Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Business
  3. Business Home
ADVERTISEMENT 

కొత్త బిల్లుతో ఏటా రూ.20 వేల కోట్లు నష్టం.. అయినా తప్పట్లేదు!

Business Sakshi User Sakshi Sakshi Time Aug 21, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
gemee.jpg

ఆన్‌లైన్‌ రియల్ మనీ గేమింగ్‌ను నిషేధించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. నిన్నటి పార్లమెంట్‌ సెషన్‌లో ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్‌సభలో ఆన్‌లైన్‌ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ బిల్లు-2025ను ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో ఈ రంగంపై ఆధారపడిన వారిలో సామూహిక నిరుద్యోగం పెరుగుతుందనే భయాలు నెలకొన్నాయి. వీటిని తొలగించడానికి ప్రభుత్వం ప్రయత్నించింది. అభివృద్ధి చెందుతున్న భారతదేశ డిజిటల్, సృజనాత్మక ఆర్థిక వ్యవస్థలో ఈ-స్పోర్ట్స్, ఆన్‌లైన్‌ సోషల్ గేమింగ్‌లో పుష్కలంగా ఉద్యోగ అవకాశాలు ఉద్భవిస్తాయని పేర్కొంది.

ఈ మేరకు ఆన్‌లైన్‌ గేమింగ్ పరిశ్రమలో పెరుగుతున్న నిరుద్యోగ ఆందోళనల మధ్య ఈ హామీ వచ్చింది. ఈ-స్పోర్ట్స్, ఆన్‌లైన్‌ సోషల్ గేమ్స్ వంటి ద్రవ్యేతర విభాగాల్లో అభివృద్ధిని ప్రోత్సహిస్తూనే మనీ గేమింగ్‌ను పూర్తిగా నిషేధించాలని ఈ బిల్లు ప్రతిపాదించింది. ప్రస్తుతం 45 కోట్ల మంది భారతీయులు ఆన్‌లైన్‌ రియల్ మనీ గేమింగ్‌లో నిమగ్నమయ్యారని, మొత్తంగా ఏటా రూ.20,000 కోట్ల వరకు నష్టం వాటిల్లుతుందని ప్రభుత్వ అంచనాలు సూచిస్తున్నాయి. ఇది గణనీయమైన ఆదాయాన్ని త్యాగం చేయడమే అయినా వినియోగదారుల సంక్షేమం, ఆర్థిక రక్షణే ఈ నిషేధానికి కారణమని అధికారులు చెబుతున్నారు.

మనీ గేమ్స్ ఆడే వారు బాధితులే తప్పా నేరస్థులు కాదని, ఈ గేమ్స్ ప్రకటనదారులు, సర్వీస్ ప్రొవైడర్లు, ఫైనాన్షియల్ ఎనేబుల్స్‌పై దాడులు జరుగుతున్నాయని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ‘గేమ్ మేకర్లు, సాఫ్ట్‌వేర్‌ డెవలపర్లు కేవలం మనీ గేమ్స్‌పైనే పని చేయరు. సృజనాత్మక ఆర్థిక వ్యవస్థలో భాగమైన ఇతర ఈ-స్పోర్ట్స్, సోషల్ గేమ్స్‌పై కూడా పనిచేస్తున్నారు. ఈ విభాగాలను ప్రోత్సహించాలని పిలుపునిచ్చాం’ అని ఆయన చెప్పారు.

ఏమిటీ బిల్లు?  

  • అన్ని రకాల ఆన్‌లైన్‌ బెట్టింగ్, గ్యాంబ్లింగ్‌(సట్టా, పోకర్, రమ్మీ, కార్డ్‌ గేమ్స్‌)తోపాటు ఆన్‌లైన్‌ ఫ్యాంటసీ స్పోర్ట్స్, ఆన్‌లైన్‌ లాటరీలను నిషేధిస్తూ ఈ బిల్లును తీసుకొచ్చారు. డబ్బులు పెట్టి ఆన్‌లైన్‌లో ఆడే క్రీడలపై నిషేధం అమలవుతుంది.  

  • ఆన్‌లైన్‌ గేమ్‌లకు ప్రచారం చేసినవారు కూడా నేరస్తులే. ఇలాంటి గేమ్‌ల్లో ఒకరి నుంచి మరొకరికి ఆన్‌లైన్‌లో నగదు బదిలీలకు వీలు కల్పించిన బ్యాంక్‌లు లేదా ఆర్థిక సంస్థలను సైతం శిక్షిస్తారు.  

