Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Business
  3. Business Home
ADVERTISEMENT 

ఆతిథ్య రంగం జోరు..

Business Sakshi User Sakshi Sakshi Time Feb 20, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
hot.jpg

ముంబై: ఆతిథ్య రంగం ఆదాయం వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2024–25) 11–13 శాతం మేర వృద్ధి చెందనుంది. దేశీయంగా పర్యాటకానికి డిమాండ్‌ స్థిరంగా కొనసాగనుండటంతో పాటు విదేశీ పర్యాటకుల సంఖ్య కూడా పెరగనుండటం ఇందుకు తోడ్పడనుంది. క్రిసిల్‌ రేటింగ్స్‌ ఒక నివేదికలో ఈ విషయాలు వెల్లడించింది. ప్రస్తుత ఆరి్థక సంవత్సరంలో పరిశ్రమ ఆదాయ వృద్ధి 15–17 శాతం స్థాయిలో ఉండగలదని పేర్కొంది.

డిమాండ్‌ పటిష్టంగా ఉండటం, కొత్తగా హోటల్స్‌ లభ్యత ఒక మోస్తరుగానే పెరుగుతుండటంతో సమీపకాలంలో పరిశ్రమ లాభదాయకత ప్రస్తుత, వచ్చే ఆరి్థక సంవత్సరాల్లో మెరుగ్గా ఉండనుందని నివేదిక వివరించింది. గదుల అద్దె రేట్లు (ఏఆర్‌ఆర్‌) సగటున ఈ ఆరి్థక సంవత్సరం 10–12 శాతం మేర, వచ్చే ఆర్థిక సంవత్సరం 5–7 శాతం మేర పెరగవచ్చని క్రిసిల్‌ రేటింగ్స్‌ డైరెక్టర్‌ ఆనంద్‌ కులకర్ణి తెలిపారు. ఆక్యుపెన్సీ ఆరోగ్యకరంగా 73–74 శాతం స్థాయిలో కొనసాగవచ్చని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, విదేశీ టూరిస్టుల రాక ఈ ఆరి్థక సంవత్సరమూ పెరగనున్నప్పటికీ కోవిడ్‌ పూర్వ స్థాయితో పోలిస్తే 10 శాతం తక్కువగానే నమోదు కావచ్చని చెప్పారు. అయితే, వచ్చే ఏడాది ఇది పుంజుకోగలదన్నారు.  



ఆచితూచి పెట్టుబడులు..

డిమాండ్‌ పుంజుకోవడం పరిశ్రమ సెంటిమెంటు మెరుగుపడేందుకు ఊతమిస్తున్నప్పటికీ కొత్తగా పెట్టుబడులు పెట్టేటప్పుడు పరిశ్రమ ఆచితూచి వ్యవహరిస్తోందని క్రిసిల్‌ రేటింగ్స్‌ డైరెక్టర్‌ నితిన్‌ కన్సల్‌ తెలిపారు. ‘స్థల సేకరణ వ్యయాలు అధికంగా ఉండటం, నిర్మాణ వ్యయాలు పెరిగిపోవడం, పరిశ్రమ సైక్లికల్‌ స్వభావం కారణంగా లాభాలకు మళ్లాలంటే సుదీర్ఘ సమయం పట్టనుండటం వంటి అంశాల వల్ల కొత్తగా పెట్టుబడి వ్యయాలు చేయాలంటే ఆచి తూచి వ్యవహరిస్తున్నారు.

కాబట్టి బ్రాండ్లు తమ ముందస్తు పెట్టుబడి వ్యయాలను తగ్గించుకునేందుకు మేనేజ్‌మెంట్‌ కాంట్రాక్టుల ద్వారా గదులను పెంచుకోవడాన్ని కొనసాగించే అవకాశం ఉంది‘ అని కన్సల్‌ పేర్కొన్నారు. ఏఆర్‌ఆర్‌పరమైన ఆదాయ వృద్ధితో సమానంగా నిర్వహణ వ్యయాలు పెరగకపోవడం వల్ల లాభదాయకత మెరుగుపడగలదని ఆయన చెప్పారు. హోటళ్లు ఖర్చులను తగ్గించుకునే క్రమంలో గత రెండేళ్లుగా సిబ్బందిని, ఫుడ్‌.. బెవరేజ్‌ల వ్యయాలను క్రమబదీ్ధకరించుకుంటూ పలు చర్యలు తీసుకోవడం కూడా పరిశ్రమకు సానుకూలాంశమని కన్సల్‌ వివరించారు.

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
growth
Foreign Tours
tourists visit
tourists
CRISIL Ratings
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

టూవీలర్లకు ‘ఎల్‌నినో’ బ్రేక్‌ ..!

టూవీలర్లకు ‘ఎల్‌నినో’ బ్రేక్‌ ..!

2030 నాటికి 20% మార్కెట్‌ వాటా

2030 నాటికి 20% మార్కెట్‌ వాటా

భీకర దాడుల వేళ, దుబాయ్‌ సంచలన నిర్ణయం

భీకర దాడుల వేళ, దుబాయ్‌ సంచలన నిర్ణయం

రూ.215 లక్షల కోట్లకు రిటైల్‌ మార్కెట్‌

రూ.215 లక్షల కోట్లకు రిటైల్‌ మార్కెట్‌

టాప్‌ గేర్‌లో వాహన విక్రయాలు 

టాప్‌ గేర్‌లో వాహన విక్రయాలు 

మంచుకురిసే వేళలో.. ‘ఇగ్లూ విలేజ్‌’కి వెళితే..

మంచుకురిసే వేళలో.. ‘ఇగ్లూ విలేజ్‌’కి వెళితే..

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.