Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Business
  3. Business Home
ADVERTISEMENT 

కుంభమేళాపై స్టీవ్‌ జాబ్స్‌ లేఖ.. ఎన్ని కోట్లు పలికిందంటే?

Business Sakshi User Sakshi Sakshi Time Jan 15, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Stev.jpg

ప్రపంచంలోని అతిపెద్ద మతపరమైన కార్యక్రమాలలో.. భారతదేశంలో జరిగే 'మహా కుంభమేళా' (Maha Kumbh Mela) ఒకటి. ఇటీవల ప్రారంభమైన ఈ కార్యక్రమానికి కోట్లాది మంది భక్తులు విచ్చేస్తున్నారు, పవిత్ర సంగమం వద్ద పుణ్యస్థానాలు ఆచరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి దివంగత స్టీవ్ జాబ్స్ భార్య 'లారెన్ పావెల్ జాబ్స్' కూడా వచ్చారు.

మహా కుంభమేళాకు వచ్చిన లారెన్ పావెల్ జాబ్స్ తన పేరును 'కమల'గా మార్చుకున్నారు. కాగా ఇప్పుడు ఆపిల్ కో ఫౌండర్ స్టీవ్ జాబ్స్ చేతితో రాసిన ఓ లేఖ (Letter) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 1974లో రాసిన ఈ లేఖలో స్టీవ్ జాబ్స్ కుంభమేళా కోసం భారతదేశాన్ని సందర్శించాలని రాసినట్లు తెలుస్తోంది.

50 ఏళ్లకింద స్టీవ్ జాబ్స్ రాసిన ఈ లేఖ బోన్‌హామ్స్ వేలంలో 500312 డాలర్లు లేదా రూ.4.32 కోట్లుకు పలికింది. ఇది స్టీవ్ జాబ్స్ స్వయంగా రాసిన మొదటి లేఖ కావడం గమనార్హం. ఈ కారణంగానే దీనిని చాలామంది సొంతం చేసుకోవడానికి ప్రయత్నించారు.

స్టీవ్ జాబ్స్ 19వ పుట్టిన రోజుకు ఒక రోజు ముందు.. అతని చిన్ననాటి స్నేహితుడు టిమ్ బ్రౌన్‌కు ఈ లేఖను పంపించారు. ఇందులో ఆయన ఆధ్యాత్మిక, ఆత్మపరిశీలనకు సంబంధించిన చాలా విషయాలను వెల్లడించారు. అంతే కాకుండా బౌద్ధమతాన్ని గురించి ప్రస్తావిస్తూ.. కుంభమేళా కోసం భారతదేశాన్ని సందర్శించాలనే తన ఆకాంక్షను కూడా అందులో వెల్లడించారు.


భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ.. తాను చాలా సార్లు ఏడ్చినట్లు లేఖలో పేర్కొన్నారు. ఏప్రిల్‌లో ప్రారంభమయ్యే కుంభమేళా కోసం నేను భారతదేశానికి వెళ్లాలనుకుంటున్నాను. నేను మార్చిలో ఎప్పుడో బయలుదేరుతాను, కానీ ఇంకా ఖచ్చితంగా తెలియలేదని అందులో ప్రస్తావించారు.

స్టీవ్ జాబ్స్ మొదట ఉత్తరాఖండ్‌లోని నీమ్ కరోలి బాబా ఆశ్రమాన్ని సందర్శించాలని అనుకున్నారు. అయితే, నైనిటాల్‌కు చేరుకోగానే, నీమ్ కరోలి బాబా అంతకుముందు సంవత్సరం మరణించినట్లు అతను కనుగొన్నాడు. నిరుత్సాహపడకుండా, జాబ్స్ కైంచి ధామ్‌లోని ఆశ్రమంలో ఉండి, నీమ్ కరోలి బాబా బోధనల నుంచి ఓదార్పు పొందారు. ఆ సమయంలో ఆయన పూర్తిగా ఆధ్యాత్మికతలో మునిగిపోయారు. ఆ తరువాత ఆయనలో చాలా మార్పు వచ్చిందని కూడా చెప్పారు.

ఇప్పుడు, స్టీవ్ భార్య లారెన్ పావెల్ జాబ్స్, మహా కుంభమేళా 2025కి హాజరవడం ద్వారా అతని చిరకాల కోరికలలో ఒకదాన్ని నెరవేర్చింది. ఈమె జనవరి 15 వరకు నిరంజినీ అఖారా క్యాంపులోని కుంభ్ టెంట్ సిటీలో ఉండనున్నారు. ఆ తరువాత జనవరి 20న అమెరికాలోనూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించే కార్యక్రమానికి హాజరవుతారు.

ఇదీ చదవండి: కుంభమేళాలో స్టీవ్‌ జాబ్స్‌ భార్యకు అస్వస్థత

ఈ కుంభమేళా కారణంగా రాష్ట్ర ఆర్థిక వృద్ధి కూడా భారీగా పెరుగుతుందని చెబుతున్నారు. ఈ కార్యక్రమానికి కేటాయించిన బడ్జెట్ రూ.7,000 కోట్లు కాగా.. రాష్ట్రానికి వచ్చే ఆదాయం రూ. 2 లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా. 45 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి వచ్చే సందర్శకులు సగటున రూ. 5,000 ఖర్చు చేస్తే ఏకంగా రూ. 2 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని చెబుతున్నారు. ఈ ఖర్చు రూ.10వేలకు పెరిగితే.. వచ్చే ఆదాయం రూ. 4 లక్షల కోట్లకు చేరుతుంది.

Steve Jobs letter to his friend about planning to visit Kumbh Mela in India.

The thing to notice here is, he used the word "Shanti" before concluding. pic.twitter.com/s4yN2pupjr

— Kartik Jaiswal (@draken73jp) October 24, 2021

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
steve jobs
letter
Maha Kumbh Mela
Kumbha Mela
business man
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వైఎస్సార్‌సీపీ లేఖ

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వైఎస్సార్‌సీపీ లేఖ

అపుడు నెలకు రూ. 25 వేలు, క్యాబ్‌ డ్రైవర్‌గా ఇపుడు లక్ష

అపుడు నెలకు రూ. 25 వేలు, క్యాబ్‌ డ్రైవర్‌గా ఇపుడు లక్ష

కేందమంత్రి కిషన్‌రెడ్డికి సీఎం రేవంత్‌ లేఖ

కేందమంత్రి కిషన్‌రెడ్డికి సీఎం రేవంత్‌ లేఖ

పశ్చిమాసియా ఉద్రిక్తత.. కేంద్రానికి ఎంపీ గురుమూర్తి లేఖ

పశ్చిమాసియా ఉద్రిక్తత.. కేంద్రానికి ఎంపీ గురుమూర్తి లేఖ

యుద్ధం ఎఫెక్ట్‌.. రాష్ట్రాలకు కేంద్రం లేఖ

యుద్ధం ఎఫెక్ట్‌.. రాష్ట్రాలకు కేంద్రం లేఖ

ఏపీని నియంత్రించండి

ఏపీని నియంత్రించండి

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.