Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Business
  3. Business Home
ADVERTISEMENT 

అల్ట్రాటెక్‌ చేతికి ఇండియా సిమెంట్స్‌.. శ్రీనివాసన్‌ రాజీనామా

Business Sakshi User Sakshi Sakshi Time Dec 26, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
india-cements.jpg

సిమెంట్‌ (cement) రంగ దిగ్గజం అల్ట్రాటెక్‌ తాజాగా ఇండియా సిమెంట్స్‌(India cements)లో ప్రమోటర్లకున్న 32.72 శాతం వాటాను సొంతం చేసుకుంది. దీంతో ఎన్‌.శ్రీనివాసన్‌ (srinivasan) సహా ఇతర ఇండియా సిమెంట్స్‌ ప్రమోటర్లు తమ పదవుల నుంచి తప్పుకున్నారు. ఐసీఎల్‌లో 10.13 కోట్ల షేర్ల(32.72 శాతం వాటా)ను ఆదిత్య బిర్లా గ్రూప్‌ దిగ్గజం అల్ట్రాటెక్‌ తాజాగా చేజిక్కించుకుంది. దీంతో ఐసీఎల్‌లో ఇప్పటికే 22.77 శాతం వాటా(7.05 కోట్ల షేర్లు) కలిగిన అల్ట్రాటెక్‌ దీంతో ప్రధాన ప్రమోటర్‌గా అవతరించింది.

ఇండియా సిమెంట్స్‌లో వాటాను 55.49 శాతానికి(17.19 కోట్ల షేర్లు) పెంచుకుంది. వెరసి ఈ నెల 24 నుంచి అల్ట్రాటెక్‌ (UltraTech)కు అనుబంధ సంస్థగా ఐసీఎల్‌ ఆవిర్భవించింది. ఈ నేపథ్యంలో వైస్‌చైర్మన్, ఎండీ పదవులకు శ్రీనివాసన్‌ రాజీనామా చేసినట్లు ఐసీఎల్‌ వెల్లడించింది. అంతేకాకుండా ఆయన భార్య చిత్రా శ్రీనివాసన్, కుమార్తె రూపా గురునాథ్, వీఎం మోహన్‌ సైతం బోర్డు నుంచి తప్పుకున్నట్లు పేర్కొంది. ఈ బాటలో స్వతంత్ర డైరెక్టర్లు ఎస్‌.బాలసుబ్రమణ్యన్‌ ఆదిత్యన్, కృష్ణ శ్రీవాస్తవ, లక్ష్మీ అపర్ణ శ్రీకుమార్, సంధ్యా రాజన్‌ సైతం బుధవారం(25న) రాజీనామా చేసినట్లు తెలియజేసింది.  

కొత్త డైరెక్టర్లు 
కొత్తగా కేసీ జన్వర్, వివేక్‌ అగర్వాల్, ఈఆర్‌ రాజ్‌ నారాయణన్, అశోక్‌ రామచంద్రన్‌ డైరెక్టర్లుగా ఐసీఎల్‌ బోర్డు ఎంపిక చేసింది. స్వతంత్ర డైరెక్టర్లుగా అల్కా భరూచా, వికాస్‌ బాలియా, సుకన్య క్రిపాలు ఎంపికయ్యారు. ఐసీఎల్‌లో మెజారిటీ వాటా కొనుగోలు(రూ. 7,000 కోట్ల డీల్‌) ప్రతిపాదనకు కాంపిటీషన్‌ కమిషన్‌ గత వారం అల్ట్రాటెక్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతోపాటు ఓపెన్‌ ఆఫర్‌ ద్వారా ఐసీఎల్‌లో మరో 26% వాటాను సొంతం చేసుకునేందుకు సైతం అనుమతించింది.  

