Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Crime
  3. మహిళా వలంటీర్‌పై దాడి
ADVERTISEMENT 

మహిళా వలంటీర్‌పై దాడి

Crime Sakshi User Sakshi Sakshi Time Jun 17, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
attack.jpg

చంపాడులో టీడీపీ కార్యకర్తల బరితెగింపు 

ఆమె ఇంటిపై రాళ్లు రువ్వి అంతు చూస్తామంటూ పోస్టర్‌ 

పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోని వైనం 

వేమూరు: గ్రామ వలంటీర్‌పై టీడీపీ కార్యకర్తలు మహిళలతో దాడి చేయించి కొట్టిన ఘటన బాపట్ల జిల్లా వేమూరు మండలం చంపాడులో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఎస్సీ మాదిగ వర్గానికి చెందిన పమిడిపాగుల జ్యోతి అనే మహిళ గ్రామ వలంటీర్‌గా పని చేస్తోంది. వలంటీర్లపై కూటమి నేతల అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఎన్నికల ముందు ఆమె రాజీనామా చేశారు. కాగా.. ఎన్నికల్లో గెలిచాక టీడీపీ కార్యకర్తలు జ్యోతిని లక్ష్యంగా చేసుకుని వేధించటం మొదలుపెట్టారు. నాలుగు రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు ఆమె ఇంటిపై ఇటుక రాళ్లతో దాడి చేశారు.

 ‘మీ వైఎస్సార్‌సీపీ పార్టీ గెలవాలని ఓట్లు వేయించి తెగపాకులాడావుగా గొప్ప వాలంటీరు. ఇప్పుడు మాది రాజ్యం. నీ అంతు చూస్తాం. జై టీడీపీ, జై కూటమి’ అంటూ ఆ ఇంటి గోడపై పోస్టర్‌ అతికించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండాపోయింది. మరుసటి రోజునుంచి స్కూల్‌కెళ్తున్న జ్యోతి పిల్లలను దూషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం బజారు నుంచి ఇంటికెళ్తున్న జ్యోతిపై కొందరు మహిళలతో టీడీపీ నాయకులు దాడి చేయించి కొట్టించారు. కిందపడిపోయిన జ్యోతిని వేమూరు పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. 

అక్కడ ఆమె స్పృహ కోల్పోవటంతో 108 అంబులెన్స్‌లో తెనాలిలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వైఎస్సార్‌సీపీ వేమూరు ఇన్‌చార్జి వరికూటి అశోక్‌బాబు హుటాహుటిన వేమూరు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి జ్యోతిని పరామర్శించారు. నాలుగు రోజుల క్రితం ఆమె ఇంటిపై రాళ్లురువ్వి పోస్టర్‌ అతికించినట్టు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేయకపోవటంపై పోలీసులను ప్రశ్నించారు. 

ఆ కేసుతో పాటు ఆదివారం జరిగిన దాడిపై కేసులోనూ ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేస్తేనే పోలీస్‌ స్టేషన్‌ నుంచి వెళతానని పట్టుబట్టారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంటిపై జరిగిన రాళ్ల దాడిపై ఎఫ్‌ఐఆర్‌ తర్వాత ఇస్తామని ఎస్‌ఐ నాగరాజు వెల్లడించారు. వరికూటి అశోక్‌బాబు మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఎక్కడైనా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులపై దాడులకు పాల్పడితే సహించబోమన్నారు. కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని, తనతోపాటు పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. 

వైఎస్సార్‌సీపీ నేతపై దాడి.. 
వేటపాలెం: బాపట్ల జిల్లా వేటపాలెం మండల పరిధిలోని బచ్చులవారిపాలెంలో వైఎస్సార్‌సీపీ నేత బచ్చుల బంగారు బాబు పై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. బాధితుడు తెలిపిన వివరాల మేరకు..గ్రామంలో శనివారం రాత్రి గంగమ్మ తల్లి కొలుపులు జరుగుతున్నాయి. అదే అదునుగా గ్రామంలో టీడీపీకి చెందిన ప్రధాన నాయకుడు వారి అనుచరులు నలుగురికి మద్యం తాగించి బంగారుబాబుపై దాడికి తెగబడ్డారు. దీంతో బంగారుబాబు తలకు తీవ్రగాయం అయ్యింది. అక్కడే ఉన్న కొంతమంది మహిళలు దాడిని అడ్డుకోవడంతో అతడిని వదిలేశారు. 

కాగా, బంగారుబాబు వైఎస్సార్‌సీపీ తరఫున గ్రామంలో ప్రచారం చేసి ఓట్లు వేయించాడు. టీడీపీ చెందిన ఒక నాయకుడు గ్రామంలో టీడీపీ తరఫున పోటీ చేసిన మన సామాజిక వర్గం నాయకుడు కొండయ్యకు గ్రామం మొత్తం ఓట్లు వేద్దామని బంగారు బాబును అడిగారు. అందుకు అతను ఒప్పుకోకపోగా వైఎస్సార్‌సీపీని వీడే ప్రసక్తే లేదని స్పష్టంగా చెప్పాడు. 

దాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామంలో టీడీపీ ఓట్లు చీలుస్తావా అని చెప్పి వారికి సంబంధించిన కొంత మందికి మద్యం తాగించి బంగారు బాబుపై దాడి చేయించాడు. తనను చంపేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితుడు వాపోయాడు. తనకు, తన వర్గం వారికి రక్షణ కల్పించాలని కోరుతూ వేటపాలెం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.   

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
volunteer
TDP
Jyoti
Andhra Pradesh
Attack
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.