కొడుకు జీవితంలో ఉన్నత స్థాయికి చేరటంలో తండ్రి పాత్ర చాలా ప్రధానం. ఈ రోజుకి కూడా ఉన్నత స్థాయిలో ఉన్న ఎంతోమంది దిగ్గజాలు తమ తండ్రుల మాటలను తు.చ తప్పకుండా అనుసరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు నెట్‌ఫ్లిక్స్ కో-ఫౌండర్ 'మార్క్ రాండోల్ఫ్'.
చదువు పూర్తయిన తరువాత 21 సంవత్సరాల వయసులో ఉద్యోగంలో చేరాల్సి వచ్చినప్పుడు నా తండ్రి ఒక నోట్ తన స్వహస్తాలతో రాసి ఇచ్చారని.. దానికి సంబంధించిన ఫోటోను కూడా తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశారు. ఆ నోట్‌నే తన పిల్లలకు కూడా ఇచ్చానని మార్క్ రాండోల్ఫ్ పేర్కొన్నారు.
మార్క్ రాండోల్ఫ్ తండ్రి నోట్లోని అంశాలు
-
అడిగిన దానికంటే 10 శాతం ఎక్కువ చేయి
-
తెలియని విషయాలపైన ఎవరికీ, ఎప్పుడూ నీ అభిప్రాయాలను అందించవద్దు
-
ఎప్పుడూ మర్యాదగా వ్యవహరించు, శ్రద్ధగా ఉండు
-
తీవ్రమైన విమర్శలనైనా ఎదుర్కో.. కానీ ఫిర్యాదులు చేయవద్దు
-
నిజాయితీగా ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోవడంలో భయపడవద్దు
-
అవసరమైన చోట లెక్కలు వేసుకో
-
ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా వ్యవహరించు, ఓపెన్ మైండెడ్‌గా ఉండు
-
ఏ విషయం మీద అయినా.. వెంటనే స్పందించడానికి సిద్ధంగా ఉండు
When I was twenty-one years old, fresh out of college and about to start my first job, my father gave me a handwritten list of instructions.
Here are my dad's rules for success:
• Do at least 10% more than you are asked.
• Never, ever, to anybody, present as fact, opinions… pic.twitter.com/JOEIYxctcG— Marc Randolph (@mbrandolph) June 1, 2024