ఏం జరిగిందంటే? 
ఈ ఏడాది జూలై 28న ఐసీఎల్‌లో ప్రమోటర్ల నుంచి 32.72 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు అల్ట్రాటెక్‌ సిమెంట్‌ ప్రతిపాదించింది. ఇందుకు రూ. 3,954 కోట్ల డీల్‌ కుదుర్చుకున్నట్లు అల్ట్రాటెక్‌ వెల్లడించింది. దీంతో నిబంధనల ప్రకారం ఐసీఎల్‌ వాటాదారుల నుంచి 26 శాతం వాటా కొనుగోలు(రూ. 3,142 కోట్ల విలువ)కు ఓపెన్‌ ఆఫర్‌ సైతం ప్రకటించింది. తద్వారా వేగవంత వృద్ధితోపాటు, తీవ్ర పోటీ నెలకొన్న దక్షిణాది సిమెంట్‌ మార్కెట్లో విస్తరించేందుకు ప్రణాళికలు అమలు చేసింది. మరోపక్క అంతకుముందే అంటే జూన్‌కల్లా ఐసీఎల్‌లో 23 శాతం వాటాను అల్ట్రాటెక్‌ సొంతం చేసుకుంది. ఈ బాటలో సుమారు రూ. 1,900 కోట్లు వెచ్చించి రెండు బ్లాక్‌డీల్స్‌ ద్వారా ఐసీఎల్‌లో డీమార్ట్‌ రిటైల్‌ స్టోర్ల దమానీ గ్రూప్‌నకు గల వాటాను చేజిక్కించుకుంది.

కన్సాలిడేషన్‌ బాట..
దేశీయంగా సిమెంట్‌ పరిశ్రమ కన్సాలిడేషన్‌ బాటలో సాగుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ప్రధానంగా కుమార మంగళం బిర్లాకు చెందిన ఆదిత్య బిర్లా గ్రూప్, గౌతమ్‌ అదానీకి చెందిన అదానీ గ్రూప్‌ పోటీ పడుతున్నాయి. చిన్న సిమెంట్‌ కంపెనీలను కొనుగోలు చేస్తున్నాయి. ఆదిత్య బిర్లా గ్రూప్‌ 2026–27కల్లా వార్షికంగా 200 టన్నుల(ఎంటీపీఏ) సామర్థ్యంతో టాప్‌ ర్యాంకులో నిలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు అదానీ గ్రూప్‌ 2027–28కల్లా సిమెంట్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని 140 ఎంటీపీఏకు పెంచుకునే ప్రణాళికల్లో ఉంది.

అల్ట్రాటెక్‌ ప్రస్తుత సామర్థ్యం 156.66 ఎంటీపీఏగా ఉంది. ఇప్పటికే సంఘీ ఇండస్ట్రీస్, పెన్నా ఇండస్ట్రీస్‌ను సొంతం చేసుకున్న అదానీ సిమెంట్‌ ఇటీవలే సీకే బిర్లా గ్రూప్‌ కంపెనీ ఓరియంట్‌ సిమెంట్‌ను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఈ ఏడాది(2024–25) 100 ఎంటీపీఏను అందుకోనుంది. ఇదేవిధంగా అల్ట్రాటెక్‌ కేశోరామ్‌ ఇండస్ట్రీస్‌ సిమెంట్‌ బిజినెస్‌పై దృష్టి పెట్టింది. కొనుగోలు ప్రక్రియను పూర్తి చేసేందుకు నియంత్రణ సంస్థల అనుమతుల కోసం ఎదురు చూస్తోంది.

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
India Cements
srinivasan
ultratech
takeover
business news
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

దూసుకెళ్లిన రిలయన్స్ పవర్ స్టాక్ ఇన్వెస్టర్లకు లాభాల పంట

దూసుకెళ్లిన రిలయన్స్ పవర్ స్టాక్ ఇన్వెస్టర్లకు లాభాల పంట

త్వరలో 50 వేలకే తులం బంగారం?

త్వరలో 50 వేలకే తులం బంగారం?

ఈ హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ టార్గెట్‌ రూ.3 వేల కోట్లు

ఈ హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ టార్గెట్‌ రూ.3 వేల కోట్లు

ఇరాన్-అమెరికా యుద్ధం ఎఫెక్ట్, ఫుల్ జోష్ లో  స్టాక్ మార్కెట్

ఇరాన్-అమెరికా యుద్ధం ఎఫెక్ట్, ఫుల్ జోష్ లో స్టాక్ మార్కెట్

గోల్డ్ మార్కెట్‌లో కలకలం..! తులం రూ.1,50,000కు చేరుతుందా?

గోల్డ్ మార్కెట్‌లో కలకలం..! తులం రూ.1,50,000కు చేరుతుందా?

గంట గంటకు మారుతున్న బంగారం ధరలు

గంట గంటకు మారుతున్న బంగారం ధరలు

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.