Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Business
  3. Business Home
ADVERTISEMENT 

ఏజీఆర్‌ బకాయిలు ఎలా రాబట్టాలో ఏమో!

Business Sakshi User Sakshi Sakshi Time Mar 4, 2026 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
telcoo.jpg

భారత టెలికాం రంగంలో మార్పులు చోటుచేసుకునేలా ఇటీవల సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు బ్యాంకులు, టెలికాం సంస్థలు, ప్రభుత్వ యంత్రాంగంలో తీవ్ర చర్చకు దారితీసింది. టెలికాం స్పెక్ట్రం అనేది ప్రజా ఆస్తి అని, ఇది ప్రభుత్వ సార్వభౌమత్వ పరిధిలోకి వస్తుందని స్పష్టం చేస్తూ ఫిబ్రవరి 13, 2026న అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. దాంతో దివాలా తీసిన సంస్థల బకాయిల వసూలు ప్రక్రియ చిక్కుల్లో పడినట్టయిందని కొందరు భావిస్తున్నారు.

ముఖ్యంగా రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్‌), ఎయిర్ సెల్ సంస్థల నుంచి వేల కోట్ల రూపాయల ఏజీఆర్ బకాయిలను(స్పెక్ట్రం వినియోగానికి బదులుగా టెలికాం కంపెనీలు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజు) ఎలా రాబట్టాలనే అంశంపై టెలికమ్యూనికేషన్స్ విభాగం (డాట్‌) ఇప్పుడు అటార్నీ జనరల్ నుంచి అత్యవసర న్యాయ సలహాను కోరింది.

స్పెక్ట్రం ప్రభుత్వ ఆస్తి.. ఐబీసీ పరిధిలోకి రాదు

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. టెలికాం స్పెక్ట్రం అనేది ఒక పరిమిత సహజ వనరు. దీనిపై పూర్తి హక్కులు భారత ప్రభుత్వానికే ఉంటాయి. టెలికాం ఆపరేటర్లకు కేవలం షరతులతో కూడిన వినియోగ హక్కు మాత్రమే ఉంటుంది తప్ప, అది వారి సొంత ఆస్తి కాదు. దివాలా కోడ్ (ఐబీసీ) కింద స్పెక్ట్రంను విక్రయించడం లేదా బదిలీ చేయడం సాధ్యపడదు. ఈ నేపథ్యంలో ఆర్‌కామ్‌, ఎయిర్ సెల్ వంటి సంస్థల ఆస్తులను విక్రయించి తమ అప్పులు తీర్చుకోవాలని భావించిన బ్యాంకులు (రుణదాతలు) ఇప్పుడు చేతులెత్తేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

రుణదాతల ఆందోళన

ఈ తీర్పుతో సుమారు రూ.37,588 కోట్ల ఏజీఆర్ బకాయిల వసూలు ప్రశ్నార్థకంగా మారింది. అందులో ఆర్‌కామ్‌ బకాయిలు సుమారు రూ.25,199.3 కోట్లుగా ఉన్నాయి. ఎయిర్ సెల్ బకాయిలు సుమారు రూ.12,389 కోట్లుగా ఉన్నాయి. సాధారణంగా ఏదైనా కంపెనీ దివాలా తీస్తే దాని ఆస్తులను అమ్మి ‘వాటర్‌ఫాల్‌ మెకానిజం’(ఒక కంపెనీ దివాలా తీసినప్పుడు దాని ఆస్తులను అమ్మగా వచ్చిన డబ్బును ఎవరికి ముందు ఇవ్వాలి, ఎవరికి తర్వాత ఇవ్వాలి అని నిర్ణయించే క్రమం) ద్వారా రుణదాతలకు పంచుతారు. కానీ, ఇప్పుడు స్పెక్ట్రం ఐబీసీ పరిధిలో లేకపోవడంతో ప్రభుత్వ బకాయిలు అలాగే ఉండిపోవడమే కాకుండా, ఇతర ఆర్థిక సంస్థల అప్పు రికవరీ కూడా నామమాత్రంగానే మిగిలే ప్రమాదం ఉంది.

టెలికాం రంగంపై ఒత్తిడి

భారత టెలికాం రంగం ఇప్పటికే భారీ అప్పులతో సతమతమవుతోంది. ఆర్థిక సంవత్సరం 2024 నాటికి ప్రధాన ఆపరేటర్ల మొత్తం అప్పు రూ.4.09 లక్షల కోట్లుగా ఉంది. వొడాఫోన్ ఐడియా నెట్‌వర్క్ బలోపేతం కోసం నిధులు సేకరించినప్పటికీ స్పెక్ట్రం ఫీజులు, అప్పుల నిర్వహణ సవాలుగా మారింది. భారతీ ఎయిర్ టెల్ 75.6% డెట్-టు-ఈక్విటీ నిష్పత్తితో బ్యాలెన్స్ షీట్‌ను నెట్టుకొస్తోంది. టెలికాం కంపెనీలు 5జీ సేవలకు మారుతున్న తరుణంలో భారీ పెట్టుబడులు అవసరం అవుతున్నాయి. ఇలాంటి సమయంలో నియంత్రణ సంస్థల స్పష్టత లేకపోవడం పెట్టుబడిదారులను ఆందోళనకు గురిచేస్తోంది.

బ్యాంకులు టెలికాం రంగానికి రుణాలు ఇచ్చేటప్పుడు ఇకపై చాలా జాగ్రత్త వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అటార్నీ జనరల్ ఇచ్చే వివరణ ఆధారంగా కేంద్ర ప్రభుత్వం తదుపరి అడుగు వేయనుంది. ఒకవేళ స్పెక్ట్రంను వేలం వేయడానికి వీలు లేకపోతే ప్రభుత్వం ఈ బకాయిలను ఎలా సర్దుబాటు చేస్తుందనేది తేలాల్సి ఉంది.

ఇదీ చదవండి: బిగ్‌రిలీఫ్‌.. ఒకేరోజు భారీగా పడిన బంగారం ధర!

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Supreme Court
telecom spectrum
public
asset
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

కొలీజియం నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేం! 

కొలీజియం నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేం! 

సంపదకు అసలైన మార్గం.. కియోసాకి మూడు సూత్రాలు!

సంపదకు అసలైన మార్గం.. కియోసాకి మూడు సూత్రాలు!

నీట్ రీ-ఎగ్జామ్ కు సుప్రీంకోర్టు లైన్ క్లియర్

నీట్ రీ-ఎగ్జామ్ కు సుప్రీంకోర్టు లైన్ క్లియర్

నీట్‌ ‘రీ–ఎగ్జామ్‌’ విచారణ జూలైకి వాయిదా!

నీట్‌ ‘రీ–ఎగ్జామ్‌’ విచారణ జూలైకి వాయిదా!

సుప్రీంకోర్టులో ఓమిక్స్ ఇంటర్నేషనల్‌కు ఊరట

సుప్రీంకోర్టులో ఓమిక్స్ ఇంటర్నేషనల్‌కు ఊరట

‘వాళ్లంతా పరాన్నజీవులు..’

‘వాళ్లంతా పరాన్నజీవులు..’

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.