Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Business
  3. Business Home
ADVERTISEMENT 

మొసళ్లుంటాయ్‌... జాగ్రత్త!

Business Sakshi User Sakshi Sakshi Time Jan 19, 2026 Sakshi Read Time Read Time: 5 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
ONLINE-TRADING-SCAM.jpg

స్టాక్‌మార్కెట్‌ సముద్రంలో అడుగడుగునా గండాలే

కొత్తకొత్త రూపాలతో ముందుకొస్తున్న మోసగాళ్లు

మార్కెట్లు పెరుగుతుండటంతో ఇన్వెస్టర్లకు గాలం

ర్యాలీని ఆసరా చేసుకుని అనామక షేర్ల హవా

టిప్స్‌ అంటూ వాట్సాప్‌లో నకిలీ నిపుణుల వల

ఫేక్‌ ప్లాట్‌ఫామ్‌లతో లేని లాభాలు చూపిస్తూ మోసం

అధికారిక సమాచారం, కాస్త రీసెర్చ్‌ అవసరం

ఇన్‌స్టంట్‌ లాభాలకు ఆశపడితే అంతే సంగతి  

స్టాక్‌ మార్కెట్లు అదేపనిగా పెరుగుతున్నాయి. దీంతో ఇప్పటిదాకా దూరంగా ఉన్నవాళ్లు కూడా పెట్టుబడి పెడితే బాగుంటుంది కదా అని ఊగిసలాడుతున్నారు. ఇదే అదనుగా మోసగాళ్లు చెలరేగిపోతున్నారు. ఏఐ అండతో ఏకంగా నకిలీ ట్రేడింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌నే సృష్టిస్తున్నారు. నకిలీ లాభాలు చూపిస్తున్నారు. 10వేలు విత్‌డ్రా చేయనిచ్చి... 10 లక్షలు లాగేస్తున్నారు. కొందరి దగ్గరైతే కోట్లు కొట్టేస్తున్నారు. ఈ మధ్య హైదరాబాద్‌లో సాక్షాత్తూ సీబీఐ మాజీ జాయింట్‌ డైరెక్టర్‌ భార్యనే మోసం చేశారంటే మోసగాళ్లు ఏ స్థాయిలో రెచి్చపోతున్నారో అర్థం చేసుకోవచ్చు.

 చాలామందికి లాభాల ఆశచూపించి... నకిలీ ఖాతాల్లోకి నగదు వేయించుకుని చెక్కేస్తున్నారు. ఇవన్నీ ఒకెత్తయితే... మార్కెట్‌ ర్యాలీలో భాగంగా కొన్ని అనామకపు షేర్లు కూడా హల్‌చల్‌ చేస్తున్నాయి. ఫలానా షేరు కొంటే నెలలో రెండింతలవుతుందంటూ ఎస్‌ఎంఎస్‌లూ వస్తున్నాయి. వీటి వలలో చిక్కుకుని చాలామంది విలవిలలాడుతున్నారు. మరి దీనికి మార్గమేంటి? స్టాక్‌ మార్కెట్‌ అంటే మోసం మాత్రమే కాదు కదా? ఈ మోసాల బారిన పడకుండా ఉండటమెలా? మన డబ్బులు మనం కాపాడుకోవటం ఎలా? ఇదే ఈ వారం బిగ్‌ ‘వెల్త్‌ స్టోరీ’.

నకిలీలు, మోసగాళ్ల సంగతి పక్కనబెడితే... ముందుగా మార్కెట్లో ట్రేడవుతున్న షేర్లతోనే ఎలాంటి స్కామ్‌లు చేస్తారో ఒకసారి తెలుసుకుందాం.  

