Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Business
  3. Business Home
ADVERTISEMENT 

రూ. 15.15 లక్షల కోట్ల స్కాం : దలాల్‌ స్ట్రీట్‌లో ప్రకంపనలు

Business Sakshi User Sakshi Sakshi Time Jun 4, 2026 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Rajesh-Exports-Faked.jpg

సాక్షి, ముంబై:  భారతదేశంలోని అతిపెద్ద లిస్టెడ్ సంస్థలలో ఒకటి, ప్రముఖ బంగారు శుద్ధి మరియు ఆభరణాల తయారీ సంస్థ రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ (Rajesh Exports)  భారీ స్కాం వెలుగులోకి వచ్చింది. రూ. 15.15 లక్షల కోట్ల మేర భారీ ఆర్థిక అవకతవకలు జరిగినట్టు మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ (SEBI)  ఆరోపించింది. ఈ  మేరకు జూన్ 3న జారీ చేసిన ఒక మధ్యంతర ఉత్తర్వులో సెబీ రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ , దాని ప్రమోటర్-చైర్మన్ రాజేష్ మెహతాలను సెక్యూరిటీల మార్కెట్‌లోకి ప్రవేశించకుండా నిషేధించింది. ఐదు ఆర్థిక సంవత్సరాల పాటు భారీ ఆర్థిక అవకతవకలు జరిగాయని రెగ్యులేటర్  వెల్లడించింది. ఈ ఆదేశాలు దలాల్ స్ట్రీట్‌లో ప్రకంపనలు సృష్టించాయి. దీని షేర్‌  బాగా పడిపోయింది. చివరికి కొనేవాళ్లు లేక లోయర్‌ సర్క్యూట్‌లోకి జారుకుంది.

బెంగళూరు కేంద్రంగా ఉన్న ఈ సంస్థ, ప్రపంచ బంగారు దిగ్గజంగా పేరు సంపాదించింది. ఆర్థిక సంవత్సరం FY21 నుంచి FY25 మధ్య కాలంలో, కంపెనీ తన విదేశీ అనుబంధ సంస్థల (ముఖ్యంగా స్విట్జర్లాండ్‌కు చెందినవాల్‌కంబి SA) ద్వారా రూ. 15.15 లక్షల కోట్ల మేర (కన్సాలిడేటెడ్ రెవెన్యూలో దాదాపు 99.8 శాతం)  తప్పుడు  ఆదాయాన్ని చూపించిందని సెబీ ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

దర్యాప్తు అధికారులు కోరిన అనేక కీలక పత్రాలను కంపెనీ అందించడంలో విఫలమైందని సెబీ తెలిపింది. ఫోరెన్సిక్ ఆడిటర్‌కు కస్టమర్ రికార్డులు, వెండర్ వివరాలు, ముఖ్యమైన అనుబంధ సంస్థల ఆర్థిక నివేదికలు సమర్పించలేదనీ, పొంతన లేని ఆదాయ వ్యవయాల వివరాలు, దర్యాప్తునకు సహకరించకపోవడం లాంటి వాటిని  రెగ్యులేటర్ ఎత్తి చూపింది. ఈ ఆదాయ ఆరోపణలతోపాటు ఆఫ్రికాలో ఉన్న బంగారు గనుల ఆస్తులలో రూ. 1,035 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు వచ్చిన నివేదికను కూడా సెబీ ప్రశ్నించింది.

ఎల్‌ఐసీకీ తప్పని ముప్పు
రాజేష్ ఎక్స్‌పోర్ట్స్‌లో సుమారు 10.8% వాటాను కలిగి ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) అతిపెద్ద వాటాదారులలో ఒకటి. తాజా స్కాం కారణంగా వాటాదారుల సంపదలో రూ. 12,726 కోట్ల వరకు నష్టం వాటిల్లవచ్చని సెబీ అంచనా వేసింది. ఈ ప్రభావం ప్రమోటర్లు, నియంత్రణ సంస్థలకే పరిమితం కాలేదు.  పరోక్షంగా సంబంధం  ఉన్న లక్షలాది మంది సాధారణ పెట్టుబడిదారులను  కూడా ప్రభావితం  చేయనుంది.

