Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Business
  3. Business Home
ADVERTISEMENT 

కళ తప్పిన బంగారం ఈటీఎఫ్‌లు.. కారణమిదే!

Business Sakshi User Sakshi Sakshi Time Apr 18, 2023 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
GOLD-ETF.jpg

న్యూఢిల్లీ: బంగారం ఎక్సే్ఛంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌ (గోల్డ్‌ ఈటీఎఫ్‌లు)కు గడిచిన ఆర్థిక సంవత్సరం (2022–23) పెద్దగా కలసి రాలేదు. గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లోకి వచ్చిన పెట్టుబడులు కేవలం రూ.653 కోట్లకు పరిమితమయ్యాయి. బంగారం ధరలు పెరగడంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపించడం ఇందుకు కారణమని చెప్పుకోవాలి. పెట్టుబడులు తగ్గినప్పుటికీ గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లో ఇన్వెస్టర్ల ఫోలియోలు (ఒక ఇన్వెస్టర్‌ పెట్టుబడికి కేటాయించే గుర్తింపు నంబర్‌) మార్చి చివరికి 47 లక్షలకు పెరిగాయి.

చాలా మంది ఇన్వెస్టర్లు ఇప్పటికీ ఇతర సాధనాలతో పోలిస్తే ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌కే ప్రాధాన్యం ఇస్తున్నట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. 2022–23లో ఈక్విటీ ఫండ్స్‌లోకి వచ్చిన పెట్టుబడులు రూ.2 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం. బంగారం ధరలు పెరగడంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుని ఇతర సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేసేందుకు మొగ్గు చూపించారు. గడిచిన ఏడాది కాలంలో ఈక్విటీల దిద్దుబాటుకు లోను కాగా, డెట్‌ సాధనాలు ఆకర్షణీయంగా మారడం గమనించొచ్చు.

మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల అసోసియేషన్‌ (యాంఫి) గణాంకాల ప్రకారం.. 2021–22లో గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లోకి రూ.2,541 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. కానీ, 2022–23లో 75 శాతం తగ్గి రూ.653 కోట్లకు పరిమితయ్యాయి. 2019–20లో చూసినా కానీ రూ.1,614 కోట్లను గోల్డ్‌ ఈటీఎఫ్‌లు ఆకర్షించాయి. అంతకుముందు సంవత్సరాల్లో గోల్డ్‌ ఈటీఎఫ్‌లు నికరంగా పెట్టుబడులను కోల్పోయాయి. గడిచిన నాలుగేళ్లలో ఇన్వెస్టర్లు ఎక్కువగా ఈక్విటీల్లోకి పెట్టుబడులు కుమ్మరించినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మంచి రాబడులు వస్తుండడంతో ఈక్విటీలకు ప్రాధాన్యం ఇచ్చినట్టు తెలుస్తోంది.



బంగారం ప్రియం..  

వార్షికంగా చూస్తే 2022–23లో బంగారం ఈటీఎఫ్‌ల్లోకి పెట్టుబడులు తగ్గడం అన్నది ఇన్వెస్టర్లు ఇతర ఇన్వెస్ట్‌మెంట్‌ సాధనాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలుస్తోందని మార్నింగ్‌స్టార్‌ ఇండియా రీసెర్చ్‌ మేనేజర్‌ కవిత కృష్ణన్‌ పేర్కొన్నారు. ‘‘ఈక్విటీలకు ప్రాధాన్యం పెరిగినట్టు కనిపిస్తోంది. ఈక్విటీ విభాగాల్లోకి అదే పనిగా పెట్టుబడులు పెరగడం దీన్ని తెలియజేస్తోంది. రూపాయి బలహీన పడడం, యూఎస్‌ డాలర్‌ అప్‌ ట్రెండ్‌లో ఉండడం బంగారం ధరలపై గణనీయమైన ప్రభావం చూపించాయి. మరింత ఖరీదుగా బంగారాన్ని మార్చేశాయి.

ఇది మొత్తం మీద బంగారం ఈటీఎఫ్‌ పెట్టుబడులపై ప్రభావం చూపించింది’’అని కవిత కృష్ణన్‌ వివరించారు. మరోవైపు గడిచిన ఆర్థిక సంవత్సరంలో కేంద్ర సర్కారు సావరీన్‌ గోల్డ్‌ బాండ్‌లను నాలుగు విడతలుగా ఇష్యూ చేసింది. ఇది కూడా గోల్డ్‌ ఈటీఎఫ్‌ పెట్టుబడులపై ప్రభావం చూపించింది. మార్చి చివరి వారంలో బంగారం ధర 10 గ్రాములు రూ.59,400కు చేరడం తెలిసిందే.

బంగారం ధరలు సానుకూలంగా ఉండడం, అదే సమయంలో ఇతర పెట్టుబడి సాధనాలు ప్రతికూల రాబడులు ఇవ్వడంతో, ఇన్వెస్టర్లు గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లో రాబడులు స్వీకరించినట్టు ఫయర్స్‌ రీసెర్చ్‌ హెడ్‌ గోపాల్‌ కావలిరెడ్డి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు మాంద్యం పరిస్థితులను ఎదుర్కోవచ్చన్న అంచనాల నేపథ్యంలో 2023లో బంగారం ధరల్లో పెరుగుదల కొనసాగొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ద్రవ్యోల్బణం ఇప్పటికీ సౌకర్యస్థాయికి ఎగువన కొనసాగుతుండడం, వడ్డీ రేట్లపై సెంట్రల్‌ బ్యాంకుల వైఖరి, ఆర్థిక వృద్ధి అవకాశాలు బలహీనపడిన నేపథ్యంలో బంగారం ధరలు మరో 10–15 శాతం మేర ప్రస్తుత సంవత్సరంలో పెరిగే అవకాశాలున్నాయని గోపాల్‌ కావలిరెడ్డి అంచనా వ్యక్తం చేశారు.

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Gold Exchange Traded Funds
Investments
Rising prices
Investors
Profits
taking
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

దూసుకెళ్లిన రిలయన్స్ పవర్ స్టాక్ ఇన్వెస్టర్లకు లాభాల పంట

దూసుకెళ్లిన రిలయన్స్ పవర్ స్టాక్ ఇన్వెస్టర్లకు లాభాల పంట

ఆ షేర్ల ట్రేడింగ్‌లో జాగ్రత్త: సెబీ హెచ్చరిక

ఆ షేర్ల ట్రేడింగ్‌లో జాగ్రత్త: సెబీ హెచ్చరిక

‘సివిల్‌’కు మళ్లీ స్వర్ణయుగం..!

‘సివిల్‌’కు మళ్లీ స్వర్ణయుగం..!

గృహలక్ష్మి ఇప్పుడు... ఇన్వెస్ట్‌మెంట్‌ మహాలక్ష్మి

గృహలక్ష్మి ఇప్పుడు... ఇన్వెస్ట్‌మెంట్‌ మహాలక్ష్మి

మధ్యతరగతిపై ధరల భారం

మధ్యతరగతిపై ధరల భారం

కోల్‌ గ్యాసిఫికేషన్‌తో రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు

కోల్‌ గ్యాసిఫికేషన్‌తో రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.