Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Business
  3. Business Home
ADVERTISEMENT 

లాభాన్ని నష్టంతో సర్దుబాటు చేసుకోవచ్చా?

Business Sakshi User Sakshi Sakshi Time Oct 13, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
qaa.jpg

ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో నాకు రూ.1.25 లక్షలకు పైగా దీర్ఘకాల మూలధన లాభం (ఎల్‌టీసీజీ) వచ్చింది. అదే సమయంలో స్వల్పకాల మూలధన నష్టం కూడా ఎదురైంది. ఈ నష్టాన్ని సర్దుబాటు చేసుకుని తక్కువ పన్ను చెల్లించడం సాధ్యపడుతుందా? – సత్యనారాయణ గొట్టిపాటి

ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో దీర్ఘకాల మూలధన లాభం వచ్చినట్లయితే.. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.25 లక్షలకు మించిన మొత్తంపై 12.5 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఈక్విటీ పెట్టుబడులపై స్వల్పకాల మూలధన నష్టం (ఏడాదిలోపు విక్రయించినప్పుడు వచ్చే మొత్తం/ఎస్‌టీసీఎల్‌)) ఎదురైతే.. అప్పుడు ఎల్‌టీసీజీ నుంచి ఎస్‌టీసీఎల్‌ను మినహాయించుకోవచ్చు. దీనివల్ల నికరంగా చెల్లించాల్సిన పన్ను భారం తగ్గిపోతుంది. ఈక్విటీ పెట్టుబడిని కొనుగోలు చేసిన తేదీ నుంచి ఏడాది నిండిన తర్వాత విక్రయించనప్పుడు వచ్చే లాభం/నష్టాన్ని దీర్ఘకాలంగా, ఏడాది నిండకుండా విక్రయించినప్పుడు వచ్చే మొత్తాన్ని స్వల్పకాల మూలధన లాభం/నష్టం కింద పరిగణిస్తారు.

ఉదాహరణకు ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో రూ.2 లక్షల దీర్ఘకాల లాభం వచ్చిందని అనుకుందాం. రూ.1.25 లక్షల వరకు పన్ను లేదు. అప్పుడు మిగిలిన రూ.75,000పై 12.5 శాతం చొప్పున రూ.9,375 పన్ను చెల్లించాలి. ఒకవేళ అదే ఆర్థిక సంవత్సరంలో రూ.50,000 స్వల్పకాల నష్టం వచ్చిందనుకోండి. నికర దీర్ఘకాల లాభం రూ.75వేలలో ఈ మొత్తాన్ని సర్దుబాటు చేసుకోవచ్చు. అప్పుడు నికర దీర్ఘకాల మూలధన లాభం రూ.25,000కు తగ్గుతుంది. దీనిపై 12.5 శాతం రేటు ప్రకారం రూ.3,125 పన్ను చెల్లిస్తే సరిపోతుంది.  

ఒకవేళ ఈక్విటీ ఫండ్స్‌లో పెట్టుబడులపై వచ్చిన నష్టం దీర్ఘకాలానికి సంబంధించి అయితే.. అప్పుడు దీర్ఘకాల మూలధన లాభంతోనే సర్దుబాటు చేసుకోగలరు. అదే స్వల్పకాల మూలధన నష్టాన్ని స్వల్పకాల మూలధన లాభం, దీర్ఘకాల మూలధన లాభంతోనూ సర్దుబాటు చేసుకోవచ్చు. ఒకవేళ స్వల్పకాల నష్టం అన్నది స్వల్పకాల లాభం/దీర్ఘకాల మూలధన లాభం మించి ఉంటే.. అప్పుడు సర్దుబాటు చేసుకోగా మిగిలిన నికర నష్టాన్ని ఎనిమిది ఆర్థిక సంవత్సరాల పాటు క్యారీ ఫార్వార్డ్‌ (భవిష్యత్తు లాభాల్లో సర్దుబాటు) చేసుకోవచ్చు. 

ఇదీ చదవండి: మధ్యతరగతి వారికి వారెన్ బఫెట్ ఆర్థిక సలహా 

మ్యూచువల్‌ ఫండ్స్‌లో సిప్‌ ద్వారా ఇన్వెస్ట్‌ చేస్తున్నాను. నాకు ఇంటి లోన్‌ ఉంది. మరో 5 ఏళ్లకు పూర్తవుతుంది. గ్రాట్యుటీ రూపంలో వచ్చే మొత్తంతో గృహ రుణాన్ని ముందుగానే తీర్చివేయాలా లేక మెరుగైన రాబడి వచ్చే చోట ఇన్వెస్ట్‌ చేసుకోవాలా? – జ్యోతిర్మయి

గృహ రుణాన్ని కొనసాగించుకోవచ్చు. గృహ రుణం కాకుండా ఇతర రుణాలు ఉంటే, పెట్టుబడుల కంటే ముందు వాటిని తీర్చేయడం మంచి నిర్ణయం అవుతుంది. గృహ రుణం కొనసాగించడం వల్ల నష్టం లేదనడానికి పలు కారణాలు ఉన్నాయి. అద్దె రూపంలో కొంత ఆదా చేస్తుంటారు. రుణంపై వడ్డీ చెల్లింపులకు పన్ను ప్రయోజనం ఉంది. పైగా చాలా తక్కువ రేటుకు వచ్చే రుణం ఇది. ఈ రుణం రేటుతో పోలిస్తే దీర్ఘకాలంలో పెట్టుబడులపై అధిక రాబడులు వస్తాయి. కనుక గృహ రుణం లాభదాయకమే. ఒకవేళ గృహ రుణాన్ని పూర్తిగా తీర్చివేయడం ద్వారా నిశ్చింతగా ఉండొచ్చని భావిస్తే లేదా భవిష్యత్తు ఆదాయం విషయంలో అనిశ్చితిగా ఉంటే అలాగే ముందుకెళ్లొచ్చు. గ్రాట్యుటీ ద్వారా వచ్చే మొత్తంతో ఆ పనిచేయవచ్చు.

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Personal Finance
questions
answers
expert
Direndra Kumar
Youth Finance
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

సొంతిల్లా... అద్దె ఇల్లా?

సొంతిల్లా... అద్దె ఇల్లా?

ఈపీఎఫ్‌ సభ్యులకు త్వరలో డబుల్‌ ధమాకా!

ఈపీఎఫ్‌ సభ్యులకు త్వరలో డబుల్‌ ధమాకా!

ఏటీఎం నుంచి మనీ విత్‌డ్రా.. EPFOనుంచి కీలక అప్‌డేట్‌ వచ్చేసింది

ఏటీఎం నుంచి మనీ విత్‌డ్రా.. EPFOనుంచి కీలక అప్‌డేట్‌ వచ్చేసింది

భారీగా క్రెడిట్‌ కార్డు అప్పులు.. కియోసాకి అలర్ట్‌

భారీగా క్రెడిట్‌ కార్డు అప్పులు.. కియోసాకి అలర్ట్‌

Income Tax: ‘ఇన్‌కం స్టేట్‌మెంట్‌’ ఇలా తయారు చేయండి..

Income Tax: ‘ఇన్‌కం స్టేట్‌మెంట్‌’ ఇలా తయారు చేయండి..

గృహలక్ష్మి ఇప్పుడు... ఇన్వెస్ట్‌మెంట్‌ మహాలక్ష్మి

గృహలక్ష్మి ఇప్పుడు... ఇన్వెస్ట్‌మెంట్‌ మహాలక్ష్మి

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.