ఇప్పటికే కెనరా బ్యాంక్ పోరాటం
మరోవైపు రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ ఏకకాలంలో రుణదాతల నుండి ఒత్తిడిని ఎదుర్కొంటోంది. బ్యాంకుకు చెల్లించాల్సిన బకాయిలు సుమారు రూ. 509 కోట్ల రుణాల చెల్లింపులో  విఫలం కావడంతో కెనరా బ్యాంక్ ఈ కంపెనీకి ఉన్న తన రుణాన్ని ఒత్తిడికి గురైన ఆస్తిగా (స్ట్రెస్డ్ అసెట్) వర్గీకరించింది.  ఫలితంగా, ఈ రుణదాత వేలం ప్రక్రియ ద్వారా ఒత్తిడికి గురైన ఈ రుణాన్ని విక్రయించేందుకు చర్యలు ప్రారంభించింది. బ్యాంకింగ్ సమస్య సెక్యూరిటీస్ మార్కెట్ విచారణకు భిన్నమైందే అయి నప్పటికీ, ఈ రెండూ కలిసి కంపెనీకి రెండు వైపుల సంక్షోభాన్ని సృష్టించాయి. 

సెబీ ఉత్తర్వు మధ్యంతరమైనదని గమనించడం ముఖ్యం. నియంత్రణ సంస్థ తన తుది తీర్పును ఇంకా వెలువరించలేదు.రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ , రాజేష్ మెహతాలకు తమ వాదన వినిపించుకునేందుకు, ఆరోపణలపై ప్రతిస్పందించేందుకు అవకాశం ఉంది. దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నందున తుది ఫలితం రావడానికి సమయం పట్టవచ్చు.

ఒకవేళ ఇది రుజువైతే, భారతదేశ కార్పొరేట్ రంగంలో ఇప్పటివరకు చూసిన అతిపెద్ద స్కాంలలో ఒకటిగా నిలుస్తుంది. భారతదేశ కార్పొరేట్ పాలనా వ్యవస్థకు ఈ కేసు గుణపాఠంగా నిలవవచ్చు. పెట్టుబడిదారులకు ఇదొక తీవ్ర హెచ్చరిక. కంపెనీ ఎంత పెద్దదైనా, ఎంత గౌరవనీయమైనదైనా సరే, రిటైల్ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడి మూలధనంలో గణనీయమైన భాగాన్ని ఒకే కంపెనీ స్టాక్‌లో కేంద్రీకరించే విషయంలో ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉంటూ, కంపెనీ  రెగ్యులేటరీ ఫైలింగ్‌లు, స్టాక్ ఎక్స్ఛేంజ్ డిస్క్లోజర్‌లు, రెడ్ ఫ్లాగ్‌లను పర్యవేక్షించాలి అంటున్నారు నిపుణులు.

ఇదీ చదవండి: ఆస్తికోసం వ్యాపారవేత్త కుటుంబం దారుణ హత్య, ఆ తర్వాత షాకింగ్‌ ఘటన

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Rajesh Exports
Scam
sebi
Dalal Street
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

‘షార్ట్ సెల్లింగ్’ను సులభతరం చేయడంపై దృష్టి!

‘షార్ట్ సెల్లింగ్’ను సులభతరం చేయడంపై దృష్టి!

హెచ్చరిక.. వెలుగులోకి కొత్త స్కామ్!

హెచ్చరిక.. వెలుగులోకి కొత్త స్కామ్!

ఈ వారం 3 ఐపీఓలు

ఈ వారం 3 ఐపీఓలు

నా దగ్గర ఉన్న ఫ్రూఫ్స్ సజ్జనార్ కి పంపితే.. 24 గంటల్లో నందు స్టోరీ క్లోజ్.!

నా దగ్గర ఉన్న ఫ్రూఫ్స్ సజ్జనార్ కి పంపితే.. 24 గంటల్లో నందు స్టోరీ క్లోజ్.!

నమ్మితే నట్టేట మునిగినట్టే !

నమ్మితే నట్టేట మునిగినట్టే !

ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌ ఐపీవోకి ఓకే..

ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌ ఐపీవోకి ఓకే..

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.