Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Business
  3. Business Home
ADVERTISEMENT 

గణాంకాలపై మార్కెట్‌ ఫోకస్‌!

Business Sakshi User Sakshi Sakshi Time Jun 8, 2026 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
stock.jpg

పశ్చిమాసియా పరిస్థితులు కీలకం 

నేడు ప్రపంచ మార్కెట్ల ప్రభావం 

ఈ వారం మళ్లీ ఆటుపోట్లకు చాన్స్‌ 

స్టాక్‌ మార్కెట్లపై విశ్లేషకుల అంచనా

దేశీ స్టాక్‌ మార్కెట్లు ఈ వారం పలు అంశాల ఆధారంగా కదలనున్నాయి. ప్రధానంగా పలు దేశ, విదేశీ గణాంకాలు వెలువడనున్నాయి. మరోపక్క రోజుకో మలుపు తీసుకుంటున్న పశ్చిమాసియా పరిస్థితులు కీలకం కానున్నాయి.  

గత వారాంతాన యూఎస్‌ మార్కెట్లతోపాటు.. పసిడి, వెండి తదితర కమోడిటీలలో అమ్మకాలు వెల్లువెత్తాయి. యూఎస్‌ స్టాక్‌ మార్కెట్లు 1.5–4% మధ్య క్షీణించగా.. బంగారం 3 శాతం, వెండి 6.5% చొప్పున పతనమయ్యాయి. ముడిచమురు, కాపర్, నేచురల్‌ గ్యాస్‌ సైతం 2–4 శాతం మధ్య నీరసించాయి. ఇందుకు పలు కారణాలు కనిపిస్తున్నాయి. యూఎస్‌ లీజర్, హెల్త్‌కేర్, ఆతిథ్య రంగాల దన్నుతో మే నెలలో ఉపాధి గణాంకాలు అంచనాలను మించాయి. 

దీంతో కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల పెంపునకు మొగ్గు చూపవచ్చన్న అంచనాలు పెరిగి ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు 100కు బలపడింది. మరోపక్క ఏఐ సవాళ్లతో టెక్నాలజీ స్టాక్స్‌లో తలెత్తిన భారీ అమ్మకాలు నాస్‌డాక్‌ను 4% పడగొట్టినట్లు తెలిపా రు. కాల్పుల విరమణ అంటూనే యూఎస్, ఇరాన్‌ మధ్య దాడులు కొనసాగుతుండటంతో సెంటిమెంటు బలహీనపడినట్లు నిపుణులు పేర్కొన్నారు.   

నేడు అటూఇటుగా 
గత వారం చివర్లో యూఎస్‌ మార్కెట్లు, కమోడిటీలలో నమోదైన అమ్మకాల ప్రభావం నేడు దేశీయంగా కనిపించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే గత వారం విడుదలైన దేశ జీడీపీ గణాంకాలు, ఆర్‌బీఐతోపాటు ప్రభుత్వం చేపట్టిన విదేశీ పెట్టుబడులకు ప్రోత్సాహకాల నిబంధనల సవరణలు కొంతమేర ఇన్వెస్టర్లను ఆకట్టుకునే వీలున్నట్లు వివరించారు.

 రాజకీయ, భౌగోళిక అనిశ్చితి, చమురు ధరల కారణంగా ఎదురవుతున్న ద్రవ్యోల్బణ ఒత్తిళ్లతో ఈ ఆర్థిక సంవత్సరం(2026–27) దేశ జీడీపీ వృద్ధి అంచనాలను ఆర్‌బీఐ తగ్గించడం కొంతమేర ప్రతికూలమేనని ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. విదేశీ పెట్టుబడులకు ఆర్‌బీఐ దన్ను, బలపడిన డాలరు.. రూపాయిపై ప్రభావం.. ఇవన్నీ కీలకంగా నిలవనున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్‌ రీసెర్చ్‌ హెడ్‌ సంతోష్‌ మీనా తెలియజేశారు. వెరసి నేడు మార్కెట్లు ఆటుపోట్లు ఎదుర్కొనే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. 

