Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Business
  3. Business Home
ADVERTISEMENT 

మళ్లీ మొబైల్‌ టారిఫ్‌లు పెంపు..?

Business Sakshi User Sakshi Sakshi Time Jan 2, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
telecom01.jpg

దేశంలోని టెలికం ఆపరేటర్లు డిజిటల్‌ మౌలిక వసతుల్లో చేసిన భారీ పెట్టుబడుల ప్రయోజనాన్ని పొందాలంటే పన్నుల తగ్గింపు, టారిఫ్‌ల పెంపు అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తదుపరి తరం 5జీ సేవల కవరేజీని విస్తరించేందుకు ప్రైవేట్‌ ఆపరేటర్లు టెలికం మౌలిక సదుపాయాలు, రేడియోవేవ్స్‌ కోసం 2024లో సుమారు రూ.70,000 కోట్లు పెట్టుబడి పెట్టారు. అయితే 18 కోట్ల 2జీ కస్టమర్లను కనెక్ట్‌ చేయడం, సమ్మిళిత వృద్ధి కోసం 4జీకి మళ్లేలా వారిని ప్రోత్సహించడం సవాలుగా మారింది.

‘టెలికం రంగంలో పన్నులను హేతుబద్ధీకరించాలి. భారత్‌లోనే పన్నులు ఎక్కువగా ఉన్నాయి. అలాగే టారిఫ్‌లు అత్యల్పంగా ఉన్నాయి. అధిక వినియోగ కస్టమర్‌లు ఎక్కువ చెల్లించడం, ఎంట్రీ లెవల్‌ డేటా వినియోగదారులు తక్కువ చెల్లించేలా మార్పులు రావొచ్చు. టెలికం సంస్థలు చేసిన పెట్టుబడులు డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్నాయి. దీని ద్వారా స్టార్టప్‌ పర్యావరణ వ్యవస్థ మొత్తం లాభపడింది. పన్నుల హేతుబద్ధీకరణ, టారిఫ్‌ల పెంపు ద్వారా పెట్టుబడులపై రాబడిని పొందే సమయం ఆసన్నమైంది’ అని ఈవై ఇండియా మార్కెట్స్, టెలికం లీడర్‌ ప్రశాంత్‌ సింఘాల్‌ అన్నారు.  

ఏఆర్‌పీయూ రూ.300 స్థాయికి..

భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్‌ ఐడియాలు ఒక్కో వినియోగదారు నుంచి సగటు ఆదాయాన్ని (ఏఆర్‌పీయూ) రూ.300 స్థాయికి పెంచాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పాయి. గతేడాది జులైలో మొబైల్‌ రీఛార్జ్‌ ప్లాన్ల పెంపు తర్వాత వొడాఫోన్‌ ఐడియా ఏఆర్‌పీయూ ఏప్రిల్‌–జూన్‌లో రూ.154 నుంచి సెప్టెంబర్‌ త్రైమాసికంలో 7.8 శాతం పెరిగి రూ.166కి చేరుకుంది. భారతీ ఎయిర్‌టెల్‌ రూ.211 నుంచి 10.4 శాతం వృద్ధితో రూ.233కి, రిలయన్స్‌ జియో రూ.181.7 నుంచి రూ.195.1కి దూసుకెళ్లింది. అయితే టారిఫ్‌ల పెంపు ఈ సంస్థలకు షాక్‌ తగిలింది. దాదాపు 2 కోట్ల మంది సబ్‌స్క్రైబర్‌లు తమ కనెక్షన్‌లను వదులుకున్నారు. 10–26 శాతం ధరల పెంపు కారణంగా రిలయన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్‌ ఐడియా సంయుక్తంగా 2.6 కోట్ల మంది వినియోగదారులను కోల్పోయాయి.

మౌలికంలో పెట్టుబడులు..