పంప్‌ అండ్‌ డంప్‌.. 
పెద్దగా ఎవరికీ తెలియన ఓ అనామకపు షేరు ఉన్నట్టుండి తెరమీదికి వస్తుంది. అప్పటిదాకా స్తబ్దుగా ఉన్న ఆ షేరు ధర అప్పటికే పెరగటం మొదలవుతుంది. దీనికి గురించి సోషల్‌ మీడియాలో ఫిన్‌ఫ్లుయెన్సర్లు ఊదరగొడతారు. ఊరూపేరూ లేని ఎస్‌ఎంఎస్‌లు కూడా వచ్చేస్తుంటాయి. అప్పటిదాకా ఆ షేరు గురించి తెలియనివారు కొందరు ఇన్వెస్ట్‌ చేయటం మొదలుపెడతారు. కొందరు వేచి చూద్దామని వాచ్‌లిస్ట్‌లో పెడతారు. అది మెల్లగా పెరుగుతుంటుంది. దీంతో అందరూ ఎగబడతారు. అంతే... అప్పటికే దాన్ని కొనిపెట్టుకున్న స్టాక్‌మార్కెట్‌ తిమింగలాలు రేటు పెరిగే కొద్దీ వాటిని అమ్మేస్తుంటారు. బాగా సొమ్ము చేసుకుంటారు. ఒక దశ తర్వాత వేగంగా ఆ షేరు కుప్పకూలుతుంది. మళ్లీ లేచినా... కొద్దిరోజులకే మళ్లీ పడుతుంది. భారీ రేటుకు కొన్న ఇన్వెస్టర్లు ఇరుక్కు పోయినట్లే!!.

బాయిలర్‌ రూమ్‌ ఆపరేషన్స్‌ 
బాయిలర్‌ రూమ్‌లో ఎవరూ ఎక్కువసేపు ఉండలేరు. తక్షణం బయటపడేలా బాయిలర్‌ ఒత్తిడి చేస్తుందన్న మాట. అదే తరహాలో... మంచి తరుణం మించిన దొరకదు, లాస్ట్‌ చాన్స్‌ అంటూ ఊరూ పేరూ లేని, పనికిమాలిన స్టాక్స్‌ను కొనిపించేలా కొందరు బ్రోకర్లు, ఫిన్‌ఫ్లుయెన్సర్లు ఒత్తిడి పెంచుతుంటారు. దాన్ని వాళ్లు సొమ్ము చేసుకుంటారు.

శక్తివంతమైన ఆయుధాలున్నాయ్‌..  
ఇలాంటి మోసాల బారిన పడకుండా ఉండేందుకు, మన చేతిలోనే కొన్ని శక్తివంతమైన ఆయుధాలున్నాయి. వాటిని కాస్త పదును పెట్టుకుంటే సరి. అవేంటంటే... 
→ ఏ అంశాన్నయినా లోతుగా పరిశీలించాలి.. 
→ కంపెనీ ఆర్థిక స్థితిగతులు తెలుసుకోవాలి 
→ కంపెనీ వార్షిక నివేదికలను చదవాలి 
→ వార్తలను విశ్వసనీయ సోర్స్‌ల ద్వారానే ధృవీకరించుకోవాలి 
→ సెబీ ఇన్వెస్టర్‌ హెల్ప్‌లైన్‌ 
→ ఎన్‌ఎస్‌ఈ/బీఎస్‌ఈ అలర్టులు 
→ ప్రామాణికమైన ఫైనాన్షియల్‌ న్యూస్‌ ప్లాట్‌ఫాంలు


ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ 
కంపెనీలు బయటకు వెల్లడించని సమాచారం కూడా యాజమాన్యానికి తెలిసి ఉంటుంది. అది సహజం. దీన్ని ఆధారం చేసుకుని యాజమాన్యంగానీ, వారికి దగ్గరగా ఉండే వారు గానీ ఆ కంపెనీ షేర్లలో ట్రేడింగ్‌ చేస్తుంటారు. కంపెనీకి ప్రతికూలంగా ఉండే సమాచారం గనక వారికి తెలిస్తే... షేర్లను విక్రయించేయటం, సానుకూలమైన సమాచారం తెలిస్తే కొని పెట్టుకోవటం చేస్తుంటారు. ఆ తరువాత సమాచారం బయటకు వస్తుంది. దానికి తగ్గట్టుగా షేరు రియాక్ట్‌ అవుతుంది. దీనివల్ల ముందే ట్రేడింగ్‌ చేసిన కంపెనీ ఇన్‌సైడర్లు బాగుపడతారు. కాబట్టే దీన్ని ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అంటారు. ఇలాంటి సందర్భాల్లో షేరు పెరగడానికి లేదా పడటానికి అసలు కారణాలేంటో తెలియని ఇన్వెస్టర్లు నష్టపోతూ ఉంటారు.  

పోంజీ, పిరమిడ్‌ స్కీములు 
ఇన్వెస్ట్‌మెంట్‌ స్కీములో కొత్తగా ఎవరినైనా చేరిస్తే, భారీగా లాభాలిస్తామంటారు. కానీ అసలు లాభాల్లో నుంచి కాకుండా, కొత్త ఇన్వెస్టర్ల నుంచి తీసుకున్న డబ్బులో కొంత పాత ఇన్వెస్టర్లకు చెల్లిస్తుంటారు. అంతిమంగా ఇలాంటి స్కీములు ఎక్కడో ఒక దగ్గర ఆగిపోతాయి. లింకు తెగి అప్పటిదాకా ఇన్వెస్ట్‌ చేసిన వాళ్లంతా కుప్పకూలుతారు.

బేసిక్‌ అంశాలను తెలుసుకోవాలి .. 
పెట్టుబడుల పెట్టే ముందు ఇలాంటి కొన్ని ఆర్థికాంశాల గురించి తెలుసుకుంటే మంచిది. 
→ పీ/ఈ నిష్పత్తి (కంపెనీ లాభాన్ని సంవత్సరాలతో గుణించడమన్న మాట) 
→ ఎర్నింగ్స్‌ పర్‌ షేర్‌ (ఈపీఎస్‌– సదరు కంపెనీ ఒక షేరుకు ఎంత చొప్పున ఆర్జిస్తోంది) 
→ రిటర్న్‌ ఆన్‌ ఈక్విటీ (ఆర్‌వోఈ– షేర్‌హోల్డర్ల ప్రతి రూ.100కు కంపెనీ ఎంత లాభాన్ని తెస్తోంది)  అంకెల గురించి అంతగా అర్థం కాకపోయినా ఫర్వాలేదని, గుడ్డిగా ఇన్వెస్ట్‌ చేసేయొద్దు.

ఫాంటమ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌  
వీటినే ఫాంటమ్‌ రిటర్న్స్‌’, ఫాంటమ్‌ అసెట్స్‌ అని కూడా పిలుస్తుంటారు. ఫాంటమ్‌ అనేది ఊహే కదా... అలాగే ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ కూడా అన్నమాట. అసలు ఉనికిలోనే లేని నకిలీ స్టాక్స్, బాండ్స్, ఫండ్స్‌లాంటి వాటిని అంటగడతారు. నకిలీ లాభాలు చూపిస్తుంటారు. నకిలీ స్టేట్‌మెంట్లు పంపిస్తారు. అంతా రియల్‌ అనుకుని, లాభాలు పెరుగుతుండటం చూసి మరింత పెట్టుబడి పెట్టేస్తుంటారు. ఎప్పుడైనా విత్‌డ్రా చేద్దామని అనుకుంటే... ఆ రోజే మొత్తం సిస్టమ్‌ మాయమైపోతుంది. ఈ మధ్య ఇలాంటివి బాగా పెరిగాయి.  

