తన వాహనమే ఎక్కడం గమనార్హం. ఈ కేసుపై ప్రకటన విడుదల చేసిన అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్‌ జనరల్‌.. ‘ఇన్‌స్పెక్టర్‌ నరేందర్‌ ఆదేశాల మేరకు నవీన్‌రెడ్డి గత శనివారం అర్ధరాత్రి సదరు పబ్‌ వద్దకు వెళ్లా రు. లక్ష్మణ్‌ రావును అనవసరంగా పబ్‌ బయటకు పిలిచారు.

రోడ్డుపై ఆపి ఉంచిన పోలీసు వాహనం వద్దకు వచ్చిన ఆయన్ను బలవంతంగా అందులో ఎక్కించుకుని ఠాణాకు తరలించారు. అక్కడ కొన్ని గంటల పాటు నిర్భంధించారు. నరేందర్, నవీన్‌రెడ్డి, హరిలపై నమోదు చేసి కేసు దర్యాప్తులో ఉందని, చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటాం’ అని పేర్కొన్నారు.

చదవండి: మెట్రో రైలులో యూట్యూబర్‌ హల్‌చల్‌.. ప్రయాణికులను షాక్‌

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
bribe case
banjara hills
Police
inspector
ACB
Hyderabad
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ఈ పోలీసుల సేవ చూస్తే.. ఒక్క సెల్యూట్‌తో సరిపోదు!

ఈ పోలీసుల సేవ చూస్తే.. ఒక్క సెల్యూట్‌తో సరిపోదు!

కొడుకు పుట్టలేదని బాలుడి కిడ్నాప్‌

కొడుకు పుట్టలేదని బాలుడి కిడ్నాప్‌

పక్కాగా.. బస్సొచ్చేలా..

పక్కాగా.. బస్సొచ్చేలా..

నెల రోజుల పసికందు కిడ్నాప్‌​ కేసు.. 72 గంటల్లో ఛేదన

నెల రోజుల పసికందు కిడ్నాప్‌​ కేసు.. 72 గంటల్లో ఛేదన

హైదరాబాద్‌ : రుచులు.. అద్భుతం : ఫుడ్‌– ఎ–ఫెయిర్‌– 2026

హైదరాబాద్‌ : రుచులు.. అద్భుతం : ఫుడ్‌– ఎ–ఫెయిర్‌– 2026

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.