Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Crime
  3. Year Ender 2024: రుధిర దారులు!
ADVERTISEMENT 

Year Ender 2024: రుధిర దారులు!

Crime Sakshi User Sakshi Sakshi Time Dec 30, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
2322.jpg

రక్తపుటేరులు పారించిన రహదారులు 

 ప్రాణాలు కోల్పోయిన వందలాదిమంది 

 క్షతగాత్రులుగా మిగిలినవారెందరో.. 

కొత్త ఏడాదిలోనైనా రోడ్ల విస్తరణ జరిగేనా? 

సాక్షి, రంగారెడ్డిజిల్లా: రహదారులు రక్తపుటేరులు పారిస్తున్నాయి. వాహనాల రద్దీ మేరకు రోడ్ల విస్తరణ పనులు చేపట్టకపోవడం.. మద్యం తాగి మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతుండటం.. ప్రమాదకర మైన మూల మలుపులే ఇందుకు ప్రధాన కారణం. ఫలితంగా జిల్లాలో నిత్యం ఏదో ఒకచోట ప్రమాదం వెలుగు చూస్తూనే ఉంది. ఎవరో ఒకరు మృత్యువాతపడుతూనే ఉన్నారు. అయినా పాలకుల్లో చలనం మాత్ర ం కలగడం లేదు. ప్రమాదాలను నియంత్రించే చర్య లు చేపట్టడం లేదు. కొత్త సంవత్సరంలోనైనా రోడ్ల వ్యవస్థ మెరుగుపడుతుందో లేదో వేచి చూడాల్సిందే.    

2024లో తీరని విషాదం 
విజయవాడ జాతీయ రహదారి ఇటు ఎల్బీనగర్‌ నుంచి అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం కొత్తగూడెం వరకు విస్తరించి ఉంది. బీజాపూర్‌ జాతీయ రహదారి ఇటు అప్పా జంక్షన్‌ నుంచి మన్నెగూడ వరకు విస్తరించి ఉంది. బెంగళూరు జాతీయ రహదారి ఆరాంఘర్‌ నుంచి షాద్‌నగర్‌ మండల వరకు విస్తరించి ఉంది. శ్రీశైలం జాతీయ రహదారి చాంద్రాయణగుట్ట నుంచి ఆమనగల్లు మండల శివారు వరకు విస్తరించి ఉంది. నాగార్జునసాగర్‌ జాతీయ రహదారి ఎల్బీనగర్‌ నుంచి యాచారం మండల శివారు వరకు విస్తరించి ఉంది. హైదరాబాద్‌ నగరానికి మణిహారంగా గుర్తింపు పొందిన ఓఆర్‌ఆర్‌ ఇటు కోకాపేట నుంచి అటు తారామతిపేట వరకు విస్తరించింది. ఇక పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌వే సహా ఆర్‌ అండ్‌బీ, మున్సిపాలిటీ అంతర్గత రోడ్లు అనేకం ఉన్నాయి. ఆయా రహదారులు 2024లో జిల్లాలోని అనేక కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చాయి. 

2025లోనైనా పనులు ప్రారంభమయ్యేనా? 
ప్రమాదాలకు నిలయంగా మారిన బీజాపూర్‌ జాతీయ రహదారి నాలుగు లేన్లుగా విస్తరణకు 29 ఏప్రిల్‌ 2022లో అప్పటి కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరి శంకుస్థాపన చేశారు. టెండర్‌ కూడా ఖరారైంది.  ఇప్పటికీ పనులు మాత్రం ప్రారంభం కాలేదు. దీంతో ఈ రహదారిపై నిత్యం రక్తపుటేరులు పారుతూనే ఉన్నాయి. ఇటీవల ఆలూరు స్టేజీ వద్ద రోడ్డు వెంట కూరగాయలు అమ్ముకుంటున్న వారిపైకి లారీ దూసుకెళ్లిన ఘటనలో నలుగురు మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. కేవలం ఈ ఒక్క రోడ్డుపైనే మూడేళ్ల వ్యవధిలో 379 ప్రమాదాలు చోటు చేసుకోగా>, సుమారు 400 మంది క్షతగాత్రులయ్యారు. 146 మంది ప్రాణాలు కోల్పోయారు. ఓఆర్‌ఆర్‌పై అబ్దుల్లాపూర్‌ మెట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈనెల 2న జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్క, తమ్ముడు మృతి చెందారు. ఆగి ఉన్న ట్యాంకర్‌ను వెనుక నుంచి వచి్చన కారు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది.నూతన సంవత్సరంలోనైనా విస్తరణ పనులు ప్రారంభమవుతాయో వేచి చూడాలి.

 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Crime News
2024 Year End Stories
Telangana
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

శనగ కూరలో విషం కలిపి తల్లికి పెట్టిన కొడుకు.. ఎందుకో తెలిస్తే షాక్‌

శనగ కూరలో విషం కలిపి తల్లికి పెట్టిన కొడుకు.. ఎందుకో తెలిస్తే షాక్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

షాబాద్‌ హత్యకేసుల నిందితుడు రాజ్‌కుమార్‌ మృతి

షాబాద్‌ హత్యకేసుల నిందితుడు రాజ్‌కుమార్‌ మృతి

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.