మరి తప్పించుకోవటమెలా? 
మరి ఇన్ని రూపాల్లో మోసగాళ్లు దాడులు చేస్తుంటే మనని మనం కాపాడుకోవటం ఎలా? ఈ సందేహానికి సమాధానం ఒక్కటే... ఆథరైజ్డ్‌ అవునా కాదా అన్నది చూసుకోవటం. రూపాయి పెట్టుబడి పెడుతున్నా సరే, ఇన్వెస్టింగ్‌కు ముందే బ్రోకర్‌ లేదా ప్లాట్‌ఫాం గురించి ధ్రువీకరించుకోవాలి. సెబీలోను, ఎన్‌ఎస్‌ఈ లేదా బీఎస్‌ఈలోను రిజిస్టర్డా కాదా అన్నది తెలుసుకోవాలి. సెబీలో నమోదు చేసుకోనివారికి ఎవరికైనా... పెట్టుబడి సలహాలివ్వడానికి గానీ మీ డబ్బును మేనేజ్‌ చేయడానికి గానీ చట్టబద్ధమైన అర్హత ఉండదు.  
→ గ్యారంటీ రాబడులొస్తాయని చెబితే...! ఎందుకంటే స్టాక్‌మార్కెట్లో రాబడులకు గ్యారంటీ ఉండదు.
  → వెంటనే నిర్ణయం తీసుకోకపోతే నష్టపోతారంటూ ఒత్తిడి చేస్తే...! ఎందుకంటే ఒత్తిడిలో ఏ నిర్ణయమూ తీసుకోవద్దు. 
→ అవాంఛిత కాల్స్, మెసేజీలు లేదా ఈమెయిల్స్‌ ద్వారా వచి్చన సమాచారాన్ని నమ్మొద్దు. ఎందుకంటే ఆ సమాచారం సరైనదైతే మీకెందుకు పంపుతారు? వాళ్లే ఉపయోగించుకుంటారుగా!. 
→ నమ్మశక్యం కాని ఆఫర్లు ఇస్తే నమ్మొద్దు 
→ గుర్తు తెలియని ప్రొఫైల్స్‌ లేదా ఫేక్‌ యోగ్యతాపత్రాలు చూపిస్తే పట్టించుకోవద్దు 
→ ఎవరైనా సరే ‘‘మీ డబ్బు చాలా వేగంగా రెట్టింపవుతుంది’’ అంటూ హామీ ఇస్తున్నారంటే, అది సలహా కాదు, అలర్టవ్వాల్సిన విషయమని గుర్తుంచుకోవాలి.  

ఈ ప్రశ్నలు వేసుకోవాలి..   
పెట్టుబడికి ముందు కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. అవేంటంటే.. 
→ అసలు సదరు కంపెనీ ఏం చేస్తుంది? 
→ దాన్ని నడిపేది ఎవరు? వారికి విశ్వసనీయత ఉందా? 
→ ఆదాయం నిజమైనదేనా? నిలకడగా వచ్చేదేనా? 
→ ఈ పెట్టుబడి ఎందుకు పెట్టానో ఎవరు అడిగినా సరళంగా వివరించగలనా? 
→ ఏదైనా తేడా వస్తే బైటపడే మార్గమేంటి? 
ఈ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇచ్చుకోలేకపోతే, కాస్త ఆగి, ఆలోచించాలి.

తప్పుడు రీసెర్చ్‌ రిపోర్టులు 
కొన్ని ఊరూపేరూ లేని సంస్థల నుంచి రీసెర్చ్‌ రిపోర్టులంటూ బయటికొస్తాయి. వారు కావాలనుకున్న షేరు తాలూకు భవిష్యత్తును ఊదరగొడుతూ చూపిస్తారు. రకరకాల మెయిల్స్‌ ద్వారా ఈ రిపోర్టులు వచ్చి పడుతుంటాయి. నిజమేనని నమ్మి ఇన్వెస్ట్‌ చేస్తే అంతే గతి.