  • ఆన్‌లైన్‌ గేమ్‌ను ఏ రూపంలో నిర్వహించినా, ప్రోత్సహించినా, ప్రచారం చేసినా నేరమే. అంటే కంప్యూటర్‌ లేదా మొబైల్‌ ఫోన్‌ ద్వారా చేసినా నేరంగా పరిగణిస్తారు. సోషల్‌ మీడియా లేదా పత్రికలు లేదా టీవీల్లో ప్రచారం చేసినా శిక్ష తప్పదు.

  • నైపుణ్యం లేదా అదృష్టం(చాయిప్‌)పై ఆధారపడిన ఏ గేమ్‌ అయినా నిషిద్ధమే.  

  • మన దేశంలోనే కాకుండా.. దేశ సరిహద్దుల్లో లేదా విదేశీ గడ్డపై నుంచి గేమ్‌లను నిర్వహించినా దోషులే అవుతారు.  

  • ఈ బిల్లు ప్రకారం.. ఆన్‌లైన్‌ గేమ్‌ల్లో పాల్గొన్నవారిని దోషులుగా కాకుండా బాధితులుగానే పరిగణిస్తారు.  

  • డబ్బుతో సంబంధం లేదని ఈ–స్పోర్ట్స్, ఎడ్యుకేషనల్‌ గేమ్స్, సోషల్‌ గేమ్స్‌కు కొన్ని నియంత్రణలను బిల్లు సూచిస్తోంది.  

  • సమాజంలో అశాంతి తలెత్తకుండా చూడాలని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని బిల్లులో పొందుపర్చారు. డిజిటల్‌ టెక్నాలజీని బాధ్యతాయుతంగా వాడుకొనేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.  

ఇదీ చదవండి: రష్యాతో వాణిజ్యం.. తక్షణ దిద్దుబాటు చర్యలు అవసరం

  • డబ్బు ప్రమేయం లేని ఈ–స్పోర్ట్స్‌ చట్టబద్ధమే అవుతాయి. ఇందుకోసం కేంద్ర క్రీడల శాఖ కొన్ని మార్గదర్శకాలు, ప్రమాణాలు రూపొందించాలని బిల్లులో సూచించారు. విద్యా, సాంస్కృతిక విలువలను పెంపొందించడానికి, నైపుణ్యాభివృద్ధికి, సమాజంలో ప్రజల మధ్య అనుసంధానానికి ఆన్‌లైన్‌ సోషల్‌ గేమ్స్‌ను ప్రోత్సహించవచ్చు. ఈ మేరకు కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ, కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకోవాలి.  

  • ఈ–స్పోర్ట్స్‌కు సంబంధించి శిక్షణ, పరిశోధనలకు ప్రభుత్వం మద్దతు ఇస్తుంది.  

  • మానసికోల్లాసం, నైపుణ్యాభివృద్ధి కోసం సోషల్, ఎడ్యుకేషన్‌ గేమ్స్‌ ఆడుకోవచ్చు.  

  • ఆన్‌లైన్‌ గేమ్‌లను వర్గీకరించడానికి, రిజిస్టర్‌ చేసుకోవడానికి రూ.50 కోట్లతో జాతీయ స్థాయిలో గేమింగ్‌ అథారిటీ ఏర్పాటు చేస్తారు. దీనికి ప్రతిఏటా రూ.20 కోట్లు కేటాయిస్తారు. ఎలాంటి గేమ్‌ అనేది ఈ అథారిటీ నిర్ణయిస్తుంది. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తుంది.

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
online gaming
money
Game
Job opportunities
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

సంపదకు అసలైన మార్గం.. కియోసాకి మూడు సూత్రాలు!

సంపదకు అసలైన మార్గం.. కియోసాకి మూడు సూత్రాలు!

డబ్బు నిజంగా సంతోషాన్ని ఇస్తుందా?: బిల్ గేట్స్ ఏమన్నారంటే..

డబ్బు నిజంగా సంతోషాన్ని ఇస్తుందా?: బిల్ గేట్స్ ఏమన్నారంటే..

డబ్బు అవసరం ఉండదు!.. భవిష్యత్తులో..

డబ్బు అవసరం ఉండదు!.. భవిష్యత్తులో..

కాల్ మని మోసం.. 5 కోట్లకు 21 కోట్ల వడ్డీ...!

కాల్ మని మోసం.. 5 కోట్లకు 21 కోట్ల వడ్డీ...!

‘సివిల్‌’కు మళ్లీ స్వర్ణయుగం..!

‘సివిల్‌’కు మళ్లీ స్వర్ణయుగం..!

ఈ రోబో ఏం చేస్తుందో తెలిస్తే.. షాక్‌ అవాల్సిందే!

ఈ రోబో ఏం చేస్తుందో తెలిస్తే.. షాక్‌ అవాల్సిందే!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.