Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Business
  3. Business Home
ADVERTISEMENT 

దీనదయాళ్ పోర్ట్‌లో తగ్గిన రష్యా చమురు సరఫరా

Business Sakshi User Sakshi Sakshi Time Oct 20, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
portt.jpg

ప్రపంచ దేశాల ఒత్తిడి, యూఎస్‌, ఈయూల సెకండరీ ఆంక్షల(రష్యాతో వ్యాపారం సాగిస్తున్న దేశాలు, కంపెనీలపై పరోక్షంగా విధించి ఆంక్షలు) ప్రభావం కారణంగా రష్యా నుంచి భారత్‌కు ముడి చమురు దిగుమతులు తగ్గినట్లు తెలుస్తుంది. దాంతో దేశంలోని 13 ప్రధాన ఓడరేవుల్లో అత్యంత ముఖ్యమైన దీనదయాళ్ పోర్ట్(Deendayal Port)లో గణనీయంగా సరఫరా దెబ్బతింది. రష్యన్ చమురు రవాణాలో కీలక పాత్ర పోషించే ఈ నౌకాశ్రయం తాజా గణాంకాల ప్రకారం క్రూడ్‌ వాల్యూమ్ క్షీణతను నమోదు చేసింది.

2025 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో దీనదయాళ్ పోర్ట్ నిర్వహించిన ముడి చమురు, ఎల్‌పీజీ/ఎల్‌ఎన్‌జీ మొత్తం వాల్యూమ్ 30.07 లక్షల టన్నులకు తగ్గింది. ఇది గత ఏడాది ఇదే కాలంలో నమోదైన 32.5 లక్షల టన్నుల వాల్యూమ్‌తో పోలిస్తే దాదాపు 6% క్షీణతను సూచిస్తుంది. భారతదేశంలోని ప్రధాన ఓడరేవుల్లో దీనదయాళ్ పోర్ట్ రష్యన్ చమురును అధికంగా నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ తగ్గుదల ఆందోళన కలిగిస్తోంది.

తగ్గుదలకు కారణాలు

భారతదేశంపై రష్యా చమురు దిగుమతులకు సంబంధించి ప్రత్యక్ష ఆంక్షలు లేనప్పటికీ అమెరికా (USA), యూరోపియన్ యూనియన్ (EU) విధించిన ద్వితీయ పరిమితుల (Secondary sanctions) ప్రభావం ప్రపంచవ్యాప్తంగా రష్యన్ చమురు సరఫరాపై పడింది. రవాణా, బీమా, ఆర్థిక లావాదేవీలు కఠినతరం కావడంతో దిగుమతిదారులు రష్యన్ చమురును నిలిపేస్తున్నారు. ఇతర ప్రత్యామ్నాయ వనరుల వైపు మళ్లుతున్నారు.

భారత్‌పై ఒత్తిడి

భారతదేశం తన ఇంధన అవసరాల కోసం రష్యా ముడి చమురుపై భారీగా ఆధారపడటాన్ని తగ్గించాలని యూఎస్‌, ఈయూ వంటి దేశాల నుంచి అంతర్జాతీయ ఒత్తిడిని ఎదుర్కొంటోంది. రష్యా-ఉక్రెయిన్ వివాదం నేపథ్యంలో అమెరికా, పశ్చిమ దేశాలతో వ్యూహాత్మక సంబంధాలను కొనసాగించాల్సిన అవసరం భారత్‌కు ఉంది. రష్యా చమురు దిగుమతులను కొనసాగించడం ఈ సంబంధాలకు ఇబ్బంది కలిగిస్తుంది. రష్యా చమురుతో సంబంధం ఉన్న సంస్థలు, బ్యాంకులపై భవిష్యత్తులో అమెరికా సెకండరీ ఆంక్షలు విధించే అవకాశం ఉంది. ఈ ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి భారత్ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది.

రిఫైనరీలపై ప్రభావం

దీనదయాళ్ పోర్ట్ ద్వారా సాగే ముడి చమురు సరఫరా ప్రధానంగా నయారా ఎనర్జీ (Nayara Energy- రష్యాకు చెందిన రోస్‌నెఫ్ట్ మద్దతు కలిగిన సంస్థ), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) వంటి రిఫైనరీలపై పడుతుంది. నయారా ఎనర్జీకి రష్యాకు చెందిన రోస్‌నెఫ్ట్‌తో 10 సంవత్సరాల దీర్ఘకాలిక ఒప్పందం ఉంది. అయితే ఈ ఒత్తిళ్ల మధ్య కూడా నయారా చమురు సరఫరా ప్రస్తుతానికి స్థిరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇవి 6,700కు పైగా ఫ్యూయల్ స్టేషన్లకు ఇంధనాన్ని నింపుతూ దేశీయ సరఫరాను కొనసాగిస్తున్నాయి. తాత్కాలికంగా ఐఓసీకి చెందిన వదినార్ రిఫైనరీలో నిర్వహణ పనులు కూడా ముడి చమురు వినియోగం తగ్గడానికి మరో కారణంగా నిలిచింది.

ఇదీ చదవండి: దీపావళి కానుక.. బ్యాంకులు అదిరిపోయే ఆఫర్లు..

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
port
Russian Oil
slowdown
reasons
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

పసిడి ఇంత భారీ పతనం.. ఇవే కారణాలు

పసిడి ఇంత భారీ పతనం.. ఇవే కారణాలు

మౌలిక రంగం మందగమనం 

మౌలిక రంగం మందగమనం 

అందుకే బంగారం ధరలు పెరుగుతున్నాయ్!

అందుకే బంగారం ధరలు పెరుగుతున్నాయ్!

రష్యా చమురు దిగుమతుల్లో భారత్‌ స్థానం ఎంతంటే..

రష్యా చమురు దిగుమతుల్లో భారత్‌ స్థానం ఎంతంటే..

రష్యా ఆయిల్ దిగుమతులపై సంతోషంగా లేని చెప్పిన ట్రంప్

రష్యా ఆయిల్ దిగుమతులపై సంతోషంగా లేని చెప్పిన ట్రంప్

దేశం వీడుతున్న సంపన్నులు.. కారణాలు ఇవే!

దేశం వీడుతున్న సంపన్నులు.. కారణాలు ఇవే!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.