అనధికారిక ట్రేడింగ్‌ 
ఒక్కోసారి కమీషన్‌ కోసం కక్కుర్తి పడి ఏజెంట్లు లేదా బ్రోకర్లు మీ అనుమతి లేకుండా మీ అకౌంట్లో అనధికారికంగా ట్రేడింగ్‌ చేస్తుండవచ్చు. దీన్ని జాగ్రత్తగా గమనిస్తుండాలి.

మోసపూరిత అడ్వైజరీ స్కాములు 
సడెన్‌గా వాట్సాప్‌లో ఓ మెసేజ్‌ వస్తుంది. ఫలానా గ్రూపుకు చెందిన నిపుణుడు సలహాలిస్తాడంటూ లింకు పంపిస్తారు. ఆ గ్రూపు లో చేరితే... అప్పటికే కొందరు ఆ ఎక్స్‌పర్ట్‌ను పొగుడుతూ ఉంటారు. మీరిచి్చన సలహా వల్ల నేను లక్షలు సంపాదించానంటూ మెసేజీలు పెడుతుంటారు. ఆ సలహా ఏంటో... ఎప్పుడిచ్చారో కూడా మనకు తెలీదు. ఇలా కొందరు చేస్తుండగానే... ఫలానా చోట ఖాతా తెరిస్తే తాను నేరుగా సలహాలిస్తానంటూ సదరు నిపుణుడు చెబుతాడు. అందులో ఉన్నదంతా ఆ నిపుణుడి మనుషులే కాబట్టి ‘సరే సర్‌’.. అంటారు. అదంతా నిజమని నమ్మి మనం కూడా ఖాతా తెరిచినా... ఎక్స్‌పర్ట్‌కు ఫీజు చెల్లించినా... అంతే సంగతి.

ఆన్‌లైన్‌ ఖాతాలను రక్షించుకోవాలి..    
డిజిటల్‌ భద్రతకు చెక్‌లిస్ట్‌ 
→ 2–ఫ్యాక్టర్‌ ఆథెంటిఫికేషన్‌ని ఎనేబుల్‌ చేయాలి 
→ బలమైన, ప్రత్యేకమైన పాస్‌వర్డ్‌లను వాడాలి 
→ ఓటీపీలను ఎవరికీ చెప్పొద్దు 
→ సందేహాస్పద లింకులను క్లిక్‌ చేయకుండా జాగ్రత్త వహించాలి 
→ అధికారిక సోర్సుల నుంచే యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి 
ప్రస్తుత ప్రపంచంలో మిమ్మల్ని ముంచినా మీ ఫోనే... మిమ్మల్ని కాపాడగలిగేది కూడా మీ చేతిలోని ఫోనే.

ఫ్రాడ్‌ అని అనుమానం వస్తే..     
వెంటనే యాక్షన్‌ తీసుకోవాలి. సత్వరం ఫిర్యాదు చేస్తే రికవరీ చేసేందుకు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. ఏ మా త్రం జాప్యం చేసినా మోసగాళ్లు తప్పించుకునేందుకు అవ కాశం ఇచి్చనట్లవుతుంది. ఈ కింది వాటికి రిపోర్ట్‌ చేయాలి. 
→ సెబీ ఆన్‌లైన్‌ కంప్లైంట్‌ పోర్టల్‌ 
→ ఎన్‌ఎస్‌ఈ లేదా బీఎస్‌ఈ 
→ మీ బ్రోకర్‌ 
→ లోకల్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌

ఆరోగ్యకరమైన మైండ్‌సెట్‌ 
పెట్టుబడులకు సంబంధించి ఆరోగ్యకరమైన ఆలోచనా విధానాన్ని అలవర్చుకోవాలి. 
→ హైప్‌ని బట్టి కాకుండా దీర్ఘకాలిక లక్ష్యాల కోసం ఇన్వెస్ట్‌ చేయాలి 
→ పోర్ట్‌ఫోలియోలో వైవిధ్యం పాటించాలి. అంటే డబ్బంతా ఒకే దాంట్లో ఇన్వెస్ట్‌ చేయకుండా, కొంత ఈక్విటీ, కొంత డెట్, కాస్తంత బంగారంలో పెట్టుబడి పెడితే ఎటు పోయి ఎటొచ్చీ ఏదైనా పడిపోయినా మరొకటి మెరుగ్గా ఉండటం వల్ల ఓవరాల్‌గా రిసు్కలు తగ్గుతాయి. 
→ ‘హాట్‌ టిప్స్‌’ వెంటబడకూడదు. చేతులు కాల్చుకోకూడదు. 
→ FOMO.. అంటే ఫియర్‌ ఆఫ్‌ మిస్సింగ్‌ ఔట్‌. సింపుల్‌గా చెప్పాలంటే ఇప్పుడు ఇన్వెస్ట్‌ చేయకపోతే ఇక ఎప్పటికీ కుదరదు, ఆ మంచి అవకాశం ఇక దొరకనే దొరకదు అన్నట్లుగా ఒక్కోసారి కంగారు పుట్టించే పరిస్థితులు ఎదురవుతుంటాయి. స్కామర్లు ఇలాంటివాటిని ఆయుధాలుగా వాడుకుంటూ ఉంటారు. జాగ్రత్త వహించాలి.  
→ సిసలైన ఇన్వెస్ట్‌మెంట్‌ అనేది చాలా బోరింగ్‌గానే ఉంటుంది. కానీ అదే మంచిది. ఓపిగ్గా, రీసెర్చ్‌ చేసి, క్రమశిక్షణతోనే పెట్టుబడుల ఫలాలు అందుకోవచ్చు. 

షార్ట్‌కట్‌లంటూ ఉండవు. స్టాక్‌ మార్కెట్‌ అనేది అన్ని వివరాలను తెలుసుకుని, జాగ్రత్తగా వ్యవహరించే ఇన్వెస్టర్లకు మాత్రమే లాభాలనిస్తుంది. అజాగ్రత్తగా ఉండే వారిని నష్టాలతో శిక్షిస్తుంది. పెట్టుబడులకు సంబంధించి ఎప్పటికప్పుడు కొత్త వివరాలను తెలుసుకునేందుకు ఆసక్తిగా ఉండాలి. అదే సమయంలో అప్రమత్తంగానూ ఉండాలి. రాత్రికి రాత్రి లాభాలు గడించాలనుకోవడం కాకుండా పెట్టుబడిని కాపాడుకోవడానికి అత్యంత ప్రాధాన్యమివ్వాలి!.

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
stock market scam
fraudsters
fake
Trading Platform
fake accounts
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

వెంకీమామ- అనిల్ రావిపూడి మూవీ.. నిర్మాణ సంస్థ అలర్ట్..!

వెంకీమామ- అనిల్ రావిపూడి మూవీ.. నిర్మాణ సంస్థ అలర్ట్..!

స్టాక్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌ కోసం కొత్త ప్లాట్‌ఫామ్‌

స్టాక్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌ కోసం కొత్త ప్లాట్‌ఫామ్‌

రూ. 18 కోట్ల మేయర్ కిడ్నాప్‌ డ్రామా : సంచలన ఆరోపణలు

రూ. 18 కోట్ల మేయర్ కిడ్నాప్‌ డ్రామా : సంచలన ఆరోపణలు

మీ పిల్లలు తింటున్నది చాక్లెట్లు కాదు..!

మీ పిల్లలు తింటున్నది చాక్లెట్లు కాదు..!

‘గుడ్డిగా ఏఐని నమ్మితే..’: హెచ్చరించిన గూగుల్‌

‘గుడ్డిగా ఏఐని నమ్మితే..’: హెచ్చరించిన గూగుల్‌

ఈ కోర్టే నకిలీది!

ఈ కోర్టే నకిలీది!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.