మోర్గాన్‌ స్టాన్లీ నివేదిక ప్రకారం భారతీ ఎయిర్‌టెల్‌ అక్టోబర్‌లో పట్టణ ప్రాంతాల్లో సబ్‌స్క్రైబర్స్‌ను కోల్పోగా, గ్రామీణ ప్రాంతాల్లో నికరంగా భారీ స్థాయిలో జోడించింది. రిలయన్స్‌ జియో మెట్రోలు, ప్రధాన సర్కిల్స్‌లో చందాదారులను పొందింది. చిన్న సర్కిల్స్‌లో కస్టమర్లను కోల్పోయింది. వొడాఫోన్‌ ఐడియా నుంచి అక్టోబర్‌లో భారీగా వినియోగదార్లు దూరమయ్యారు. 5జీ పర్యావరణ వ్యవస్థకు మద్దతుగా టెలికం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రంగం 2022–2027 మధ్య రూ.92,100 కోట్ల నుంచి రూ.1.41 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు చేయనున్నట్టు డిజిటల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రొవైడర్స్‌ అసోసియేషన్‌ (డీఐపీఏ) డైరెక్టర్‌ జనరల్‌ మనోజ్‌ కుమార్‌ సింగ్‌ తెలిపారు. భారతీ ఎయిర్‌టెల్‌ రెండో త్రైమాసిక పనితీరుపై జేఎం ఫైనాన్షియల్‌ రిపోర్ట్‌ ప్రకారం టారిఫ్‌ పెంపులు మరింత తరచుగా జరిగే అవకాశం ఉంది. 5జీలో భారీ పెట్టుబడులు, ఐపీవోకు వచ్చే అవకాశం ఉన్నందున జియోకు అధిక ఏఆర్‌పీయూ అవసరం.

ఇదీ చదవండి: గూగుల్‌ పే, ఫోన్‌పేకి ఎన్‌పీసీఐ ఊరట

బీఎస్‌ఎన్‌ఎల్‌కు మార్పు

ధరల పెంపుదలకు దూరంగా ఉన్న ప్రభుత్వరంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌కు దాదాపు 68 లక్షల మంది కస్టమర్లు కొత్తగా వచ్చి చేరారు. నష్టాల్లో ఉన్న ఈ సంస్థ ఇప్పటికీ పాత తరం 3జీ సేవలను అందిస్తోంది. దేశవ్యాప్తంగా 4జీ సేవలను పరిచయం చేసేందుకు కసరత్తు చేస్తోంది. భారతీ ఎయిర్‌టెల్‌ నెట్‌వర్క్‌లో సబ్‌స్క్రైబర్‌ వృద్ధి ఈ రంగానికి కొంత ఆశను కలిగించింది. సేవలను అందించడంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ అసమర్థత ఈ వృద్ధికి కారణంగా కొంతమంది విశ్లేషకులు పేర్కొన్నారు. భారతీ ఎయిర్‌టెల్‌ అక్టోబర్‌లో వైర్‌లెస్‌ విభాగంలో 19.28 లక్షల మంది వినియోగదారులను జోడించింది. క్రియాశీల చందాదారులు దా దాపు 27.23 లక్షలు అధికం అయ్యారు. వొడాఫోన్‌ ఐడియా 19.77 లక్షల వైర్‌లెస్‌ సబ్‌స్క్రైబర్‌లను కోల్పోయింది. యాక్టివ్‌ సబ్‌స్రైబర్‌ బేస్‌ దాదాపు 7.23 లక్షలు తగ్గింది. రిలయన్స్‌ జియో వైర్‌లెస్‌ కస్టమర్ల సంఖ్య అక్టోబర్‌లో మొత్తం 46 కోట్లకు వచ్చి చేరింది. సెప్టెంబర్‌లో ఈ సంఖ్య 46.37 కోట్లు నమోదైంది. క్రియాశీల వినియోగదారుల సంఖ్య బలపడింది.
 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
tariff
tariff hikes
tariff plan
tariff plans
Tariff rates
jio
Airtel
bsnl
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

రోజుకి 2 జీబీ డేటా.. కేవలం రూ.51 మాత్రమే!

రోజుకి 2 జీబీ డేటా.. కేవలం రూ.51 మాత్రమే!

జియో మెగా ఐపీఓకు సై!

జియో మెగా ఐపీఓకు సై!

'హే జియో' అంటే చాలు.. మీ పనులన్నీ చేసే ఏఐ అసిస్టెంట్!

'హే జియో' అంటే చాలు.. మీ పనులన్నీ చేసే ఏఐ అసిస్టెంట్!

పేటెంట్లలో టాప్‌కి దూసుకెళ్లిన జియో ప్లాట్‌ఫార్మ్స్

పేటెంట్లలో టాప్‌కి దూసుకెళ్లిన జియో ప్లాట్‌ఫార్మ్స్

డొనాల్డ్‌ ట్రంప్‌కు ఊరట

డొనాల్డ్‌ ట్రంప్‌కు ఊరట

పాపులర్‌ రీచార్జ్‌ ప్లాన్‌ రేటు మార్చేసిన ఎయిర్‌టె‌ల్‌

పాపులర్‌ రీచార్జ్‌ ప్లాన్‌ రేటు మార్చేసిన ఎయిర్‌టె‌ల్‌

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.