రుతుపవనాలపై దృష్టి
ఇటీవల ఆశలు రేపుతున్న రుతుపవనాలపై ఇన్వెస్టర్లు దృష్టిపెట్టనున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. మే నెలకు ద్రవ్యోల్బణ గణాంకాలు 12న వస్తాయి.  ఈ అంశాలన్నిటికీ ప్రాధాన్యత ఉన్నట్లు రెలిగేర్‌ బ్రోకింగ్‌ రీసెర్చ్‌ ఎస్‌వీపీ అజిత్‌ మిశ్రా పేర్కొన్నారు. గ్లోబల్‌ ఐటీ దిగ్గజాల్లో అమ్మకాలు దేశీయంగానూ ప్రభావం చూపవచ్చని లివ్‌లాంగ్‌ వెల్త్‌ రీసెర్చ్‌ నిపుణులు కె.హరిప్రసాద్‌ చెప్పారు.

సాంకేతికంగా చూస్తే.. 
సాంకేతిక నిపుణుల అంచనాల ప్రకారం గత వారం సెన్సెక్స్‌ మద్దతు స్థాయిలకు సమీపంలో నిలిచినప్పటికీ బలహీనంగానే కనిపిస్తోంది. మరోపక్క 23,500 పాయింట్లను దాటలేకపోతున్న నిఫ్టీ మరింత బలహీనపడే వీలుంది. వెరసి ఈ వారం నిఫ్టీ 23,000 పాయింట్ల దిగువకు 22,900కు చేరవచ్చు. బలపడితే 23,500 వద్ద రెసిస్టెన్స్‌కు అవకాశముంది.  

గత వారం డీలా 
విదేశీ ఇన్వెస్టర్ల నిరంతర విక్రయాల నేపథ్యంలో గత వారం(1–5) హెచ్చుతగ్గుల మధ్య దేశీ స్టాక్‌ మార్కెట్లు డీలా పడ్డాయి. సెన్సెక్స్‌ నికరంగా 532 పాయింట్లు(0.7%) నష్టపోయి 74,243 వద్ద ముగిసింది. నిఫ్టీ 181 పాయింట్లు(0.76%) క్షీణించి 23,367 వద్ద స్థిరపడింది.  

ఎఫ్‌పిఐ అమ్మకాల దెబ్బ 
కొద్ది నెలలుగా దేశీ స్టాక్స్‌లో భారీ అమ్మకాలు చేపడుతున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) ఈ నెల తొలి వారంలోనూ ఇదే ధోరణి కొనసాగించారు. వెరసి జూన్‌ తొలి వారంలో రూ. 43,000 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. దీంతో ఈ కేలండర్‌ ఏడాది(2026)లో ఇప్పటివరకూ రూ. 2.67 లక్షల కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించారు.

 ఇది సరికొత్త రికార్డ్‌కాగా..  ఎన్‌ఎస్‌డీఎల్‌ వివరాల ప్రకారం 2025లో వెనక్కి తీసుకున్న పెట్టుబడులు రూ. 1.66 లక్షల కోట్లను ఇవి దాటేశాయి. బలహీన కార్పొరేట్‌ ఫలితాలు, రూపాయి క్షీణత, గ్లోబల్‌ మార్కెట్లలో ఆకర్షణీయ అవకాశాలు తదితర అంశాలు ప్రభావం చూపుతున్నట్లు మార్కెట్‌ విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మినహా అన్ని నెలల్లోనూ ఎఫ్‌పీఐలు నికర అమ్మకందారులుగానే నిలవడం గమనార్హం! మార్చిలో అత్యధికంగా రూ. 1.17 లక్షల కోట్లు వెనక్కి తీసుకున్నారు.
     
– సాక్షి, బిజినెస్‌ డెస్క్‌ 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Stock Market
Market Experts
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

స్టాక్ మార్కెట్ క్లోజింగ్ అప్డేట్!

స్టాక్ మార్కెట్ క్లోజింగ్ అప్డేట్!

వేదాంతా పవర్ జాక్ పాట్! ఇన్వెస్టర్లకు భారీ లాభాలు!

వేదాంతా పవర్ జాక్ పాట్! ఇన్వెస్టర్లకు భారీ లాభాలు!

లాభాల్లో స్టాక్‌మార్కెట్లు.. ఐటీ షేర్లకు మంచిరోజు

లాభాల్లో స్టాక్‌మార్కెట్లు.. ఐటీ షేర్లకు మంచిరోజు

పుంజుకున్న స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

పుంజుకున్న స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

స్టాక్ మార్కెట్ జోరు.. లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీ!

స్టాక్ మార్కెట్ జోరు.. లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీ!

లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.